విద్యార్థినిని వేధిస్తున్న కండక్టర్‌ అరెస్ట్‌ | Bus Conductor Arrest Student Harrassment Case | Sakshi
Sakshi News home page

విద్యార్థినిని వేధిస్తున్న కండక్టర్‌ అరెస్ట్‌

Published Sat, Mar 24 2018 8:05 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Bus Conductor Arrest Student Harrassment Case - Sakshi

శ్రీనివాస్‌గుప్తా

నాగోలు: బస్సులో ప్రయాణిస్తున్న బీటెక్‌ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక వేధింపులకు పాల్పడుతున్న బస్సు కండక్టర్‌ను వనస్థలిపురం షీ టీమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఎల్‌బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. నాగోలు అయ్యప్ప కాలనీకి చెందిన బాదం శ్రీనివాస్‌గుప్తా అలియాస్‌ బీఎస్‌గుప్తా(50) బండ్లగూడ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. హయత్‌నగర్‌ నుంచి మెహిదీపట్నం వెళ్లే బస్సులో భాగ్యలత ప్రాంతానికి చెందిన బీటెక్‌ విద్యార్థిని రోజు బస్సు ఎక్కే క్రమంలో శ్రీనివాస్‌గుప్తా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతని వేధింపులు శృతిమంచడంతో బాధితురాలు ఈ విషయాన్ని   తల్లికి చెప్పింది. దీనిపై ఆమె గుప్తాను నిలదీయగా దురుసుగా ప్రవర్తించాడు.

శుక్రవారం బస్సు లో మరోసారి అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు వనస్థలిపురం షీ టీమ్‌ వాట్సాప్‌ నెంబర్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న షీటీమ్‌ సభ్యులు నిందితుడిని అ రెస్ట్‌ చేసి కేసులు నమోదు చేసి రిమా ండ్‌కు త రలించారు. కండక్టర్‌ శ్రీనివాస్‌గుప్తా బస్సు లో మహిళలు, విద్యార్థినుల పట్ల అస భ్యంగా ప్ర వర్తిస్తున్నాడని పోలీసులు తెలిపా రు. సమావేశంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ, ఎస్‌ఐ విజయ్, షీ టీమ్‌ ఏఎస్‌ఐ యాద య్య, సుమలత, మహేష్, పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement