రన్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
Published Sat, Mar 4 2017 8:12 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: నగర పోలీసులు, షీ టీమ్ కలిసి సంయుక్తంగా ఆదివారం ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు 2కే, 5కే రన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వీవీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను వీవీ విగ్రహం వద్ద మళ్లించి సాధన్, నిరంకారి భవన్‌వైపు అనుమతించనున్నారు. అంబేద్కర్, ఐటీ నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇక్బల్ మినార్ వైపు మళ్లించనున్నారు.
ఇక్బల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ గేట్ సెక్రటేరియట్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద మళ్లించనున్నారు. లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద మళ్లించి బీఆర్‌కేఆర్ భవన్, తెలుగు తల్లి, ఇక్బల్ మినార్ యూ టర్న్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా అనుమతించనున్నారు. కర్బల నుంచి ట్యాంక్ బండ్ మీదుగా అంబేద్కర్ విగ్రహాం వైపు వెళ్లే వాహనాలను చిల్డ్రన్ పార్క్ నుంచి డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్‌వైపు మళ్లించనున్నారు. నల్లగుట్ట నుంచి సంజీవయ్యపార్కు వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంన్ వద్ద మళ్లించి రాణిగంజ్ ఎక్స్‌రోడ్డువైపు అనుమతించనున్నారు. డీబీఆర్ మిల్స్ నుంచి చిల్డ్రన్ పార్కు వైపు వాహనాలను అనుమతించమని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ తెలిపారు. రన్‌లో పాల్గొనేందుకు వచ్చేవారు తమ వాహనాలను మక్తా, ఐమాక్స్ పార్కింగ్, డాక్టర్స్ కారు పార్కింగ్‌లో నిలుపుకోవాలని ఆయన సూచించారు.
Advertisement