నాలుగో రోజు 29 నామినేషన్లు
లోక్‌సభకు 4, అసెంబ్లీ స్థానాలకు 25 దాఖలు
నల్లగొండకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
మిర్యాలగూడ అసెంబ్లీకి తూడి
సాక్షి, నల్లగొండ, జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాలుగో రోజు శనివారం మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలకు రెండుచొప్పున, 8 అసెంబ్లీ స్థానాలకు 25 చొప్పున ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భువనగిరి, నాగార్జునసాగర్, దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి ఒక్క నామినేషన్ కూడా రాలేదు. అత్యధికంగా నల్లగొండ అసెంబ్లీ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 7, టీడీపీ, టీఆర్‌ఎస్ నుంచి 3 చొప్పున, వైఎస్సార్ కాంగ్రెస్, భారత పిరమిడ్ పార్టీల నుంచి ఒక్కొక్కటి చొప్పున, స్వతంత్రులు 10మంది నామినేషన్లు వేశారు.
ఎంపీ గుత్తా, డీసీసీ అధ్యక్షుడు తూడి..
నల్లగొండ లోక్‌సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్లను సమర్పిం చారు. అదేవిధంగా భువనగిరి లోక్‌సభ స్థానానికి బీఎస్పీ అభ్యర్థిగా అర్వపల్లి అంబటి రెండు సెట్ల నా మినేషన్లు వేశారు. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానానికి డీసీసీ జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా నకిరేకల్ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రెండుసెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.