st reservations
-
ప్రతి కులానికి రిజర్వేషన్ ఫలం!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎస్సీ, ఎస్టీల్లోని ఉపకులాల్లో హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల కల నెరవేరిందని ఆయా వర్గాల నేతలు చెబుతుండగా.. వాస్తవంగా ఏమేరకు లబ్ధి జరుగుతుందనే చర్చ మరోవైపు మొదలైంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అమలవుతున్నప్పటికీ అభివృద్ధిలో ఉన్న కులాలే ఎక్కువ లబ్ధి పొందుతున్నాయనే వాదన తీవ్రంగా ఉంది.ఎస్సీల్లో మాలలే ఎక్కువగా రిజర్వేషన్ల ఫలాలు అందుకుంటున్నారని, మాదిగలకు సరైన కోటా దక్కడం లేదనే వాదన ఉండగా.. ఎస్టీల్లో లంబాడాలే రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారంటూ ఆదివాసీ తెగలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తు న్నాయి. ఈ క్రమంలోనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్), తుడుందెబ్బ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి పేరిట ఉద్యమాలు ఏళ్లుగా కొనసాగు తున్నాయి. ఇందులో అత్యంత చురుకుగా ఎమ్మార్పీఎస్ ముందు వరుసలో ఉంది. దాదాపు 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమాలకు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పరిష్కారం లభించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు...రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల కేటగిరీలో 60 ఉప కులాలున్నాయి. అదే విధంగా షెడ్యూల్డ్ తెగల (ట్రైబ్స్) కేటగిరీలో 32 ఉప కులాలు న్నాయి. గిరిజన కేటగిరీలో పర్టిక్యులర్లీ వల్నరెబుల్ (అత్యంత బలహీన) ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ) విభాగం కింద మరో 5 కులాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో ప్రధానంగా నాలుగైదు కులాల్లోనే అత్యధిక జనాభా ఉండగా.. మిగిలిన కులాల్లో మాత్రం వెయ్యిలోపు నుంచి పదివేల లోపు జనాభా ఉన్నవే ఎక్కువ.కాగా ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లను వర్గీకరించేందుకు అనుమతించడంతో పాటు అన్ని కులాలకు సమానంగా అందించేవిధంగా వర్గీకరణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఏవిధంగా జరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
గిరిజన రిజర్వేషన్లు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో ఆరుశాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గిరిజనుల జనాభా ప్రకారం వారికి సమాన వాటా ఇవ్వాలన్న లక్ష్యంతో ఆరుశాతం రిజర్వేషన్లను పదిశాతానికి పెంచింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయగా... పెంచిన 10 శాతం రిజర్వేషన్లను రోస్టర్ జాబితాలో సర్దుబాటు చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో ప్రతి పది అవకాశాల్లో ఒకటి గిరిజనులకు దక్కేలా రోస్టర్‌లో ఎస్టీ రిజర్వేషన్లను పొందుపర్చింది. కాస్త అటు ఇటుగా మారిన రోస్టర్ విద్య, ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల ప్రక్రియను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రోస్టర్ చార్ట్‌నే ప్రామాణికంగా తీసుకుంటుంది. దీని ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తుంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న రోస్టర్‌లో గిరిజనులకు పదిశాతం కోటాను సర్దుబాటు చేయడంతో కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ... ఇప్పటికే గిరిజనులకు రిజర్వ్ చేసిన అంకెలను రిజర్వులో కాస్త అటు ఇటుగా మార్చి పెరిగిన 4 శాతం అంకెలను సర్దుబాటు చేశారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుతో గిరిజనులకు 4 శాతం అదనంగా అవకాశాలు పెరిగాయి. ఈ క్రమంలో రోస్టర్‌లో కొత్తగా 15, 42, 67, 92 స్థానాల్లో గిరిజనులు అవకాశాలను దక్కించుకోనున్నారు. ఇప్పటివరకు ఈ నాలుగు పాయింట్లు జనరల్ కేటగిరీకే కేటాయించగా... తాజాగా గిరిజనులకు కేటాయిస్తూ రోస్టర్‌లో మార్పులు జరిగాయి. 6% రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్లు ఎస్టీ(మహిళ): 8, 58 ఎస్టీ(జనరల్): 25, 33, 75, 83 10శాతం రిజర్వేషన్ల పెంపుతో రోస్టర్ పాయింట్లు ఎస్టీ(మహిళ): 8, 33, 75 ఎస్టీ(జనరల్): 15, 25, 42, 58, 67, 83, 92 కొత్త నియామకాలకు మార్గం సుగమం గిరిజన కోటా అంశం తేలడంతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు శాఖల్లో కొలువుల భర్తీకి అనుమతులు ఇవ్వగా... గిరిజన రిజర్వేషన్ల అంశంతో కాస్త జాప్యం నెలకొంది. ఇప్పుడు రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో కొత్తగా నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. ఇకపై గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు అమలయ్యేలా నియామకాలు చేపట్టాలి. ఈమేరకు నియామక ఏజెన్సీలు సైతం పక్కాగా చర్యలు తీసుకోవాలి. అతి త్వరలో ప్రభుత్వం అనుమతించిన పోస్టుల భర్తీలో వేగిరం పుంజుకోనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. చదవండి: కోమటిరెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు -
తుది తీర్పునకు లోబడే గ్రూప్–1 ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి గ్రూప్–1 అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో తుది తీర్పునకు లోబడే ఫలితాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సూచించింది. గ్రూప్–1 ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడికి ముందే సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022, సెప్టెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 33ను విడుదల చేసిందని.. కొత్త రిజర్వేషన్ల మేరకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. మెదక్ జిల్లా సర్ధనా హవేలీఘన్పూర్ పోచమ్మరాల్ తండాకు చెందిన జీ. స్వప్న సహా మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. పరిపాలనా విభాగం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ జీవోను వచ్చే ఆదివారం జరిగే ప్రాథమిక పరీక్షకు వర్తింపజేయాలని కోరారు. 503 పోస్టులను భర్తీ చేయడం కోసం ఈ ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్ల నిర్ణయించకుండానే గ్రూప్–1 ప్రిలిమినరీ నిర్వహిస్తున్నారని.. పాయింట్లు కేటాయిస్తే ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్ కోటా కింద దాదాపు 50 పోస్టులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రస్తుతం ప్రాథమిక పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. అయితే తుది ఫలితాలు మాత్రం తీర్పునకు లోబడే ఉంటాయని పేర్కొంటూ..విచారణ వాయిదా వేశారు. -
వైద్య శాఖలో నోటిఫికేషన్లు వాయిదా!.. ఆలస్యానికి కారణం ఇదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పరిధిలో పోస్టుల నోటిఫికేషన్లు వాయిదా పడనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి రోస్టర్ వివరాలు వచ్చాకే నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నాయి. దీనికి ఎన్ని రోజులు పడుతుందనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా 10,028 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. చదవండి: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ 'మరో ప్రస్థానం' అందులో ఇప్పటికే 969 ఎంబీబీఎస్ అర్హతగల సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 211 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే వారం అర్హత సాధించిన వారి జాబితాను ప్రదర్శించనున్నారు. అభ్యంతరాలు స్వీకరించాక తుది జాబితా విడుదల చేస్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు నిర్ణయానికి ముందే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినందున యథాతధంగా భర్తీ ప్రక్రియ జరగనుంది. 9 వేల పోస్టుల్లో గిరిజన రిజర్వేషన్ల పెంపు ఎంబీబీఎస్ అర్హత కాకుండా స్పెషలిస్టు వైద్యులు, నర్సింగ్, ఏఎన్ఎం పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కావాల్సి ఉంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ పూర్తయ్యాక వీటికి నోటిఫికేషన్లు జారీ చేయాలని బోర్డు భావించగా.. గిరిజన రిజర్వేషన్ల పెంపుతో వాయిదా పడ్డాయి. కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి రోస్టర్ వివరాలు అందాక విడతల వారీగా 9వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేస్తామని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. కొత్త రిజర్వేషన్ల ప్రకారం.. ఈ పోస్టుల్లో 900కుపైగా ఉద్యోగాలు గిరిజనులకే దక్కనున్నాయి. -
ఇక కొత్త రోస్టర్.. ఎస్టీ రిజర్వేషన్లు 10శాతానికి పెరగడంతో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో నూతన రోస్టర్ రూపకల్పన అనివార్యమైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 శాతం ఉండగా తాజాగా 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గిరిజను లకు కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్ల శాతానికి తగినట్లుగా గిరిజనుల వాటాను క్రమపద్ధతిలో సర్దుబాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్ల అమలుకు రోస్టర్ పాయింట్లే కీలకం. ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లోకి ప్రవేశాల్లో రోస్టర్ ప్రాతిపదికన కేటాయింపులు జరుపుతున్నారు. ఇప్పటివరకు ప్రతి వందలో 8, 25, 33, 58, 75, 83 స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేసి ఈ లెక్కన ఉద్యోగ కేటా యింపులు, విద్యాసంస్థల్లో అడ్మిషన్లు ఇస్తూ వచ్చారు. తాజాగా రిజర్వేషన్లు 10 శాతానికి పెంచడంతో ఆ మేరకు ఎస్టీ రిజర్వేషన్ స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది. దసరా తర్వాతే స్పష్టత... గిరిజన రిజర్వేషన్ల పెంపు అమలుకు రోస్టర్ సిద్ధం కావాల్సి ఉండటం, ఇందుకు కాస్త సమయం పట్టనుండటం, దసరా సెలవుల అనంతరం రెండో శనివారం, ఆదివారం సెలవు ఉండటంతో కొత్త రోస్టర్‌పై కాస్త సందిగ్ధం నెలకొంది. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా వరుస సెలవులతో మరో రెండ్రోజులు ఈ ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో దసరా సెలవుల తర్వాతే నూతన రోస్టర్‌పై స్పష్టత వస్తుందని అధికార వర్గాల సమాచారం. ప్రతి పదిలో ఒకటిగా... ప్రస్తుత రోస్టర్ చార్ట్‌లో 6 శాతం ప్రకారం కేటాయించిన స్థానాలతోపాటు అదనపు స్థానాల్లో 4 శాతం కోటాను సర్దుబాటు చేసే అవకాశం లేదు. దీంతో కోటా 6% ఉన్నప్పుడు పోస్టుల మధ్య పాటించిన అంతరాన్ని తగ్గించాల్సి ఉంది. ఈ క్రమంలో వంద సీట్లలో 10 శాతం కేటాయింపులు జరపాల్సి వస్తే ప్రతి పదిలో ఒకటి చొప్పున స్థానాన్ని సర్దుబాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగని ప్రతి పదో నంబర్‌ను కేటాయిస్తే దూరం పెరుగుతుందని భావిస్తున్న అధికారులు... ఆ సంఖ్యను కాస్త తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అత్యంత వెనుకబడ్డ వర్గంగా ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్‌లకు తాజా రోస్టర్ న్యాయబద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఈ దిశగా రోస్టర్ పాయింట్లు సర్దుబాటు చేయాలని, వీలైనంత వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చని సీఎం ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. చదవండి: కాంగ్రెస్ జీ-23 గ్రూప్‌పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు -
సవాళ్లకు తావులేకుండా ఎస్టీ రిజర్వేషన్లు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ప్రస్తుతమున్న 6 శాతం నుంచి 10 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్గిరిజన మహాసభ వేదికగా వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పెంపు మార్గదర్శకాల జారీలో భాగంగా అన్ని శాఖల నుంచి ప్రభుత్వం సలహాలు స్వీకరిస్తోంది. ముఖ్యంగా రిజర్వేషన్ల పెంపు వల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా ఈ అంశాన్ని పరిశీలించాలని న్యాయశాఖకు సూచించింది. ‘పొరుగు’ మోడల్‌ను అనుసరిస్తూ... రాష్ట్రంలో ప్రస్తుతం రిజర్వేషన్లు 50 శాతం పరిధిలోనే ఉన్నాయి. గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచితే అవి 54 శాతానికి పెరుగుతాయి. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక ఏ ప్రాతిపదికన 50 శాతం సీలింగ్‌ను దాటి రిజర్వేషన్లు పెంచుకున్నా యనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన పత్రా లు, నిబంధనలను తెప్పించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికా రులు... ఆ నమూనాను అనుసరించొచ్చా లేదా అని పరిశీలిస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తవని భావిస్తే పొరుగు రాష్ట్రాల ఫార్ములాను తెలంగాణలోనూ పాటించే అవకాశం ఉంది. ఇతర వర్గాలకు నష్టం లేకుండా.. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై పలుమార్లు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి... కోటా పెంపు వల్ల ఇతర వర్గాలకు నష్టం జరగొద్దనే సూత్రంతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. మరో మారు పరిశీ లించిన అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని ఓ ఉన్నతాధికారి పేర్కొ న్నారు. ఈ లెక్కన దసరా తర్వాత లేదా దీపావళి కానుక గా గిరిజన రిజర్వేషన్ల పెంపు ఉత్త ర్వులను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల విశ్వసనీయ సమాచారం. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ–25, ఎస్సీ–15, ఎస్టీ–6, మైనారిటీ– 4 శాతంగా రిజర్వేషన్లు ఉన్నాయి. -
ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం(హైదరాబాద్): గిరిజనుల(ఎస్టీ) రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచటంతోపాటు గిరిజనబంధును ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని గిరిజన రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్, సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ నాయక్ అన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని లంబాడి తండాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1986లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 4 శాతం ఉన్న రిజర్వేషన్లను 6 శాతానికి పెంచితే, ఇప్పుడు సీఎం కేసీఆర్ 10 శాతానికి పెంచటం గొప్ప పరిణామమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చారని కొనియాడారు. తండాలను గ్రామపంచాయితీలుగా చేస్తానని చెప్పి 3,600 తండాలను గ్రామ పంచాయితీలుగా చేశారని, ఇప్పుడు వాటన్నింటికీ గిరిజనులే సర్పంచులుగా ఉండటం గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, సేవాలాల్ సేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కళ్యాణనాయక్, నేతలు ఓబానాయక్, మున్నా, దేవేందర్, దేవరాజు, కృష్ణ, నందు తదితరులు పాల్గొన్నారు. -
అబద్ధాల పునాదులపై అధికార ‘కేంద్రం’
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నడుస్తోందని, కేంద్ర మంత్రులు పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అబద్ధాల కర్మాగారాన్ని నడుపుతోందని, ఆ పార్టీ బడా ఝూటా పార్టీ గా మారిందని ఎద్దేవా చేశారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి తెలంగాణ ప్రభు త్వం నుంచి ప్రతిపాదనలు అందలేదని పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడిన కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంత్రి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలి: కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తెలంగాణ గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానపరిచేలా ఉన్నందున బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని కోరుతూ అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపించిందన్నారు. గిరిజన రిజర్వేషన్ల గురించి పార్లమెంట్లో ప్రశ్నను లేవనెత్తిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. అసెంబ్లీ గిరిజన రిజర్వేషన్ల బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సమయంలో ఎమ్మెల్యే గా ఉన్నారని, అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మద్దతు పలికారని గుర్తు చేశారు. బిల్లు ఆమోదం సమయంలో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ప్రతిపాదన రాలేదని కేం ద్రం చెప్పడం ఫూల్స్ (తెలివితక్కువ వారు) డ్రా మాలా ఉందని విమర్శించారు. గిరిజన రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పొందిన తర్వా త 2017 మే 29న కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపామని తెలిపారు. కేంద్రం నుంచి అందినట్లు సమాచారం కూడా వచ్చిందన్నారు. అలాగే సీఎం కేసీఆర్ 2018, 2019లో ప్రధాని మోదీకి లేఖ ఇచ్చారని, మంత్రి సత్యవతి రాథోడ్ రెండుసార్లు 2021, 2022లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాకు లేఖ రాస్తే సమాధానం కూడా వచ్చిందని తెలిపారు. నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇది కోట్లాది మంది గిరిజనులకు సంబంధించిన అంశమని హరీశ్ పేర్కొన్నారు. బీజేపీ అబద్ధాలను దేశమంతా తెలిసేలా ఎండగడతామని, పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామన్నారు. రిజర్వేషన్ల బిల్లును తొక్కిపెట్టి గిరిజనుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు ప్రతి గోండు గూడెం లో, తండాల్లో చేపట్టాలని, యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, కోరుకంటి చందర్, మాజీ ఎంపీ సీతారామ్ నాయక్‌పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు: నిర్ణయాన్ని తిరిగి సమీక్షించం
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశాలిస్తూ తామిచ్చిన తీర్పును తిరిగి సమీక్షించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు ఎలా చేయాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు నోట్ రూపంలో రెండు వారాల్లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. జర్నైల్ సింగ్ వర్సెస్ లచ్మి నరైన్ గుప్తా కేసులో ఇంప్లీడ్ అయిన 133 పిటిషన్లను మంగళవారం జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ గవాయిల ధర్మాసనం మంగళవారం విచారించింది. నాగరాజ్, జర్నైల్ సింగ్ కేసులు తిరిగి ప్రారంభించాలని భావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏ గ్రూపులు వెన కబడి ఉన్నాయో రాష్ట్రాలు ఎలా నిర్ణయిస్తాయని న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘విధానాలు ఎలా అమలు ఎలా చేయాలో రాష్ట్ర ప్రభుత్వాలకు మేం చెప్పడం కాదు.. న్యాయసమీక్షకు లోబడి ఎలా అమలు చేయాలో రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొంది. ‘మూడు హైకోర్టులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాయి.. అందులో రెండు పదోన్నతులు కొనసాగించాలని చెప్పగా ఒకటి స్టే ఇచ్చింది. కేంద్రం ముందు ఈ సమస్య ఉంద’ని అటార్నీ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్టేటస్ కో ఆదేశాల వల్ల 2,500 సాధారణ పదోన్నతులు ఏళ్ల తరబడి నిలిచిపోయానన్నారు. అడ్‌హక్ రూపంలో వాటిని చేపట్టాలని కేంద్రం భావిస్తోందని వేణుగోపాల్ తెలిపారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల నిబంధనల్లో ఈ గందరగోళాన్ని పరిష్కరించాలని కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. నిబంధనల్లో గందరగోళం వల్ల పలు రాష్ట్రాల్లో పదోన్నతులు నిలిచిపోయాయని తెలిపాయి. పలువురు సీనియర్ న్యాయవాదుల వాదనల అనంతరం ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు నోట్ రూపంలో రెండు వారాల్లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. -
అధికారంలోకి వచ్చాక ఎస్టీ రిజర్వేషన్లపైనే తొలి సంతకం
కవాడిగూడ: రాష్ట్రంలోబీజేపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఎస్టీ రిజర్వేషన్ల ఫైల్ మీద ఉంటుందని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్ రావు చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై కొమురంభీం విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్టీ రిజర్వేషన్లపై గిరిజనులను సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. దళితబంధు మాదిరిగానే గిరిజనబంధు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి చొరవతో మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తింపునిస్తామని చెప్పారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్స వాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, గిరిజన ఐక్యవేదిక నేతలు వివేక్ నాయక్, డాక్టర్ హెచ్‌కె నాగు, సిదం అర్జున్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కుతాడి కుమార్, లోనిక రాజు పాల్గొన్నారు. -
