కాంగ్రెస్‌ ప్రతిపాదనలకు ఓకే: హార్దిక్‌ పటేల్‌ | Hardik Patel Accepts Congress Proposal on Patidar Quota | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ప్రతిపాదనలకు ఓకే: హార్దిక్‌ పటేల్‌

Published Tue, Nov 14 2017 3:10 AM | Last Updated on Tue, Aug 21 2018 2:39 PM

Hardik Patel Accepts Congress Proposal on Patidar Quota - Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించటంపై కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనలకు అంగీకరిస్తున్నట్లు పటీదార్‌ ఉద్యమ (పాస్‌) నేత హార్దిక్‌ పటేల్‌ చెప్పారు. ‘పాస్‌ కోర్‌ కమిటీతో సమావేశం తర్వాత రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ప్రతిపాదనలకు అంగీకరించాలని నిర్ణయించాం. గుజరాత్‌లోని మా సామాజిక వర్గంలోని ఇతర నేతలతో దీనిపై చర్చిస్తాం. రాజ్యాంగ పరిధిలోనే పటేళ్లకు రిజర్వేషన్లు కావాలనేది మా లక్ష్యం. రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ఫార్ములా బాటలోనే నడిస్తే.. ఇతర సామాజిక వర్గాలకూ ప్రయోజనం చేకూరుతుంది. దీన్నే గుజరాత్‌ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ చేర్చనుంది.’ అని హార్దిక్‌ పటేల్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement