One Who Worked Hard without any Rest is Resting in Peace Here, Message on Karunanidhi's Coffin - Sakshi
Sakshi News home page

కరుణానిధి శవపేటిక మీద ఏం రాశారంటే..

Published Wed, Aug 8 2018 4:20 PM | Last Updated on Wed, Aug 8 2018 4:58 PM

Karunanidhi Casket Reads - Sakshi

చెన్నై :విరామమన్నది ఎరుగక, నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఇక్కడ విశ్రమిస్తున్నాడు’.. ఈ మాటలు కరుణానిధికి వర్తించినంత బాగా ఇంక ఎవరికి వర్తించవేమో. అందుకే శాశ్వత నిద్రలోకి జారుకుని విశ్రమిస్తోన్న ‘కలైజ్ఞర్‌’ శవపేటిక మీద ఈ మాటలనే చెక్కించారు. ఒకానొక సందర్భంలో కరుణానిధి తన కుమారుడు స్టాలిన్‌తో ‘మన సమాధి చూసిన జనాలు విశ్రాంతి అన్నది ఎరగకుండా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ సేద తీరుతున్నారని’ అనుకోవాలని చెప్పారట. ఈ మాటలు కరుణానిధికి సరిగ్గా సరిపోతాయి. అందుకే ఆయన శవ పేటికి మీద కొడుకు స్టాలిన్‌తో చెప్పిన మాటలనే తమిళంలో చెక్కించారు.

సాయంత్రం 4 గంటలకు రాజాజీ హాల్‌ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాలాజా రోడ్‌, చెపాక్‌ స్టేడియం మీదుగా గంటన్నరపాటు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్‌ ప్రాగంణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement