సాక్షి, హన్మకొండ: గతంలో వరంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హన్మకొండ గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టకుని వరంగల్‌కు వస్తున్నారో ప్రజలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. (వరంగల్‌లో అదృశ్యం.. కశ్మీర్‌లో ప్రత్యక్షం)
గతంలో గ్రేటర్ వరంగల్‌కు ప్రతి ఏడాది రూ.300 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారని, కేంద్ర నిధులతో చేసిన అభివృద్ధి పనులే తప్ప, ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు.కేంద్రం ఇచ్చిన నిధులతో చేసిన పనులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుని ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment