She Team
-
తెలంగాణలో ఐదేళ్లలో 1,03,496 మంది అదృశ్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో ‘అదృశ్యం’ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వయోభేదాలు లేకుండా ఇంటినుంచి బయటికి వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి చేరకుండా తప్పిపోతుండటం కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో కొందరు, ఇంట్లో పెద్దలు మందలించారని ఇంకొందరు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో మరికొందరు కనిపించకుండా పోతున్నారు. ఇలా తప్పిపోతున్న వారి కుటుంబసభ్యులు సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేక.. చివరకు పోలీసుస్టేషన్లలో ‘మిస్సింగ్’కేసులు నమోదు చేస్తున్నారు. ఫిర్యాదు చేసి కళ్లు కాయలు కాయేలా ఎదురుచూసిన కొందరికి తమ కుటుంబసభ్యుల ఆచూకీ దొరకగా.. మరికొందరికీ ఎదురుచూపులే మిగిలాయి. తప్పిపోయిన వారిలో కొంతమంది ఆచూకీ పోలీసులు కనుగొన్నా.. మరికొంతమంది ఆచూకీ మాత్రం దొరకడం లేదు.అదృశ్యం కేసులపై హైకోర్టు తీవ్ర స్పందన అప్పట్లో రాష్ట్రంలో పెరిగిన మిస్సింగ్ కేసులపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు 2014 నుంచి 2019 వరకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం.. ఏటా తొమ్మిది వరకు మిస్సింగ్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. 2019 నుంచి 2020 నవంబర్ వరకు ఆ కేసులు రెట్టింపు అయ్యాయని హైకోర్టులో ఓ ప్రైవేట్ పిటిషన్ కూడా దాఖలైంది. అదృశ్యమైన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉన్నట్టు కేసులు నమోదయ్యాయని పిటిషనర్ వివరించారు.చదవండి: భర్తపై వ్యక్తిగత పగతో వైవాహిక చట్టాల దుర్వినియోగమా? దీనిపై ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో షీ టీమ్, దర్పన్ యాప్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, ఆపరేషన్ ముస్కాన్ లాంటి కార్యక్రమాల ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఆ తర్వాత కూడా 2020 నుంచి 2024 అక్టోబర్ 19 వరకు రాష్ట్రంలో 1,03,496 మంది బాలురు, బాలికలు, పురుషులు, స్త్రీలు తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. 2023లో అత్యధికంగా 23,509 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి 20,403 కేసులు నమోదయ్యాయి. అదృశ్యమైన 1,03,496 మందిలో 97,028 మంది ఆచూకీ లభించగా, ఇంకా 6,468 మంది ఎక్కడ ఉన్నారో, ఏమైపోయారో తెలియని పరిస్థితి నెలకొంది. ‘అదృశ్యం’కేసుల్లో మహిళలే ఎక్కువ.. తెలంగాణవ్యాప్తంగా ఐదేళ్లలో అదృశ్యమైన 1,03,496 మందిలో మహిళలే 54,744 మంది ఉన్నారు. పురుషులు 34,643 మంది, బాలురు 5,750 మంది కాగా బాలికలు 8,359 మంది. ఇదే సమయంలో ఆచూకీ లభ్యమైన వారి జాబితాలోనూ 52,312 మంది మహిళలు ఉండగా, 31,291 మంది పురుషులు, 5,450 మంది బాలురు, 7,070 మంది బాలికలు ఉన్నారు. ఆచూకీ దొరకని 6,468 మందిలో పురుషులు 3,352 మంది, మహిళలు 2,432 మంది, బాలురు 295 మంది, బాలికలు 389 మంది ఉన్నారు. పరిష్కారం చూపాలి రాష్ట్రంలో ప్రతీరోజు ఎంతోమంది తప్పిపోతున్నారు. కొంతమంది ఆచూకీ పోలీసులు కనుగొన్నా.. మరికొంతమంది ఆచూకీ మా త్రం దొరకడం లేదు. బాలికలు, బాలురు, మహిళలు, పురుషుల ఆచూకీ దొరక్క.. వారి కుటుంబాల బాధ వర్ణనాతీతం. ఇప్పటికీ ఆచూకీ తెలియని వారు చాలామంది ఉన్నారు. వారు బతికి ఉన్నారో, లేదో తెలియక క్షణక్షణం బాధ అనుభవిస్తూ ఉంటారు. వారి బాధకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉంది. ఇప్పటికైనా వారి ఎదురుచూపులకు పరిష్కారం చూపాలి. – రాజేంద్ర పల్నాటి, ఫౌండర్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏఎస్ఐ మృతి
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ షీ టీమ్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్‌రెడ్డి (51) హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ నెల 11న విధులు ముగించుకొని ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తుండగా నాగోలు ప్లైఓవర్‌పై బైక్ స్కిడ్ అయి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నాగోలులోని సుప్రజా హాస్పిటల్ తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రాజేందర్‌రెడ్డి చనిపోయాడు. పలువురు పోలీసు అధికారులు అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. ఆదివారం నాగోలు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజేందర్‌రెడ్డి అంత్యక్రియల కోసం షీ టీమ్ డీసీపీ 70 వేలు నగదు, ఇతర పోలీసులు సిబ్బంది 70 వేలు అతడి కుటుంబ సభ్యులకు అందజేశారు. -
నల్లగొండ: శివ మృతిపై అట్టుడికిన పల్లె
సాక్షి, నల్లగొండ: చండూర్ మండల పరిధిలోని తాస్కాని గూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా.. పోలీసుల వేధింపుల వల్లే చనిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో.. శుక్రవారం సాయంత్రం పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ నెలకొంది. గ్రామానికి చెందిన ఓ యువతిని అబ్బనబోయిన శివ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. యువతి తల్లి షీ టీమ్ పోలీసులను ఆశ్రయించడంతో.. అతన్ని పిలిపించుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు పోలీసులు. అనంతరం ఇంటికి చేరుకుని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు శివ. దీంతో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే.. పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. కౌన్సిలింగ్ పేరుతో శివను కొట్టారని, ఆ మనస్తాపంతోనే శివ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆగ్రహంతో రగిలిపోయారు బంధువులు, గ్రామస్తులు. ఈ క్రమంలో.. శివ మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించగా.. ఆ మృతదేహాంతో ఆ అమ్మాయి ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు శివ కుటుంబ సభ్యులు యత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై కారం పొడి చల్లి దాడికి దిగారు మృతుడి బంధువులు. షీటీమ్ సీఐ రాజశేఖర్‌పై శివ సోదరి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. -
నెక్లెస్‌రోడ్డులో రన్ ఫర్ విమెన్ (ఫొటోలు)
-
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ షీటీమ్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలు, యువతుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీటీమ్స్ దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని అడిషనల్ డీజీ స్వాతి లక్రా పేర్కొన్నారు. ఢిల్లీలో ఈనెల 5 నుంచి 7 వరకు నిర్వహించిన సీఎస్ల కాన్ఫరెన్స్‌లో ఇదే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో కలిసి తీసుకున్న గ్రూప్ ఫొటోను ట్విట్టర్లో స్వాతి లక్రా షేర్ చేశారు. తెలంగాణ షీటీమ్స్ దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు బెస్ట్ ప్రాక్టీస్‌గా నిలిచిందని, ఇతర రాష్ట్రాల్లోనూ షీటీమ్స్ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం వెల్లడైనట్లు ఆమె వెల్లడించారు. -
మహిళా భద్రతకు షీ టీం భరోసా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలకు భద్రమైన వాతావరణం కల్పించేందుకు 2014లో ఏర్పాటైన మహిళా భద్రతా విభాగం (షీ టీం) ఈ ఏడాది కూడా ఆసాంతం అతివల సమస్యలపై సత్వరమే స్పందించింది. 2022లో మొత్తం 6,157 ఫిర్యాదులు అందుకొని అందులో 521 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతోపాటు మరో 1,206 పెట్టి కేసులు నమోదు చేసి 1,842 మందికి కౌన్సెలింగ్ ఇచ్చింది. మరోవైపు గృహహింస బాధితులకు భద్రత, భరోసా కల్పించేందుకు ధైర్య అనే యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించి దీన్ని డయల్ 100, అన్ని మహిళా పోలీసు స్టేషన్లకు అనుసంధానించింది. ఎన్ఆర్ఐ భర్తల మోసాలకు సంబంధించి 85 ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టింది. సైబర్ నేరాలపై స్కూలు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, రాష్ట్రవ్యాప్తంగా 250 మహిళా హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటుకు తోడ్పాటు అందించింది. ఈ మేరకు షీ టీం వార్షిక నివేదికను బుధవారం విడుదల చేసింది. -
నిమజ్జనంలో నికృష్ట పనులు.. 240 మంది పోకిరీల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు జరిగిన నవరాత్రి ఉత్సవాలపై నగర షీ– టీమ్స్‌కు చెందిన ప్రత్యేక బృందాల డేగకన్ను ఫలితంగా 240 మంది పోకిరీలు చిక్కినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం ప్రకటించారు. నిమజ్జనం రోజుతో పాటు విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల దగ్గరా షీ–టీమ్స్ నిఘా వేశాయి. మఫ్టీల్లో, రహస్య కెమెరాలతో ఉన్న ఈ బృందాలకు మహిళలు, యువతులను వేధిస్తున్న 240 మంది పోకిరీలు చిక్కారు. వీరిని పక్కా సాక్ష్యాలతో సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచినట్లు ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. పోకిరీలకు కనిష్టంగా రెండు నుంచి గరిష్టంగా పది రోజుల వరకు జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. షీ–టీమ్స్ కృషిని కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినులపై హెచ్ఎం అసభ్యకర ప్రవర్తన మహబూబాబాద్ రూరల్: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ హెచ్ఎంను పాఠశాలకు రావద్దని.. విద్యార్థుల తల్లిదండ్రులు, తండావాసులు వెళ్లగొట్టారు. మహబూబాబాద్ దూదియ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం షేక్ సర్వర్ పాషా కొన్నిరోజులుగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఐదుగురు విద్యార్థినులు శుక్రవారం వారి తల్లిదండ్రులకు చెప్పారు. సోమవారం వారందరూ పాఠశాలకు చేరుకుని హెచ్ఎంను నిలదీశారు. పిల్లలకు విద్యాభోధన చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అయితే, తనను క్షమించమని, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా పనిచేస్తానని ఉపాధ్యాయుడు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే.. కొన్ని రోజులుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చి హెచ్ఎం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడని, ఇంట్లో చెబుతామంటే వద్దన్నాడని తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పర్వతగిరి జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం రాందాస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించిన డీఈఓ.. ఉపాధ్యాయుడు సర్వర్ పాషాను సస్పెండ్ చేశారు. (చదవండి: హాస్టల్లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..) -
మీ ఇంటికే వస్తాం..!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలు, చిన్నారులపై వేధింపులు పెరుగుతున్నాయి. స్కూలు, కాలేజీ, హాస్టల్, ఆఫీసు ఎక్కడపడితే అక్కడ ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో వేధింపులూ ఆగడం లేదు. దీంతో రాచకొండ షీ టీమ్స్ ఒక అడుగు ముందుకేసింది. సున్నితమైన కేసులలో బాధితుల ఇంటికే వెళ్లి భరోసా ఇచ్చి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నారు. బాధితులు పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఫిర్యాదులు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతి ఫిర్యాదుపై క్షుణ్నంగా దర్యాప్తు చేసి ప్రాథమిక ఆధారాలను సేకరించి, నిందితులను జైలుకు పంపిస్తున్నారు. 3,273 కేసుల నమోదు.. రాచకొండ షీ టీమ్స్‌లో 7 బృందాలు, ఒక్కో బృందంలో ఐదుగురు పోలీసులు మొత్తం 35 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 292 కేసులు నమోదయ్యాయి. వీటిలో 123 ఎఫ్ఐఆర్ నమోదు కాగా, 118 పెట్టీ, 51 కౌన్సిలింగ్ కేసులున్నాయి. ఆయా కేసులలో 310 మంది పోకిరీలను అరెస్టు చేశారు. వీరిలో 110 మంది మైనర్లు, 200 మంది మేజర్లున్నారు. అధికార హోదా, అంగబలం, రాజకీయ అండదండల ప్రలోభాలతో మహిళలు, విద్యారి్థనిలు, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినా, అసభ్యకరంగా ప్రవర్తించే ఎవరినైనా వదిలిపెట్టడం లేదు. ఉదయం 4 నుంచే డెకాయ్ ఆపరేషన్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఉదయం, రాత్రి సమయాలలో సినిమాలు, సీరియళ్ల చిత్రీకరణ జరుగుతుంటాయి. షూటింగ్స్ ముగించుకొని రాత్రి సమయాలలో ఇంటికి వెళుతున్న కళాకారులు, కాస్టింగ్ సిబ్బందిని స్థానికంగా పోకిరీలు వేధిస్తున్నట్లు రాచకొండ షీ టీమ్స్ దృష్టికి వచి్చంది. దీంతో ప్రత్యేక బృందాలతో ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచే షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. కళాకారుల లాగే పోలీసులూ మఫ్టీలో తిరుగుతూ.. ఆకతాయిల ఆటకట్టిస్తున్నారు. దీంతో పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్, హయత్‌నగర్, వనస్థలిపురం వంటి మార్గాలలో పోకిరీల చేష్టలు తగ్గుముఖం పట్టాయి. – ఎస్కే సలీమా, రాచకొండ షీ టీమ్స్ డీసీపీ (చదవండి: చట్టానికి దొరక్కుండా ఆన్లైన్ గేమింగ్) -
మహిళా వేధింపులపై షీ టీమ్ ట్వీట్
-
ఒకటే కులం.. పైగా ఇద్దరూ క్లాస్మేట్స్.. ఇద్దరూ డాక్టర్లే!
సాక్షి, హైదరాబాద్: పెళ్లంటే నూరేళ్ల పంట. కానీ కొందరు అమ్మాయిలకు అదే విష వలయంగా మారుతోంది. పెళ్లికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఏకాంతంగా కలుస్తున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధం.. పైగా కాబోయే భార్యాభర్తలమే కదా అని ఏకాంతంగా మాట్లాడేందుకు అనుమతిస్తున్న అమ్మాయిలు దారుణంగా మోసపోతున్నారు. కాబోయే భర్త ముసుగులో ఉన్న కామాంధులు అమ్మాయిలను వంచించి వదిలేస్తున్నారు. తీరా మోసపోయాక బాధిత యువతులు పోలీసులను, భరోసా కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు సుమారు 457కు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. మ్యాట్రిమోనీ సంస్థల ద్వారా.. హైదరాబాద్‌లోని ఓ డీమ్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కేరళకు చెందిన ఓ అమ్మాయి ప్రముఖ మ్యాట్రిమోనీ సంస్థ ద్వారా ఓ అబ్బాయిని ఎంపిక చేసుకుంది. రెండు కుటుంబాలు వారి పెళ్లికి అంగీకరించాయి. దాంతో ఒకరినొకరు అర్థం చేసుకొనేందుకు తరచుగా కలిసేవారు. అయితే అది కాస్తా వారు శారీరకంగా దగ్గరయ్యే దాకా వచ్చింది. కొద్దిరోజుల తర్వాత అబ్బాయి ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఆందోళనకు గురైన ఆ అమ్మాయి అతడి బంధువులను సంప్రదించగా స్పందన లేదు. చివరకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆ అమ్మాయి మోసపోయినట్లుగా కేసు నమోదు చేశారు. ఏడాది కింద ఈ కేసు నమోదైనా ఇప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు. ఈ ఉదంతంలో కొసమెరుపు ఏంటంటే.. సదరు మ్యాట్రిమోని సంస్థ జాబితాలో ఇప్పటికీ అతడు ‘వధువు కోసం ఎదురు చూస్తున్న వరుడే’. కట్నం కావాల్సి వచ్చింది.. వధూవరులిద్దరిదీ ఒకటే కులం. పైగా ఇద్దరూ క్లాస్మేట్స్. ఇద్దరూ డాక్టర్లే. చిన్నప్పటి నుంచి తెలిసిన అబ్బాయి కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. గతేడాది మాటా ముచ్చట పూర్తయింది. మంచి రోజులు చూసుకొని పెళ్లి చేయాలని భావించారు. అప్పటికే ఓ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆమె అతడిని తన సొంత ఖర్చులతో పీజీలో చేర్పించింది. ఎలాగూ కాబోయే భార్యా భర్తలమనే భరోసాతో శారీరకంగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వరుడికి ఎక్కువ కట్నం ఇచ్చే మరో సంబంధం వచ్చింది. దాంతో అతడు మొదటి వధువుతో మాట్లాడటం మానేశాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సమక్షంలో అతడు తన తప్పును అంగీకరించి, అమ్మాయిని నెల రోజుల్లో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఇప్పటికి 3 నెలలు దాటింది. ఆమె తనను పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేసిందంటూ ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. వందల్లో బాధితులు.. నగరానికి చెందిన ఓ యువతి వరంగల్ జిల్లాలో ఏఎన్ఎంగా పని చేస్తోంది. తన కంటే రెండేళ్లు చిన్నవాడైనా కూడా తెలిసిన అబ్బాయి అని చేరదీసి చదివించింది. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం లభించింది. కొద్దిరోజుల్లో తాము పెళ్లి చేసుకుంటామని ఆమె కలలు కంటున్న తరుణంలో.. ఆ అమ్మాయి తనకంటే పెద్దదని, తాను పెళ్లి చేసుకోనని తెగేసి అతడు చెప్పాడు. దీంతో మోసపోయానని గుర్తించిన ఆమె పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. పెళ్లికి ముందు అభిప్రాయాలు, అభిరుచులను పంచుకోవడం మంచిదే. కానీ కొందరు దీన్ని అవకాశంగా తీసుకొని లైంగిక వంచనకు పాల్పడుతున్నారు. యువతులు అంతగా చనువు ఇవ్వొద్దని పలువురు సూచిస్తున్నారు. నిర్భయ వంటి వాటికే స్పందిస్తారా ‘మోసంతో పాటు, నమ్మిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఇలాంటి ఉదంతాలను పోలీసులు మోసపోయిన కేసులుగానే నమోదు చేస్తున్నారు. నిర్భయ వంటి సంఘటనల్లో మాత్రమే స్పందించి అత్యాచారం జరిగినట్లు కేసులు నమోదు చేస్తున్నారు. ఇది సరైంది కాదు. పైగా అమ్మాయిలు స్వయంగా తాము అత్యాచారానికి గురైనట్లు కేసులు పెడితే ‘మెడికల్ ఎగ్జామినేషన్’ఉండాలంటున్నారు. ఇది చాలా అన్యాయం.’ – మమత రఘువీర్, సామాజిక కార్యకర్త -
నెట్టింట వేధింపులకు నట్టింట పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: తెలిసీ తెలియక కొందరు యువతులు, విద్యార్థినులు ఆన్లైన్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి బాధితుల రక్షణ కోసం విమెన్ సేఫ్టీ వింగ్ త్వరలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై సైబర్ బాధితుల ఇంటికే నేరుగా పోలీసులు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించనున్నారు. ఇందుకోసం షీ టీమ్స్‌లో కొందరు మహిళా పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ఆర్థిక నేరాలు మినహా మహిళలకు ఆన్లైన్లో ఎదురయ్యే అన్నిరకాల మోసాలు, వేధింపులపై తమకు ఫిర్యాదు రాగానే.. వెంటనే బాధితుల వద్దకు వెళ్తారు. అక్కడే ఫిర్యాదు తీసుకుని పరిస్థితిని బట్టి చర్యలు తీసుకుంటారు. ఈ టీం సభ్యులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ వేధింపులు.. వాటిని ఎలా ఎదుర్కోవాలి తదితర విషయాలపై ఇప్పటికే సమగ్ర అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఈ బృందంలో ఒక సైకియాట్రిస్ట్ కూడా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందం ఏమేం చేస్తుంది? వాస్తవానికి ఉద్యోగం చేస్తున్న మహిళలు, చదువుకుంటున్న యువతులు, స్కూలు విద్యార్థినులు నిత్యం ఏదో ఒకచోట రకరకాల వేధింపులు ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 341 షీ టీమ్స్ ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించేందుకు ఇటీవల ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్లు కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆన్లైన్లో ఎదురయ్యే వేధింపులపై చాలామంది పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఎవరికీ చెప్పుకోలేక, తమలో తామే కుమిలిపోతుంటారు. కొందరికి ఆడ పిల్ల పోలీస్‌స్టేషన్ గడప తొక్కకూడదన్న ఆలోచనలతో వదిలేయాలని పెద్దలు సలహా ఇస్తుంటారు. అవసరమైతే ఆఫీసు, కాలేజీ, స్కూలు మాన్పించి వేధింపులకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. చాలా సందర్భాల్లో సోషల్ మీడియా, ఆన్లైన్, సెల్‌ఫోన్.. ఇలా మాధ్యమం ఏదైనా, అది ఎలాంటి వేధింపులైనా, లేక ప్రేమ వ్యవహారం నడిపి మోసం చేసినా, పెళ్లిపేరుతో మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో పరిచయం పెంచుకుని మాట తప్పినా.. అవేమీ వెలుగు చూడటం లేదు. కారణం పరువుపోతుందన్న భయం. అయితే, ఇకపై అలాంటి భయాలు అవసరం లేదని షీ టీమ్స్ పోలీసులు అంటున్నారు. ‘మీరు షీ టీమ్స్‌కు కాల్ చేయగానే సైబర్ టీం మీ ముందుకు వస్తారు. మీ పేరు, వివరాలు ఎక్కడా బయటకు రావు. వారు ముందుగా మీలో ధైర్యాన్ని నింపుతారు. ఓదార్పునిస్తారు. నిందితులను క్షణాల్లో గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటారు. మీకు ఇకపై నిందితుల నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా, విషయం మూడో కంటికి తెలియకుండా సమస్యను పరిష్కరిస్తారు’అని చెబుతున్నారు. ఒక వేళ సమస్య తీవ్రత అధికంగా ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నతాధికారులను సంప్రదించి కేసు పెడతారు. లాక్‌డౌన్‌తో పెరిగిన సమస్యలు.. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. అయితే అంతే స్థాయిలో మహిళలు, పిల్లలకు ఆన్లైన్ వేధింపులు కూడా అధికమయ్యాయి. అలాంటి వేధింపులకు చరమగీతం పాడేందుకు, బాధితులకు తామున్నామన్న భరోసా కల్పించేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ ఇలాంటి వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇప్పటికే లాక్డౌన్ కాలంలో గృహహింస, భార్యాభర్తల కలహాలపై టెలిఫోన్లో కౌన్సెలింగ్ నిర్వహించి అనేక సమస్యలు పరిష్కరించిన విమెన్ సేఫ్టీ వింగ్‌పై ప్రశంసల జల్లు కురిసింది. రాష్ట్రంలో వేలాదిమంది గృహిణులకు స్వాంతన చేకూర్చింది. ఇపుడు ఈ విధానం కూడా లక్షలాది మంది యువతులు, విద్యార్థినులలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచుతుందని పోలీసు ఉన్నతాధికారులు ధీమాగా ఉన్నారు. -
పెళ్లి తర్వాత కథ మలుపు.. చివరకు..
సాక్షి, ఖమ్మం : పెద్దలు వారి ప్రేమను కాదన్నారు. అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత కథ మలుపు తిరిగి, కొన్ని ఊహించని సంఘటనలతో చివరకు ప్రేమించిన వాడితో అమ్మాయికి రెండో పెళ్లి అయింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం నర్సింహులు గూడెంకు చెందిన కళ్యాణ్, నేలకొండపల్లి మండలం చెరువు మాదారంకు చెందిన యడవల్లి పావని గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కానీ, ఆ ఇద్దరి ప్రేమను వారి కుటుంబాలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమెకు వేరే సంబంధం చూసి వివాహం చేశారు. అయితే పెళ్లైన కొద్ది రోజుల్లోనే అనారోగ్యంతో ఉన్న ఆమెను స్ధానిక అసుపత్రిలో వైద్య పరిక్షలు చేయించిన భర్తకు అప్పటికే అమె గర్భవతి అని తెలిసింది. దీంతో అసలు ప్రేమ విషయం తెలుసుకుని భార్యకు విడాకులు ఇచ్చాడు. ఏమి చేయాలో తోచని పరిస్థితితో ఆ యువతి షీ టీం సీఐ అంజలిని కలిసింది. ప్రేమ విషయం సీఐకి చెప్పింది. తర్వాత సీఐ అంజలి గతంలో ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులను సదరు యువతి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇరువురి కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించారు. వారి సమక్షంలో ప్రేమించిన యువకుడితో వివాహం చేయించారు. దంపతులకు సీఐ అంజలి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. -
వివాహితకు బిస్కెట్లలో మత్తుమందు, ఆపై
సాక్షి, హైదరాబాద్: వివాహితకు మత్తుమందు ఇచ్చి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరరం ఆమె నగ్న ఫొటోలను తీసి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఈ దారుణం కూకట్‌పల్లిలో వెలుగుచూసింది. శ్రీధర్‌గౌడ్ అనే వ్యక్తి ఓ వివాహితకు మత్తుతో కూడిన బిస్కెట్లు ఇచ్చాడు. అవి తిన్న వివాహత సృహ కోల్పోయింది. దాంతో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఫోటోలను డిలీట్ చేయాలంటే 20 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. ఆ మొత్తం ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్ షీ టీమ్ అతన్ని వలపన్ని పట్టుకుంది. క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన మాదాపూర్‌లో ఓ క్యాబ్ డ్రైవర్ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. క్యాబ్‌లో ఎక్కిన తర్వాత డ్రైవర్ తనతో అభ్యంతరకరంగా వ్యవహరించాడని యువతి ఆన్లైన్ ఫిర్యాదులో పేర్కొంది. డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం రావడంతో యువతి ఫిర్యాదు చేయగా.. షీ టీమ్స్ అతన్ని అరెస్టు చేశాయి. ట్యూషన్ టీచర్ నిర్వాకం పాఠాలు చెబుతానంటూ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యూషన్ టీచర్‌ను సైబరాబాద్ షీ టీమ్ శనివారం అరెస్టు చేసింది. కూకట్‌పల్లిలో ఈఘటన వెలుగు చూసింది. అభ్యంతరకరంగా వ్యవహరించిన టీచర్ విషయాన్ని తల్లిదండ్రులకు బాలిక ఇదివరకే చెప్పింది. తల్లిదండ్రులు మందలించినా టీచర్ తీరు మారకపోవడంతో షీటీమ్‌కు సమాచారం అందించారు. ట్యూషన్ టీచర్‌ను అరెస్టు చేసిన షీ టీమ్ రిమాండ్‌కు తరలించింది. (చదవండి: కూతుళ్లను యువకుడి దగ్గరకు పంపుతున్న తల్లి) -
‘వాట్సాప్’ అడ్మిన్లూ బహుపరాక్!
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారమయ్యే పుకార్లకు వాటి అడ్మిన్లు బాధ్యత వహించాల్సి వస్తుందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న (మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ... ఏదైనా వీడియో క్లిప్పింగ్‌ను ఫార్వర్డ్ చేసే ముందు పక్కాగా సరిచూసుకోవాలని సూచించారు. ఇటీవల మార్ఫింగ్ చేసిన, ఎక్కడెక్కడిలో కలిపి జోడించిన వీడియోలు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయన్న ఆయన ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతి గ్రూప్ అడ్మిన్ అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అలా కాకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగర షీ–టీమ్స్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కోఠి ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గవర్నర్ తమిళసై సౌందరరాజన్, శుక్రవారం చార్మినార్ వద్ద నిర్వహిస్తున్న రన్స్‌కు హోంమంత్రి మహమూద్ అలీ అతిథులుగా హాజరవుతున్నారని అన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పెట్రోలింగ్ వాహనాల వద్ద కేసులు నమోదు విధానం ప్రారంభించామని, ఇప్పటి వరకు 156 ఎఫ్ఐఆర్లు, 893 పెట్టీ కేసులు రిజిస్టర్ అయినట్లు కొత్వాల్ వివరించారు. అలాగే నగరంలో వృద్థులకు ఆసరాగా ఉండటానికి పోలీసుస్టేషన్ల వారీగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడుతున్నామని, త్వరలోనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. (హాయ్.. నేను విజయ్ దేవరకొండ అంటూ..) -
వేధించే ‘ప్రేమ’లు!
సాక్షి, సిటీబ్యూరో: ఓ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న మహిళను షాద్‌నగర్ మండలం కామ్సన్పల్లి గ్రామానికి చెందిన బాలరాజు ప్రతిరోజూ ఫాలో అవుతున్నాడు. బస్టాప్, పాఠశాల ప్రాంగణంలో ప్రత్యక్షమవుతూ తనను ప్రేమించాలంటూ వేధించడం మొదలెట్టాడు. ఈ విషయం బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంలో బాలరాజును హెచ్చరించారు. అయినా బాలరాజు తన తీరును మార్చుకోకపోవడంతో ఒత్తిడికి గురైన బాధితురాలు షాద్‌నగర్ షీ బృంద సభ్యులను సంప్రదించారు. ఆ వెంటనే బాలరాజు బాధితురాలి వెంటపడుతున్న సమయంలో మఫ్టీలో ఉన్న షీ బృంద సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదుచేయించి జైలుకు పంపించారు. ఇది గత నెలలో షీ బృందం దృష్టికి వచ్చిన ఓ కేసు మాత్రమే. ఇలాంటివి ప్రతి నెలా సైబరాబాద్, రాచకొండ షీ బృంద సభ్యులకు వచ్చే దాదాపు 500 ఫిర్యాదుల్లో 125 కేసులు ఎఫ్ఐఆర్లు నమోదుచేస్తున్నారు. ఈ కేసుల్లో సగానికి సగం ప్రేమించమంటూ చేసే వేధింపులే ఎక్కువగా ఉన్నాయని షీ బృంద గణాంకాలు చెబుతున్నాయి. అంటే 63 కేసులు ‘లవ్ వేధింపు’లే ఉన్నాయని ఆయా ఈవ్‌టీజర్లను కౌన్సెలింగ్ చేస్తున్న సభ్యులు చెబుతున్నారు. ప్రేమించకుంటే ఎందాకైనా.. పాఠశాలలో పరిచయం.. కళాశాలలో స్నేహం.. ఉద్యోగంలో చేసే ప్రాంతంలో పరిచయం, జర్నీ చేసే సమయంలో జరిగిన పరిచయం.. ఇలా ఏదో ఒక చోట జరిగిన పరిచయంతో విద్యార్థినుల నుంచి మొదలుకొని మహిళల వెంటపడుతున్న ఈవ్‌టీజర్లు పెరుగుతున్నారు. ఏదో రకంగా వారి సెల్‌ఫోన్ నంబర్లను దొరకబుచ్చుకుంటున్నారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను...మీరు కూడా నన్ను ప్రేమించండి అంటూ ఫోన్‌కాల్స్ చేస్తున్నారు. వాట్సాప్ పోస్టులతో పాటు సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నారు. లేకుంటే వారి సామాజిక మాధ్యమాల ఖాతాల నుంచి వారి వ్యక్తిగత చిత్రాలను డౌన్లోడ్ చేసుకొని మార్ఫింగ్ చేస్తున్నారు. ఈ ఫొటోలను మీ మిత్రులకు పంపిస్తామని, మీ కుటుంబ సభ్యులందరికీ వాట్సాప్ లేదంటే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తామని బెదిరిస్తున్నారు. చివరకు ప్రేమ అవసరం లేదు. తమతో గడపాలనే స్థాయికి చేరుకుంటున్నారు. ఈ ఈవ్‌టీజర్లతో చాలామంది పెళ్లిళ్లు కూడా జరగకుండా నిలిచిపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఇలా ఆకతాయిల వేధింపులు తారస్థాయికి చేరడంతో షీ బృంద సభ్యులను ఆశ్రయిస్తున్నారు. ఆ వెంటనే రంగంలోకి దిగుతున్న షీ బృందాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని జైలుకు పంపిస్తున్నాయి. ‘సామాజిక మాధ్యమాల్లో అపరిచితుల నుంచి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయవద్దు. మీ ఫేస్బుక్ ఖాతాలకు ప్రైవేట్ సెట్టింగ్స్ పెట్టుకుంటే మంచిది. ఎక్కడో ఒక చోట జరిగిన పరిచయంతో ఆకతాయిలు వెంటపడుతూ వేధిస్తుంటే షీ బృంద సభ్యులను ఆశ్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామ’ని సైబరాబాద్ షీటీమ్ ఇన్చార్జ్ అనసూయ తెలిపారు. -
త్వరలో ‘షీ సేఫ్’ యాప్
గచ్చిబౌలి: మహిళల భద్రత కోసం త్వరలో ‘షీ సేఫ్’యాప్‌ను తీసుకురానున్నామని రాష్ట్ర షీ టీమ్స్ ఇన్చార్జ్ స్వాతి లక్రా పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియం వద్ద శనివారం రాత్రి సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ), సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ‘షీ సేఫ్ నైట్ వాక్’ను స్వాతి లక్రా, సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్, బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, పద్మశ్రీ పీవీ సింధు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ... రాష్ట్రంతో పాటు నగరంలో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐటీ కారిడార్‌లో రాత్రి సమయంలో విధులు నిర్వహించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, వారంతా పోలీసుల సహాయం లేకుండా సురక్షితంగా ఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భద్రతపై మహిళలకు అవగాహన కల్పించేందుకే నైట్ వాక్ నిర్వహించామని పేర్కొన్నారు. ‘షీ సేఫ్ నైట్ వాక్’లో పాల్గొన్న ప్రజలు సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ..ఐటీ కారిడార్‌లో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. భద్రతపై మహిళలకు భరోసా కల్పించేందుకే షీ సేఫ్ నైట్ వాక్‌ను నిర్వహించామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్, పుల్లెల గోపీచంద్ అకాడమీ వరకు అక్కడి నుంచి తిరిగి గచ్చిబౌలి స్టేడియం వరకు షీ సేఫ్ నైట్ వాక్ కొనసాగింది. గైనకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని, నటి ఇషా రెబ్బా, ఎ‹స్సీఎస్సీ వైస్ చైర్మన్ భరణి కుమార్, సైబరాబాద్ షీ టీమ్స్ ఇన్చార్జ్, డీసీపీ అనసూయ, ఎస్సీఎస్సీ ఉమెన్ ఫోరం లీడర్ ప్రత్యూష, బిత్తిరి సత్తి, ఐటీ ఉద్యోగులు, పోలీసులు పాల్గొన్నారు. -
అడ్డుకుంటేనే ఆగుతారు
విద్యార్ధినులు, యువతులు, మహిళా ఉద్యోగినులు, అంగన్వాడీ, ఆశా మహిళలకు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇస్తున్నారు లక్ష్మి. శాంతి భద్రతలను కాపాడడంతోపాటు, సమాజానికి రక్షణ కల్పించే పనిలో ఉన్న మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డులు, షీ టీం సభ్యులకు సైతం పోరాట కళలో మెళుకువలు నేర్పిస్తున్నారు. నిత్యం జరుగుతున్న ఆగడాల భయంతో ఆడపిల్లలు ఇంట్లోనే ఉండిపోతే తమ కలల్ని నిజం చేసుకోలేరని లక్ష్మి అంటున్నారు. ఈ కథ లక్ష్మిదే అయినా, రవి దగ్గర్నుంచి మొదలుపెట్టాలి. రవిది వరంగల్ జిల్లా కొత్తవాడ. కరాటే అంటే ఆసక్తి. చిన్నతనంలోనే ఏడాదిన్నర వ్యవధిలో బ్లాక్ బెల్ట్ సాధించే దశకు చేరుకున్నాడు! ప్రస్తుతం బ్లాక్ బెల్ట్‌లో సెవన్త్ డాన్. కరాటేనే వృత్తిగా ఎంచుకొని పాఠశాల పిల్లలకు నేర్పిచడానికి రాష్ట్రమంతటా తిరుగుతున్నప్పుడు అతడికి లక్ష్మితో పరిచయం అయింది. లక్ష్మిది నిజామాబాద్ జిల్లా మాకులూరు మండలం శాంతినగర్ గ్రామం. అప్పటికే ఆమెకు కరాటేలో ప్రవేశం ఉంది. ఇద్దరూ 1997లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా లక్ష్మి మార్షల్ ఆర్ట్స్‌ను కొనసాగించారు. ప్రస్తుతం ఆమె బ్లాక్‌బెల్ట్‌లో సిక్త్స్ డాన్. షీ టీమ్‌లకు కోచింగ్! తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీమ్‌లను ఏర్పాటు చేయడంతో లక్ష్మి ప్రాధాన్యం మరింత పెరిగింది. మహిళా ఐపీఎస్‌ల నేతృత్వంలో విధులు నిర్వర్తించే షీ టీమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి లక్ష్మికి అవకాశం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్‌ను నేర్పించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా లక్ష్మికి ప్రాధాన్యం లభించింది. ఆమె చేత పాఠశాలల్లో పని చేస్తున్న పీఈటీలకు శిక్షణ ఇప్పించారు. మూడేళ్ల క్రితం జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ‘సంఘటిత సబల’ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించడం వెనుక లక్ష్మి కృషి, పట్టుదల ఉన్నాయి. ఆమె భర్త సహకారం ఉంది. – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ, ఫోటోలు: గోవర్ధనం వేణుగోపాల్ పోకిరీల భయంతో చదువు ఆగకూడదు చిన్నప్పటి నుంచే పోలీసు ఆఫీసర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. సుమన్, విజయశాంతి, సినిమాలను చూసి అప్పుడే కరాటే నేర్చుకోవడం ప్రారంభించాను. పదో తరగతి చదువుతున్న సమయంలోనే నా స్నేహితురాలిని కొందరు పోకిరీలు వేధించడంతో భయంతో చదువును ఆపేసి ఇంటి వద్దనే ఉండిపోయింది. ఆ సంఘటన తరువాత ప్రతి విద్యార్థినీ ధైర్యంగా చదువుకోవడానికి స్వేచ్ఛగా వెళ్లాల్సిన ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పాలని భావించాను. ఆ విధిని నా భర్తతో కలసి నెరవేరుస్తున్నాను. – లక్ష్మి -
షీ–టీమ్‌ల బలోపేతానికి నోడల్ టీమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షీ–టీమ్‌ల పనితీరును మరింత బలోపేతం చేసే దిశగా వుమెన్ సేఫ్టీ వింగ్ ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లోని షీ–టీమ్‌లకు శిక్షణ ఇవ్వడం, ఫిర్యాదులపై నియమిత సమయంలో చర్యలు చేపట్టారా? లేదా? వంటి పలు అంశాలను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రస్థాయిలో షీ నోడల్ టీమ్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని మహిళా రక్షణ విభాగం కార్యాలయంలో గురువారం ఈ ప్రత్యేక షీ–టీమ్ విభాగాన్ని వుమెన్ ప్రొటెక్షన్ విభాగం ఐజీ స్వాతి లక్రా ప్రారంభించారు. హైదరాబాద్‌లో క్యాబ్‌లను బుక్ చేసుకోగానే బుక్ చేసిన వారి సమాచారంతోపాటు క్యాబ్ ప్రయాణించే మార్గాన్ని తెలుసుకునేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని స్వాతి లక్రా తెలిపారు. -
‘దిశ’ ఘటనతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం
సాక్షి, యాదాద్రి: ‘దిశ’ సంఘటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రతా చర్యలు పెంచారు. మహిళలు, విద్యార్థినులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, కళాశాలలు, బస్టాండ్లను గుర్తిస్తున్నారు. అలాగే గ్రామాల్లో బెల్ట్ షాపులు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి దాడులు నిర్వహిస్తున్నారు. మత్తు పదార్థాలు విక్రయించే వారిపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రధానంగా భువనగిరి, బీబీనగర్, వలిగొండ, నాగిరెడ్డిపల్లి, రామన్నపేట, వంగపల్లి రైల్వేస్టేషన్లతో పాటు బస్టాండ్లపై కన్నేశారు. పెట్రో మొబైల్.. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పెట్రో మొబైల్ వాహనాలు, సిబ్బందిని ఏర్పాటు చేశారు. పెట్రో మొబైల్ సిబ్బంది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటారు. బాధితులు 100కు డయల్ చేసిన వెంటనే వీరు స్పందిస్తారు. జీపీఎస్ వి« దానం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంతో పెట్రో మొబైల్ వాహనాలను అనుసంధానం చేశారు. 12 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక డ్రైవర్, ఇద్దరు కానిస్టేబుల్స్‌తో నడవాల్సిన పెట్రో మొబైల్ వాహనాలు.. సిబ్బంది కొరత వల్ల ఒక డ్రైవర్, కానిస్టేబుల్‌తో పని చేస్తున్నాయి. బ్లూ కోట్స్.. జిల్లాలోని 17 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్‌కు ఇద్దరు చొప్పున బ్లూకోట్స్ సిబ్బంది ఉన్నారు.ఆయా స్టేషన్ల పరిధిలో వీరు నిత్యం తిరుగుతుంటారు. ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే అక్కడికి చేరుకుని పరిష్కరిస్తారు. సిటీ పోలీసింగ్.. జిల్లాలో కొన్ని గ్రామాల్లో మాత్రమే గ్రామ పోలీస్ వ్యవస్థ ఉండగా ఎక్కువ సిటీ పోలీసింగ్ కొనసాగుతోంది. జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నందున ఇక్కడ నిబంధనల్లోనూ తేడా ఉంటుంది. బ్లూకోట్స్, పెట్రో మొబైల్, ఎస్ఓటీ పోలీస్ తదితర విభాగాలు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ సేవలందిస్తున్నాయి. అయితే దిశ దుర్ఘటన నేపథ్యంలో భద్రత చర్యలను మరింత పెంచారు. జిల్లాలో నేరాల అదుపుపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతోంది. ఎస్ఓటీ పోలీసులు సివిల్ పోలీస్‌లతోపాటు నేరాలను ప్రేరేపించే కార్యకలాపాలపై దాడులు పెంచారు. గతంలో 100 డయల్‌కు 50 కాల్స్ వస్తుండగా ఇప్పుడు 100 వరకు వస్తున్నాయి.సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ భద్రతా చర్యలు విసృతం చేశారు. మహిళల కోసం విశ్రాంతి గదులు, వెయిటింగ్ హాల్స్.. మహిళల భద్రత దృష్ట్యా టోల్గేట్లు, పెట్రోల్ బంక్‌ల వద్ద మహిళల కోసం ప్రత్యేకంగా రెస్ట్ రూమ్‌లు, వెయిటింగ్ హాళ్లు ఏర్పాటు చేసే యోచనలో జిల్లా పోలీసులు ఉన్నారు. జిల్లాలోనూ వెలుగుచూసిన ఘటనలు జిల్లాలోనూ దిగ్భ్రాంతికర సంఘటనలు గతంలో వెలుగు చూశాయి. యాదగిరిగుట్టలో వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్న చిన్నారుల సంఘటన సంచలనం సృష్టించిందే. అలాగే బొమ్మలరామారం మండలం హజీపూర్‌లో బాలికలపై లైంగికదాడి, హత్య సంఘటనలు జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించాయి. సిబ్బంది కొరత : జిల్లా పోలీస్ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. వివిధ హోదాల్లో 670మంది ఉండాలి. ప్రస్తుతం 326 ఖాళీలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భదత్రా చర్యలను పెంచారు. బెల్ట్ షాపులు, దాబాలపై ఎస్ఓటీ పోలీసుల దాడులు చౌటుప్పల్/బీబీనగర్ : ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పలు చోట్ల దాడులు నిర్వహించారు. చౌటుప్పల్‌లోని వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద గంగాపురం వెంకటేశం బెల్టుషాపులో సోదాలు చేసి రూ.20వలే విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా లక్కారం గ్రామ శివారులో గల సుందరయ్యకాలనీలో ఎన్.వెంకటేశ్వర్లుకు చెందిన కిరాణం షాపునుంచి రూ.20వేలు విలువ చేసే నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అదే విధంగా బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద జాతీయ రహదారి వెంట గల దాబాలపైనా మంగళవారం రాత్రి ఎస్ఓటీ పోలీస్‌లు దాడులు నిర్వహించారు. వెంకటేశ్వర్ దాబాలో మద్యం స్వాధీనం చేసుకుని విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ రంగస్వామి తెలిపారు. నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు యాదాద్రి భువనగిరి జిల్లా కమిషనరేట్ పరిధిలో ఉన్నందున గ్రామ పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో లేదు. ఆ పద సమయంలో 100కు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందిస్తారు. వారం రోజుల పాటు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరి ధిలో విద్యాసంçస్థల్లో 100కు డయల్ చేయ డం, షీటీంలకు ఫోన్ చేయడం వంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యే క కార్యక్రమాలు నిర్వహిస్తాం. టోల్గేట్లు, పెట్రోల్‌బంక్‌ల వద్ద మహిళలకు రెస్ట్ రూం లు, వెయిటింగ్ హాళ్లు ఏర్పాటు చేయిస్తాం. –డీసీపీ నారాయణరెడ్డి ఉదయం సమయంలోనూ పెట్రోలింగ్ నిర్వహించాలి రాత్రి వేళల్లోనూ కాకుండా ఉదయం సమయంలోనూ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలి. అనుమానితులు, జూలాయిగా తిరిగే వ్యక్తుల వివరాలను ఆరా తీస్తుండాలి. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపైనా ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతుండాలి. అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. –మధు, దాతారుపల్లి -
ఆ ఘటనపై కేసీఆర్ కలత చెందారు..
సాక్షి, భీమారం(వరంగల్) : జిల్లా కేంద్రంలోని సమ్మయ్యనగర్‌లో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర్‌రావు కలత చెందారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సామూహిక లైంగిక దాడికి గరై అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్న బాలిక కుటుంబాన్ని సోమవారం మంత్రి దయాకర్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి ఘటన వివరాలను మృతురాలి నాన్నమ్మ లక్ష్మి వివరించింది. తండ్రి లేని పిల్లలను కష్టపడి చదివిస్తుండగా.. ఇలాంటి దారుణం జరిగిందని రోదించింది. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ ఘటనపై ముఖ్యమంత్రి చాలా బాధపడుతున్నారని తెలిపారు. స్వయంగా కేసు పరిశోధనపై ఆరా తీస్తున్నారని తెలిపారు. చిన్నారి శ్రీహిత హత్య కేసులో మాదిరిగానే ఈ కేసులోనూ నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసుల దర్యాప్తు ఉంటుందని పేర్కొన్నారు. ‘షీ’టీంలను బలోపేతం చేస్తాం బాలికలు, యువతులు, మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన షీ టీంలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి దయాకర్‌రావు చెప్పారు. మహిళలకు సంబంధించి కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల భద్రత కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మహిళలపై దాడులు జరిగితే రాజకీయం చేసే బదులు కుటుంబాలకు అండగా నిలవాలని హితవు పలికారు. అనంతరం ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ వెన్నెల కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లు సిరంగి సునీల్‌కుమార్, స్వప్నతో పాటు స్థానికులు పాల్గొన్నారు. -
‘షి’ ఈజ్ రన్
-
నన్నూ.. ర్యాగింగ్ చేశారు
హైదరాబాద్, సైదాబాద్: కాలేజీలో తాను కూడా ర్యాగింగ్‌కు గురయ్యానని, నేడు ర్యాగింగ్ చేస్తే కఠినంగా శిక్షిస్తున్నామని, ఆడపిల్లలను ర్యాగింగ్ చేయాలంటే భయపడేలా యాంటి ర్యాగింగ్ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు షీ టీమ్ ఇన్చార్జ్, ఐజీ స్వాతిలక్రా అన్నారు. సరస్వతినగర్ కాలనీలోని వైదేహి ఆశ్రమాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ రికార్డులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ‘మీరు షీ టీమ్‌ను నిర్వహిస్తున్నారు కదా మీరు చదువుకునే రోజుల్లో ఎప్పుడైన ర్యాగింగ్‌కు గురయ్యారా’ ప్రశ్నించగా పై విధంగా స్పందించారు. మహిళలకు భరోసా కల్పించేందుకు ఐపీఎస్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. నగరంలో షీ టీమ్‌ల ఏర్పాటుతో 50 శాతం వేధింపులు తగ్గాయన్నారు. ప్రతి మహిళ, యువతికి ఆత్మరక్షణకు కరాటేలో మెళకువలు అవసరమని, ఇందుకోసం ఆశ్రమంలో ఒక శిక్షకుడిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పెద్ద లక్ష్యాలను నిర్ధేశించుకుని క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు. తాను మొదటిసారి విజయం సాధించలేదని, రెండోసారి ప్రయత్నించి ఐపీఎస్‌కు ఎంపికైనట్లు తెలిపారు. వైదేహి ఆశ్రమ పద్దతులు, భద్రత బాగున్నాయని అభినందించారు. కార్యక్రమంలో ఆశ్రమ అధ్యక్షురాలు సీతాకుమారి, కార్యదర్శి మురళి, భారతీదేవి, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల్లో చైతన్యం కోసం షీ టీం సైకిల్ యాత్ర
-
మీకిదే మా భరోసా
వికారాబాద్ అర్బన్: గృహ హింస, అట్రాసిటీ, అత్యాచారం, లైంగిక దాడులకు గురవుతున్న మహిళలు, యువతులు, బాలికలకు అండగా నిలిచేందుకే భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని షీటీం రాష్ట్ర ఇన్చార్జ్, ఐజీ స్వాతిలక్రా అన్నారు. వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సెంటర్‌ను ఐజీ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్, ఎస్పీ అన్నపూర్ణతో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలని మహిళలు, యువతులకు పిలుపునిచ్చారు. భరోసా కేంద్రాలు బాధితులకు అండగా నిలుస్తాయని తెలిపారు. మహిళలపై, చిన్నారులపై రకరకాలుగా దాడులు జరుగుతున్నాయని, వీటితో కుంగిపోయిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మనోధైర్యం నింపేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయని చెప్పారు. అత్యాచారాలకు గురైన మహిళలకు ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన సహకారం అందిస్తారన్నారు. అంతేకాకుండా నేరస్తులకు శిక్షపడే వరకు భరోసా కేంద్రం కృషి చేస్తుందని స్పష్టంచేశారు. ఇందుకోసం ఒక న్యాయ సలహాదారు అందుబాటులో ఉంటారని వివరించారు. న్యాయమూర్తి అనుమతితో కోర్టు కార్యకలాపాలు సైతం ఇక్కడి నుంచే నిర్వహిస్తామని, అవసరమైతే వీడియో రికార్డింగ్ చేసి న్యాయస్థానానికి సమర్పిస్తామని స్పష్టంచేశారు. చిన్నారుల హక్కుల పరిరక్షణకు హైదరాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఉందని తెలిపారు. ఉన్నత న్యాయస్థానం అనుమతితో త్వరలోనే వికారాబాద్‌లో చైల్డ్ కోర్టు ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. షీటీంలో భాగంగా కళాజాత బృందం గ్రామగ్రామానికి వెళ్లి పాటలతో ప్రజలను, యువతను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రారంభమైందని, హైదరాబాద్‌లో మొదలైన ఈ కార్యక్రమం వికారాబాద్‌లో రెండో అడుగు వేసిందని ఆనందం వ్యక్తంచేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. భరోసా కేంద్రం ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సహకరించిన కలెక్టర్ జలీల్‌ను అభినందించారు. సెంటర్ పని తీరుపై ఐజీల ఆరా... ఎస్పీ కార్యాలయంలోని భరోసా కేంద్రంలో పనిచేసే సిబ్బంది పనితీరుపై ఐజీలు స్వాతిలక్రా, రవీంద్ర ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 126 కేసులు రాగా.. కౌన్సెలింగ్ ద్వారా 45 కేసులను పరిష్కరించినట్లు ఎస్పీ అన్నపూర్ణ వారికి వివరించారు. 35 కేసులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, 21 కేసులు ఆయా పీఎస్‌లో ఉన్నాయని, 11 కేసులు కోర్టుల పరిధిలో ఉన్నాయని చెప్పారు. భరోసా సెంటర్లో అత్యాచార, గృహహింస, బాలికలపై లైంగిక దాడి, అట్రాసిటీ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను అధికారులు పరిశీలించారు. సెంటర్ ఏర్పాటుకు కృషిచేసిన ఎస్పీని అభినందించారు. సైబర్ ల్యాబ్ కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభం... ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సైబర్ ల్యాబ్ కమాండ్ కంట్రోల్ రూంను ఐజీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, సాంకేతిక వినియోగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింలు, వికారాబాద్ డీఎస్పీ శిరీష, డీటీసీ డీఎస్పీ రవికుమార్ తదితరులు ఉన్నారు. సీసీ కెమెరాలు ప్రారంభం.. వికారాబాద్: వికారాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఐజీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేషన్లో ఎంత మంది సిబ్బంది ఉన్నారని సీఐ వెంకట్రామయ్యను అడిగి తెలసుకున్నారు. సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. నేరాలను అదుపు చేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఎస్పీ అన్నపూర్ణ, అడిష్నల్ ఎస్పీ నర్సింలు, డీఎస్పీ శిరీష, సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
అతివకు అభయం!
