తాండూరు: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఆకతాయిని షీటీమ్ అదుపులోకి తీసుకున్నట్లు తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ప్రకారం... తాండూరు మండలంలోని బిజ్వార్ గ్రామానికి చెందిన రాజేందర్‌రెడ్డి(28) బుధవారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో అమ్మాయిలు, మహిళలకు సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో షీ టీమ్‌కు మహిళలు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన షీ టీమ్ ఆకతాయిని అదుపులోకి తీసుకొని అర్బన్ ఠాణాకు తరలించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ వెంకట్రామయ్య వివరించారు.