Viral Video: Groom Arrives At His Wedding In Coffin, See Netizens Shocking Reactions - Sakshi
Sakshi News home page

Video: పోయేకాలం అంటే ఇదే!.. శవపేటికలో పెళ్లి మండపానికి వచ్చిన వరుడు

Published Fri, Nov 18 2022 4:20 PM | Last Updated on Fri, Nov 18 2022 5:54 PM

Groom Arrives In Coffin, Netizens Not impressed With Wedding Stunt - Sakshi

సాధారణంగా పెళ్లి మండపానికి వరుడు ఎలా వస్తాడు...? మనదేశంలో ఉత్తరాదిన అయితే గుర్రం మీద వస్తాడు. దక్షిణాదిన అయితే ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారు. కొన్నిచోట్ల బావమరుదులు మండపానికి ఎత్తుకొని వస్తారు. ఎబ్బే... ఇంత ట్రెడిషనల్‌గా బాగలేదు అనుకున్నాడేమో ఈ వరుడు. అందరికంటే భిన్నంగా ట్రై చేశాడు. మండపానికి ఏకంగా శవపేటికలో వచ్చాడు. అతని స్నేహితులు ఆరుగురు ఆ శవపేటికను మండపానికి మోసుకొచ్చారు.

పెళ్లి మండపం వద్దకు రాగానే శవపేటికను మోసుకువెళ్లి ఒక చోట ఉంచారు. అది ఓపెన్‌ చేయగానే పెళ్లి కొడుకు బయటికి రావడంతో ఆశ్చర్యపోవడం అతిథుల వంతయ్యింది. అంతేనా.. చివరకు అందరూ ఆ శవపేటిక పక్కన వరుసలో నిలబడి ఫొటో కూడా తీసుకున్నారు.
చదవండి: Video: మంచి చెప్పడమే ఆమెకు శాపమైంది! యువతిపై పిడుగుద్దులు..

ఇదంతా జరిగింది ఎక్కడన్నది తెలియనప్పటికీ.. ఈ వివాహానికి హాజరైన ఒకరు వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.80 లక్షల మంది చూశారు. అయితే దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుభమాని పెళ్లి చేసుకుంటూ.. ఇలా శవపేటికలో రావడమేంటని మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement