Rajender reddy
-
కిషన్‌రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ..అందుకేనా..!
సాక్షి,హన్మకొండజిల్లా:తెలంగాణ రాజకీయల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కలిశారు. కిషన్‌రెడ్డి ఆదివారం(ఫిబ్రవరి16) హన్మకొండ పర్యటనకు వచ్చినపుడు ఎమ్మెల్యే ఆయనను కలిసి చర్చిచండంతో పాటు అభివృద్ధి పనులపై వినతి పత్రం సమర్పించారు.వేయిస్తంభాల గుడిని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని,కుడా ఆధ్వర్యంలో చేపట్టే పనులకు అనుమతులు, నిధులు కేటాయించాలని కిషన్‌రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. ఎలాంటి రాజకీయ బేషమ్యాలకు పోకుండా హన్మకొండ అభివృద్దే తన ధ్యేయం అని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి కోసమే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిశానని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్నారు. -
నేను ఎవరితోనూ భేటీ కాలేదు: నాయిని రాజేందర్ రెడ్డి
-
బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేత వివాదం.. వేడెక్కుతున్న వరంగల్ పాలిటిక్స్
సాక్షి, వరంగల్: వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేత వివాదం ముదురుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. పార్క్ స్థలం ఎకరం భూమి ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించుకుని ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయానికి ఇంటి నంబర్ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వరంగల్ బీఆర్ఎస్ నేతలను స్టువర్ట్ పురం చెడ్డి గ్యాంగ్ దొంగలుగా రాజేందర్ రెడ్డి అభివర్ణించారు. భూ ఆక్రమణలు చేసిన బీఆర్ఎస్ నేతల మీద రౌడి షీట్ ఓపెన్ చేసి చెడ్డిల మీద తిప్పాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలైనా వదిలిపెడతాను కానీ... వినయ్ భాస్కర్ చేసిన పాపాలను వదిలిపెట్టనంటూ ఎమ్మెల్యే నాయిని నిప్పులు చెరిగారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏఎస్ఐ మృతి
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ షీ టీమ్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్‌రెడ్డి (51) హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ నెల 11న విధులు ముగించుకొని ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తుండగా నాగోలు ప్లైఓవర్‌పై బైక్ స్కిడ్ అయి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నాగోలులోని సుప్రజా హాస్పిటల్ తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రాజేందర్‌రెడ్డి చనిపోయాడు. పలువురు పోలీసు అధికారులు అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. ఆదివారం నాగోలు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజేందర్‌రెడ్డి అంత్యక్రియల కోసం షీ టీమ్ డీసీపీ 70 వేలు నగదు, ఇతర పోలీసులు సిబ్బంది 70 వేలు అతడి కుటుంబ సభ్యులకు అందజేశారు. -
రౌడీషీటర్లకు కార్పెట్ వేస్తావా.. అంతుచూస్తా
సాక్షి, తాండూరు: ‘రౌడీషీటర్లకు కార్పెట్ వేస్తావా..? ఎంత ధైర్యం? నీ అంతు చూస్తా!’ అంటూ తాండూరు సీఐపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివా దాస్పద మయ్యాయి. 3 రోజుల క్రితం జరిగిన భావిగి భద్రేశ్వర జాతరకు ముందుగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. అరగంట తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. దాంతో మరో కార్పెట్ వేసి ఎమ్మెల్యేను కూర్చోబెట్టారు. ఇదే మహేందర్‌రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ప్రొటోకాల్ ఎందుకు పాటించలేదని సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి మహేందర్‌రెడ్డి బూతులు తిట్టారు. ‘నా ముందే రౌడీషీటర్లకు కార్పెట్ ఎలా వేస్తావు’ అని సీఐని నిలదీశారు. ‘రౌడీషీటర్లు ఎవరు ?’ అని సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే పక్కన ఉన్నవారంతా వారేనంటూ దుర్భాషలాడారు. ఎమ్మెల్యే రౌడీషీటరా అంటూ సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్సీ మళ్లీ తీవ్ర పదజాలం ఉపయోగించారు. మంచిగా మాట్లాడాలని సీఐ ఎమ్మెల్సీని కోరగా.. ‘నువ్వు ఇసు క అమ్ముకొంటలేవా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ అమ్ముకొంటున్నాన ని సీఐ ప్రశ్నించగా.. త్వరలో పట్టిస్తానని ఫోన్ కట్ చేశారు. సీఐని దూషించిన కేసులో మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వికారాబాద్ ఎస్పీ తెలిపారు. అధికారులకు ఆడియో తలనొప్పి... జాతర సందర్భంగా జరిగిన తప్పిదాలు పోలీసు ఉన్నతాధికారులకు సమస్యలను తెచ్చిపెట్టాయి. ప్రొటోకాల్ ప్రకారం బందోబస్తు నిర్వహించడంలో విఫలం అయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఎమ్మెల్సీ, సీఐల మధ్య ఫోన్ సంభాషణ ఆడియో బయటకు రావడం కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టింది. ఈ విషయమై తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రాజేందర్‌రెడ్డిలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. మహేందర్ రెడ్డిని అడగ్గా.. ‘పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి ప్రొటోకాల్‌ను పాటించట్లేదు. ఫోన్లో నేను తిట్టింది వాస్తవమే’ అని తెలిపా రు. తాండూరు సీఐని మహేందర్‌రెడ్డి దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
2 వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై లైంగిక దాడి.. ఫొటోలు తీసి పెళ్లికొడుకు వాట్సాప్‌కు
మహబూబ్‌నగర్ క్రైం: రెండు వారాల్లో పెళ్లి కాబోతున్న యువతిపై ఇద్దరు లైంగిక దాడి చేయడమేగాక.. ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి సదరు పెళ్లికొడుకుకి పంపారు. ఈ నెల 5న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కోత్లాబాద్‌కి చెందిన ఓ అమ్మాయి(20) ప్రతిరోజూ మహబూబ్‌నగర్‌కు వచ్చి దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే మల్కాపూర్కి చెందిన రాజేందర్‌రెడ్డి అలియాస్ రాజు కొత్లాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: (దిగొచ్చిన చికెన్ ధర.. లొట్టలేస్తున్న మాంసం ప్రియులు) ప్రస్తుతం ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉండటంతో రాజు కూడా ప్రతిరోజూ కొత్లాబాద్ నుంచి బైక్‌పై మహబూబ్‌నగర్‌కు వచ్చి పెయింటింగ్ పని చేసేవాడు. ఈ క్రమంలో దినసరి కూలీగా పని చేసే అమ్మాయిని రాజు చాలాసార్లు బైక్‌పై ఎక్కించుకుని రావడంతో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈనెల 5న ఆ అమ్మాయి పని కోసం జిల్లాకేంద్రంలోని టీడీగుట్ట గేటు దగ్గరకు వచ్చింది. ఆరోజు పని దొరకకపోవడంతో రాజు అతని స్నేహితుడు, ఆంజనేయులు కలిసి ఆమె వద్దకు వెళ్లారు. చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..) వేరే చోట పని ఇప్పిస్తామని చెప్పి బైక్‌పై ఎక్కించుకుని ఫతేపూర్ అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. రాజు అత్యాచారం చేసేటప్పుడు ఆంజనేయులు ఫొటోలు, వీడియోలు తీశాడు. విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు. కాగా, ఈ నెల 18న ఆ అమ్మాయికి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లైంగిక దాడి ఫొటోలు, వీడియోలను సదరు పెళ్లికొడుకు వాట్సాప్‌కు పంపారు. చదవండి: (సెంట్రల్ జైలులో ఉంచినా.. నమ్మిన జెండా వీడలేదు.. సమర్థతను గుర్తించి) ఆ ఫొటోలను పెళ్లికొడుకు అమ్మాయి తల్లిదండ్రులకు చూపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై 2 రోజుల క్రితం అమ్మాయి, తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి శుక్రవారం రాజు, ఆంజనేయులును అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు. -
ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
సాక్షి, హన్మకొండ: గతంలో వరంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హన్మకొండ గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టకుని వరంగల్‌కు వస్తున్నారో ప్రజలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. (వరంగల్‌లో అదృశ్యం.. కశ్మీర్లో ప్రత్యక్షం) గతంలో గ్రేటర్ వరంగల్‌కు ప్రతి ఏడాది రూ.300 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారని, కేంద్ర నిధులతో చేసిన అభివృద్ధి పనులే తప్ప, ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు.కేంద్రం ఇచ్చిన నిధులతో చేసిన పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుని ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
పాలమూరులో క్లీన్ స్వీప్..
సాక్షి, నారాయణపేట: రాష్ట్రంలో ఏ సభకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతుండ్రు.. ఈ ఊపు చూస్తుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల గెలుపు ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. అప్పట్లో పాలమూరును తొమ్మిదేళ్లు దత్తత తీసుకున్న చంద్రబాబు ఆగం చేసిండు.. మళ్లీ పాలమూరు– రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును అడ్డుకుంటూ కేసులు వేశారని విమర్శించారు. ఇప్పుడేమో సిగ్గులేకుండా మక్తల్‌లో టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టిండు.. ఇక్కడ ఎస్‌ఆర్‌రెడ్డి గెలుస్తాడు.. ప్రతి ఇంటికి ఒకరూ చొప్పున పక్కనున్న మక్తల్ నియోజకవర్గంలో అడుగుపెట్టి అక్కడి టీడీపీ అభ్యర్థిని ఓడించి తెలంగాణ సత్తా ఏమిటో చాటాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పచ్చబడుతున్న పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు నిర్మాణం కాకుండా అడ్డుకున్న చంద్రబాబుకు తగిన బుద్ధిచెప్పాలన్నారు. ఆంధ్రవాళ్ల పెత్తనం తెలంగాణలో ఎందుకు అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తిచేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కర్వెన నుంచి మొదటి దశలోనే పేట జాయమ్మ చెరువుకు రూ.20 కోట్లు ఇచ్చి ఎత్తిపోతలతో నీళ్లు నింపుతామన్నారు. ‘పేట’ను జిల్లా చేస్తా టీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డిని కారు గుర్తుకు ఓటేసి లక్ష మెజారిటీతో అసెంబ్లీకి పంపించండి.. మీ చిరకాల వాంఛ అయిన పేటను ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో జిల్లాగా ప్రకటిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. 58 ఏళ్లలో ఏ ఒక్క సీఎం ఒక్క జిల్లాను చేయలేదు.. 31 జిల్లాలు చేసిన కేసీఆర్.. 32వ జిల్లాగా పేటను చేయడం ఖాయమన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని, మూడు నెలల్లో పేటకు వచ్చి కలెక్టర్, ఎస్పీ కార్యాలయాన్ని నా చేతులమీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి వెళ్తానన్నారు. చేనేతకు చేయూత.. చేనేత కార్మికులను ఏనాడు ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయి. చేనేతకు చేయూతనిస్తూ 50 శాతం సబ్సిడీతో నూలు, కావాల్సిన రసాయనిక పదార్థాలు ఇస్తామన్నారు. అలాగే నేతన్నలు తయారు చేసిన చీరలను తామే కొనుగోలు చేసి.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. దత్తత తీసుకోండి.. కర్ణాటక సరిహద్దులో ఉన్న మారుమూల నారాయణపేటను దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేందర్‌రెడ్డి కేసీఆర్‌ను కోరారు. అలాగే ఈ ప్రాంత రైతుల చిరుకాల వాంఛ అయిన నారాయణపేట జాయమ్మ చెరువును కృష్ణాజలాలతో నింపాలని ఆకాంక్షించారు. అన్నిరంగాల్లో వెనుకబడిన ఈ ప్రాంతంలో విద్య, వైద్యం తదితర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కేసీఆర్‌కు విన్నవించారు. -
వరగల్ వెస్ట్ టికెట్ నాకే ఇవ్వాలని కోరా ; నాయిని రాజేంద్రర్రెడ్డి
-
అమ్మ ఎట్లుంది?
పెద్దపల్లి: అమ్మ ఎట్లుంది.. ఆరోగ్యం బాగుందా.. నాన్న చనిపోయి నాలుగేండ్లయిందా? పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి తనయుడు రాజేందర్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుశల ప్రశ్నలు అడిగారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో గురువారం సీఎంను కలిసిన రాజేందర్‌రెడ్డి పరిచయం చేసుకునేలోపే అమ్మ బాగుందా అని అడగడంతో అమ్మ కూడా చనిపోయిందని సమాధానమిచ్చారు. దీంతో కాసేపు విచారం వ్యక్తం చేసి దగ్గరకు తీసుకున్నారు. అనంతరం రాజేందర్‌రెడ్డి పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము మనో హర్రెడ్డి గెలుపు కోసమే పనిచేశామని, తిరిగి అప్పటి నుంచి టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇకముందు కూడా టీఆర్ఎస్లోనే కొనసాగుతూ పార్టీ విజయానికి సహకరిస్తామని సీఎంకు వివరించారు. స్పందించిన సీఎం తన ఆశీస్సులు ఉంటాయని రాజేందర్‌రెడ్డి నుంచి ఫోన్ నంబరు తీసుకోవాలని ఓఎస్డీని ఆదేశించారు. ఆయన వెంట కాశెట్టి కుమార్ ఉన్నారు. -
వేధింపులపై టీఆర్ఎస్ నేత ఆందోళన
సాక్షి, మహబూబ్‌నగర్: ఎమ్మెల్యే వేధింపులకు గురిచేస్తున్నాడంటూ టీఆర్ఎస్ పార్టీ నేత ఆందోళన చేపట్టాడు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ శనివారం ఉదయం స్థానిక టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ మరికల్ గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఎమ్మెల్యే వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలన్నాడు. కాగా శ్రీనివాస్ పెట్రోల్ బాటిల్ పట్టుకుని సెల్ టవర్ పై ఆందోళన చేస్తుండటంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారమందుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది సెల్‌టవర్ దగ్గరకు చేరుకుని శ్రీనివాస్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఎమ్మెల్యే వేధింపులు: టీఆర్ఎస్ నేత ఆందోళన
-
'అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరాను'
హైదరాబాద్: తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న నారాయణపేట చాలా వెనుకబడి ఉందని వివరించారు. అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ మాటిచ్చారని, అందుకే టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. పార్టీ కండువా కప్పి రాజేందర్ ను టీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు. టీడీపీలో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో అధికారకంగా చేరనున్నట్లు సమచారం. ఇప్పటికే జీహెచ్ఎంసీ, నారాయణఖేడ్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన టీఆర్ఎస్.. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జరిగే పురపాలక ఎన్నికలపై దృష్టి సారిస్తూ వడిగా అడుగులు వేస్తోంది. -
టీఆర్ఎస్లో చేరిన రాజేందర్ రెడ్డి
► టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ► కేసీఆర్ సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం ► నెలాఖరులో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ► సభా వేదికగా అధికారకంగా టీఆర్ఎస్లో చేరనున్న టీడీపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. మంగళవారం ఆయన్ను పార్టీ కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో అధికారకంగా చేరనున్నారు. ఈ నేపథ్యంలో నెలాఖరులో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభా వేదికగా టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరనున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, నారాయణఖేడ్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన టీఆర్ఎస్.. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జరిగే పురపాలక ఎన్నికలపై దృష్టి సారిస్తూ వడిగా అడుగులు వేస్తోంది. -
పాలమూరులో రేవంత్ ఒంటరేనా??
► జిల్లాలో టీడీపీకి మిగిలింది ఒక్క ఎమ్మెల్యేనే ► టీఆర్ఎస్లోకి రాజేందర్‌రెడ్డితో...రేవంత్‌రెడ్డి ఒంటరేనా? ► రోజురోజుకూ పొడివడుతున్న ‘తెలుగుదేశం’ ప్రతిష్ట ► మనోధైర్యం కోల్పోతున్న ద్వితీయశ్రేణి నాయకులు ► అధికార పార్టీ వైపు చూపు..కాపాడుకునే పనిలో నాయకత్వం మహబూబ్‌నగర్: దశాబ్దాల పాటు జిల్లాలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ... నేతల వలసల కారణంగా ప్రస్తుతం ఉనికిని చాటుకునే పరిస్థితికి దిగజారింది. జిల్లానుంచి అనేకమంది రాష్ట్ర నేతలను అందించిన ఆ పార్టీ ప్రస్తుతం నాయకత్వ లోపంతో సంక్షోభ దిశలో పయనిస్తోంది. తెలంగాణ వచ్చిన సమయంనుంచి జిల్లాలో ఏటికి ఎదురీదుతున్న పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీ 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జిల్లానుంచి కేవలం రెండు స్థానాలనే గెలుచుకుంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరనున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా ఆ పార్టీ శాసనసభపక్ష నాయకుడు రేవంత్‌రెడ్డి ఒక్కరే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. ద్వితీయశ్రేణి ముఖ్యనాయకులపై కూడా గులాబీ పార్టీ మరోసారి దృష్టి సారించి వారిని తమలో కలిపేసుకునే ప్రయత్నాలు చేస్తుందన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో గుబులు రేపుతోంది. అయితే ఇప్పటికే అనేకమంది టీడీపీ నేతలు అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డి మనోధైర్యం కల్పిస్తారా..? టీడీపీ శాసనసభాపక్ష నేతగా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి జిల్లాలో ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఏ మేరకు మనోధైర్యం కలిపిస్తారో.. రాజకీయ వలసలను ఏ మేరకు నివారించ గలుగుతారన్న సందేహం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. రాష్ట్రస్థాయిలో కీలకనేతగా ఉన్న రేవంత్‌రెడ్డి జిల్లాలో మాత్రం ఒకే ఒక్క శాసనసభ్యుడిగా ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అటు రాష్ట్రస్థాయిలో..ఇటు జిల్లా స్థాయిలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో ఎన్ని అవంతారాలు ఎదురైనా పార్టీలోనే కొనసాగుతున్న వివిధ నియోజకవర్గాల నేతలు రాజకీయంగా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రికి ఇప్పటికే టీఆర్ఎస్ గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత శాసనసభ ఎన్నికల సమయంలోనే ఆయనను చేర్చుకోవడానికి ప్రయత్నం చేసినా చివరి నిమిషంలో విఫలం కావడంతో సదరు నేత టీడీపీలోనే కొనసాగుతున్నారు. అలాగే పార్టీలో మండల, జిల్లా స్థాయిలో పట్టున్న టీడీపీ నేతలను ఇప్పటికే టీఆర్ఎస్లో చేర్చే బాధ్యతను అధికార పార్టీకి చెందిన పలువురు నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. రోజురోజుకూ బలహీన పడుతున్న టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు అధికార పార్టీ వైపు చేరడంతో మండల స్థాయిలోని పార్టీ బలహీనమైంది. పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించడానికి, తమ ఓటు బ్యాంకును పెంచుకునే లక్ష్యంతో రెండు నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీచేసినప్పటికీ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. రెండు శాసనసమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు చేరొక స్థానం గెలుపొందగా, టీడీపీకి మాత్రం ఆశాభంగం ఎదురైంది. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో సైతం ఉంటుందన్న భావన మండల, నియోజకవర్గ స్థాయిలో వ్యక్తం కావడం... వారిలో మనోధైర్యం కల్పించడానికి పార్టీ నాయకత్వం పూర్తిస్థాయి దృష్టి సారించకపోవడంతో అనేక మంది తమ తమ స్థాయిలో రాజకీయ దారులను వెతుక్కుంటున్నారు. జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు పలువురు ఇప్పటికే టీడీపీలో చేరగా, మరికొందరు అదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్‌రెడ్డి జిల్లాలో పార్టీ పునర్జీవం కల్పించడానికి ఏ రకంగా వ్యవహరిస్తారోనన్న అంశం ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. -
టెన్.. డౌన్.. టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై
► టీఆర్ఎస్లోకి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ► సీఎం ఢిల్లీ నుంచి రాగానే చేరతానని వెల్లడి ► ముందు బాబు సమక్షంలో టీడీపీ భేటీలో ప్రసంగం ► ఆ వెంటనే హరీశ్, లక్ష్మారెడ్డిలతో భేటీ, చేరిక ప్రకటన సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఎదురుదెబ్బల పరంపరకు, ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యేల వలసకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కన్పించడం లేదు. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావుతో పాటు ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకోగా, తాజాగా గురువారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. గురువారం రాత్రి నగరంలోని ఓ స్టార్ హోటల్లో మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డిలతో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ తాను టీఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రకటించారు. ‘‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాలని నిర్ణయించుకున్నా. ఎమ్మెల్యేగా గెలిచి 20 నెలలైనా ప్రజల కోసం ఏమీ చేయలేకపోయాం. అందుకే వారికోసం పార్టీ మారాలని నిర్ణయించుకున్నా. సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే ఆయనతో సమావేశమై, నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించి, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరతా. కార్యకర్తల కోరిక మేరకు తీసుకున్న ఈ నిర్ణయం నా వ్యక్తిగతం’’ అని పేర్కొన్నారు. దీంతో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ బాట పట్టిన ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది. ఉదయం టీడీపీ భేటీలో పాల్గొని... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి కారణాలపై చంద్రబాబు సమక్షంలో గురువారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్లోకి వెళ్లడం, తద్వారా కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యంపై మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు! కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడి అవసరముందని కూడా వ్యాఖ్యానించారు. తీరా ఆ సమావేశం ముగియగానే మంత్రులతో సమావేశమై, టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించేశారు!! -
సకల జనభేరిని అడ్డుకుంటే సహించం: రాజేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సకల జనభేరి సదస్సుకు ఎలాంటి అడ్డం కులు కల్పించినా సహించేది లేదని తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. అడ్వొకేట్స్ జేఏసీ నేతలు ప్రహ్లాదరావు, శ్రీరంగారావుతో కలిసి హైదరాబాద్‌లో ‘సకల జనభేరి’ పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరాధార, అసత్య ప్రచారంతో హైదరాబాద్‌పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 29న జరిగే సకల జనభేరికి తెలంగాణ న్యాయవాదులంతా కుటుంబ సభ్యులతోపాటు తరలిరావాలని రాజేందర్ పిలుపునిచ్చారు. సకల జనభే రీకి పో లీసులు అనుమతిని ఇచ్చినప్పటికీ, జిల్లాల్లో జరిగే సన్నాహక సమావేశాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఏవీ కాలేజీ నుంచి నిజాం కాలేజీ దాకా భారీ ర్యాలీని నిర్వహిస్తామని, అందరూ ఉదయమే అక్కడకు చేరుకోవాలన్నారు. సకలజన భేరిని జయప్రదం చేయండి ఈ నెల 29న జరగనున్న సకలజన భేరి సభను విజయవంతం చేయాలని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్. విద్యాసాగర్‌లు పిలుపునిచ్చారు. సకల జనుల భేరీ విజయవంతం చేయండి: ఏపీటీఎఫ్ ఈ నెల 29న జరిగే సకల జనుల భేరీని విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ తెలంగాణ ప్రిసీడియం ప్రతినిధులు కె.వేణుగోపాల్, కొండల్‌రెడ్డి, మనోహర్ గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం 2న ఉపాధ్యాయ గర్జన: పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 2న ఉపాధ్యాయ గర్జన నిర్వహించనున్నట్లు పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి తెలిపారు. ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 గం. నుంచి గర్జన నిర్వహిస్తామన్నారు.