Hyderabad: కలల తీరం చేరకుండానే.. రోడ్డు ప్రమాదంలో | BTech student died In Road Accident | Sakshi
Sakshi News home page

Hyderabad: కలల తీరం చేరకుండానే.. రోడ్డు ప్రమాదంలో

Apr 25 2024 3:06 PM | Updated on Apr 25 2024 3:19 PM

BTech student died In Road Accident

వీసా ప్రాసెస్‌లో భాగంగా బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ కోసం వెళ్తున్న బీటెక్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.

బీటెక్‌ విద్యార్థి మృతి 

హైదరాబాద్: వీసా ప్రాసెస్‌లో భాగంగా బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ కోసం వెళ్తున్న బీటెక్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి సత్యనారాయణపురానికి దొంతరి మధుసూదన్‌రెడ్డి, సుష్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు వర్షిత్‌ రెడ్డి (23) బీటెక్‌ పూర్తి చేశాడు. విదేశీ విద్య కోసం అమెరికా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. 

ఇందులో భాగంగా వీసా కోసం నగరంలోని హిమాయత్‌నగర్‌ బ్యాంక్‌లో స్టేట్‌మెంట్‌ కోసం యాక్టివాపై వెళ్తుండగా.. ఉప్పల్‌ కట్టమైసమ్మ దేవాలయం వద్ద ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో వర్షిత్‌ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తాడనుకున్న కుమారుడిని మృత్యువు కబళించడంతో వర్షిత్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement