సంస్కతీ, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట
ఖానాపూర్ : అనాదిగా వస్తున్న సంస ్కతీ సంప్రదాయాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, ప్రతి ఒక్కరూ వారి వారి సంస్కతిని ఆచరించాలని ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ అన్నారు. మండలంలోని బంజారా గిరిజన తండాల్లో శీతల్ పండుగను మంగళవారం ఘనంగా జరుపుతున్నారు. బంజార సంస్కతీ సంప్రదాయాల్లో భాగంగా ప్రతీ ఏటా ఖరీఫ్‌లో ఆయా గ్రామాల బంజారాలు సీతళాయాడి పూజలను నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోన్న ఆచారం. ప్రజలు, పశుసంపద ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ గ్రామశివారులోని వేపచెట్టు క్రింద పంట దాన్యాలు, నైవేద్యంగా బోనాన్ని సమర్పిస్తారు. ఏడు దేవుళ్లను అక్కడ ఏర్పరచి ఈ పూజలు చేశారు. పూజ నిర్వహించిన ప్రాంతం నుంచి గొడ్డు, గొద, పశుసంపదను తీసుకెళ్లడంతో పాటు రోజంతా మహిళల పాటల మధ్య వేడుకలు నిర్వహించారు.
ఉత్సవాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే
మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన పెంబితాండ, ఇటిక్యాల తండా, లోతొర్యెతండా, తాటిగూడ తదితర చోట్ల జరిగిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేయడంతో పాటు సంప్రదాయ నత్యం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు వి.లలిత, విక్రమ్‌నాయక్, చంద్రబాను, విలాస్, పరుశురాం, అంకం రాజేందర్, పాకల రాంచందర్, రాజగంగన్న, అష్వక్, ఆరె. రాజేందర్, జన్నారపు శంకర్, గొర్రె గంగాధర్, అబినయ్, షకిల్, స్వామి, కిషన్, ఎంఈవో గుగ్లావత్ రాంచందర్ పాల్గొన్నారు.