మహబూబ్‌నగర్: పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కుమ్మిరి గోపాల్ కుమార్తె శ్రీవాణి (19) హైదరాబాద్ మేడ్చల్‌లోని సూర్యనగర్‌కాలనీలో ఉన్న ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదివేది. ఇటీవల ఇంటికి వచ్చి రెండ్రోజులు ఉండి సోమవారం తిరిగి హాస్టల్‌కు వెళ్లింది.
బుధవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కళాశాల నుంచి తండ్రికి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ హైదరాబాద్‌కు బయలుదేరారు. మూడు నెలల కిందట శ్రావణి అక్క వివాహం జరింది. అనంతరం శ్రావణి తల్లి పెబ్బేరు నుంచి కొత్తకోటకు బైక్‌పై వస్తుండగా నాటవెళ్లి సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు బైక్ పైనుంచి పడి అక్కడికక్కడే మృతిచెందింది. మూడు నెలల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment