యువతికి వేధింపులు.. 76 ఏళ్ల వ్యక్తిపై కేసు | 76-year-old man booked for 'harassing' woman | Sakshi
Sakshi News home page

యువతికి వేధింపులు.. 76 ఏళ్ల వ్యక్తిపై కేసు

Published Sat, May 20 2017 6:47 PM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

76-year-old man booked for 'harassing' woman

హైదరాబాద్‌: తనను వేధిస్తున్న వృద్ధునిపై ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాలివీ.. ఎంబీఏ చదువుకున్న ఓ యువతి(25) మే 18వ తేదీన తన తాతతో కలిసి ఆలయానికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వినోద్‌ దివాన్(76)‌.. ఇద‍్దరినీ తన కారులో ఎక్కించుకుని తీసుకువచ్చి వారి ఇంట్లో దించాడు. ఈ సందర్భంగా అతడు యువతి ఫోన్‌ నంబర్‌ను అడిగి తెలుసుకున్నాడు. ఎక్కడికైనా వెళ్దాం రమ్మంటూ ఆహ్వానించగా ఆమె తిరస్కరించింది. అనంతరం ఆమెకు పలుమార్లు ఫోన్‌ చేసి విసిగించసాగాడు. దీనిపై మనస్తాపం చెందిన బాధితురాలు షీటీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement