coffin
-
ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది! సరిగ్గా 11 రోజుల తర్వాత..
ఒక్కసారి సమాధి అయితే ఇక అంతే. బతికుండే ఛాన్స్ ఉండదు. అది కూడా బతికుండా సజీవ సమాధి అయినా కూడా అంతే. ఆ టైంలో లక్కీగా ఎవరైనా గమనిస్తే బతికే అవకాశం ఉంటుందేమో గానీ సమాధి అయిన తర్వాత అందుకు అస్సలు అవకాశం ఉండదు. అలాంటిది ఓ మహిళ సమాధి అయినా కూడా.. 11 రోజులు వరకు ప్రాణాల కోసం పోరాడిందట. విషయం తెలుసుకుని చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఆమె సమాది వద్దకు చేరుకుని చూడగా..ఒక్కసారిగా అంతా నిర్ఘాంతపోయారు. ఈ వింత ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బ్రెజిల్‌లోని 37 ఏళ్ల రోసాంజెలా అల్మేడా అనే మహిళ పొరపాటున సజీవ సమాధి అయ్యిందనే విషయం గుప్పుమంది. ఆమె డెత్ సర్టిఫికేట్లో షాక్‌కి గురయ్యి, గుండెపోటుతో మరణించినట్లు ఉంది. దీంతో తాము ఖననం చేసినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే ఆమె సమాధి అయిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్లు ఆ సమాధిలోంచి వింత శబ్దాలు వినిపించాయి. ఓ మనిషి మూలుగు వినిపోస్తుందని అందరూ చెప్పడంతో.. బంధువులు ఆమె చనిపోయిన 11వ రోజున ఆమె సమాధికి వద్దకు చేరుకుని తవ్వడం ప్రారంభించారు. వెలికితీయగా బంధువులంతా అల్మెడాని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె శరీరరం వేడిగా ఉండి శ్వాస తీసుకోవడం చూసి షాక్ తిన్నారు. ఐతే ఇక్కడ జరిగిన మరో షాకింగ్ విషయం ఏంటంటే ఆమెను ఖననం చేసినప్పుడూ వంటిపై గాయాలు లేవు. కానీ ఇప్పుడూ చూస్తే నుదిటిపై మణికట్టుపనై తీవ్ర గాయాలు ఉన్నాయి. కొంతమంది సాక్ష్యుల సైతం ఆమె చనిపోయి ఉండకపోవచ్చని తాము చూసేటప్పటికీ.. ఆమె శరీరం వెచ్చగానే ఉందని చెప్పారు. చిత్రవిచిత్రమైన ట్విస్ట్‌లతో టెన్షన్ రేకెత్తించి ఈ అంశం కాస్త చివరికి విషాదంగా ముగిసింది. అల్మెడా సమాధి నుంచి బయటకు తీసిన తర్వాత సజీవంగా లేకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా అవన్ని పుకార్లు అయ్యి ఉండొచ్చని కొట్టిపారేశారు. ఓ వ్యక్తి సమాధిని తవ్వి ఆమె ఆత్మకు శాంతి చేకూరకుండా భంగం కలిగించినందుకు గానూ ఆయా వ్యక్తులపై అభియోగాలు మోపి పోలీసులు అరెస్టు చేయడం కొసమెరపు. చివరికి విచారణలో అల్మెడాను సజీవంగా పాతిపెట్టలేదని నిర్థారించారు. అవన్నీ ఊహగానాలకింద తేల్చారు పోలీసులు. చివరికి ఈ షాకింగ్ ఘటన అనేక ట్విస్ట్‌లతో బాధకరంగా ముగిసింది. (చదవండి: మనిషి బ్రెయిన్ వేవ్స్‌తో..ఏకంగా "పాట"నే పునర్నిర్మించారు!) -
పాపం.. బతికిందని సంతోషించేలోపే గుండె ఆగింది
ఒంట్లో ఓపికలేకున్నా.. బలానంతా కూడదీసుకుని, తానింకా బతికే ఉన్నానని శవపేటిక మూతను తట్టిమరీ కొన ఊపిరితో బయటపడిన బామ్మ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. బతికిందని సంతోషించేలోపే.. అదీ వారంలోపే ఆమె ఉదంతం విషాదాంతం అయ్యింది. ఈక్వెడార్ బామ్మ బెల్లా మోంటోయా(76) కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఆస్పత్రిలో ఉన్నంత సేపు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నామని, వారం తర్వాత(జూన్ 16న) ఆమె మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక తల్లి మృతిపై గిల్బర్ట్ బార్బెరా స్పందిస్తూ.. తన తల్లి శాశ్వత నిద్రలోకి జారుకున్నట్లు ప్రకటించాడు. చనిపోయిందనుకుని భావించి జూన్ 9వ తేదీన శవపేటికలో ఉంచి సమాధి చేయబోతుండగా.. శవపేటికను బాది ఆమె ప్రాణాలతో బయపడి అందరినీ ఆశ్చర్యపర్చింది. సుమారు ఐదు గంటలపాటు ఆ బామ్మ శవపేటికలోనే ఉండిపోయింది. శ్వాస అందకపోవడంతో ఇబ్బంది పడిన ఆమెను అప్పటికప్పుడే ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. catalepsy(కండరాలు బిగుసుకుపోవడం) వల్ల ఆమె స్పృహ కోల్పోయి కదల్లేని స్థితిలో అచేతనంగా ఉండిపోయిందని, అలా ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు భావించి ఉంటారని ఆ టైంలో వైద్య నిపుణులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ.. వారం తర్వాత గుండెపోటు రావడంతో కన్నుమూసిందామె. ఏ స్మశానవాటికలో ఆమె బతికిందని సంతోషించారామె.. అదే చోట ఆమెను మళ్లీ ఇప్పుడు సమాధి చేశారు. Video Credits: Associated Press ఇదీ చదవండి: రక్తం కారుతున్నా లెక్క చేయకుండా.. -
ఖననం చేసే సమయంలో..శవపేటిక నుంచి శబ్దం అంతే..
ఓ మహిళ చనిపోయిందని వైద్యులు ధృవికరించారు. దీంతో బంధువులు ఆమె కడసారి చూపు కోసం కొద్ది గంటలు ఉంచి ఆ తర్వాత ఖననం చేసేందుకు రెడీ అయ్యారు. ఇంతలో శవపేటికలోంచి తడుతున్న శబ్దం. అంతే ఒక్కసారిగా బంధువులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన ఈక్వెడార్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఈక్వెడార్‌లోని ఒక ఆస్పత్రిలో బెల్లా మోంటోయా అనే 76 ఏళ్ల మహిళ కార్డియాక్ అరెస్టుతో చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. పునరుజ్జీవన ప్రయత్నాలకు స్పందించలేదని నిర్ధారించి మరీ ఆమె మృతిని ధృవీకరించారు. ఆమె జూన్13 ఉదయం ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వగా.. మధ్యాహ్నం చనిపోయినట్లు వైద్యుల ధృవీకరించారని ఆమె కుమారుడు గిల్బర్ రోడోల్ఫో బల్బెరన్ మోంటోయా చెబుతున్నారు. ఆమె కడసారి చూపు కోసం చాలా గంటల సేపు శవపేటికలో ప్రదర్శనగా ఉంచారు. ఇక ఖననం చేసేందుకు తీసుకువెళ్తుండగా..ఒక్కసారిగా శవపేటికను తట్టిన శబ్దం వచ్చింది. దీంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైన బంధువులు శవపేటికను తెరిచి చూడగా..ఆమె ఊపిరి పీల్చుకోవడం కోసం ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. వెంటనే హుటాహుటినా స్ట్రెచ్చర్ తెచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఈక్వెడార్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని బీబీసీ పేర్కొంది. బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ..ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం మెరుగవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, ఆమె సజీవంగా ప్రాణాలతో నాతోనే ఉండాలని కోరుకుంటున్నా అని ఆవేదనగా చెప్పాడు. (చదవండి: అద్భుతం..అంతరిక్షంలో వికసించిన పువ్వు! ఫోటో వైరల్) -
పార్లమెంట్ భవనంపై ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్.. మండిపడ్డ ఓవైసీ
పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్‌పై మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లీమీన్ (ఎమ్ఐఎమ్)నేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చడాన్ని తప్పుబట్టారు. ఈ రకమైన పోలికలు అవసరమా అని ప్రశ్నించారు. ప్రధాని కాకుండా స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగుంటే బావుండేదని అభిప్రాయపడ్డారు. 'ఆర్జేడీకి నిర్దిష్టమైన అభిప్రాయమే ఉండదు. సెక్యులరిజమ్ గురించి మాట్లాడుతుంది.. బీజేపీతో స్నేహం చేసి బయటికి వచ్చిన నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేస్తుంది. పాత పార్లమెంట్‌కు కనీసం అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు కూడా లేవు. అలాంటప్పుడు కొత్త పార్లమెంట్‌ను సమాదితో ఎందుకు పోల్చుతారు. ఈ రకమైన పోలికలు అవసరమా' అని ఆర్జేడీపై ఓవైసీ ఫైరయ్యారు. పీఎం ప్రధాని నరేంద్ర మోదీ తప్ప ఇంకా ఎవరూ ఈ పని చేయలేరన్నట్లు ప్రవర్తిస్తారని ఓవైసీ విమర్శించారు. 2014కు ముందు దేశంలో ఏం జరగనట్లు.. ప్రస్తుతం మాత్రమే అంతా జరుగుతున్నట్లు ప్రధాని ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తారని ఆరోపించారు. ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్: పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలు యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్ పెను వివాదాని దారితీసింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్జేడీ. ఈ భవనం శవపేటిక మాదిరిగా సమాధి చేసిన ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, దీన్ని దేశం అంగీకరించదంటూ ఆర్జేడీ పార్టీ బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. ఇదీ చదవండి:పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. ఇది నిజంగా అప్రతిష్ట: రాహుల్ -
కొత్త పార్లమెంట్ భవనంపై లాలు యాదవ్ పార్టీ వివాదాస్పద ట్వీట్
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనంపై పెను రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే 19 ప్రతిపక్ష పార్టీలు బైకాట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే సరిగ్గా పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలు యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్ పెను వివాదాని దారితీసింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్జేడీ. ఈ భవనం శవపేటిక మాదిరిగా సమాధి చేసిన ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, దీన్ని దేశం అంగీకరించదంటూ ఆర్జేడీ పార్టీ బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. వాస్తవానికి పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం, చర్చల వేదిక కానీ దాన్ని బీజేపీ అవమానపర్చిలే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసింది ఆర్జేడీ. దీంతో ఈ ట్వీట్‌పై స్పందించిన బీజేపీ నేత సుశీల్ మోదీ ఇలా పార్లమెంట్ కొత్త భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలంటూ మండిపడ్డారు. మరో బీజేపీ నేత దుష్యంత్ గౌతమ్ ఇలాంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం అన్నారు. కొత్త పార్లమెంట్‌ని శవపేటికతో పోల్చారు, పాత భవనాన్ని జీరోతో పోల్చారా? ఎందుకంటే మనం అప్పుడూ జీరోలానే కూర్చొన్నాం కదా అని చురకలంటించారు. ఇదిలా ఉండగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని చరిత్రలో అవమానకరంగా లిఖించబుడుతుందని విమర్శించారు. కాగా, ఈ పరిణామాలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆయా నాయకులెవరూ ఆ కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెట్టకుండా రాజీనామే చేయడమే ఉత్తమమని గట్టి కౌంటరిచ్చింది. ये क्या है? pic.twitter.com/9NF9iSqh4L — Rashtriya Janata Dal (@RJDforIndia) May 28, 2023 (చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్) -
పోయేకాలం అంటే ఇదే!.. శవపేటికలో పెళ్లి మండపానికి వచ్చిన వరుడు
సాధారణంగా పెళ్లి మండపానికి వరుడు ఎలా వస్తాడు...? మనదేశంలో ఉత్తరాదిన అయితే గుర్రం మీద వస్తాడు. దక్షిణాదిన అయితే ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారు. కొన్నిచోట్ల బావమరుదులు మండపానికి ఎత్తుకొని వస్తారు. ఎబ్బే... ఇంత ట్రెడిషనల్‌గా బాగలేదు అనుకున్నాడేమో ఈ వరుడు. అందరికంటే భిన్నంగా ట్రై చేశాడు. మండపానికి ఏకంగా శవపేటికలో వచ్చాడు. అతని స్నేహితులు ఆరుగురు ఆ శవపేటికను మండపానికి మోసుకొచ్చారు. పెళ్లి మండపం వద్దకు రాగానే శవపేటికను మోసుకువెళ్లి ఒక చోట ఉంచారు. అది ఓపెన్ చేయగానే పెళ్లి కొడుకు బయటికి రావడంతో ఆశ్చర్యపోవడం అతిథుల వంతయ్యింది. అంతేనా.. చివరకు అందరూ ఆ శవపేటిక పక్కన వరుసలో నిలబడి ఫొటో కూడా తీసుకున్నారు. చదవండి: Video: మంచి చెప్పడమే ఆమెకు శాపమైంది! యువతిపై పిడుగుద్దులు.. ఇదంతా జరిగింది ఎక్కడన్నది తెలియనప్పటికీ.. ఈ వివాహానికి హాజరైన ఒకరు వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.80 లక్షల మంది చూశారు. అయితే దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుభమాని పెళ్లి చేసుకుంటూ.. ఇలా శవపేటికలో రావడమేంటని మండిపడుతున్నారు. -
కడసారి చూపులకు 13 గంటలు నిరీక్షించిన మాజీ కెప్టెన్
గతవారం ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాణి ఎలిజబెత్ పార్థివదేహం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంది. సోమవారం(సెప్టెంబర్ 19 వరకు) ఉదయం 6:30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. కాగా 72 ఏళ్లు ఇంగ్లండ్‌ను పాలించిన ఎలిజబెత్‌ను కడసారి చూడడం కోసం జనాలు బారులు తీరారు. వారిలో ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హమ్ కూడా ఉన్నాడు. అయితే అతను కావాలనుకుంటే సెలబ్రిటీ హోదాలో రాణి ఎలిజబెత్‌ను వీఐపీ స్లాట్‌లో డైరెక్ట్‌గా చూడొచ్చు. కానీ బెక్‌హమ్ అలా చేయలేదు. ప్రొటోకాల్ పాటిస్తూ దాదపు 13 గంటల పాటు సామాన్యులతో కలసి క్యూ లైన్లో నిల్చున్న బెక్‌హమ్ శుక్రవారం సాయంత్రం క్వీన్ ఎలిజబెత్‌కు కడసారి నివాళి అర్పించాడు. బెక్‌హమ్ చర్యపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే విషయమై రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బెక్‌హమ్ మాట్లాడాడు. ''మనందరం కలిసి రాణి ఎలిజబెత్-2ను కడసారి చూడడానికి వచ్చాం.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవాలనుకున్నాం.. ఇలాంటి సమయంలో సెలబ్రిటీ హోదా కన్న ఒక మాములు వ్యక్తిగా చూద్దామనుకున్నా. అందుకే ప్రొటోకాల్ పాటిస్తూ 13 గంటల పాటు క్యూలైన్లో నిల్చొన్నా. ఇలా చేసినందుకు నాకు బాధ లేదు.. ఎందుకంటే మనం ఒకరిని కడసారి చూసేందుకు వెళుతున్నాం. అందుకే రాణి దర్శనం కోసం ఎన్ని గంటలైనా సరే నిరీక్షించాలని అనుకున్నా. చివరికి ఆమెకు కడసారి నివాళి అర్పించా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాణి ఎలిజబెత్-2 శవపేటికను ఉంచిన వెస్ట్‌మినిస్టర్ హాల్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఇప్పటివరకు దాదాపు 750,000 మంది రాణి ఎలిజబెత్‌ను కడసారి చూడడానికి పోటెత్తారు. Absolute kudos to David Beckham who queued with other members of the public for 12 hours. pic.twitter.com/famWJIlNet — Dan Wootton (@danwootton) September 16, 2022 చదవండి: కొంప ముంచిన వికెట్ కీపర్ హెల్మెట్ -
పాతిపెట్టిన శవాలను తీసి మళ్లీ ఉరేశారు
పడుకున్న శవాన్ని లేపి మరీ చంపేస్తా.. ఓ సినిమాలో హీరో డైలాగ్ ఇది. ఏదో డైలాగు చెప్పడం వరకూ ఓకేగానీ.. నిజంగా అలా చంపుతారా ఎవరైనా? ఎందుకు చంపరు.. చరిత్రను తిరగేస్తే.. చచ్చినోళ్లను మళ్లా చంపిన సంఘటనలు చాలా ఉన్నాయి.తిరుగుబాట్లు, నమ్మక ద్రోహం, నేరాలకు పాల్పడటం వంటివాటితో పాటు.. చనిపోయినోళ్ల మీద తమ, ప్రతీకారం తీర్చుకోవడం వంటివి అందుకు కారణమయ్యాయి. శవానికి ఉరేశారు.. ఆలివర్ క్రోమ్‌వెల్.. ఇంగ్లండ్ కామన్వెల్త్ దేశాలకు మొట్టమొదటి ప్రజాస్వామ్య పాలకుడు.1658 సెప్టెంబర్ 3న యూరినరీ ఇన్ఫెక్షన్తో చనిపోయాడు. కానీ 1661 జనవరిలో ఆయన శవాన్ని మళ్లీ ఉరితీశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అప్పట్లో ఇంగ్లండ్‌ను కింగ్ చార్లెస్ పాలించేవాడు. ఆయన విధానాలు, ఇష్టమొచ్చినట్టుగా పన్నులు వేయడంతో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఆలివర్ నేతృత్వంలో తర్వాత ప్రభుత్వం ఏర్పాటైంది. కింగ్ చార్లెస్‌ను ఉరితీశారు. కొంతకాలానికి ఆలివర్ కూడా చనిపోయాడు. తదనంతర పరిణామాల్లో రాజు అనుకూల సైన్యం ఎదురుతిరిగి.. కింగ్ చార్లెస్–2ను రాజును చేసింది. ఈ నేపథ్యంలో మొదటి కింగ్ చార్లెస్‌ను గద్దె దింపి, ఉరేయడానికి కారణమైన వారికి మరణశిక్షలు విధించారు. కారకుల్లో ఒకరైన ఆలివర్ అప్పటికే చనిపోయాడు.. అయినా.. వాళ్ల పగ తీరితేగా.. సమాధి నుంచి ఆయన శవాన్ని తీసి మరీ.. ఉరి వేశారు. అప్పటికీ కోపం తగ్గకపోవడంతో ఆలివర్ తలను నరికి.. 20 అడుగుల ఎత్తైన కర్రకు వేలాడదీశారు. సుమారు 25 ఏళ్లపాటు ఆ తల అలాగే వేలాడింది. చివరికి 1960లో దానిని కేంబ్రిడ్జిలోని ఓ రహస్య స్థలంలో పూడ్చిపెట్టారు. శవపేటికతో సహా.. స్పెయిన్ ఆక్రమణలో ఉన్న నెదర్లాండ్స్ (డచ్) స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న రోజులవి. డచ్ పోరాటకారులు, స్పెయిన్ మధ్య 12 ఏళ్ల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ కాల్పుల విరమణ కాలంలో నెదర్లాండ్స్‌లోని యూట్రెచ్ రాష్ట్రాలకు సెక్రటరీగా ఉన్న గిల్లెస్ వాన్ లాడెన్‌బర్గ్.. చేసిన కొన్ని పనులు గొడవలు రేపాయి. దాంతో 1618లో అతడిని అరెస్టు చేశారు. తాను ఆత్మహత్య చేసుకుంటే.. తన ఆస్తులు, ఇతర అంశాలపై విచారణ ఆపేస్తారని లాడెన్‌బర్గ్ భావించి, ఉరేసుకున్నాడు. కానీ పాలకులు అతడిని వదల్లేదు. కుట్రదారుడిగా ప్రకటించి మరణశిక్ష వేశారు. లాడెన్‌బర్గ్ శవాన్ని శవపేటికతో సహా వేలాడదీశారు. ఇవి జస్ట్ ఉదాహరణలే.. పెద్దపెద్ద మతాధికారులకు కూడా చనిపోయిన తర్వాత ఉరేసిన ఘటనలో చరిత్రలో చాలా ఉన్నాయి. -
బతికుండగానే 50 గంటలు సమాధి!
మిస్టర్ బీస్ట్.. అసలు పేరు జిమ్మీ డొనాల్డ్సన్. భయాన్ని సైతం జయించాలనే తాపత్రయం కలవాడు. ప్రమాదాలతో పరాచికాలు ఆడుతుంటాడు. దీన్ని వీడియోలు తీసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాడు. ఫాలోవర్లను ఎంటర్టైన్ చేసేందుకు ఏదైనా చేస్తుంటాడు. తాజాగా అతడు సజీవ సమాధికి పూనుకున్నాడు. ఒకటీ రెండు గంటలు కాదు, ఏకంగా 50 గంటలు శవపేటికలో పడుకున్నాడు. అంటే రెండు రోజులకు పైగా భూమి లోపల పేటికలో జీవించాడు. దీన్నంతటినీ 12 నిమిషాల వీడియోగా ఎడిట్ చేసి యూట్యూబ్‌లో షేర్ చేశాడు. ఇంకేముందీ అతడు చేసిన ప్రమాదకరమైన పని గురించి, అతడి గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇక ఈ వీడియోలో పేటికలో పడుకున్న అతడు బోర్‌గా ఫీల్ అయినట్లు పేర్కొన్నాడు. కొన్నిసార్లు కదలడానికి కూడా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చాడు. అయితే సమాధిలోకి వెళ్లేముందు పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపాడు. మొత్తానికి ఓ పెద్ద స్టంట్ చేసి ప్రాణాలతో శవపేటిక నుంచి బయటపడిన ఇతడు తన అనుభవం గురించి మాట్లాడుతూ ఇది నిజంగా వెర్రిచేష్టలే అని తనను తానే నిందించుకున్నాడు. ఇలా సమాధిలోకి వెళ్లినప్పుడు తలనొప్పితో బాధపడటమే కాక ఆకలితో అలమటించానని పేర్కొన్నాడు. ఇప్పటివరకు తాను చేసిన సంట్స్‌లో మరీ అధ్వాన్నమైన పని ఇదే అని చెప్పుకొచ్చాడు. పలువురు నెటిజన్లు కూడా అతడి సాహసాన్ని విమర్శిస్తున్నారు. దీనివల్ల మానసికంగా బాధ కలగడంతో పాటు శారీరక సమస్యలు కూడా వస్తాయని చెప్తున్నారు. కొద్ది మంది నెటిజన్లు మాత్రం ఇంతటి సాహసానికి పూనుకోవడం నిజంగా గ్రేట్ అని కొనియాడుతున్నారు. చదవండి: వాట్సాప్ మెసేజ్: సిటీలో హెల్మెట్ అవసరం లేదా? పాపం ఈ భల్లూకం కష్టం చూడండి.. పిల్లల కోసం.. -
మాజీ కేంద్ర మంత్రి పాడె మోసిన రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కెప్టెన్ సతీష్ శర్మ రెండు రోజుల క్రితం కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఆయన మృతికి సంతాపం తెలిపింది. సతీష్ శర్మ అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సతీష్ శర్మ పాడె మోశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలని కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ మేరకు ‘‘మరణించిన కెప్టెన్ సతీష్ శర్మకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ వినయపూర్వకమైన నివాళులు అర్పించింది. కెప్టెన్ దేశ ప్రజలకు చేసిన సేవలను ఎన్నటికి మరువం.’’ అంటూ రాహుల్ గాంధీ కెప్టెన్ సతీష్ శర్మ పాడె మోస్తున్న ఫోటోలను ట్వీట్ చేసింది. సతీష్ శర్మ మృతి గురించి తెలిసిన వెంటనే రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేం అన్నారు. Shri @RahulGandhi and the Congress party pay their humblest tributes to Late Capt. Satish Sharma ji. His contributions towards the service of our people will always be remembered. pic.twitter.com/vTdpRe8XgO — Congress (@INCIndia) February 19, 2021 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన సతీష్ శర్మ గత కొద్ది రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం గోవాలోని తన నివాసంలో మృతి చెందారు. గాంధీ కుటుంబానికి ఆయన చాలా నమ్మకస్తుడిగా ఉండేవారు. రాహుల్ గాంధీ రాజకీయాల్లో ప్రవేశించిన తొలి నాళ్లలో ఆయనకు మెంటార్‌గా వ్యవహరించారు. పీవీ ప్రభుత్వంలో సతీష్ శర్మ 1993 నుంచి 1996 వరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేశారు. మూడు సార్లు రాయ్ బరేలి, అమేథీ నుంచి లోక్‌సభకు ఎన్నికవ్వగా.. మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంతేకాక ఆయన ప్రొఫేషనల్ కమర్షియల్ పైలెట్. చదవండి: రాహుల్ గాంధీ షాకింగ్ ట్వీట్: ట్విటర్ దుమారం -
ఈ శవపేటికలు చరిత్రను తిరగరాస్తాయి..!
కైరో: ఈజిప్టు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పిరమిడ్లు, మమ్మీలు. పురాతత్వ శాస్త్రవేత్తలు ఇక్కడ నిత్యం పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. తాజాగా ఈజిప్టులోని సక్కారా ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు 3000 సంవత్సరాల క్రితం నాటి చెక్క, రాతి శవపేటికలను గుర్తించారు. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన చరిత్రను తిరగరాసే గొప్ప, అద్భుతమైన ఆవిష్కరణ అంటున్నారు ఆర్కియాలజిస్టులు. సక్కారా అనేది పురాతన ఈజిప్టు రాజధాని మెంఫిన్‌లో భాగం. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ డజనుకు పైగా పిరమిడ్లు, పురాతన మఠాలు, జంతువుల ఖనన ప్రదేశాలు ఉన్నాయి. ప్రసిద్ధ ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్త జాహి హవాస్ నేతృత్వంలోని పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ అద్భుతాన్ని గుర్తించింది. ఈజిప్టు పాత సామ్రాజ్యం(ఓల్డ్ కింగ్డమ్) ఆరవ రాజవంశానికి చెందిన మొదటి ఫారో.. కింగ్ టెటి పిరమిడ్ సమీపంలో పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ఆవిష్కరణలని గుర్తించింది. 'చరిత్రను తిరిగరాస్తుంది' న్యూ కింగ్డమ్ (క్రీస్తుపూర్వం 16 వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 11వ శతాబ్దం)నాటి 50 కి పైగా చెక్క శవపెటికలు భూమికి 40 అడుగుల లోతులో ఈ శ్మశానవాటికలో బయపటడినట్లు హవాస్ న్యూస్ ఏజెన్సీకి ఏఎఫ్పీకి వెల్లడించారు. "ఈ ఆవిష్కరణ సక్కారా చరిత్రను.. మరి ముఖ్యంగా 3,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన న్యూ కింగ్డమ్ చరిత్రను తిరిగరాస్తుంది" అన్నారు. (చదవండి: ప్రైవేట్ ఫొటోషూట్.. మోడల్ అరెస్టు!) ఇంకా ఏమి కనుగొన్నారు తన బృందం శవపేటికలతో పాటు మొత్తం 22 బాణాలను కనుగొన్నట్లు హవాస్ వెల్లడించారు. వాటిలో ఒకదాని మీద "సైనికుడు, పక్కనే విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉన్న అతని యుద్ధ గొడ్డలి ఉంది" అన్నారు. వీటితో పాటు ఒక రాతి శవపేటికను కూడా గుర్తించామని హవాస్ వెల్లడించారు. అలాగే చనిపోయినవారి పుస్తకంలోని(బుక్ ఆఫ్ ది డెడ్) 17 వ అధ్యాయాన్ని కలిగి ఉన్న ఐదు మీటర్ల పొడవున్న పురాతన పత్రం, ఆ కాలంలో ఉపయోగించిన మాస్క్‌లు, చెక్క పడవలు, పురాతన ఈజిప్షియన్లు ఆడటానికి ఉపయోగించే ఆట వస్తువులు వంటివి లభ్యమయ్యాయి అని తెలిపారు. ఇదే ప్రధాన ఆవిష్కరణ ఎందుకు ఈజిప్ట్ పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ శనివారం సక్కారాలో గుర్తించిన "ప్రధాన ఆవిష్కరణలు" గురించి ప్రకటించింది. ‘‘ఇది చాలా అరుదైన, క్రొత్త ఆవిష్కరణ. ఎందుకంటే మేము కనుగొన్న చాలా కళాఖండాలు న్యూ కింగ్డమ్(క్రొత్త రాజ్యం)కి చెందినవి. అయితే ప్రస్తుతం సక్కారాలో గుర్తించినవి మాత్రం సాధారణంగా క్రీ.పూ 500 కాలానికి చెందినవి’’ అని తెలిపింది. ఇక్కడ ఇటీవలి సంవత్సరాలలో అనేక తవ్వకాలు జరిగాయి. (చదవండి: 2,500 ఏళ్ల తర్వాత 'మమ్మీ'ని బయటకు తీశారు!) బయటపడిన పురాతన ఆలయం ఇక ఇక్కడ జరిపిన తవ్వకాల్లో హవస్ ఒక పురాతన ఆలయం కూడా బయటపడింది. ఇది "కింగ్ టెటి భార్య క్వీన్ నిరిట్ యొక్క అంత్యక్రియల ఆలయం" అని పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పురాతన ఈజిప్టులో నిర్మించిన మొట్టమొదటి నిర్మాణాల్లో ఒకటి అయిన జొజర్ స్టెప్ పిరమిడ్ సక్కరా ప్రాంతంలోనే ఉంది. -
కరోనా మృతదేహాల కోసం ప్రత్యేకంగా..
బొగోటా: మహమ్మారి కరోనా వైరస్ ఎన్నోన్నో హృదయవిదారక దృశ్యాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. అంటువ్యాధి సోకి మరణించిన వారిని కుప్పలుతెప్పలుగా ఖననం చేసిన దృశ్యాలు ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాయి. దక్షణ అమెరికా దేశం ఈక్వెడార్‌లోనూ మహమ్మారి విలయం కొనసాగుతోంది. ఈ క్రమంలో కరోనాతో మరణించిన తమ వాళ్ల మృతదేహాలతో పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులు వీధుల్లో నిలబడిన ఫొటోలు కొలంబియా వ్యాపారవేత్త రొడాల్ఫో గోమెజ్‌ను కలచివేశాయి. ఆస్పత్రి పడకలనే శవపేటికలుగా మార్చే ఆవిష్కరణకు దారిచూపాయి. ఈ విషయం గురించి రొడాల్ఫో మాట్లాడుతూ.. ‘‘ ఈక్వెడార్‌లోని గ్వాయేకిల్‌లో మృతదేహాలతో కొంతమంది వీధుల్లోకి వచ్చారు. మహమ్మారి కారణంగా అంత్యక్రియలు కూడా సరైన పద్ధతిలో నిర్వహించుకునే వీల్లేకుండా పోయింది. అందుకే శవపేటికలుగా రూపాంతరం చెందే బెడ్లను తయారుచేశాం’’అని తెలిపారు.(‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’) ‘‘ఈ బెడ్లకు మెటల్ రెయింగ్స్ ఉంటాయి. కింది భాగంలో బ్రేకులతో కూడిన చక్రాలు అమర్చాం. ఇది 150 కిలోల బరువును మోయగలుగుతుంది. ఈ బయోగ్రేడబుల్ బెడ్- కఫిన్స్ 92 నుంచి 132 డాలర్ల ధరలో అందుబాటులోకి తీసుకువస్తున్నాం. దీంతో మృతదేహం నుంచి వైరస్ వ్యాపించే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది’’అని పేర్కొన్నారు. తొలుత కొలంబియాలోని లెటీసియాలో ఉన్న ఓ ఆస్పత్రికి ఈ బెడ్లను విరాళంగా ఇస్తున్నామని రొడాల్పో తెలిపారు. బొగోటాలో ఉన్న తమ ఫ్యాక్టరీలో నెలకు 3 వేల బెడ్ల చొప్పున తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. కొలంబియా, ఈక్వెడార్‌లతో పాటు పెరూ, చిలీ, బ్రెజిల్, మెక్సిక్, యూఎస్‌కు వీటిని ఎగుమతి చేసేందుకు వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.(అమెరికాను బ్రేక్ చేయనున్న బ్రెజిల్!) -
పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే.. శవపేటికలో వధువు
ఏ జంట అయినా పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకుంటుంది. కొంతమంది అయితే తమ వివాహ వేడుక అందరికి గుర్తిండిపోయేలా వింతగా జరుపుకుంటారు. అదెలాగంటే.. కొందరు వివాహ వేడుకకి గుర్రాలపై వస్తారు. మరికొందరు కొత్తగా రెడీ చేసిన కారులో వెరైటీగా ఎంట్రీ ఇస్తారు. ఇంకొందరు గాల్లో తేలియాడుతూ రింగులు మార్చుకుంటారు. కానీ ఓ వధువు మాత్రం ఇంకాస్త వెరైటీగా తన పెళ్లి వేడుకను జరుపుకుంది. గుర్రాలు, కార్లను కాదని ఏకంగా శవపేటికలో పెళ్లి మంటపానికి వచ్చింది. శవపేటిక లోపలి నుంచి లేచి మంటపంపైకి వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. ఓ వధువు శవపేటికలో పడుకొని ఉంది. ఆ శవపేటికపై నల్లటి వస్త్రం కప్పి ఉంది. కళ్యాణ మంటపం దగ్గరకి రాగానే ఆ వస్త్రాన్ని తొలగించారు. అనంతరం శవపేటికలోనుంచి వధువు నవ్వుతూ లేచింది. అందరూ ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం వేదికపైకి వెళ్లి రింగులు మార్చుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ చావు కూడా మన జీవితంలో భాగమే.. అందుకే ఆమె శవపేటికలో వచ్చింది’ అని ఒకరంటే.. ‘పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే’ అంటూ మరొకరు కాంమెట్లు చేస్తున్నారు. కాగా, ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు. -
కొడుకు శవాన్నైనా చూద్దామనుకుంటే...చేదు అనుభవం
తిరువనంతపురం : కుటుంబాన్ని పోషించడం కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన కొడుకు మరణించడంతో ఓ వృద్ధ జంటకు తీరని వేదన మిగిలింది. కడుపుకోతను తట్టుకుని కనీసం కొడుకు శవాన్నైనా చూడాలనుకుంటే చేదు అనుభవం ఎదురైంది. కొడుకు స్థానంలో మహిళ భౌతిక కాయం కనిపించడంతో చేసేదేమీ లేక మరికొన్నాళ్లు నిరీక్షించక తప్పని పరిస్థితి రావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలు.. కేరళలోని పత్నమితిట్టకు చెందిన రఫీక్(29) ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. దురదృష్టవశాత్తూ ఫిబ్రవరి 28న గుండెపోటు రావడంతో అక్కడే మరణించాడు. దీంతో కుమారుడి శవాన్ని ఇంటికి తీసుకువచ్చేందుకు అధికారుల చుట్టూ తిరిగిన అతడి తల్లిదండ్రులు.. గురువారం వచ్చిన శవపేటిక తెరచి చూసి అవాక్కయ్యారు. కుమారుడి స్థానంలో శ్రీలంకకు చెందిన ఓ మహిళ శవం ఉండటంతో బోరున విలపించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న కొన్నీ సీఐ పరిస్థితిని పర్యవేక్షించారు. కార్గో సెక్షన్ పొరపాటు వల్ల రఫీక్ మృతదేహం శ్రీలంకకు, అతడి స్థానంలో ఓ మహిళ మృతదేహం ఇక్కడకు వచ్చిందని వారికి నచ్చజెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి రఫీక్ శవాన్ని తిరిగి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కరుణానిధి శవపేటిక మీద ఏం రాశారంటే..
చెన్నై : ‘విరామమన్నది ఎరుగక, నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఇక్కడ విశ్రమిస్తున్నాడు’.. ఈ మాటలు కరుణానిధికి వర్తించినంత బాగా ఇంక ఎవరికి వర్తించవేమో. అందుకే శాశ్వత నిద్రలోకి జారుకుని విశ్రమిస్తోన్న ‘కలైజ్ఞర్’ శవపేటిక మీద ఈ మాటలనే చెక్కించారు. ఒకానొక సందర్భంలో కరుణానిధి తన కుమారుడు స్టాలిన్‌తో ‘మన సమాధి చూసిన జనాలు విశ్రాంతి అన్నది ఎరగకుండా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ సేద తీరుతున్నారని’ అనుకోవాలని చెప్పారట. ఈ మాటలు కరుణానిధికి సరిగ్గా సరిపోతాయి. అందుకే ఆయన శవ పేటికి మీద కొడుకు స్టాలిన్‌తో చెప్పిన మాటలనే తమిళంలో చెక్కించారు. సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. -
తల్లి శవపేటిక మీద పడి.. విషాదం
