
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బీనగర్ షీ టీమ్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్‌రెడ్డి (51) హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ నెల 11న విధులు ముగించుకొని ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తుండగా నాగోలు ప్లైఓవర్‌పై బైక్ స్కిడ్ అయి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే నాగోలులోని సుప్రజా హాస్పిటల్ తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రాజేందర్‌రెడ్డి చనిపోయాడు. పలువురు పోలీసు అధికారులు అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. ఆదివారం నాగోలు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజేందర్‌రెడ్డి అంత్యక్రియల కోసం షీ టీమ్ డీసీపీ 70 వేలు నగదు, ఇతర పోలీసులు సిబ్బంది 70 వేలు అతడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment