ఒంట్లో ఓపికలేకున్నా.. బలానంతా కూడదీసుకుని, తానింకా బతికే ఉన్నానని శవపేటిక మూతను తట్టిమరీ కొన ఊపిరితో బయటపడిన బామ్మ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. బతికిందని సంతోషించేలోపే.. అదీ వారంలోపే ఆమె ఉదంతం విషాదాంతం అయ్యింది.
ఈక్వెడార్ బామ్మ బెల్లా మోంటోయా(76) కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఆస్పత్రిలో ఉన్నంత సేపు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నామని, వారం తర్వాత(జూన్ 16న) ఆమె మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక తల్లి మృతిపై గిల్బర్ట్ బార్బెరా స్పందిస్తూ.. తన తల్లి శాశ్వత నిద్రలోకి జారుకున్నట్లు ప్రకటించాడు.
చనిపోయిందనుకుని భావించి జూన్ 9వ తేదీన శవపేటికలో ఉంచి సమాధి చేయబోతుండగా.. శవపేటికను బాది ఆమె ప్రాణాలతో బయపడి అందరినీ ఆశ్చర్యపర్చింది. సుమారు ఐదు గంటలపాటు ఆ బామ్మ శవపేటికలోనే ఉండిపోయింది. శ్వాస అందకపోవడంతో ఇబ్బంది పడిన ఆమెను అప్పటికప్పుడే ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
catalepsy(కండరాలు బిగుసుకుపోవడం) వల్ల ఆమె స్పృహ కోల్పోయి కదల్లేని స్థితిలో అచేతనంగా ఉండిపోయిందని, అలా ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు భావించి ఉంటారని ఆ టైంలో వైద్య నిపుణులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ.. వారం తర్వాత గుండెపోటు రావడంతో కన్నుమూసిందామె. ఏ స్మశానవాటికలో ఆమె బతికిందని సంతోషించారామె.. అదే చోట ఆమెను మళ్లీ ఇప్పుడు సమాధి చేశారు.
Video Credits: Associated Press
ఇదీ చదవండి: రక్తం కారుతున్నా లెక్క చేయకుండా..
Comments
Please login to add a commentAdd a comment