వనపర్తి క్రైం : ఇంటి నుంచి వెళ్లిన ఆడపిల్లలు క్షేమంగా ఇంటికి చేరే వరకు కన్నవారికి భయం తప్పడంలేదు. వారు ఏదో ఒకచోట వేధింపులకు గురవుతున్నారు. వీరికి రక్షణగా నిలుస్తున్నాయి షీ టీమ్‌లు.. ఒక్క ఫోన్‌చేస్తే చాలు వెంటనే వాలిపోయి బాధితులకు భరోసా కల్పిస్తున్నాయి. తెలిసీ తెలియని వయసులో పెడదోవపడుతున్న యువకులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి సన్మార్గంలో నడిపిస్తున్నాయి. షీ బృందాల ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటివరకు 488 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రేమ వేధింపులే ఎక్కువ.. యువతులపై ఆకతాయిల వేధింపులకు చెక్ పెట్టేందుకు షీ టీమ్‌లను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రారంభించారు. 2016లో మందికి కౌన్సెలింగ్ ఇవ్వగా, 2017లో 233 మందికి, 2018 నుంచి ఇప్పటివరకు 38 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తెచ్చారు. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు సామాజిక మాధ్యమాలు, ఫేస్బుక్, వాట్సాప్ పరిచయాల నేపథ్యంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రేమించాలంటూ యువకులు అమ్మాయిలపై బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్నారు. ఇలాంటి సమయాల్లో షీ టీమ్‌లు రంగంలోకి దిగుతున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో నిఘా ప్రధాన ప్రాంతాల్లోనే షీ బృందం నిఘా పెడుతోంది. జిల్లా కేంద్రంలోని జంగిడిపురం, చాణక్య పాఠశాల, బాలికల డిగ్రీ కళాశాల, బండారుబావి, బాలికల జూనియర్ కళాశాల, చందాపూర్ రోడ్డు, స్కాలర్స్, సీవీ రామన్ కళాశాల రోడ్డు తదితర కూడళ్లలో ఎక్కువమంది యువతి, యువకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడి నుంచే షీ టీమ్‌కు ఫోన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఫోన్ వచ్చిన వెంటనే బృందాలు అక్కడి వెళ్లి విషయాలను ఆరా తీస్తూ పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. సిబ్బందిని పెంచితేనే.. జిల్లాలో షీ టీమ్ ఏర్పాటైన మొదట్లో 8 మంది పనిచేశారు. ప్రస్తుతం నలుగురి పోలీసు సిబ్బంది మాత్రమే ఈ బృందంలో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరులో షీ టీమ్ సభ్యులు పనిచేయాల్సి ఉంది. కానీ సిబ్బంది కొరత కారణంగా జిల్లా కేంద్రంలో మాత్రమే షీ టీమ్ నిఘా ఉంచింది. దీంతో కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాధారణ దుస్తువుల్లో ఉండి విధులను నిర్వహించే షీ టీమ్‌కు సమాచారం అందించాలంటే 9177930150, 100 నంబర్లకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. సమాచారం వచ్చిన వెంటనే సమస్య పరిష్కరానికి బృందం పనిచేస్తుంది. నిఘాతో పాటు బృందంలో మరింత మంది సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. -
కరీంనగర్: షీ టీమ్స్ అదుపులో అకతాయిలు
-
‘ఆమె’కు రక్ష!
మహబూబ్‌నగర్ క్రైం : జిల్లాలో మహిళల రక్షణే ప్రధాన ధ్యేయంగా ఆకతాయిల ఆట కట్టించడానికి జిల్లా ఎస్పీ ఏర్పాటు చేసిన షీ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఈవ్‌టీజింగ్ లేదా వేధింపులు ఎదుర్కొంటున్న యువతులు, మహి ళలు తమ ఆవేదనను వాట్సాప్ ద్వారా చెప్పినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సామాజిక మాధ్యమాలను, వాట్సాప్ నంబర్‌ను తెరపైకి తీసుకొచ్చారు. కొందరు బాధితులు తల్లిదండ్రులకు చెప్పుకోలేని స్థితిలో ఉండటం, పోలీసులకు చెప్తే వివరాలు సైతం బహిర్గతం అవుతాయన్న భయం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఈ అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయడంతో వాట్సాప్‌కు పదుల సంఖ్యలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో పెడదోవ పడుతున్న యువకుల తల్లిదండ్రులను పిలిపించడం.. ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి సన్మార్గంలో పెట్టడం కూడా బాధ్యతగానే బృందం స్వీకరిస్తోంది. ఇప్పటి వరకు షీటీం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 2017లో 12 ఎఫ్ఐఆర్లు, 76 కేసులలో 151 మంది యువకులకు కౌన్సిలింగ్ చేశారు. 2018 జనవరి నుంచి మే 13 వరకు 43 కేసులలో 69 మంది యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. చైతన్యం చేసేందుకు కృషి.. షీటీంల ఏర్పాటుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఎస్పీ షీటీంల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఈవ్‌టీజింగ్, వేధింపుల వంటి సమస్యలు ఎదురైతే తమకు ఫిర్యాదు చేయాలని సెల్ నంబర్లు ఇస్తున్నారు. 100కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. మండల కేంద్రాల్లో సైతం.. జిల్లాకేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో సైతం ఈవ్‌టీజింగ్, వేధింపులు క్రమంగా పెరుగుతున్నా యి. ఫిర్యాదు చేస్తే పరువు పోతుందన్న భావనతో బాధితులు వేధింపులను మౌనంగా భరిస్తున్నారు. చట్టం వీరికి రక్షణగా ఉన్నా పోలీసులంటే భయం కారణంగా వారికి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో అవగహన కార్యక్రమాలు ఏర్పా టు చేసిన తర్వాత కొంత మార్పు వచ్చింది. సెల్ఫోన్లు ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతుండటంతో వాట్సాప్, సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. ఫేస్బుక్, వాట్సాప్ పరిచయాలు, స్నేహం ముసుగులో ఎదరువుతున్న వేధింపుల విషయంలో బాధితులకు షీ టీం అవసరం ఎంతో ఏర్పడుతోంది. ఫేస్బుక్లో వెల్లువలా వచ్చే పోస్టింగ్‌లకు లైక్ కొట్టగానే మురిసిపోవడం.. క్రమక్రమంగా మెసెంజర్లలో అసభ్యకర మెసేజ్‌లు చేసే వరకూ రావడం పలు కేసుల్లో గుర్తిం చారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత యువతులు, విద్యార్థినులను ప్రేమించాలంటూ యువకులు బ్లా క్మెయిలింగ్కు దిగుతున్న ఘటనలూ కోకొల్లలు. ఈ పరిణామాన్ని ఊహించని బాధిత యువతులు షీటీంను ఆశ్రయించడం పరిపాటిగా మారుతుంది. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు, వేర్వేరు నంబర్ల నుంచి వరుసగా కాల్స్ రాత్రీపగలు తేడా లేకుండా ఫోన్ చేయడం మాట్లాడేప్పుడు పెట్టే యడం.. కొన్నిసార్లు అసభ్యంగా మాటలు.. వంద ల సంఖ్యలో పట్టణంలో యువతులు, మహిళలు ఎదుర్కొంటున్న వేదన ఇది. పాత నంబర్ తీసేసి కొత్త ఫోన్ నంబర్ తీసుకున్నా మందికి ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇలాంటి వారి సమస్య పరిష్కరించేందుకు షీటీంలు పని చేస్తున్నాయి. అర్ధరాత్రి వరకూ వేధింపులు.. వేధింపులు, ఈవ్ టీజింగ్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు షీటీంలు పనిచేస్తున్నా సెల్‌ఫోన్, ఇంటర్నెట్ ఆధారిత నేరాలకు పాల్పడేవారు విద్యార్థినులు, యువతులను ఇంకా వేధిస్తూనే ఉన్నారు. తెలిసిన వారున్నా లేకపోయినా సెల్‌ఫోన్ నంబరుంటే చాలు అసభ్యంగా మాట్లా డుతుంటారు. బాధితులు మాట్లాడకపోయినా, నంబరు గుర్తించి సమాధానం ఇవ్వకపోయిన వేర్వేరు నంబర్లతో ఫోన్ చేసి భయపెడుతున్నారు. పైశాచిక మనస్త త్వం ఉన్న కొందరు నేరగాళ్లు దుర్భాషలాడుతున్నారు. ఆసభ్య, అశ్లీల వీడియోలను సెల్ఫోన్లకు పంపుతున్నారు. మరికొందరు అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు విరామం లేకుండా ఫోన్లు చేస్తూ హింసిస్తున్నారు. ఇలాంటి చిత్రహింసలు ఎదుర్కొంటున్న వారి లో కొంతమంది వైద్యులూ, ఉపాధ్యాయులు, మహిళా ఉద్యోగినులు ఉన్నారు. కళాజాత బృందాలతో అవగాహన జిల్లాలో షీటీం పనితీరుపై గ్రామాల్లో పోలీస్ కళాజాత బృందాలతో చైతన్యం చేస్తున్నాం. అలాగే కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. వేధింపులకు ఎదుర్కొంటున్న వారు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. వేధించేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం. మహబూబ్‌నగర్ బస్టాండ్, కళాశాలలు, కళాశాలలకు వెళ్లే రోడ్లపై షీటీంలు ఉంటాయి. – సంపత్, షీటీం సీఐ, మహబూబ్‌నగర్ -
షీటీంలకు చిక్కిన 38మంది ఆకతాయిలు
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్): యువతులు, మహిళలను వేధించే ఆకతాయిలను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ కార్తికేయ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల రోజుల వ్యవధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీం బృందం 38 మందిని పట్టుకున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ప్రసుత్తం ఆరు షీ టీం బృందాలు పనిచేస్తున్నాయని, ఈ టీంలకు ఇన్‌చార్జీగా ఒక సీఐని నియమించామన్నారు. ప్రతి షీ టీం బృందంలో ఎస్సై స్థాయి అధికారి, ఇద్దరు మహిళా పోలీసులు, ఇద్దరు కానిస్టేబుల్స్‌తో ఒక టీం పనిచేస్తోందన్నారు.ఈ టీం ప్రధానంగా స్త్రీలను వేధింపులు అధికంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని అక్కడ సాధరణ ప్రజలలో కలిసి పోయి, వీరివద్ద ఉండే నిఘా కెమెరాల ద్వారా ఆకతాయిల వేధింపులు రికార్డు చేసుకుంటారని, నేరస్వభావాన్ని బట్టి నేరస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించటం లేదా, వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. గతనెల మార్చి 1 నుంచి 31 వరకు షీ బృందాలు 38 మందిని పట్టుకుని ఆయా పోలీస్స్టేషన్లలో అప్పగించారని సీపీ తెలిపారు. మహిళలూ సమాచారమివ్వండి.. మహిళలు ఎవరైనా ఆకతాయిల వేధింపులు నుంచి రక్షణ కోసం వాట్సప్ నం. 9490618029 లేదా, మేసేజ్ డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
విద్యార్థినిని వేధిస్తున్న కండక్టర్ అరెస్ట్
నాగోలు: బస్సులో ప్రయాణిస్తున్న బీటెక్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక వేధింపులకు పాల్పడుతున్న బస్సు కండక్టర్‌ను వనస్థలిపురం షీ టీమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. నాగోలు అయ్యప్ప కాలనీకి చెందిన బాదం శ్రీనివాస్‌గుప్తా అలియాస్ బీఎస్గుప్తా(50) బండ్లగూడ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. హయత్‌నగర్ నుంచి మెహిదీపట్నం వెళ్లే బస్సులో భాగ్యలత ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థిని రోజు బస్సు ఎక్కే క్రమంలో శ్రీనివాస్‌గుప్తా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతని వేధింపులు శృతిమంచడంతో బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. దీనిపై ఆమె గుప్తాను నిలదీయగా దురుసుగా ప్రవర్తించాడు. శుక్రవారం బస్సు లో మరోసారి అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు వనస్థలిపురం షీ టీమ్ వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న షీటీమ్ సభ్యులు నిందితుడిని అ రెస్ట్ చేసి కేసులు నమోదు చేసి రిమా ండ్‌కు త రలించారు. కండక్టర్ శ్రీనివాస్‌గుప్తా బస్సు లో మహిళలు, విద్యార్థినుల పట్ల అస భ్యంగా ప్ర వర్తిస్తున్నాడని పోలీసులు తెలిపా రు. సమావేశంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్ఐ విజయ్, షీ టీమ్ ఏఎస్ఐ యాద య్య, సుమలత, మహేష్, పాల్గొన్నారు. -
ఆకతాయిలకు..చెక్
భానుగుడి(కాకినాడ సిటీ): బాలికలు, మహిళలు ధైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. శనివారం స్థానిక భానుగుడి సెంటర్లో కాకినాడ స్మార్ట్‌సిటీలో ఈవ్‌టీజింగ్ నివారణకు జిల్లా పోలీస్ విభాగం షీ టీమ్స్ ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. 2కే రన్ ర్యాలీని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రారంభించారు. జేఎన్టీయూకే అలుమినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై షీ టీమ్స్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీసీఎం రాజప్ప మాట్లాడుతూ మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ఇటీవల నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్లో మహిళలకు 30 శాతం ప్రాధాన్యం పాటించామన్నారు. మహిళల గౌరవాన్ని, స్వేచ్ఛను భంగపరిచే అనుచిత ప్రవర్తన, వేధింపులను నిర్మూలించేందుకు షీ టీమ్స్ రక్షణ వ్యవస్థను అమలులోకి తెచ్చిందన్నారు. సీసీటీవీ కెమెరాలు, మఫ్టీలో షీటీమ్‌ల నిఘాలో కాకినాడ నగరంలో మహిళలకు మరింత భద్రతంగా రూపుదిద్దినందుకు ఎస్పీ, పోలీసు యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఎస్పీ విశాల్‌గున్ని మాట్లాడుతూ నగరంలో ఈవ్‌టీజింగ్ జరిగే ప్రదేశాల్లో ఒక మహిళా ఎస్సై, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు పురుష కానిస్టేబుళ్లతో షీ టీమ్ మఫ్టీలో రహస్య నిఘా ఉంచుతాయన్నారు. ఫిర్యాదులను 100 నంబర్‌కు ఫోన్ ద్వారాగానీ, ‘షీటీమ్‌కేడీఏ’ ఫేస్బుక్ అడ్రస్‌కు, వాట్సాప్ నంబర్ 94949 33233కు మెసేజ్ ద్వారా లేదా, కాకినాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్ పై అంతస్తులోని డీఎస్పీకి తెలియజేస్తే 24 గంటలలోపు ఆకతాయిలపై చర్య చేపట్టి భద్రత కల్పిస్తామన్నారు. కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ నగరంలో బాలికలు, మహిళలకు ఎదురయ్యే ఆకతాయి వేధింపులను షీ టీమ్స్ అండతో ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. రంపచోడవరం ఏఎస్పీ అజితావేజెండ్ల మాట్లాడుతూ మహిళల రక్షణకోసం ఏర్పాటైన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలని కోరారు. ఐడియల్ కళాశాల కార్యదర్శి డాక్టర్ పి.చిరంజీవినికుమారి మాట్లాడుతూ మహిళలకు నేనున్నానని ఆత్మస్థైర్యం కల్పిస్తూ పోలీస్ షీటీమ్స్ వ్యవస్థ నిలవడం ముదావహమన్నారు. ముందుగా భానుగుడి సెంటర్ నుంచి జేఎన్టీయూకే ఆడిటోరియం వరకు పెద్ద సంఖ్యలో బాలికలు, మహిళల భాగస్వామ్యంతో 2కే రన్ సాగింది. ఈ రన్లో విజేతలుగా నిలిచిన బాలికలు జి.దివ్య, పుష్పవాణి, మోహితాప్రసన్న, రామలతలకు జేఎన్టీయూకే ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజప్ప బహుమతులు అందజేశారు. ఎస్పీ సతీమణి నేహాగున్ని, డీఎఫ్ఓ డాక్టర్ నందినీ సలారియా, ఏఎస్పీ ఏఆర్ దామోదర్, రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి, డీఎస్పీలు, కళాశాల విద్యార్థినిలు, వివిధ రంగాల మహిళలు పాల్గొన్నారు. -
హైదరాబాద్ మెట్రోలో వృద్ధుడి వికృత చర్య
సాక్షి, హైదరాబాద్ : ఆయన వయస్సు సుమారు 65ఏళ్లు ఉండొచ్చు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసు. కానీ చేసే పనులు తెలిస్తే మాత్రం అసహ్యించుకోకుండా ఉండలేరు. భాగ్యనగరంలో మెట్రో ప్రారంభమైన పదిరోజులకే ఓ 65 ఏళ్ల వృద్ధుడు మెట్రోలో ఎక్కిన మహిళల, యువతుల ఫోటోలను తీస్తూ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్ నరసింహా(65) అనే వృద్ధుడు మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళల ఫోటోలను అసభ్యకరంగా మొబైల్ ఫోన్‌తో తీస్తూ షీ టీమ్స్‌కు అడ్డంగా దొరికిపోయాడు. సదరు వ్యక్తి విద్యాశాఖలో రిటైర్డ్ ఉద్యోగి కావడం గమనార్హం. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్తున్న మెట్రోరైలులో తనకు ఎదురుగా కూర్చున్న మహిళల ఫోటోలను దొంగచాటుగా తీస్తూ దొరికిపోయాడు. ఆయనగారి ఫోన్ తనిఖీ చేయగా అప్పటికే ఆ ఫోన్లో చాలా మంది మహిళలు, యువతుల ఫోటోలు బయటపడ్డాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. -
టీఆర్ఎస్ కార్పొరేటర్ తనయుడు అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : నగర యువతులకు నరకం చూపాడు! -15 రోజులుగా యువతులకు వేధింపులు నిందితుడు మల్కాజ్గిరి కార్పొరేటర్ కుమారుడు సాక్షి, సిటీబ్యూరో : ఫేస్బుక్లో యువతి పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసి, యువతులకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌లు పంపించి, వారి వివరాలు సేకరించి వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని నగర షీ–టీమ్స్ బృందం మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. దాదాపు 15 రోజులుగా ఇతను పలువురు యువతులకు నరకం చూపినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడు మల్కాజ్గిరి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్‌గా గుర్తించారు. మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన అభిషేక్ తాను చదివిన స్కూల్లో కొన్నేళ్ల క్రితం చదివిన విద్యార్థినుల వివరాలను ఫేస్బుక్ ద్వారా సేకరించాడు. తానూ అదే స్కూల్లో చదివిన యువతిగా పరిచయం చేసుకుంటూ ఖాతా తెరిచాడు. అప్పటికే స్కూల్ పూర్వ విద్యార్థుల వివరాలు అతడికి తెలిసి ఉండటంతో వారందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపాడు. అనంతరం వారి ఫోన్ నెంబర్లు ఇతర వివరాలు సేకరించిన అభిషేక్ ఆ తర్వాత అసలు కథ ప్రారంభించాడు. నేరుగా మల్కాజ్గిరి నుంచే కాల్స్ చేసి వేధింపులకు పాల్పడితే పోలీసులకు చిక్కే ప్రమాదం ఉందని గుర్తించిన అతను ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఇంటర్నెట్ కాలింగ్‌ను వినియోగించాడు. గత పక్షం రోజులుగా ఒక్కో యువతికి కాల్ చేస్తూ చెప్పలేని విధంగా వేధించేవాడు. ‘నాతో నీవు అశ్లీల చాటింగ్స్ చేయాలి. నేను కాల్ చేసినప్పుడు ఫోన్ పెట్టావంటే మార్ఫింగ్ చేసిన నీ ఫొటోలు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తానని బెదిరించేవాడు. ఇతడి బాధితుల సంఖ్య పదుల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకోవాలని ప్రయత్నించారు. అయితే దాని చిరునామా ఒకచోట, లోకేషన్స్ మరోచోట రావడంతో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. హైదరాబాద్ పోలీసులు ఇటీవల ఎలాంటి కాల్స్నైనా గుర్తించే టెక్నాలజీని సమకూర్చుకున్నారు. దీని ఆధారంగా విశ్లేషించి ఇంటర్నెట్ కాల్స్‌గా తేల్చారు. వీటిపై కూపీ లాగుతూ నిందితుడి కోసం నగరమంతా జల్లెడ పట్టారు. రెండు రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి యువతులను వేధిస్తున్నట్లు గుర్తించారు. చివరకు మల్కాజిగిరిలో మంగళవారం రాత్రి అతడిని పట్టుకున్నారు. అభిషేక్ ఉండేది మల్కాజిగిరి ప్రాంతంలోనైనా అక్కడ నుంచి కాల్స్ చేస్తే పట్టుబడుతాననే ఉద్దేశంతో గోల్కొండ, బంజారాహిల్స్, చార్మినార్, హయత్‌నగర్ ప్రాంతాల్లో సంచరిస్తూ యువతులను వేధింపులకు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ ఏసీపీ మాట్లాడుతూ... అభిషేక్ ఆగడాలపై ముగ్గురు యువతులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అతడు సోషల్‌మీడియాలో యువతుల ఫోటోలను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేసినట్లు వెల్లడించారు. అభిషేక్‌పై ఐపీసీ సెక్షన్ 67(ఏ), ఐటీ యాక్ట్ 354 (డీ) కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ పేర్కొన్నారు. -
యువతికి వేధింపులు.. 76 ఏళ్ల వ్యక్తిపై కేసు
హైదరాబాద్: తనను వేధిస్తున్న వృద్ధునిపై ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ.. ఎంబీఏ చదువుకున్న ఓ యువతి(25) మే 18వ తేదీన తన తాతతో కలిసి ఆలయానికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వినోద్ దివాన్(76).. ఇద్దరినీ తన కారులో ఎక్కించుకుని తీసుకువచ్చి వారి ఇంట్లో దించాడు. ఈ సందర్భంగా అతడు యువతి ఫోన్ నంబర్‌ను అడిగి తెలుసుకున్నాడు. ఎక్కడికైనా వెళ్దాం రమ్మంటూ ఆహ్వానించగా ఆమె తిరస్కరించింది. అనంతరం ఆమెకు పలుమార్లు ఫోన్ చేసి విసిగించసాగాడు. దీనిపై మనస్తాపం చెందిన బాధితురాలు షీటీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రన్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: నగర పోలీసులు, షీ టీమ్ కలిసి సంయుక్తంగా ఆదివారం ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు 2కే, 5కే రన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వీవీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను వీవీ విగ్రహం వద్ద మళ్లించి సాధన్, నిరంకారి భవన్‌వైపు అనుమతించనున్నారు. అంబేద్కర్, ఐటీ నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇక్బల్ మినార్ వైపు మళ్లించనున్నారు. ఇక్బల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ గేట్ సెక్రటేరియట్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద మళ్లించనున్నారు. లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మళ్లించి బీఆర్కేఆర్ భవన్, తెలుగు తల్లి, ఇక్బల్ మినార్ యూ టర్న్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా అనుమతించనున్నారు. కర్బల నుంచి ట్యాంక్ బండ్ మీదుగా అంబేద్కర్ విగ్రహాం వైపు వెళ్లే వాహనాలను చిల్డ్రన్ పార్క్ నుంచి డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్‌వైపు మళ్లించనున్నారు. నల్లగుట్ట నుంచి సంజీవయ్యపార్కు వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంన్ వద్ద మళ్లించి రాణిగంజ్ ఎక్స్రోడ్డువైపు అనుమతించనున్నారు. డీబీఆర్ మిల్స్ నుంచి చిల్డ్రన్ పార్కు వైపు వాహనాలను అనుమతించమని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ తెలిపారు. రన్లో పాల్గొనేందుకు వచ్చేవారు తమ వాహనాలను మక్తా, ఐమాక్స్ పార్కింగ్, డాక్టర్స్ కారు పార్కింగ్‌లో నిలుపుకోవాలని ఆయన సూచించారు. -
బాలికను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
ఖమ్మంక్రైం: బాలికను వేధిస్తున్న ఓ వ్యక్తిపై షీ టీమ్ కేసు నమోదు చేసింది. షీటీమ్ ఎస్సై బాబూలాల్ కథనం ప్రకారం నగరంలోని రమణగుట్ట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, 7వ తరగతి చదువుతున్న బాలికను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు షీ టీమ్ సిబ్బందిని ఆశ్రయించగా.. వారు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి టూటౌన్ సీఐ రాజిరెడ్డి ముందు హాజరుపరచగా ఆయన కౌన్సెలింగ్ నిర్వహించి పిటీ కేసు నమోదు చేశారు. ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డ్రా ఓ వ్యక్తి బ్యాంకు ఖాతానుంచి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డ్రా చేసిన సంఘటనపై త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. రంగనాయకులపేటకు చెందిన పాశం సత్యనారాయణ బ్యాంకు ఖాతా నుంచి రూ.19 వేలు డ్రా అయ్యాయి. ఆయన సంబంధిత బ్యాంకును ఆశ్రయించగా.. బ్యాంకు వారు ఆ డబ్బును గాంధీచౌక్ ప్రాంతంలోని ఓ ఏటీఎం నుంచి డ్రా చేసినట్లు తెలిపారు. బాధితుడు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్సై ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళల భద్రతే షీటీం లక్ష్యం
కళాశాలలో ఫిర్యాదుల పెట్టె ►అందుబాటులో వాట్సాప్ నంబరు 79975 55511 ►ఫిర్యాదు మెసేజ్‌లు నేనే పరిశీలిస్తా ►ఎస్పీ విశ్వజిత్ కంపాటి సిరిసిల్ల క్రైం : మహిళలు, విద్యార్థినులు, యువతుల కు భద్రత కల్పించడమే ధ్యేయంగా షీటీం ముందుకు సాగుతోందని ఎస్పీ విశ్వజిత్ కంపాటి అన్నారు. జిల్లా కేంద్రంలోని వాసవీకల్యాణ మండపంలో బుధవారం షీటీం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, అకృత్యాలను పోలీసుల దృష్టికి తెచ్చేలా వారిలో ధైర్యం నూరిపోస్తున్నామని తెలిపారు. తాము అందుబాటులోకి తెచ్చిన 79975 55511 వాట్సప్ నంబరుకు సమాచారమిస్తే తానే స్వయంగా పరిశీలిస్తానని, లేనిపక్షంలో 94409 04823 నంబరుకు సమాచారం అందించాలని సూచించారు. అత్యాచారాలు, హత్యాచారాలు, వేధింపులు 18– 60ఏళ్ల వయస్సుపైవారిపైనా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులు, యు వతులపై జరిగే అకృత్యాలను నిరోధిం చేందుకరే షీటీంలను ప్రత్యేక డ్రెస్ కోడ్ లేకుండా ప్ర జల్లో మమేకం చేస్తున్నామన్నారు. ‘ఫ్రెండ్లీ పో లీసింగ్ అంటేనే తప్పు చేసిన వాడు భయపడాలి.. మంచి వాళ్లు స్నేహంగా పోలీసులతో మమేకమవ్వాలి.. షీటీంలకు దొరికిన పోకిరీ లపై నేరుగా కేసులు మోపే పరిస్థితి లేదని, ఒకటికి రెండుసార్లు కౌన్సెలింగ్ చేస్తామని, అయి నా మారకుంటే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సిరిసిల్లలో షీటీం పర్యవేక్షణాధికారి గా ఎస్సై శ్రీనివాస్ మంచి సేవలందిస్తున్నారని ఎస్పీ అభినందించారు. షీటీంలో మహిళా అధికారుల సంఖ్యను పెంచుతూనే సత్వరమే స్పం దించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నా రు. అన్ని విద్యాలయాల్లో ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేసి వారంలో ఒకరోజు వాటి ని తానే నేరుగా పరిశీలిస్తానని అన్నారు. సిరిసిల్ల డీ ఎస్పీ సుధాకర్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కతిక సారథి కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ïటౌన్ సీఐ విజయ్‌కుమార్, రూరల్ సీఐ రవీందర్, వేములవాడ రూరల్ సీఐ మాధవి, ఎస్సై శ్రీని వాస్, న్యాయవాది సీహెచ్ మహేశ్‌గౌడ్, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు జక్కని రాజు, వైద్యురలు నహీంజా, విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ట్రస్మా జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ సిరిసిల్ల ఎడ్యుకషన్ : తెలంగాణ గుర్తింపు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) జిల్లా కార్యాలయాన్ని ఎస్పీ విశ్వజిత్ ప్రారంభించారు. డీఈవో రాధాకిషన్ , ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, అధ్యక్షుడు రవిశంకర్, ఉపాద్యక్షుడు కోట మనోహర్, జిల్లా అధ్యక్షుడు ఆర్సీ రావు, ప్రధాన కార్యదర్శి నాగుల శ్రీనివాస్ గౌడ్, పట్టణ అ««దl్యక్షుడు గుగ్గిళ్ల జగన్ గౌడ్, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. -
‘టెక్’ పోలీసింగ్
► నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం ► వినియోగంలోకి సీసీ కెమెరాలు.. వాట్సప్ నంబర్లు ► జరిమానా వసూళ్ల కోసం స్వైప్ మిషన్లు ► జిల్లా పోలీసుల సరికొత్త ప్రయోగం నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిండంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిందితుల ఆచూకీ కనిపెట్టడం, నేరస్తులను పట్టుకోవడం, అనుమానితులు, అసాంఘికశక్తుల ఆట కట్టించడం కోసం ప్రధాన పట్టణాలు, కూడళల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని డ్రంకెన్ డ్రైవ్ ద్వారా అదుపులోకి తీసుకుంటూ రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇంకో అడుగు ముందుకు వేసి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారి వివరాలు తెలిపేందుకు, అసాంఘిక కార్యకలాపాలను పోలీసులకు చేరవేసేందుకు వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెచ్చారు. వివిధ సందర్భాల్లో దోషుల నుంచి జరిమానా వసూలు చేసేందుకు ఇటీవల స్వైపింగ్ మిషన్లను ప్రారంభించి నగదు రహిత లావాదేవీలవైపు పయనిస్తున్నారు. మొత్తంగా ‘టెక్’ పోలీసింగ్‌లో అగ్రస్థానంలో నిలిచేందుకు ముందుకు సాగుతున్నారు. – సిరిసిల్ల క్రైం సిరిసిల్ల క్రైం : జిల్లాలో షీటీం విభాగం సత్ఫలితాలిస్తోంది. మహిళలు, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడాన్ని నేరుగా పోలీసులకు చేరవేసేందుకు 94409 04823 మొబైల్ నంబరును అందుబాటులోకి తెచ్చారు. బాధితులు ఈ నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు అందించిన క్షణాల్లో షీటీం సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఈరెండు నెలల్లోనే ఇలాంటివి ఐదు కేసులు నమోదు చేశారు. దాదాపు 100 మంది పోకిరీకి కౌనెలింగ్తో హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలోని వివిధ రకాల నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు, సమాచారం అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 100 టోల్‌ఫ్రీ నంబరునూ వినియోగించాలని సూచిస్తున్నారు. ఎస్పీ పేరుతో ఏర్పాటు చేసిన 799755 5511 వాట్సాప్ నంబరు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. మద్యం తాగి పట్టుబడితే తప్పించుకనేదిలేదు.. మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు చిక్కితే తప్పించుకునే వీలులేకుండా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇట్లాంటి వారిని గుర్తించి, జరిమానా విధించేందుకు బ్రీతింగ్ ఎనలైజర్ అనేక యంత్రాన్ని వినియోగిస్తున్నారు. సాంకేతిక మీటర్ తనిఖీలో 30పాయింట్లకన్నా ఆల్కహాల్ అధికంగా ఉంటే జరిమానా విధిస్తున్నారు. దీని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే చాన్స్ లేకుండా స్వైపింగ్‌మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. జరిమానాల వసూళ్లకు సాంకేతిక సాయం.. ఇప్పటి వరకు జరిమానాలు చెల్లించేందుకు హ్యాండ్ టు హ్యాండ్ విధానం వినియోగించేవారు. లేదా చలాన్ల ద్వారా జరిమానా విధించేవారు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్‌లు స్వైపింగ్ మిషన్ ద్వారా జరిమానా వసూలు చేస్తున్నారు. ఇటీవల డీఐజీ రవివర్మ ఈ యంత్రాలను ఆవిష్కరించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యమో.. నేరుగా డబ్బులు పోలీస్ విభాగానికి చేరాలనో ఏమోగానీ.. మొత్తానికి నగదు రహిత లావాదేవీలకు ట్రాఫిక్ విభాగంలో స్వైపింగ్ మిషన్ విధానాన్ని అమలు చేస్తోంది. సీసీ కెమెరాల వినియోగం.. నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు వినియోగం అధికంగా ఉంటోంది. వీటి వినియోగం జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ రాజన్న ధర్మక్షేత్రంలో అ«ధికంగా ఉంది. సిరిసిల్లలో 42 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేయగా, వేములవాడ రాజన్న «క్షేత్రంలో 280కి పైగా సీసీ కెమెరాలున్నాయి. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలు పరిశీలించి, వాటి ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. కేసును స్వల్పకాలంలోనే ఛేదిస్తున్నారు. నిందితులను పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తున్నారు. భక్తులతో కిటకిటలాడే రాజన్న సన్నిధానంలో ఇద్దరు చిన్నారుల ఆచూకీని తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు అత్యంత కీలకపాత్ర వహించాయి. ఈఏడాది సుమారు 15 కేసుల్లో సీసీ కెమెరాల సాయం తీసుకున్నట్లు వేములవాడ పోలీసులు చెబుతున్నారు. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో వాహనాల చోరీ నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడినట్లు అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల సంఖ్య పెంచుతాం సిరిసిల్ల జిల్లా కేంద్రంగా మారిన క్రమంలో ఇక్కడ సీసీ కెమెరాల సంఖ్య పెంచుతాం. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుత సీసీ కెమెరాల పనితీరు మెరుగుపర్చేందుకు నేరుగా కరెంట్ సరఫరా చేయాలని ‘సెస్’ అధికారులను విన్నవించాం. – విజయ్ కుమార్, సీఐ, సిరిసిల్ల పర్యవేక్షణ రూమ్ ఏర్పాటు చేస్తాం పోలీసుల నేతృత్వంలో 80, రాజన్న ఆలయం ఆధ్వర్యంలో 100, ప్రైవేట్ లాడ్జీల్లో మరో 80 సీసీ కెమెలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి. వీటి సాయంతో నేరస్తులను పట్టుకుంటున్నాం. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నాం. ఈఏడాదిలో 13 కేసులు ఛేదించాం. త్వరలోనే కమాండింగ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు కానుంది. – శ్రీనివాస్, సీఐ వేములవాడ -
మహిళల రక్షణకు మరో ముందడుగు
► ఎస్పీ ఎం.శ్రీనివాస్ ► షీటీమ్ సభ్యులకు వాహనాలు అందజేత ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో మహిళల సంరక్షణకు మరో ముందుడుగు వేశామని ఎస్పీ శ్రీనివాస్ అన్నారు. గురువారం పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నూతన షీటీమ్ బృందాల పరిచయ వేదికలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మూడు షీటీమ్ బృందాల సభ్యులకు నూతన వాహనాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల ధన, మాన, ప్రాణాలకు, గౌరవ అభిమానాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించి పటిష్టంగా మార్చిందని అన్నారు. ఇందులో భాగంగానే షీటీమ్ సభ్యులకు 15 నూతన వాహనాలు కేటాయించామని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలను రహస్య కెమెరాలో చిత్రీకరించి, రుజువులతో సహా వారిని పట్టుకుని తల్లిదండ్రులు, భార్య, బంధువుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించడంతోపాటు పోకిరీలపై కేసులు నమోదు చేస్తామన్నారు. 100కు డయల్ చేస్తే సత్వరమే షీటీమ్ సభ్యులు చేరుకుంటారని తెలిపారు. కళాశాలల్లో విద్యార్థిగా వెళ్లి అనుమానితులపై నిఘా ఉంచుతారని, విద్యార్థులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవదని అన్నారు. సీసీఎస్ డీఎస్పీ కె.నర్సింహారెడ్డి పర్యవేక్షణలో షీటీమ్‌లు పని చేస్తాయని, సభ్యులు మారువేషంలో ఉండి మహిళలకు రక్షణ కల్పిస్తారని తెలిపారు. సెల్ 8333986698 ద్వారా సమాచారం అందించి పోలీసు రక్షణతోపాటు ప్రజారక్షణ చర్యలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ డీఎస్పీ లక్ష్మి నారాయణ, సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి, పట్టణ సీఐ సత్యనారాయణ, ఆర్ఐ బి.జెమ్స్, ఎస్సైలు డి.పద్మ, రాజలింగం, ఆర్ఎస్సై పెద్దయ్య, ఏఎస్సై అప్పారావు, శంకర్, రాధ, రాంమూర్తి, సర్దార్ సింగ్, లక్ష్మి, సుశీల, సరిత, మౌనిక పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఆదిలాబాద్ రిమ్స్ : నేరాల నియంత్రణకు పట్టణంలోని కాలనీల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ ఎం.శ్రీనివాస్ సూచించారు. ఇందుకోసం పోలీసు అధికారులు చొరవచూపాలని పేర్కొన్నారు. గురువారం మహిళా పోలీసు స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు లక్ష్మీనారాయణ, నర్సింహారెడ్డి, ఆర్ఐ బి.జేమ్స్, ఆర్ఎస్సై బి.పెద్దయ్య, ఎస్సై రాజలింగం, డి.పద్మ పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు పటిష్ట చర్యలు
► ఆదిలాబాద్,ఉట్నూర్‌లలో షీటీంలు ► ఎస్పీ శ్రీనివాస్ ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తామని ఎస్పీ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు.మంగళవారం తన కార్యాలయంలో షీ టీం బృందాలతో సమావేశమయ్యారు. షీటీంల బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో ఆర్థిక నేరాలను అరికట్టడంతో పాటు మహిళల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నూతనంగా ఆదిలాబాద్‌లో రెండు, ఉట్నూర్‌లో ఒక షీటీంలు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల 8మంది మహిళాపోలీసులతో పాటు నలుగురు కానిస్టేబుళ్లకు హైదరాబాద్‌లోని అంబర్పేట్ శిక్షణ కేంద్రంలో రెండు వారాలు శిక్ష ణ ఇచ్చినట్లు వివరించారు. త్వరలో స్థానికపోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో షీటీం సభ్యులకు కరాటే శిక్షణ ఇస్తామన్నారు. నేరాలకు సంబంధించిన ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా నియంత్రించడానికి పనిచేయాలని సూచించారు. సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో రోజువారీ కార్యక్రమాల నిర్వహణ ఉంటుందన్నారు. మహిళలు నిర్భయంగా ఉండాలని, ఎలాంటి సమస్యలున్నా డయల్ 100, ఉమెన్స్ హెల్ప్‌లైన్ 1091కు సమాచారం అందించి రక్షణ పొందాలన్నారు. కాలేజ్, బస్టాం డ్, పార్కులు, సినిమాహాల్స్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో నిఘా ఉంచాలని పేర్కొన్నారు. గురువారం షీటీం బృంధాలకు నూతన యాక్టివ వాహనాలు అంది స్తామన్నారు. మహిళల రక్షణ కోసం షీటీంలు నిరంతరం కృషి చేయాలన్నారు. సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి, షీటీం సభ్యులు సర్దార్‌సింగ్, ఎం.రాధ, రామ్మూర్తి, లక్ష్మి, శంకర్, మౌనిక, సరిత, శ్రీనివాస్, అనిత, సుశీల, సుగుణ, సీసీ పోతరాజు ఉన్నారు. -
పకడ్బందీగా చట్టాల అమలు
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చట్టాల అమలుకు కృషి చేస్తుందని రాచకొండ కమిషనరేట్ షీ టీమ్స్ ఇన్చార్జి స్నేహిత పేర్కొన్నారు. మంగళవారం మంగళ్‌పల్లి గ్రామంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు షీ టీమ్స్‌పై అవగహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్నేహిత మాట్లాడుతూ కళాశాలల్లో ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఆకతారుులు బాలికలను ఇబ్బందులకు గురి చేస్తే నేరుగా షీ టీమ్స్, స్థానిక పోలీసులకు, లేదా 100 నెంబరుకు డయల్ చేసి ఫిర్యాదులు అందించాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. రాచకొండ కమిషనర్ వాట్సాప్ నెంబరు 94906 17111 కూడా అందుబాటులో ఉంటుందన్నారు. అమ్మారుులు సామాజిక మాధ్యమాల్లో పర్సనల్ డాటా, ఫొటోలు పెట్టుకోవద్దని సూచించారు. ఆత్మరక్షణ కోసం కరాటే, కుంగ్‌ఫూలలో శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఇన్చార్జి మారుతి, సీఐ స్వామి, మహిళా పోలీసులు వరలక్ష్మి, రుద్రమదేవి ఫౌండేషన్ నిర్వాహకులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నిమజ్జన యాత్ర మార్గాల్లో షీ టీంల నిఘా
వినాయక నిమజ్జన ఉత్సవాల్లో మహిళా భక్తులతో అనుచితంగా వ్యవహరించే వారిపై సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల షీ టీం సభ్యులు నిఘా వేయనున్నారు. ఈవ్ టీజింగ్...అసభ్య పదజాలంతో మాట్లాడుతూ కనిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించే బాలికలు, అమ్మాయిలు, యువతులు, మహిళలు ఆనందంతో కేరింతలు కొడుతూ...గణపతి బొప్పా మోరియా అంటూ నగర శివారు ప్రాంతాలైన సరూర్‌నగర్ ట్యాంక్, సఫీల్‌గూడ చెరువు, కాప్రా చెరువు, చర్లపల్లిలో కొత్తగా రెడీ చేస్తున్న చెరువుల్లో సందడి చేయడం అనవాయితీగా వస్తోంది. ఏటికేడు గణపతి విగ్రహాలతో వచ్చే మహిళ భక్తుల సంఖ్య పెరుగుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని 100 మంది వరకు సిబ్బంది ఆకతాయిలపై కన్నేసి ఉంచుతారు. ఎక్కడా ఎవరైనా అమ్మాయిలను వేధిస్తున్నట్టు సమాచారం వచ్చినా, వీరి కంటపడినా అరెస్టు చేస్తారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లతో పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లలోని నిమజ్జన యాత్ర మార్గాల్లో గస్తీ నిర్వహిస్తారు. బాధితులు 100కు కాల్ చేస్తే వెంటనే ఘటనాస్థలిలో వీరు వాలిపోయేలా ఏర్పాట్లు చేశారు. ‘మఫ్టీ’తో నిఘా... సందట్లో సండేమియా అన్నట్టు జనాల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోయే అవకాశముంది. సంప్రదాయ కుటుంబానికి చెందిన నగరవాసులు ఒంటి నిండా ఆభరణాలు ధరించి...శోభాయమానంగా గణపతి మండపాల నుంచి నిమజ్జనం ఘాట్ వరకు జరిగే నిమజ్జన యాత్రలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కనబడతారు. ఇదే అదునుగా భావించి జనాల మధ్యలోనే దొంగలు తమ పనికానిచ్చే అవకాశముంది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి దాదాపు 12కు పైగా ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. వీరిలో కొందరు పోలీసు డ్రెస్సులోనే విధులు నిర్వహిస్తుండగా, మరికొందరు మఫ్టీలో నిఘా వేయనున్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ... కమిషనరేట్లలోని ముఖ్యకూడళ్ల నుంచి హుస్సేన్‌సాగర్ వరకు జరిగే వినాయక శోభాయాత్రను బలగాల పహారాతో పాటు నిఘా నేత్రాలతో నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గణేశ్ శోభ యాత్రను అధికారులు వీక్షిస్తూ ఎప్పటికప్పుడూ స్థానిక పోలీసు సిబ్బందికి మార్గనిర్దేశనం చేస్తారు. ఈ నిమజ్జన యాత్రల్లో లక్షలాది మంది భక్తుల పూజలతో వేలాది వినాయకులు తరలివస్తాయి. పోలీసులు జంక్షన్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటుచేసిన నిఘా నేత్రాలతో ఆయా ప్రాంతాల్లో గణేశుడి నిమజ్జన ర్యాలీల పర్యవేక్షణ కోసం పోలీసులు ఉపయోగిస్తున్నారు. సీసీకెమెరా మౌంట్ వెహికల్లను, ఆశ్విక దళాలను ఇప్పటికే భద్రత కోసం వినియోగిస్తున్నారు. -
12 మంది ఆకతాయిల అరెస్ట్
కౌన్సెలింగ్ చేసిన ఏసీపీ ఈశ్వర్రావు వరంగల్ : హన్మకొండ కిషన్‌పుర ప్రాంతంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవరిస్తున్న 12 మంది యువకులను శుక్రవారం రాత్రి షీ టీమ్ అదుపులోకి తీసుకున్నట్లు విభాగం ఇన్చార్జీ ఏసీపీ ఈశ్వర్రావు తెలిపారు. గత కొద్దిరోజులుగా కిషన్‌పుర వాగ్దేవి కాలేజీ పరిసర ప్రాంతాల్లోని వసతి గృహాల వద్ద ఆకతాయి యువకులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, కాలేజీకి వస్తున్న యువతులను అడ్డగిస్తున్నారన్న సమాచారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ (94910 89257)కు ఎస్ఎంఎస్గా వచ్చాయన్నారు. వీటిని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు షీ టీమ్ విభాగానికి సమాచారమిచ్చారు. దీంతో శుక్రవారం రాత్రి రంగంలోకి దిగిన షీ టీమ్ 12 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిలో వంగాల వినయ్‌రెడ్డి, భూక్యా క్రాంతి, దాసరి హరికృష్ణ, ఐలా రాహుల్, కుంభం మహేష్, మల్లా పుర్ణాకర్, ఎండి.ఆసిఫ్ ఉన్నట్లు తెలిపారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చినట్లు వెల్లడించారు. అరెస్టయిన అకతాయిలకు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే ఏసీపీ శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని, వారిపై నిర్భయలాంటి కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. కౌన్సెలింగ్ కార్యక్రమంలో షీ టీం ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మీతోపాటు శ్రీనివాస్, రమణ, వనజ పాల్గొన్నారు. -
షీ టీమ్‌కు చిక్కిన ఆకతాయి
తాండూరు: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఆకతాయిని షీటీమ్ అదుపులోకి తీసుకున్నట్లు తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ప్రకారం... తాండూరు మండలంలోని బిజ్వార్ గ్రామానికి చెందిన రాజేందర్‌రెడ్డి(28) బుధవారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో అమ్మాయిలు, మహిళలకు సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో షీ టీమ్‌కు మహిళలు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన షీ టీమ్ ఆకతాయిని అదుపులోకి తీసుకొని అర్బన్ ఠాణాకు తరలించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ వెంకట్రామయ్య వివరించారు. -
ప్రత్యేక చట్టం అవసరం
► ప్రభుత్వానికి ప్రతిపాదించిన ‘షీ టీమ్స్’ అధికారులు ► తమిళనాడు తరహా ముసాయిదా సమర్పణ ► ఈవ్టీజర్ల ఆట కట్టించేలా రూపకల్పన ► న్యాయ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైలు సాక్షి, హైదరాబాద్: రోడ్లపై పోకిరీల మొదలు అదును చూసి కాటేస్తున్న నయవంచకుల వరకు.. ఎందరో మృగాళ్ల బారినుంచి అతివల్ని రక్షిస్తున్నాయి షీ టీమ్స్ ఈ టీమ్స్ అమలులోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికే గణనీయమైన ఫలితాలు సాధిస్తున్న ఈ బృందాల పని తీరును మరింత మెరుగుపరచడంతో పాటు మహిళలకు పూర్తి స్థాయి భరోసా ఇవ్వడానికి ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈవ్‌టీజర్లకు కఠిన శిక్షలు పడేలా చేయడానికి ప్రత్యేక చట్టం అవసరమని నిర్ణయించారు. తమిళనాడు తరహాలో రూపొందించిన ‘తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ యాక్ట్’ ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించారు. చిక్కుతున్నా చిన్న కేసులే: బహిరంగ ప్రదేశాల్లో మహిళ ల్ని వేధిస్తున్న పోకిరీలను నిత్యం ‘షీ టీమ్స్’ పట్టుకుంటున్నా... తీవ్రత, ఆధారాలు ఉంటే తప్ప అందరి పైనా ఐపీసీతో పాటు నిర్భయ, యాంటీ ర్యాగింగ్ యాక్ట్‌ల ప్రకారం కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. దీంతో ఏడాదిలో సీసీఎస్ ఆధీనంలోని ‘షీ టీమ్స్’కు చిక్కిన 281 మందిలో 126 మందిపై చిన్న (పెట్టీ) కేసులు, నామమాత్రపు జరిమానాతో సరిపెట్టాల్సి వచ్చింది. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ రెండోసారీ చిక్కిన ఓ వ్యక్తితో పాటు తీవ్రమైన స్థాయిలో రెచ్చిపోయిన వారిపైనే కేసులు నమోదు చేయగలిగారు. ప్రత్యేకంగా ఉంటేనే... ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న సీసీఎస్ ఉన్నతాధికారులు ఈవ్ టీజర్లను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ప్రత్యేక చట్టం అవసరమని భావించారు. దీంతో పలు ప్రాంతాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేశా రు. చివరకు తమిళనాడులో ఉన్న చట్టం ఉపయుక్తంగా ఉందని నిర్థారించారు. ఈవ్ టీజింగ్ బారినపడి పలువురు అతివలు గాయపడటం, కొందరు మరణించడం సైతం జరగడంతో అక్కడి సర్కారు 1998లోనే ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ ఏడాది జూలై 30 ఆర్డినెన్స్ రూపంలో, కొన్ని నెలలకే చట్టంగా అమలులోకి వచ్చిన ఈ యాక్ట్ మంచి ఫలితాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అక్కడి చట్టంలోని అంశాలతో పాటు మరికొన్ని అంశాలను చేరుస్తూ ఉన్నతాధికారులు ఓ ముసాయిదా రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ప్రస్తుతం న్యాయ మంత్రిత్వ శాఖ వద్ద ఈ ఫైల్ పెండింగ్‌లో ఉంది. ముసాయిదాలో ముఖ్యాంశాలివీ... 1. బహిరంగ ప్రదేశాలు, పని చేసే ప్రాంతాలు, మాల్స్... ఇలా ఎక్కడైనా ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ చిక్కిన పోకిరీలపై నేరం నిరూపణైతే ఏడాది జైలు లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండూ పడతాయి. 2. ఈవ్‌టీజింగ్ చేయడానికి పోకిరీలు వాహనాలు ఉపయోగిస్తే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకోవచ్చు 3. దేవాలయాలతో పాటు మాల్స్, సినిమా హాల్స్, విద్యాసంస్థలు తదితర చోట్ల జరిగే ఈవ్ టీజింగ్‌ను నిరోధించాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులపై ఉంటుంది. అలాంటి సమాచారాన్ని తక్షణం సంబంధిత పోలీసులకు చేరవేయాల్సిందే. 4. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ నేరానికి యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయవచ్చు. వీరికి న్యాయస్థానం జరిమానా విధించే అవకాశం ఉంటుంది. -
మహిళల రక్షణే ప్రధాన ధ్యేయం
నడిగూడెం: మహిళల రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నట్లు షీ టీమ్ జిల్లా ఇన్చార్జ్ సునితా మోహన్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎస్పీ దుగ్గల్ ఆదేశాల మేరకు జిల్లాలో నిత్యం 50 షీ టీమ్ బృందాలు పాఠశాలలు, కళాశాలలు, కూడలుల వద్ద పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా మానసికంగా, ఫోన్ల ద్వారా వేధిస్తే నేరుగా 100 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 200 ఫిర్యాదులు ఫోన్ల ద్వారా వచ్చాయన్నారు. వాటిలో 45 ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకున్నామన్నారు. మిగతా వారికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. అనంతరం సూర్యాపేట డీఎస్పీ రశీద్ మాట్లాడారు. చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టాలు కూడా కఠినంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్స్‌పాల్ ఎం.పవన్ కుమార్, స్థానిక సర్పంచ్ నూనె ఇందిరా నాగన్న, ఎస్సై బిల్లా కిరణ్ కుమార్, ప్రిన్స్‌పాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి నర్సిరెడ్డి, అద్యాపకులు సం ఘం రాష్ట్ర కార్యదర్శి అశోక్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారులు ఆవుల వెంకన్న, కర్నాటి శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నల్లగొండలో షీ టీం టెలీఫిల్మ్..
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన 'షీ టీం' విస్తృత ప్రచారం కల్పించేందుకు ఒక 'టెలీఫిల్మ్'ను రూపొందిచారు. నల్లగొండ పట్టణంలో ఆదివారం మహిళలకు షీ టీంను చేరువ చేసేందుకు ఒక టెలీఫిల్మ్‌ను తీశారు. ఈ ఫిల్మ్ షూటింగ్‌ను ఎస్బీ డీఎస్పీ లక్ష్మీ ప్రారంభించారు. ఈ టెలీఫిల్మ్ ద్వారా మహిళలను చైతన్య పరచవచ్చని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
మహిళకు కక్ష్యాబంధన్
ఈ కాలంలో అమ్మాయి బయటకెళ్లిందంటే చాలు... అమ్మా నాన్నలకు మది నిండా గుబులే... మొన్నటికి మొన్న దేశ రాజధానిలో ‘నిర్భయ’ ఘటన... నిన్న హైదరాబాద్‌లో ‘అభయ’ ఉదంతం... తాజాగా మళ్లీ ఢిల్లీలో ఒంటరి మహిళపై ఉబర్ ట్యాక్సీ డ్రైవర్ బరితెగింపు! అతివలకు ఇది కాని కాలమే! అదృష్టమేమిటంటే... కాలం మారుతోంది. అనుభవాల పాఠాలు టెక్నాలజీలుగా మారుతున్నాయి! నింగిలోని 24 ఉపగ్రహాల జీపీఎస్ వ్యవస్థే మహిళకు రక్ష... రక్ష.. రక్ష అంటున్నాయి! పద్దెనిమిది నిమిషాలకు ఓ మానభంగం.. గంటకో కిడ్నాప్.. చెప్పుకునేందుకు సిగ్గుపడాల్సిన గణాంకలివి. తప్పొప్పుల లెక్క కాసేపు పక్కనబెడితే నిర్భయ లాంటి సంఘటనలను నివారించేందకు టెక్నాలజీ ఎంతో సాయపడుతుందన్నది మాత్రం వాస్తవం. అందరికీ స్మార్ట్ఫోన్లు వాటిల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అందుబాటులో ఉండటం ఒక కారణమైతే... అప్లికేషన్లను అభిద్ధి చేయడం కూడా సులువైపోవడం మరో కారణమవుతోంది. అప్లికేషన్లను ఓపెన్ చేసి... అవసరమైన బటన్లు చూసుకుని నొక్కాల్సిన అవసరమూ లేకుండా కొన్ని అప్లికేషన్లు కేవలం... స్మార్ట్‌ఫోన్‌ను గట్టిగా అటుఇటూ కదిలిస్తే లేదంటే.. గట్టిగా అరచినా... ఆప్తులకు మీరున్న ప్రాంతపు సమాచారం అందించేలా అప్లికేషన్లు ఉన్నాయి. ఉమన్ సేఫ్టీ షీల్డ్ ప్రొటెక్షన్: అత్యవసర పరిస్థితుల్లో ఆప్తులకు సమాచారం పంపడంతోపాటు మీరున్న ప్రాంతం తాలూకూ ఫొటోలు తీసి పంపగలగడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత. దీంట్లో ఉన్న ‘వాక్ విత్ మీ’ ఫీచర్ ద్వారా మీరు ఏ రూట్ ద్వారా ఎక్కడికి వెళ్లిందీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పుకార్... ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు... జీపీఎస్ ట్రాకర్‌లా మారిపోయి... మీ సమాచారాన్ని ముందుగా నమోదు చేసిపెట్టుకున్న ఐదు కాంటాక్ట్స్‌కు పంపడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత. ప్రస్తుతానికి ఇది రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తుంది. పోలీస్ కంట్రోల్ రూమున్న ప్రాంతాన్ని సిటీమ్యాపులో చూపుతుంది కూడా. టోటెమ్ ఎస్ఓఎస్: పోలీస్ కంట్రోల్ రూమ్‌కు డయల్ (100) చేయడంతోపాటు పదిసెకన్లు ఒకసారి ఫొటోలు తీయడం, ఆడియో రికార్డు చేయడం టోటెమ్ ఎస్ఓఎస్ అప్లికేషన్‌లోని ప్రధాన ఫీచర్లు. మూడు బటన్లు ఉండే ఈ అప్లికేషన్లో ఎరుపు బటన్‌ను ప్రెస్ చేసిన వెంటనే కంట్రోల్ రూమ్‌కు కాల్ వెళుతుంది. ఎల్లో బటన్ ప్రెస్ చేస్తే మీ జీపీఎస్ లొకేషన్.. మీరు ముందుగా స్టోర్ చేసి పెట్టుకున్న కాంటాక్ట్స్‌కు నిర్దిష్ట వ్యవధిలో వెళుతూ ఉంటాయి. రక్ష: అప్లికేషన్‌ను ఆన్ చేసి.. బటన్లు వెతుక్కునే పని లేకుండా కేవలం వాల్యూమ్ బటన్‌ను ప్రెస్ చేసి పట్టుకుంటే పనిచేసే అప్లికేషన్ ఇది. పోలీసులకు (100) కాల్ చేయడంతోపాటు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్ తాలూకూ వివరాలను గూగుల్ మ్యాప్‌పై చూపుతుంది. ఐగో సేఫ్లీ: ఫోన్‌ను వేగంగా అటుఇటూ కదిపితే చాలు... మీరు ప్రమాదంలో ఉన్నట్లు వెంటనే బంధు మిత్రులకు సమాచారం పంపే సౌకర్యమున్న అప్లికేషన్ ఇది. లేదీ హెడ్‌ఫోన్ పిన్ను డిస్కనెక్ట్ చేసినా సరిపోతుంది. మీరు ఆఫ్ చేసేంతవరకూ ప్రతి నిమిషం జీపీఎస్ లొకేషన్, ఇతర వివరాలు బంధు మిత్రులకు వెళుతూనే ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో చేసిన 30 సెకన్ల ఆడియో రికార్డింగ్ కూడా మీ లిస్ట్‌లోని వారికి ప్రసారమవడం విశేషం. సేఫ్‌లెట్... ఈ బ్రేస్లెట్... బ్లూటూత్‌తో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ఆపత్కాలంలో బ్రేస్‌లెట్‌కు రెండువైపులా ఉన్న బటన్స్‌ను నొక్కితే చాలు.. మీరు ముందుగా స్టోర్ చేసి పెట్టుకున్న కాంటాక్ట్స్‌కు ఎస్ఎంఎస్ వెళుతుంది. అవసరమైతే పోలీసులకూ అలర్ట్ పంపవచ్చు. మీరు బటన్ నొక్కిన వెంటనే స్మార్ట్‌ఫోన్‌లోని మైక్రోఫోన్ పనిచేయడం మొదలవుతుంది. శబ్దాలను రికార్డు చేస్తుంది. లీఫ్ సేఫర్: ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు తయారు చేసిన లేటెస్ట్ సేఫ్టీ టెక్నాలజీ ఇది. చూసేందుకు నెక్లెస్ మాదిరిగా ఉన్నా... ఇది సేఫ్‌లెట్ మాదిరిగానే పనిచేస్తుంది. బంధుమిత్రులతోపాటు... మీరున్న ప్రాంతంలో ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తున్న వారికీ అలర్ట్‌లు పంపడం దీని ప్రత్యేకత. జ్ట్టిఞట://ఠీఠీఠీ.్ఛ్చజఠ్ఛ్చీట ్చఛ్ఛట.ఛిౌఝ/ వెబ్సైట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. జీపీఎస్ పనిచేసేదిలా... గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.. కుప్తంగా జీపీఎస్ మానవ మేధ సృష్టించిన అద్భుతాల్లో ఒకటని చెప్పేందుకు అనుమానమే అక్కరలేదు. అగ్రరాజ్యం అమెరికా తన మిలటరీ అవసరాల కోసం అభివృద్ధి చేసుకున్నా... ప్రస్తుతం ఈ వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం మొదలుకొని... పర్యావరణ పరిరక్షణ వరకూ అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. జీపీఎస్‌లో స్పేస్, కంట్రోల్, యూజర్ సెగ్మెంట్లని మూడు భాగాలుంటాయి. మొదటి రెండింటిని అమెరికా ప్రభుత్వం పర్యవేక్షిస్తూంటుంది. స్పేస్ సెగ్మెంట్లో దాదాపు 24 ఉపగ్రహాలుంటాయి. భూమికి దాదాపు 20 వేల కిలోమీటర్ల ఎత్తులో తిరుగు తూంటాయి. ఒక్కో ఉపగ్రహం రోజుకు రెండుసార్లు ప్రత్యేక కక్ష్యలో భూమిని చుట్టేస్తూంటాయి. అంతేకాకుండా ఇవి నిరంతరం రేడియో సంకేతాల ద్వారా తమ స్థానం, సమయం వంటి వివరాలను ప్రసారం చేస్తూంటాయి. ఈ 24 ఉపగ్రహాల స్థానం, కక్ష్యల ఫలితంగా భూమ్మీద మనకు ఏ క్షణంలోనైనా కనీసం మూడు ఉపగ్రహాల సంకేతాలు అందుబాటులో ఉంటాయి! మన స్మార్ట్ఫోన్లతోపాటు కొన్ని ప్రత్యేకమైన పరికరాల్లో ఈ జీపీఎస్ సంకేతాలను అందుకునే సౌకర్యం ఉంటుంది. కాంతివేగంతో ప్రసారమయ్యే జీపీఎస్ సంకేతాలను అందుకునే స్మార్ట్ఫోన్లు.. ఆ సమయాన్ని నమోదు చేసుకుని... ఆ ఉపగ్రహానికి, తనకూ మధ్య ఉన్న దూరాన్ని లెక్కవేస్తాయి. కనీసం మూడు ఉపగ్రహాల నుంచి ఉన్న దూరాన్ని లెక్కవేస్తే...ఆ స్మార్ట్‌ఫోన్ లేదా జీపీఎస్ రిసీవర్ భూమ్మీద ఏ అక్షాంశం, రేఖాంశంపై ఏ స్థానంలో ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది. ఆప్స్ డౌన్లోడింగ్ ఇలా... స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసేవి దాదాపుగా 90 శాతం వరకూ ఉన్నాయి. ఐఫోన్, విండోస్ ఫోన్లలో కొన్ని ఆండ్రాయిడ్ ఓఎస్‌తోనూ పనిచేస్తాయి. మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుతూంటే అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్ (జ్ట్టిఞట://ఞ్చడ.జౌౌజ్ఛ.ఛిౌఝ) వెబ్‌సైట్‌కు వెళ్లండి. హోమ్ పేజీలో ఎడమవైపు పైభాగంగా ఆప్స్, మూవీస్, గేమ్స్, బుక్స్, న్యూస్‌స్టాండ్, డివెజైస్ అన్న ఆప్షన్లు కనిపిస్తాయి. ఆప్స్‌పై క్లిక్ చేస్తే... స్మార్ట్‌ఫోన్‌లో మన పనులు సులువు చేసే అనేకానేక అప్లికేషన్లు కనపడతాయి. మీకు కావాల్సిన అప్లికేషన్ పేరును, లేదా కీవర్డ్స్‌ను సెర్చ్ బార్ (పైభాగంలో భూతద్దం గుర్తు ఉన్నచోటు)లో టైప్ చేస్తే కింది భాగంలో అవి కనిపిస్తాయి. నచ్చిన అప్లికేషన్‌ను క్లిక్ చేస్తే ముందుగా పర్మిషన్స్ (మీ వివరాలు సేకరించేందుకు ,వాడుకునేందుకు అనుమతి) కోరుతూ ఒక బాక్స్ ప్రత్యక్షమవుతుంది. యాక్సెప్ట్ ఆప్షన్‌ను నొక్కితే అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్లోడ్ అవడం మొదలవుతుంది. డౌన్లోడింగ్ పూర్తయిన తరువాత ఫోన్లోని ఆప్స్ బాక్స్‌లో ఉన్న ఐకాన్‌ను నొక్కి పట్టుకుని హోం స్క్రీన్‌పైకి తెచ్చుకోండి. దీంతో అప్లికేషన్ మీరు ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లెక్క! - గిళియార్ ‘‘జంట నగరాల్లో మహిళల భద్రత కోసం షీ టీమ్ అనేక టెక్నాలజీలను వాడుతోంది. హాక్ఐ పేరుతో హైదరాబాద్ పోలీసులు అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ వీటిల్లో ఒకటి మాత్రమే. దీంతోపాటు షీటీమ్ ఓ ఫేస్బుక్ పేజీ (జ్ట్టిఞట://ఠీఠీఠీ.జ్చఛ్ఛిఛౌౌజు.ఛిౌఝ/ టజ్ఛ్ట్ఛ్చిఝజిడఛీ) ని కూడా నిర్వహిస్తోంది. మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో పోస్ట్ చేయవచ్చు. వెంటనే తగిన చర్యలు చేపడతాం. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ‘100’ నెంబరుకు ఫోన్ చేస్తే చాలు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న పోలీస్ వాహనం వెంటనే రంగంలోకి దిగుతుంది. ఆదుకునే ప్రయత్నాలు మొదలుపెడుతుంది. వీటితోపాటు నగరంలో ప్రజలు రవాణా కోసం ఉపయోగించే వాహనాలన్నింటిలో (ఆటోలు, బస్సులు, ట్యాక్సీలు వగైరా..) జీపీఆర్ఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగా మోటార్ వెహికల్స్ చట్టంలో మార్పులు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాము. ఇది అమల్లోకి వస్తే.. నేర నియంత్రణ మరింత సులువు అవుతుంది.’’ - స్వాతి లక్రా, షీటీమ్, ఏసీపీ హైదరాబాద్ -
'తప్పుడు కేసుతో జీవితం నాశనమయ్యింది'
హైదరాబాద్: పోలీసుల నిర్వాకం కారణంగా తన జీవితం నాశనమయ్యిందిని కూకట్పల్లి హైదర్‌నగర్‌కు చెందిన ఓ అధ్యాపకుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా షీ టీమ్ పోలీసులు అనవసరంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. బుధవారం బాధితుడు మల్గీ ధన్‌శెట్టి తన భార్య పరమేశ్వరి, తల్లి కళావతితో కలిసి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. వివరాల్లోకి వెళితే కూకట్పల్లి హైదర్‌నగర్‌కు చెందిన మల్గీ ధన్‌శెట్టి కొన్నేళ్లుగా నగరంలోని పలు ప్రముఖ కళాశాల్లో కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకునిగా పనిచేశారు. గత జనవరి 12వ తేదీన నాంపల్లి నుంచి కూకట్పల్లి వెళ్లేందుకు బైక్‌పై వెళుతుండగా ఫోన్ రావడంతో లక్డీకపూల్ బస్టాప్ సమీపంలో బైక్ ఆపి సెల్లో మాట్లాడుతుండగా, అక్కడే ఉన్న ఓ మహిళ ( మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ) తనను లిఫ్ట్ అడిగినట్లు తెలిపారు. ఫోన్లో మాట్లాడడం పూర్తయిన తర్వాత ఆమె వద్దకు వెళ్లి అమ్మా లిఫ్ట్ అడిగారు కదా వస్తారా అని కోరినట్లు తెలిపారు. దీంతో అదే సమయంలో వచ్చిన మరో కానిస్టేబుల్ వచ్చి మహిళలను టీజ్ చేస్తున్నారని ఆరోపిస్తూ సీసీఎస్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే పోలీసులకు తాను అలాంటి వాడిని కాదనీ, ఉన్నతాధికారులకు తన వ్యక్తిగత వివరాలు అందించడంతో అప్పటికి వదిలేశారన్నారు. వారం రోజుల తర్వాత సీసీఎస్ పోలీసులు మళ్లీ కాల్ చేసి పీఎస్‌కు రావాలని చెప్పారన్నారు. స్టేషన్‌కు వెల్లిన తనను నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరపరిచినట్లు తెలిపారు. అంతేగాకుండా నేరం ఒప్పుకుని ఫైన్ చెల్లిస్తే కేసు నుంచి బయటపడతావని లేకుంటే శిక్ష పడుతుందని బెదిరించారని తెలిపారు. మెట్రోపాలిటన్ కోర్టు తీర్పుపై సెషన్ కోర్టును ఆశ్రయించగా, కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాను చెల్లించిన ఫైన్‌ను రీఫండ్ చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు. అయితే కొందరు పోలీసుల వైఖరి కారణంగా తన అధ్యాపక జీవితం పూర్తిగా నాశనమయ్యిందన్నారు. -
మా తప్పు కూడా ఉంది: అస్మిత
హైదరాబాద్: తనను వేధించిన పోకిరీలపై తాను ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు స్పందించడం అభినందనీయమని టీవీ నటి అస్మిత అన్నారు. తనను వేధించిన ఇద్దరు ఆకతాయిలు అరెస్ట్ అయ్యారన్న సంగతి మీడియా ద్వారానే తెలిసిందని ఓ టీవీ చానల్ తో చెప్పారు. తనను వేధించిన పోకిరీలను తన కారులోంచి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశానని ఆమె వెల్లడించారు. అలాగే 'షీ' వెబ్ సైటులోనూ పెట్టానని చెప్పారు. అవేర్ నెస్ పెంచాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశానని అన్నారు. ఇంతకుముందు రెండుమూడు సార్లు పోకిరీల బారిన పడ్డానని అప్పుడు ఏమీ చేయలేకపోయానని వెల్లడించారు. గత అనుభవాల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటున్నానని చెప్పారు. ఈ క్రమంలో బైకుపై వెళుతూ తనను వేధించిన ఇద్దరు ఆకతాయిల ఫోటోలు తీశానని వివరించారు. తాను ఫోటోలు తీస్తున్నానన్న భయం లేకుండా నవ్వుతూ ఫోజులు పెట్టారని, అందుకే వారి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టానని తెలిపారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని అన్నారు. తమవైపు నుంచి కూడా తప్పు ఉందని వ్యాఖ్యానించారు. పోకిరీల బారిన పడుతున్న మహిళలు ఫిర్యాదు చేయకపోవడంతో వారి ఆటలు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని అస్మిత సూచించారు. -
ఒక్క ఫోన్ చేసుంటే...
నీరజ కృష్ణవేణి... ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ నేపథ్యంలో సాక్షి ‘ఫ్యామిలీ’... షీ-టీమ్‌తో మాట్లాడింది. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఆకతాయిలను కట్టడి చేసేందుకు గత ఏడు నెలలుగా పనిచేస్తున్న ‘షీ టీమ్’కు నీరజ ఒక్క ఫోన్‌కాల్ చేసి ఉంటే ఈరోజు ఆమె పరిస్థితి ఇలా ఉండేది కాదంటున్నారు ఆ టీమ్‌లకు నేతృత్వం వహిస్తున్న అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా. మేమున్నదందుకే! ఒకే ఒక్క ఫోన్ కాల్... 100 నెంబర్‌కి ఫోన్ చేసి షీటీమ్‌తో మాట్లాడాలని చెబితే చాలు... మాకు చెప్పిన విషయాలన్నింటినీ గోప్యంగా ఉంచి ఇబ్బంది పెడుతున్నవారి నుంచి ఎలాంటి ముప్పులేకుండా చేస్తాం. షీటీమ్ లక్ష్యం కూడా అదే. మాకు ఇప్పటి వరకూ కాల్ చేసినవారిలో యాభైశాతం నీరజలాంటి వారే. ప్రేమ పేరుతో ఏడాదిగా వేధిస్తున్నారని, ఆరు నెలలుగా వేధిస్తున్నారని, నాలుగురోజులుగా వెంటపడుతున్నారని... ఇలా అమ్మాయిల నుంచి వస్తున్న ఫిర్యాదులు తీసుకుని మా టీమ్‌లు గుట్టుచప్పుడు కాకుండా నిందితులను ఇంటరాగేట్ చేసి అమ్మాయిలకు ఎలాంటి సమస్యలూ లేకుండా చేస్తున్నాయి. ఇంటరాగేషన్ అంటే... అబ్బాయిలకు కౌన్సెలింగ్ మొదలు పనిష్మెంట్ల వరకూ అన్నీ ఉంటాయి. చాలామంది అమ్మాయిలు మంచికి పోయి ‘పట్టించుకోకపోతే వదిలేస్తారులే..’ అనే భావనతో కూడా మౌనంగా భరిస్తుంటారు. అలాంటివారు ఇంట్లో చెప్పక్కర్లేదు... మాతో చెబితే చాలు మా డ్యూటీ మేం చేస్తాం. ‘అమ్మాయి నోరు విప్పి చెప్పుకోలేదు, తల్లిదండ్రులకు తెలిసినా నలుగురికీ చెప్పుకోలేరు... ఇక మమ్మల్ని ఎవరేం చేస్తారు?’ అనే ధైర్యంతో రెచ్చిపోతున్న అబ్బాయిల మనస్తత్వం మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్న మాకు నీరజ ఫోన్ చేసి ఉంటే కచ్చితంగా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. నగరంలో దాదాపు 500 షీటీమ్లున్నాయి. ఒక్కో టీమ్‌లో ఐదుగురు సభ్యులున్నారు. కనీసం తల్లిదండ్రుల నుంచి మాకు ఫిర్యాదు అందినా చాలు, వెంటనే రంగంలోకి దిగుతాం. గుట్టుగా ఉంటే పరిష్కారం అయ్యే సమస్యలు కావివి. మేమున్నది ఇలాంటి సంఘటనలు జరగ క్కుండా చూసుకోడానికే. వేధింపులకు పాల్పడేవారి నుంచి కాపాడటానికి తల్లిదండ్రులతో పాటు షీటీమ్ కూడా ఉందన్న విషయాన్ని నీరజ లాంటివారు గుర్తించాలి. కాకపోతే వారి నుంచి మేం ఆశిస్తున్నది ఒక్కటే.. 100 నంబర్‌కు ఒక్క ఫోన్ కాల్. ...::: భువనేశ్వరి అది యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్! మానసిక రుగ్మతల కోణం నుంచి చూస్తే నీరజపై దాడికి పాల్పడ్డ వ్యక్తికి ‘యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్’ ఉందని భావించవచ్చు. మామూలు మానసిక రుగ్మతలు ఉన్నవారు అవతలివారిపై ఇంత ఉగ్రంగా (ఎగ్రెషన్‌తో) ప్రవర్తించలేరు. అలా వ్యవహరించారంటే వారిలో అసాంఘిక ధోరణి ఎక్కువగా ఉందని అర్థం. ఇలాంటి వ్యక్తులకు అవతలివారి బాధలపై స్పందన ఉండదు. ఎవరి విషయంలోనూ సహానుభూతితో ఉండలేరు. తాము అనుకున్న లక్ష్యం పూర్తికావడమే వారికి ముఖ్యం. -
‘షీ’కి చిక్కారు
* వారంలో 40 మంది ఈవ్‌టీజర్లపై కేసు * ఈవ్‌టీజర్లపై కఠిన చర్యలు: స్వాతిలక్రా సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కోసం నగర పోలీసులు రంగంలోకి దింపిన ‘షీ’ టీమ్‌లకు వారంలో 40 మంది ఈవ్‌టీజర్లు పట్టుబడినట్లు అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతిలక్రా తెలిపారు. తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ‘షీ’ టీమ్స్ పనితీరు, ఈవ్టీజర్ల వివరాలను వెల్లడించారు. గత నెల 24న పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి వంద మంది పోలీసులతో‘ షీ టీమ్’లను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ టీమ్‌లు ఉద యం, సాయంత్రం వేళ్లల్లో కళాశాలలు, షాపింగ్ సెంటర్లు, రైల్వే, బస్సు స్టేషన్ల వద్ద కాపు కాశాయి. 40 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకుని పిటి కేసు నమోదు చేసి వారి కుటుంబీకుల సమక్షంలో సీసీఎస్ పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. నిందితుల్లో ఎక్కువ మంది యువకులు, ఇంటర్ విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ డీసీపీ పాలరాజు, అదనపు డీసీపీ రంజిత్త్రన్కుమార్, ఏసీపీ కవిత ఉన్నారు. ఈ మేరకు ‘షీ టీమ్స్ మీ వెంటే ఉన్నాయి, ఆపదలో ఉంటే వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేయండి’ అనే వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. షీ టీమ్‌లు ఈవ్టీజర్ల ఆట కట్టించడమే కాకుండా ఫిర్యాదులు చేసే విధంగా మహిళలలో ధైర్యం కల్పిస్తున్నారు. ఈవ్‌టీజింగ్ బారిన పడితే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని నగర పోలీసులు ఎంఎంటీఎస్ రైలు ఎక్కి మహిళలు, విద్యార్థినులను కలిసి భరోసా ఇస్తున్నారు. ఈవ్‌టీజర్లతో అవగాహన తరగతులు.. ఈవ్‌టీజింగ్‌ను మరింత కట్టడి చేసేందుకు పట్టుబడిన వారితో ఆయా కళాశాలలో అవగాహన తరగతులు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తాము ఈవ్ టీజింగ్ చేయడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయి, దాని వల్ల పోయిన పరువు, ఎంత నష్టం కలుగుతుందో స్వయంగా వివరించేందుకు నిందితులు అంగీకరించారు. ఇలా పట్టుబడ్డారు... 20 ఏళ్ల ఓ యువకుడు మెహిదిపట్నం బస్టాప్‌లో నిల్చున్నాడు. అక్కడికి వచ్చే ఏ బస్సు ఎక్కలేదు.ప్రయాణిలకు చూస్తూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ షీ టీమ్‌కు చిక్కాడు. సికింద్రాబాద్‌లో ఓ యువకుడు బస్సులోకి మహిళలు ఎక్కే ముందు డోర్ నుంచి ఎక్కడం, వారికి తగలడం చేస్తూ షీ టీమ్స్‌కు పట్టుబడ్డాడు. అమీర్‌పేటలో ఓ ప్రైవేట్ ఉద్యోగి(36) బస్టాప్‌లో నిల్చున్న మహిళలపై పట్ల అసభ్యకరంగా చూడడంతో పాటు మాట్లాడుతూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి చిక్కాడు.సుల్తాన్బాజర్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఓ వ్యక్తి ఏకంగా మహిళను లాడ్జికి రమ్మని కోరాడు. ఆమె నిరాకరించడం, ఈ దృశ్యం షీ టీమ్స్ కంట్లో పడడంతో అతగాడి ఆటలకు అడ్డుకట్ట వేశారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే చర్యలు: స్వాతిలక్రా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ‘షీ’ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తాయి. మొదటిసారైతే పిటీ కేసుతో పాటు కౌన్సెలింగ్ చేస్తాం. మరోసారి పట్టుబడితే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తాం. -
వేధింపులకు పాల్పడ్డారో.. ఇక అంతే!