ఆరేళ్ల నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన పెంచకపోవడంతో రాష్ట్రంలోని గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని గిరిజన సలహా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన రిజర్వేషన్లు రాష్ట్రంలో మాత్రం పెరగలేదని, దీంతో గిరిజనులకు అన్ని రంగాల్లో కోటా తగ్గిం దని సభ్యులు మండిపడ్డారు. గురువారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన గిరిజన సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎజెండా లోని అంశాలను ప్రస్తావిస్తుండగా.. ములుగు శాసనసభ్యురాలు సీతక్క గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్రంలో 9.8% గిరిజన జనాభా ఉందని, ఆ మేరకు రిజర్వేషన్లు పెంచాల్సి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఆరేళ్లు కావస్తుందని, ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచకపోవడంతో ఎస్టీలు తీవ్రంగా నష్టపోయారని, ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారని పలువురు సభ్యులు ప్రశ్నించారు. దీంతో మంత్రి స్పందిస్తూ.. రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, అక్కడ పెండింగ్‌లో ఉందన్నారు. అనంతరం పోడు భూముల అంశం ప్రస్తావనకు రావడంతో మంత్రి జోక్యం చేసుకుంటూ దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే హామీ ఇచ్చారని, మరోసారి ఈ అంశాన్ని ఆయనకు వివరిస్తానని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. బిల్లులు చెల్లించడం లేదు.. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఇప్పటికే పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని, బకాయిలు పేరుకుపోయాయని సభ్యులు ప్రస్తావించారు. 2020–21 విద్యా సంవత్సరంలో ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని, వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షే మ శాఖ కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా పాల్గొన్నారు. -
మా మధ్య పెద్దలు చిచ్చు పెడుతున్నారు!
నల్లగొండ : ఎస్టీల మధ్య కొందరు పెద్దలు చిచ్చు పెడుతున్నారని, లంబాడీలకు, గోండులు, కోయల మధ్య చిచ్చు పెట్టి రిజర్వేషన్ నుంచి తొలగించాలని కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఆరోపించారు. మంగళవారం నల్లగొండ ఆర్అండ్బీ అ«తిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు భాస్కర్, రతన్‌సింగ్ నాయక్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. 1977లో ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టడం జరిగిందని, ఆనాడు నైజాం, బ్రిటీష్ కాలంలో ఆంధ్రాప్రాంతంలో రిజర్వేషన్లు ఉండేవని, తెలంగాణ లో ఉండేవి కాదన్నారు. ఈ విషయాన్ని ఇంది రాగాంధీ దృష్టికి గిరిజన నేత రవీంద్రనాయక్ తీసుకెళ్లడంతో తెలంగాణ, ఆంధ్రాప్రాంతాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం జరిగిందన్నారు. అయితే కొందరు పెద్దలు గోండులను, కోయలను రెచ్చగొట్టి లంబాడీలపై ఉసిగొల్పుతున్నారన్నారు. రాజ్యాంగపరంగా వచ్చిన రిజర్వేషన్లను ఎవరూ కాదనలేరన్నారు. కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని ఎస్టీలను మోసం చేశాడని ఆరోపించారు. త్వరలోనే లంబాడీల బహిరంగ సభ పెడతామన్నారు. గతంలో ఎస్టీ జాబితాలో 35 కులాలు ఉండేవి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 13 కులాలు ఉన్నాయని, అయితే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తే ఇప్పుడున్న 6 శాతం రిజర్వేషన్లు కూడా తగ్గిపోతాయని, అందరం కలిసి 10శాతం రిజర్వేషన్ సాధిద్ధామన్నారు. విడిపోవడం వల్ల అందరికీ నష్టమని, కలిసివుండి పోరాటం చేద్దామన్నారు. -
ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లకు కేంద్రం కొర్రీ!
సాక్షి, హైదరాబాద్ : ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల పెంపునకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు పీటముడి పడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంలోని రెండు శాఖలు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆ బిల్లును నిలిపేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కేంద్ర హోం శాఖకు సూచించింది. మొత్తం రిజ ర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు విరుద్ధంగా ఉన్నాయంటూ డిసెంబర్ 11నే ఆఫీస్ మెమొరాండం పంపించింది. మరోవైపు ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లులోని అంశాలను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సమర్థించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 9.08 శాతం ఎస్టీ జనాభా ఉందని, ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేసే ప్రతిపాదనకు మద్దతిస్తున్నట్ల తెలిపింది. మొత్తం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎస్టీల రిజర్వేషన్ 9.08 శాతానికి తగ్గకూడదంటూ డిసెంబర్ 18న కేంద్ర హోంశాఖకు ఆఫీస్ మెమోరాండం పంపింది. మొత్తంగా భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రిజర్వేషన్ల పెంపు బిల్లును రాష్ట్రపతికి పంపకుండా పెండింగ్‌లో పెట్టింది. పది నెలలుగా నిరీక్షణ ముస్లిం రిజర్వేషన్లను (బీసీ–ఈ కోటా) 4 శాతం నుంచి 12 శాతానికి, 6 శాతమున్న ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని దాదాపు ఏడాది కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది ఏప్రిల్ 16న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించి.. కేంద్రానికి పంపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్టీ జనాభా 9.08 శాతానికి, ముస్లింల జనాభా 12.68 శాతానికి చేరిందని.. ఈ మేరకు రిజర్వేషన్లను పెంచాలని బిల్లులో ప్రతిపాదించింది. అయితే ఈ రిజర్వేషన్ల పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 62 శాతానికి చేరినట్లయింది. సందేహాలు లేవనెత్తిన డీవోపీటీ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులోని ప్రతిపాదనలను కేంద్ర డీవోపీటీ సున్నితంగా తిరస్కరించింది. 1992లో ఇంద్రా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 (4) ప్రకారం.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించడానికి వీల్లేదని పేర్కొంది. అసాధారణ పరిస్థితుల్లో దీనికి మినహాయింపు ఇవ్వొచ్చని, అందుకు సహేతుక కారణాలు చూపాలని, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం చేసిన సూచనలను ప్రస్తావించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో అటువంటి కారణాలు, అసాధారణ పరిస్థితులేమీ చూపలేదని స్పష్టం చేసింది. కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో ఓబీసీలకున్న 27 శాతం రిజర్వేషన్లలో.. మైనారిటీలకు ఉప కోటా కింద 4.5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేసింది. -
ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్‌తో ఉద్యోగాలు.. భారీ షాక్!
