
ముంబై: మహారాష్ట్రలో మరాఠాల రిజర్వేషన్ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మరాఠ్వాడా ప్రాంతంలో మంగళవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరో 8మంది ఆత్మహత్యకు యత్నించారు. తాజా ఘటనతో ఈ ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. బీడ్ జిల్లా వీడా గ్రామానికి చెందిన అభిజీత్ దేశ్‌ముఖ్(35) తన ఇంటి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. లాతూర్ జిల్లా ఔసాలో 8మంది కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు.