
ఎమ్మెల్యే వేధింపులకు గురిచేస్తున్నాడంటూ టీఆర్ఎస్ పార్టీ నేత ఆందోళన చేపట్టాడు.
సాక్షి, మహబూబ్‌నగర్: ఎమ్మెల్యే వేధింపులకు గురిచేస్తున్నాడంటూ టీఆర్ఎస్ పార్టీ నేత ఆందోళన చేపట్టాడు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ శనివారం ఉదయం స్థానిక టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ మరికల్ గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఎమ్మెల్యే వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలన్నాడు.
కాగా శ్రీనివాస్ పెట్రోల్ బాటిల్ పట్టుకుని సెల్ టవర్ పై ఆందోళన చేస్తుండటంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారమందుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది సెల్‌టవర్ దగ్గరకు చేరుకుని శ్రీనివాస్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.