ముంబై : తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తోన్న 11,700 మందిపై వేటు వేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఎస్సీ, ఎస్టీలుగా చెలామణి అవుతూ 20 ఏళ్లుగా ఉద్యోగాలు అనుభవిస్తున్నవారి జాబితాలో క్లర్క్ నుంచి సీనియర్ కార్యదర్శులదాకా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నకిలీ ఉద్యోగుల తొలగింపు అనివార్యమని, అయితే ఒకే దఫాలో వేటు వేస్తే ఎదురయ్యే న్యాయసమస్యలపై చర్యలు జరుపుతున్నామని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుమిత్ ములి మీడియాకు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి సోమవారం(ఫిబ్రవరి 5న) పలు ఉద్యోగ సంఘాలు, వివిధ పక్షాలకు చెందిన నాయకులతో సీఎస్ భేటీ కానున్నారు. సీఎం ఫడ్నవిస్ సూచన మేరకు జరుగనున్న ఈ భేటీల అనంతరం ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. 20 ఏళ్లుగా ఉద్యోగాలు అనుభవిస్తూ.. : మహారాష్ట్రలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో గడిచిన నాలుగు దశాబద్దాలుగా 63,600 మంది ఉద్యోగాలు పొందారు. వారిలో 51,100 మంది అసలైన అర్హులుకాగా, మిగిలిన 11,700 మంది ఫేక్ సర్టిఫికేట్లతో అక్రమ మార్గంలో ఉద్యోగాలు పొందారు. అక్రమ ఉద్యోగులపై కొన్ని దళిత, గిరిజన సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ‘‘ఒక వ్యక్తి దీర్ఘ కాలం సర్వీసులో ఉన్నప్పుడు అతని కుల ధృవీకరణ తప్పని తేలితే ఉద్యోగం నుంచి తొలగించాల్సిన అవసరంలేదు’’ అన్న ముంబై హైకోర్టు తీర్పు మరింత గందరగోళానికి దారితీసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. 2017 జులైలో సంచలన తీర్పు చెప్పింది. ‘‘రిజర్వేషన్ కేటగరిలో నకిలీ సర్టిఫికెట్లతో పొందిన ఉద్యోగాలు, ప్రవేశాలు చట్టం దృష్టిలో చెల్లుబాటుకావని, అలా ఉద్యోగాలు చేస్తున్న వారిని విధుల నుంచి తప్పించాల్సిందే’’నని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో ఆ 11,700 మందిపై వేటుకు రంగం సిద్ధమైంది. -
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంపు!
► ఎస్సీలకు 16%, ఎస్టీలకు 9% ► జనాభా ప్రాతిపదికన ప్రతిపాదనలు రూపొందించిన యంత్రాంగం ► సానుకూలంగా ఉన్న సీఎం.. త్వరలో ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. జనాభా ప్రాతిపదికన ఈ వర్గాల రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జనాభా లెక్కల ఆధారంగా అధికారులు రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల జనాభా శాతంలో మార్పులు చోటు చేసుకున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.50 కోట్లు. ఇందులో ఎస్సీ జనాభా 54.08 లక్షలు, ఎస్టీ జనాభా 31.77 లక్షలుగా ఉంది. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలోనూ రిజర్వేషన్ల పెంపుపై ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. రిజర్వేషన్ల పెంపుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు అతి త్వరలో ఆమోదం లభించనున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీలకు తాజాగా 4 శాతం రిజర్వేషన్లు పెరగనుండడంతో రిజర్వేషన్ల కోటా 54 శాతానికి చేరుకోనుంది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. కొత్త నోటిఫికేషన్ల నాటికి.. ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగిరం చేస్తోంది. దీంతో ఆయా వర్గాలు నష్టపోతున్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. త్వరలో వెలువడే నోటిఫికేషన్లకు కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా రిజర్వేషన్లు పెంచాలనే యోచనలో ఉంది. -
కొత్తగా ఇవ్వడం లేదు.. పెంచుతున్నాం
⇔ ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లపై సీఎం స్పష్టీకరణ ⇔ప్రజలకిచ్చిన హామీని తప్పక నెరవేరుస్తాం ⇔తమిళనాడు తరహాలో మక్కీకి మక్కీగా చట్టం తెస్తాం ⇔బిల్లును ఈ నెల 16న అసెంబ్లీలో పెడతాం ⇔ఎంత పెంచాలన్నది 15న కేబినెట్ భేటీలో నిర్ణయిస్తాం ⇔త్వరలో బీసీ, ఎస్సీ రిజర్వేషన్లు కూడా పెంచుతాం ⇔కేంద్రం ఈ రిజర్వేషన్లను వద్దంటే సుప్రీంకోర్టుకు వెళ్తాం ⇔తమిళనాడుకు ఉన్న వెసులుబాటు ఇవ్వాలని కోరుతాం ⇔గతంలోని సుప్రీం తీర్పు ఏమాత్రం అడ్డంకి కాబోదు ⇔కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. తెలంగాణ రిజర్వేషన్ చట్టం పేరుతో బిల్లును తీసుకొస్తామని.. 16న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లు ప్రవేశపెడతామని వెల్లడించారు. తమిళనాడు తరహాలో మక్కీకి మక్కీగా రిజర్వేషన్ల బిల్లును రూపొందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తామని తెలిపారు. ఇదే తరహాలో త్వరలోనే బీసీలకు, ఎస్సీలకు సైతం రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు. తెలంగాణ సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు రూపొందించాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. తాము రిజర్వేషన్ల పెంపు కొత్తగా చేయడం లేదని, మతపరమైన రిజర్వేషన్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ‘‘ఎస్టీలకు 12 శాతం, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఉద్యమ సమయంలో, ఎన్నికల సభల్లో వందల సార్లు ప్రజలకు హామీ ఇచ్చాం. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. మతపరమైన రిజర్వేషన్ ఇవ్వడం లేదు. మేం ఇవ్వబోతున్న రిజర్వేషన్ కొత్తది కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో అమల్లో ఉన్నదే. దాన్ని కొంత శాతం పెంచుతున్నాం. ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ భేటీ ఉంటుంది. అదేరోజు సాయంత్రం 4.30కు బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కోరాం. 16న అసెంబ్లీ సమావేశాలకు పిలవాలని సభాపతిని కోరాం. బీసీ కమిషన్, సుధీర్ కమిటీ ప్రభుత్వానికి తమ నివేదికలు అందించాయి. ఈ నివేదికల ఆధారంగా ఎస్టీ, బీసీ–ఈలకు ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలనేది కసరత్తు చేయాలని మంత్రిని, అధికారులను ఆదేశించాం. ఈలోగా కసరత్తు జరుగుతుంది. 15న జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటాం’’అని సీఎం అన్నారు. బుధవారం ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎస్సీలకు ఒక శాతం పెంచాల్సి ఉంది రాష్ట్రంలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పేదరికంలో మగ్గుతున్నారని సీఎం పేర్కొన్నారు. ‘‘కులాలు, మతాల పేరుతో రిజర్వేషన్లకు అవకాశం లేదు కాబట్టి ఆర్థిక, సామాజిక అంశాల ఆధారంగా బీసీ కమిషన్ విచారణ జరిపింది. ముస్లింలకు బీసీ–ఈ కోటాలో రిజర్వేషన్లు ఇస్తాం. ముస్లింలకు కొత్తగా రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. ప్రస్తుతమున్న రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతున్నాం...’’అని వివరించారు. ‘‘ఇప్పుడున్న జనాభాను బట్టి రాష్ట్రంలో ఎస్సీల కనీసం ఒక శాతం రిజర్వేషన్ పెంచుతాం. బీసీలకు కూడా కొంత రిజర్వేషన్లు పెంచాల్సి న అవసరం ఉంది. బీసీల్లో ఎంబీసీలు, సంచార జాతుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌ను కోరాం. అన్ని జిల్లాల్లో పర్యటించి 6, 7 నెలల్లో కమిషన్ నివేదిక ఇస్తుంది. బీసీ కమిషన్‌కు అవసరమైన వివరాలివ్వాలని అధికారులను కోరాం. నివేదిక వచ్చాక బీసీల రిజర్వేషన్ల పెంపునకు కృషి చేస్తాం. త్వరలోనే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వంపై ఆరోపణలు చేసేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. బీసీ–ఈ రిజర్వేషన్లు పెంచితే బీసీల రిజర్వేషన్లు తగ్గుతాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక్క శాతం కూడా తగ్గేది లేదు. బీసీలకు సైతం రిజర్వేషన్లు పెంచుతాం. పార్టీ మేనిఫెస్టోలపై ఇటీవల సుప్రీం చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు మాకు సరిపోతాయి. దేశంలో నూటికి నూరు శాతం మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీ మాది..’’అని సీఎం అన్నారు. కేంద్రం వద్దంటే సుప్రీంకు.. రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం అనుమతించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం చెప్పారు. ‘‘ఒక దేశంలో రెండు చట్టాలు ఉంటాయా? తమిళనాడు మాదిరిగానే తెలంగాణలోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని కోరతాం. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు అడ్డంకి కాబోదు. మండల్ కమిషన్ రిజర్వేషన్లపై అలజడి చెలరేగిన సమయంలో ఇందిరా సహానీ కేసులో.. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదే తీర్పులో మరో విషయం కూడా ప్రస్తావించింది. ప్రత్యేక పరిస్థితులుండీ.. న్యాయబద్ధంగా ఉండీ.. సమంజసమైన ప్రాతిపదిక ఉంటే 50 శాతం పరిధిని పెంచుకునే అవకాశముందని పేర్కొంది. అందుకే తమిళనాడుకు ఉన్న వెసులుబాటునే తెలంగాణకు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరతాం. స్వాతంత్య్రం వచ్చినప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. మారిన పరిస్థితులను బట్టి కేంద్రం కూడా ఆలోచించుకోవాలి. దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ అధికారాలను రాష్ట్రాలకు అప్పగించాలి’’అని అన్నారు. విద్య, ఉద్యోగ విషయాల్లో అమలయ్యే ఈ రిజర్వేషన్లు ఎంత ఉండాలనే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని కేంద్రానికి సూచించారు. ‘‘పార్టీ ఏదైనా ప్రభుత్వ ప్రక్రియ నిరంతరం. కొన్ని సందర్భాల్లో కేంద్రంలో యూపీఏ ఉండవచ్చు.. ఎన్డీఏ ఉండవచ్చు.. ఏదో బీబీఏ ఉండవచ్చు. తమిళనాడుకు చేసినట్లు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సచ్చినట్లు చేయాలి. తమిళనాడుకు పీవీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఈ రోజు మోదీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఒక పార్టీకి ఒక పిచ్చి ఉండవచ్చు.. మా పార్టీకి ప్రజలకు న్యాయం జరగాలన్న పిచ్చి ఉంది. రూ.17 వేల కోట్ల రైతు రుణమాఫీ విజయవంతంగా పూర్తి చేశాం. రైతులపై ఉన్న రూ.లక్ష రుణ భారం తగ్గించాం. ఇది శుభపరిణామం’’అని సీఎం అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్లే.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 50 శాతం మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ‘‘తమిళనాడులో 32 సంవత్సరాలుగా 69 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. దేశంలో ఏడు రాష్ట్రాల్లో ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లున్నాయి. జార్ఖండ్‌లో 60 శాతం, మహారాష్ట్రలో 52, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరంలో 80 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. గుజ్జర్లు, జాట్లకు 68 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాజస్తాన్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. ఇప్పుడు కేంద్రం పరిశీలనలో ఉంది’’అని వివరించారు. కేబినెట్ నిర్ణయాలివి బీసీ కమిషన్, సుధీర్ కమిటీ నివేదికకు ఆమోదం ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరించాలంటూ కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయాలని నిర్ణయం తెలంగాణ హెరిటేజ్ యాక్టు తెచ్చేందుకు నిర్ణయం గతంలో గవర్నర్ ఎమ్మెల్సీ కోటా కింద పనిచేసిన బి.రాజేశ్వరరావు, ఫరూఖ్‌ను తిరిగి మరోసారి నియమించాలని నిర్ణయం. ఈ మేరకు గవర్నర్‌కు ప్రతిపాదన పంపాలని తీర్మానం. -
కొత్తగా ఇవ్వడం లేదు..పెంచుతున్నాం
-
16న అసెంబ్లీ.. రిజర్వేషన్లపై చట్టం: కేసీఆర్
► 15వ తేదీన బీఏసీ సమావేశం ► తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తాం ► అవసరమైతే 50 శాతం మించి ఇస్తాం, అనుమతి తీసుకుంటాం ► ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి ► ఒక రాష్ట్రానికి ఒక నీతి, మరో రాష్ట్రానికి మరో నీతి సరికావు ► 21న ప్లీనరీ, 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ ► 14 నుంచి 20 వరకు గులాబి కూలీదినాలు ► నేను కూడా రెండు రోజులు కూలిపనులు చేస్తా ► తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి హైదరాబాద్ ఈనెల 16వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందని, ఆ రోజు ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లపై బిల్లును ఆమోదిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. అయితే మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి వారిని బీసీ-ఈ గానే పరిగణించి ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలో మంత్రివర్గంలో నిర్ణయించి ఆ మేరకు బిల్లును పెడతామన్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్రపతి ఆమోదం కోరుతామని తెలిపారు. ఈ విషయమై బుధవారం నిర్వహించిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లతో పాటు హెరిటేజ్ చట్టం వంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. తెలంగాణ రాష్ట్రం సామాజిక నేపథ్యంలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉన్నారు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరైనా పరిస్థితిని సమీక్షించుకుంటారు బీసీ-ఈ కింద పరిగణించే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. వారిలో పేదరికం ఉంది ముస్లింలు, గిరిజనులకు చెరో 12 శాతం రిజర్వేషన్ పెంచుతామని నేను గతంలో చెప్పాను తమిళనాడులో 50 శాతం కంటే ఎక్కువ ఎలా అమలవుతోందో తెలంగాణలోనూ అలాగే చేస్తామని గతంలో చెప్పాను సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్లు నియమించగా ఇద్దరూ నివేదికలు ఇచ్చారు కుల మతాల పేరు మీద రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి వాళ్ల ఆర్థిక, రాజకీయ, సామాజిక వెనకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వగలం కాబట్టి ఆ మేరకు బీసీ కమిషన్ నివేదికలు ఇచ్చింది ఆ నివేదికను ప్రభుత్వం ఆమోదించింది ఎస్టీ కమిషన్‌కు సంబంధించి చెల్లప్ప నివేదికను కూడా ఆమోదించాం ఈనెల 16న అసెంబ్లీ సమావేశం ఏర్పాటుచేయాలని స్పీకర్‌ను కోరాం బిల్లు తయారుచేయాల్సిందిగా న్యాయశాఖ కార్యదర్శిని కూడా ఆదేశించాం 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ కేబినెట్ సమావేశం ఉంటుంది 4.30 గంటలకు స్పీకర్ కార్యాలయంలో బీఏసీ సమావేశం నిర్వహించాలని కోరాం 16వ తేదీన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుంది మంత్రులు అధ్యయనం చేసిన తర్వాత 15న ఎస్టీలకు ఎంత శాతం, బీసీ-ఈకి ఎంత శాతం ఇవ్వాలో నిర్ణయిస్తాం మేం మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం లేదు, మేం ఇచ్చేది కొత్తది కూడా కాదు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇస్తున్నారు దూదేకులకు ఒక శాతం, బీసీ-ఈ కింద 4 శాతం ఇస్తున్నారు దాన్ని కొంతమేరకు పెంచుతాం.. అంతేతప్ప కొత్తగా ఇవ్వడంలేదు ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది. వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వడానికి అవసరమైతే 50 శాతం మించి ఇవ్వడానికి సుప్రీంకోర్టే అనుమతించింది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఈ ఏడు రాష్ట్రాల్లో ముస్లింల వెనకబాటు తనాన్ని గుర్తించి అందులో కొన్ని గ్రూపులను గుర్తించి వారికి ఇప్పటికే రిజర్వేషన్ ఇస్తున్నారు. తమిళనాడు 69%, జార్ఖండ్ 60%, మహారాష్ట్ర 52%, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజొరాం.. ఈ నాలుగు రాష్ట్రాలలో గిరిజనులకు 80% చొప్పున రిజర్వేషన్ అమలులో ఉంది. గుర్జర్లు, జాట్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని రాజస్థాన్ ప్రభుత్వం అక్కడ రిజర్వేషన్లను 68 శాతానికి పెంచాలని తీర్మానించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. ఆ తరహాలోనే మేం 15న కేబినెట్ ఎంత శాతమో నిర్ణయించాక 16న అవసరమైన చట్టం చేస్తాం తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ చట్టాన్ని ఆమోదిస్తాం కేంద్రంతో మాట్లాడి దీనికి రాష్ట్రపతి ఆమోదం ఇప్పించాలని కోరుతాం, కేంద్రం కూడా ఇప్పిస్తుందనే ఆశాభావం ఉంది దేశంలో ఒక రాష్ట్రానికి ఒక నీతి, మరో రాష్ట్రానికి మరో నీతి ఉండటానికి వీల్లేదు తమిళనాడులో 68 శాతం రిజర్వేషన్ 32 ఏళ్లుగా కొనసాగుతోంది 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగిలిన తమిళనాడులో రిజర్వేషన్లపై సమీక్షించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు తెలంగాణది కూడా అదే పరిస్థితి. ఇక్కడి సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ ఎస్సీలకు 15 శాతం అమలుచేస్తున్నాం, కానీ రాష్ట్రంలో వారి జనాభా 16.3 శాతం ఉన్నట్లు జనాభా లెక్కల్లో తేలింది బీసీల రిజర్వేషన్‌ను కూడా కొంత పెంచడానికి సుముఖంగా ఉన్నాం వృత్తి పనుల్లో చెప్పులు కుట్టే వృత్తి తప్ప మిగిలిన వృత్తులన్నీ బీసీ కులాలే చేస్తున్నారని, వాళ్లు వెనకబడి ఉన్నందున వాళ్లకు ఎంత శాతం రిజర్వేషన్ పెంచాలి, అందులో అత్యంత వెనకబడిన (ఎంబీసీ)ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్లకు ఏంచేయాలి, సంచార జాతుల స్థితిగతులేంటనే విషయాలపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ను కోరాం బీసీ కమిషన్ ఎక్కడ పర్యటించినా వారికి కలెక్టర్లు, కార్యదర్శులు పూర్తి సమాచారాన్ని అందించాలని తెలిపాం ఇప్పుడు బీసీలకు ఉన్న రిజర్వేషన్ ఒక్కశాతం కూడా తగ్గదు.. నివేదిక అందిన తర్వాత మరింత పెంచుతాం ఎవరూ ధర్నాలు, డిమాండ్ చేయకపోయినా దేశంలో తొలిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్లలోనూ రిజర్వేషన్లు అమలు చేశాం పార్టీల మేనిఫెస్టోలు చిత్తు కాగితాలా.. వాటిని అమలు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల వ్యాఖ్యానించారు. అందువల్ల ప్రోగ్రెసివ్ థింకర్స్ ఎవరూ దీన్ని వ్యతిరేకించొద్దని కోరుతున్నా త్వరలోనే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్లను నియమించి స్థితిగతులపై అధ్యయనం చేస్తాం సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు హెరిటేజ్ చట్టం అసంబద్ధంగా ఉండేది దాన్ని అర్బన్ డెవలప్మెంట్ కింద పెట్టి కేవలం హైదరాబాద్ నగరంలోనే కొన్ని భవనాలనే తెచ్చారు, అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న చారిత్రక కట్టడాలను విస్మరించారు వనపర్తి కోట, దోమకొండ గడీ లాంటి వాటిని పెట్టలేదు గతంలోనే దాన్ని మార్చాం. హెరిటేజ్ యాక్ట్ అంటే రాష్ట్రం మొత్తానికి ఉంటుంది. దాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. గతంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా చేసిన డి రాజేశ్వరరావు, ఫారుక్ హుస్సేన్ లను మరో టెర్మ్ నియమించాలని తీర్మానం చేశాం, గవర్నర్‌కు పంపుతాం 17 వేల కోట్ల రుణమాఫీని విజయవంతంగా ముగించాం తెలంగాణ రైతులకు ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం లక్ష రూపాయల రుణభారం వారి తలమీద నుంచి తీసేశాం 21న ప్లీనరీ, 27న వరంగల్‌లో సభ ఈనెల 21వ తేదీన హైదరాబాద్‌లో ప్లీనరీ, 27వ తేదీన వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం టీఆర్ఎస్ సభ్యత్వం 75 లక్షలు దాటింది.. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు దేశంలోని పెద్ద పార్టీలలో టీఆర్ఎస్ కూడా చేరింది నాయిని నరసింహారెడ్డి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా ఉంటారు 14 నుంచి 20 వరకు గులాబి కూలీ దినాలుగా ప్రకటిస్తున్నా వీలును బట్టి ఈ ఆరు రోజుల్లో రెండు రోజుల పాటు కూలీ పనులు చేయాలి నేను కూడా రెండు రోజులు కూలీ చేసి ఆ డబ్బుతో సభకు రావాలి, దాన్ని విజయవంతం చేయాలి -
'దామాషా పద్ధతిన ఎస్టీలకు రిజర్వేషన్లు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాలు, ఇతర అన్ని రంగాల్లోనూ ఇదే విధానంలో రిజర్వేషన్లు అమలు చేయాలని గురువారం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు రాసిన లేఖలో కోరారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్ల హామీని 16 నెలల కాలంలో ఎందుకు అమలుచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం వెంటనే ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇలా..
లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇలా.. రాష్ట్రం మొత్తం ఎస్సీ ఎస్టీ సీట్లు ఆంధ్రప్రదేశ్ 42 7 3 అరుణాచల్‌ప్రదేశ్ 2 - - అసోం 14 1 2 బీహార్ 40 6 - ఛత్తీస్‌గఢ్ 11 1 4 ఢిల్లీ 7 1 - గోవా 2 - - గుజరాత్ 26 2 4 హర్యానా 10 2 - హివూచల్ప్రదేశ్ 4 1 - జవుూ్మకాశ్మీర్ 6 - - జార్ఖండ్ 14 1 5 కర్ణాటక 28 5 2 కేరళ 20 2 - వుధ్యప్రదేశ్ 29 4 6 వుహారాష్ట్ర 48 5 4 వుణిపూర్ 2 - 1 మేఘాలయు 2 - 2 మిజోరాం 1 - 1 నాగాలాండ్ 2 1 - ఒడిశా 21 3 5 పంజాబ్ 13 4 - రాజస్థాన్ 25 4 3 సిక్కిం 1 - - తమిళనాడు 39 7 - త్రిపుర 2 - 1 ఉత్తరప్రదేశ్ 80 17 - పశ్చివుబెంగాల్ 42 10 2 అండవూన్ నికోబార్1 - - చండీగఢ్ 1 - - దాద్రానగర్ హవేలీ 1 - 1 డయుూ్య డావున్ 1 - 1 లక్షదీవులు 1 - 1 పుదుచ్చేరి 1 - - మొత్తం 543 84 47