ఇండోనేషియా : తల్లి చనిపోయిన బాధలో ఉన్న ఆ కొడకు జీవితం విషాదంగా ముగిసింది. అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో తల్లి శవపేటిక మీద పడి తీవ్ర గాయాలపాలైన కొడుకు చనిపోవటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన ఇండోనేషియాలోని ఉత్తర తొరజాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర తొరజాలోని పారిండింగ్ లోయకు చెందిన సేమెన్ కొండోరుర(40) తల్లి ‘బెర్తా’ కొద్ది రోజుల క్రితం చనిపోయింది. అక్కడి సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారిని ఒక శవపేటికలో ఉంచి చెక్కతో తయారు చేసిన ఓ చిన్న పాటి మేడలో ఉంచాలి. అనుకున్న ప్రకారం అంతా సిద్ధం చేసి శవపేటికను మేడ పైకి తరలిస్తున్న సమయంలో నిచ్చెన పక్కకు జరగటంతో అంతా ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. దీంతో శవపేటిక మేడపై నుంచి సేమెన్ మీదకు జారి పడింది. బరువైన శవపేటిక అలా అంత ఎత్తు నుంచి మీద పడటంతో తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సేమెన్ మృతి చెందాడు. సేమెన్ శవాన్ని తల్లి బెర్తా శవంతో పాటే ఉంచి ఘనంగా ఖననం చేశారు బంధువులు. -
పీవీ నుంచి నేటి జయ వరకు అదే కంపెనీ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహాన్ని ఖననం చేయడం కోసం ప్రత్యేకంగా గందపు చెక్కలతో తయారుచేసిన శవపేటికను తయారు చేయించారు. అయితే, ఈ పేటికను రూపొందించిన కంపెనీ ఇప్పటి వరకు దాదాపు 500 మంది ప్రముఖులకు పేటికలను తయారు చేసి ఇచ్చిందంట. జయ చనిపోయిన వెంటనే ప్రత్యేక పేటికను రూపొందించే పనిని ఫ్లైయింగ్ స్క్వాడ్ అండ్ హోమేజ్ కంపెనీకి అప్పగించారు. దీంతో ప్రత్యేకంగా గందపు చెక్కలతో ఆ కంపెనీ శవపేటికను రూపొందించి ఇచ్చింది. ఈ పేటికలోపల 0 నుంచి 5డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతను కొనసాగించగలిగితే మూడు రోజుల వరకు కూడా మృతదేహం చెక్కు చెదరదని ఆ కంపెనీ చెబుతోంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రముఖ నటుడు శివాజీ గణేశన్, మనోరమవంటి ప్రముఖులకు కూడా ఈ కంపెనీనే పేటికలను రూపొందించింది. ‘జయకోసం రూపొందించిన పేటికను హెవీ డ్యూటీ కంప్రెజర్, ఫ్రీజర్ బాక్స్ రూపొందించాం. ఇది శరీరాన్ని త్వరగా చెడిపోకుండా ఉంచుతుంది’ అని ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్‌ఎంఎం శాంతకుమార్ తెలిపారు. 1994లో పేటికలను తయారుచేసి హక్కును పొందిన ఆయన ఇప్పటి వరకు 500మంది ప్రముఖులకోసం ప్రత్యేక పేటికలను తయారు చేయించి ఇచ్చారు. -
విమానాల్లో రహస్య బెడ్ రూమ్‌లు!
విమానాల్లో సుదూర ప్రయాణాలు చేయడమంటే మాటలు కాదు. ప్రయాణికులతోపాటు వారికి సేవలు అందించే విమానం సిబ్బంది గంటలకొద్ది సాగే ప్రయాణంలో అలసిపోతారు. ప్రయాణికులంటే సీట్లలో ప్రశాంతంగా కూర్చుంటారు. మరీ విమానం సిబ్బంది పరిస్థితి ఏమిటి? విమాన ప్రయాణంలో వారు కాసింత విశ్రాంతి తీసుకోవాలంటే ఎలా?.. అందుకు విమానంలోనే వారికోసం రహస్య ఏర్పాటు ఒకటి ఉంటుంది. బోయింగ్ 777, 787 వంటి పెద్ద విమానాల్లో ఎయిర్‌హోస్టెస్, ఇతర విమాన సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి రహస్య బెడ్రూమ్లు ఉంటాయి. వీటిని క్రూ రెస్ట్ డిపార్ట్మెంట్స్ అని పిలుస్తారు. కాక్‌పిట్ వెనుక ఫస్ట్ క్లాస్ పైన ఇవి ఉంటాయి. రహస్యంగా ఉండే ఈ ప్రదేశాన్ని సాధారణంగా ప్రయాణికులు గుర్తించే వీలుండదు. డోర్ వెనుకాల రహస్యంగా ఉండే చిన్నపాటి మెట్లపై నుంచి ఎక్కి వెళితే ఇక్కడికి చేరుకోవచ్చు. లోపలికి వెళ్లేందుకు యాక్సెస్ కార్డు లేదా కోడ్ ఉంటుంది. విమానం పరిణామం బట్టి అందులో సిబ్బంది విశ్రాంతి గదులు ఉంటాయి. ఇవి సహజంగా చాలా ఇరుగ్గా ఉంటాయి. వీటికి కిటికీలు కూడా ఉండవు. పూర్తిగా అన్నివైపుల కప్పివేయబడి ఉంటాయి. ఇందులో ఎనిమిది వరకు పడకమంచాలు ఉంటాయి. బోయింగ్ 777 విమానంలో ఆరు నుంచి పది వరకు పరుపులు ఉంటాయి. దీనికి అదనంగా సింక్తోపాటు ఒక బాత్రూమ్ కూడా ఉంటుంది. విమానంలో సిబ్బంది కోసం ఇలాంటి ఏర్పాటు ఉంటుందని సాధారణంగా చాలామందికి తెలియదు. ఈ విశ్రాంతి గదుల్లో సేదదీరుతున్న ఎయిర్‌హోస్టెస్ ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. చూడటానికి శవపేటికల్లా ఉంటాయి! 'బోయింగ్ 747 విమానంలో బంక్ పరుపులు (ఒకదానిపై ఒకటి ఉండేవి) ఉంటాయి. బోయింగ్ 777 విమానంలోనైతే ఇవి శవపేటికల్లా చాలా ఇరుగ్గా ఉంటాయి. ఇందులో విశ్రాంతి తీసుకోవడానికి దిండు, దుప్పటి కూడా ఇస్తారు. నిద్రపోయేముందు ధరించేందుకు నేను ఎప్పుడూ సొంత పైజామాలే తీసుకెళుతాను. అవసరమైతే బిజినెస్ క్లాస్‌లోని దిండు, దుప్పటి తీసుకోవచ్చు. ఇందులో కొన్ని ప్రాథమిక సదుపాయాలు ఉంటాయి. చిన్నపాటి టీవీలు కూడా ఉంటాయి. కానీ అవి ఐప్యాడ్ కన్నా చిన్నవిగా ఉంటాయి' అని బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి తెలిపారు. -
జవాను శవపేటికనూ వదలని 'అమ్మ'
చెన్నై: తమిళనాడులో ఏఐఏడీఎంకే మంత్రుల 'అమ్మ' భజన రోజు రోజుకు పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న నూతన వధూవరులు బాసికాలపై కూడా దర్శనమిచ్చిన 'అమ్మ' ఇప్పుడు అమరులైన జవానుల శవపేటికలను కూడా వదలలేదు. సియాచిన్‌లో మంచుతుపానులో చిక్కుకుపోయి అమరులైన జవాన్లకు మంగళవారం వారి స్వస్థలాల్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. తమిళనాడులోని మదురైలో సిపాయ్ గణేషన్ అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక్కడ కూడా తమిళనాడు సీఎం జయలలిత ఫోటో దర్శనమిచ్చింది. రాష్ట్ర మంత్రి సెల్లూరు రాజు జిల్లా కలెక్టర్ వీర రాఘవరావుతో కలిసి జవాను అంత్యక్రియల కార్యక్రమానికి వచ్చారు. రూ. 10 లక్షల చెక్‌ను ప్రభుత్వం తరఫున సిపాయ్ గణేషన్ తల్లికి అందజేశారు. ఆ తర్వాత జయలలిత ఫోటోను శవ పేటికపై పెట్టి ఈ సాయం అందించింది తనే అంటూ జవాను తల్లికి సైగ చేశారు. దీంతో అప్పటికే ఏడుస్తూ ఉన్న ఆవిడ ఆ ఫోటో చూసి నమస్కారం చేసింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాను శవపేటిక వద్ద రాజకీయాలు చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జయలలిత పేరును ఎంత వీలైత అంతగా ప్రచారంలోకి తీసుకు రావాలని ఏఐఏడడీఎంకే నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్, అమ్మ ఫార్మసి, అమ్మ సిమెంట్, అమ్మ ఉప్పు, అమ్మ ఆముదం, అమ్మ అవార్డులు, అమ్మ థియేటర్. ఇలా అనేక పథకాలు ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి ప్రారంభించినవే. -
వధువు వచ్చెనిలా..
మీరు చూస్తున్నది నిజమే. అయితే పెళ్లికూతురు శవపేటికలో ఉండడమేమిటనేదేగా మీ సందేహం. జెన్నీ బక్లెఫ్ అనే ఈ 58 ఏళ్ల వ ధువు ఓ ఫ్యునరల్ పార్లర్ ఉద్యోగిని. ఆ సంస్థలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున జెన్నీకి వింత ఆలోచన వచ్చింది. అదేమిటంటే పెళ్లి వేదిక వద్దకు గుర్రపు బగ్గీలో కాకుండా వెరైటీగా రావాలనుకోవడం. ఆ ఆలోచన మదిలో తట్టిందే తడవుగా అదే పనిచేసేసింది. అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. -
బాటిల్లో బబ్బోపెట్టండి..
తాము చనిపోయినప్పుడు అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలుగా శవపేటికలను ముందే తయారుచేయించుకుంటున్న వాళ్లు విదేశాల్లో పెరిగిపోయారు. అలాంటోళ్లలో ఈయనో వెరైటీ టైపు. ఈయన చనిపోయాక తనను విస్కీ బాటిల్లో బబ్బోపెట్టమంటున్నాడు. ఈయన పేరు ఆంటో విక్‌హాం(48). గతంలో బ్రిటన్ సైన్యంలో పనిచేశాడు. ఇరాక్ యుద్ధంలో తన కళ్ల ముందే చాలా మంది సహచరులు చనిపోయారట. వారి అంత్యక్రియలకు వెళ్లడం.. అందరూ ముఖాలు వేలాడదీసుకుని ఉండటం వంటివి చూశాడట. అప్పుడే డిసైడయ్యాడట. తన అంత్యక్రియలు సంతాప కార్యక్రమంలా కాకుండా ఓ వేడుకలా జరగాలని.. ఎలాంటి శవపేటిక తయారుచేయించుకోవాలా అని ఆలోచించాడు. వెంటనే తనకిష్టమైన జాక్ డానియల్స్ విస్కీ గుర్తొచ్చింది. వెంటనే అదే బాటిల్ రూపంలో 10 అడుగుల పొడవున్న శవపేటికకు ఆర్డర్ ఇచ్చాడు. దీని కోసం రూ.30 లక్షలు వెచ్చించాడు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తున్న విక్‌హాం.. తన అంత్యక్రియలకు ఇంకా చాలా వినూత్న ప్లాన్స్ వేసుకుంటున్నాడు. సమాధి రాయిని ఐప్యాడ్ రూపంలో చేయించాలని యోచిస్తున్నాడు. -
ఆ 6గురు జూన్ 1 లోపే ఎందుకు చనిపోయారు?
చైనాలో ఆరుగురు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటూ చేసుకుంటూ 'మమ్మల్ని పూడ్చి పెట్టండి. మా శవాలను కాల్చొద్దు' అని లేఖ రాసి చనిపోయారు. అంతే కాదు. తాము జూన్ 1 కి ముందే చనిపోతున్నాం కనక తమను కాల్చడానికి వీల్లేదు అని కూడా వారు చెప్పుకున్నారు. అసలు సమస్యేమిటంటే చైనాలో మృతులను ఖననం చేయడం, వారి జ్ఞాపకార్థం సమాధి కట్టడం ఆచారం. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. అయితే జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో చనిపోయిన ప్రతివారినీ పూడ్చిపెడితే ఆఖరికి దేశంలో అంగుళం కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే చైనా జూన్ 1 తరువాత నుంచి సమాధి చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ వార్త వినగానే ఆరుగురు వృద్ధులు తమకు సమాధులుండవేమోనని భయపడ్డారు. అందుకే జూన్ 1 లోపే చనిపోతే సమాధులుంటాయని మే 28 నే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంఘటన అన్ హుయ్ ప్రాంతంలోని ఆంకింగ్ నగరంలో జరిగింది. చనిపోయిన వారిలో 83 ఏళ్ల ఝెంగ్ షిఫాంగ్ అనే ఆమె ముందుగానే తన శవపేటికను తయారు చేసి ఉంచుకుంది. కానీ ఆ శవపేటికను అధికారులు కొత్త చట్టాల మేరకు ధ్వంసం చేశారు. దీంతో ఆమె పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒక మహిళ బావిలోకి దుంకి చనిపోతే, మిగతా వారు విషం తాగారు. చైనాలో సమాధులను నేలమట్టం చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీని పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. రెండేళ్ల క్రితం 4 లక్షల సమాధులను ప్రభుత్వం నేలమట్టం చేసింది. అయితే తీవ్ర ప్రజావ్యతిరేకత నేపథ్యంలో అప్పట్లో ఈ సమాధి విధ్వంస ఉద్యమం ఆగిపోయింది.