6 నెలల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు | Traffic curbs in Jubilee Hills, Banjara Hills | Sakshi
Sakshi News home page

6 నెలల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

Published Tue, Jan 9 2018 4:10 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Traffic curbs in Jubilee Hills, Banjara Hills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఆరునెలల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం - 45 లోని శ్రీహరి ఇంటి నుంచి దుర్గం చెరువు వరకు నాలుగు లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ ను మళ్లిస్తున్నట్టు సీపీ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆంక్షలు ఈ నెల 10 నుంచి జులై 10 వతేదీ వరకు అమలులో ఉన్నాయి. ఆంక్షల నేపథ్యంలో మాదాపూర్ నుంచి రోడ్డు జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోకి వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలు రోడ్డు నెం. 44 మీదుగా NOC పబ్, ఇక్బాల్యా ఇంటర్‌నేషనల్ స్కూల్, ఫెర్నాండేజ్ దవాఖానా, రోడ్డు నెం. 39/44 జంక్షన్ మీదుగా రోడ్డు నెం. 45 లోకి  రావాలి. ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచించారు.


రోడ్డు నెం. 1/12లో 15 రోజులు..

  • బంజారాహిల్స్‌ రోడ్డు నెం-12లోని 1/12 జంక్షన్ నుంచి హిందు శ్మశాన వాటిక వరకు ఎం-40 గ్రేడ్ సీసీ రోడ్డు, ఫుట్‌పాత్ తదితర పనుల కారణంగా 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ ఆంక్షలు 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అమలులో ఉంటాయి.
     
  • మాసబ్‌ట్యాంక్ నుంచి రోడ్డు నెం-12 కు వెళ్లే వాహనాలను 1/12 జంక్షన్‌లో మళ్లిస్తారు. ఈ వాహనాలు 1/10 జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెం-10, జహీరానగర్, క్యాన్సర్ దవాఖాన, ఒడిశా ఐలాండ్ జంక్షన్ మీదుగా రోడ్డు నెం-12 లోకి రావాలి.
     
  • బంజారాహిల్స్ రోడ్డు నెం-13 లో ఒన్‌వేను ఏర్పాటు చేయనున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ నుంచి రోడ్డు నెం.1 లోకి వన్‌వే ఉంటుంది. రోడ్డు నెం. 1/12 జంక్షన్ నుంచి రోడ్డు నెం-13 కు వాహనాల అనుమతి ఉండదు. ఈ రూట్‌లోని వాహనాలను రోడ్డు నెం. 1/10 జంక్షన్, రోడ్డు నెం.10, జహీరానగర్, క్యాన్సర్‌ ఆస్పత్రి, ఒడిశా ఐలాండ్ జంక్షన్, రోడ్డు నెం-12 కు మళ్లిస్తారు.
     
  • రోడ్డు నెం. 45, ఫిలింనగర్, అపోలో హాస్పిటల్‌ నుంచి రోడ్డు నెం.12 మీదుగా వచ్చే వాహనాలు.. ఒడిశా ఐలాండ్ జంక్షన్, క్యాన్సర్‌ ఆస్పత్రి , జహీరానగర్, రోడ్డు నెం-10, రోడ్డు నెం. 1/10 జంక్షన్ నుంచి రోడ్డు నెం-1 లోకి రావాలి.
     
  • ఏసీబీ అఫీస్ నుంచి రోడ్డు నెం.1/12 జంక్షన్‌కు వచ్చే వాహనాలు.. రోడ్డు నెం-13 బంజారాహిల్స్ రోడ్‌ , ఫ్యామిలీ హాస్పిటల్‌ లైన్‌లోకి ట్రాఫిక్‌ను మళ్లిస్తారు.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement