చచ్చినోడు తిరిగొచ్చాడు | Man Comes Alive Affter 4 days Of Funeral At Mayiladuthurai | Sakshi
Sakshi News home page

చచ్చినోడు తిరిగొచ్చాడు

Published Tue, Jan 7 2025 1:45 PM | Last Updated on Tue, Jan 7 2025 3:26 PM

Man Comes Alive Affter 4 days Of Funeral At Mayiladuthurai

సేలం: కావేరి నదిలో మునిగి మృతి చెందాడని భావించి అంత్యక్రియలు చేసి దహనం చేయబడిన స్థితిలో ఆ వ్యక్తి ప్రాణాలతో తిరిగి వచ్చిన సంఘటన మైలాడుదురైలో కలకలం రేపింది. మైలాడుదురై జిల్లా తరంగంపాడి తాలూకా మేలప్పాది ప్రాంతంలో గత డిసెంబర్‌ 22వ తేది గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కావేరి నదిలో తేలుతూ కనిపించింది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. అప్పుడు మురుదూర్‌ లక్ష్మీ నారాయణపురానికి చెందిన సెల్వరాజ్‌(62) అని తెలిసింది. దీంతో సెంబనార్‌కోవిల్‌ పోలీసులు సెల్వరాజ్‌ భార్య శాంతిని కలుసుకుని మృతదేహాన్ని గుర్తించమని కోరారు. అనంతరం ఆ మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి తర్వాత శాంతికి అప్పగించారు. 

అనంతరం కుటుంబీకులు సెల్వరాజ్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి దహనం చేశారు.  ఈ స్థితిలో ఆదివారం అకస్మాత్తుగా సెల్వరాజ్‌ మరుదూర్‌ గ్రామానికి తిరిగి వచ్చాడు. చనిపోయాడని భావించిన సెల్వరాజ్‌ ప్రాణాలతో తిరిగి రావడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్పుడు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసి అది సెల్వరాజ్‌గా భావించినట్టు తెలిసింది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement