పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్‌పై మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లీమీన్ (ఎమ్‌ఐఎమ్)నేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చడాన్ని తప్పుబట్టారు. ఈ రకమైన పోలికలు అవసరమా అని ప్రశ్నించారు. ప్రధాని కాకుండా స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగుంటే బావుండేదని అభిప్రాయపడ్డారు.
'ఆర్జేడీకి నిర్దిష్టమైన అభిప్రాయమే ఉండదు. సెక్యులరిజమ్ గురించి మాట్లాడుతుంది.. బీజేపీతో స్నేహం చేసి బయటికి వచ్చిన నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేస్తుంది. పాత పార్లమెంట్‍కు కనీసం అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు కూడా లేవు. అలాంటప్పుడు కొత్త పార్లమెంట్‌ను సమాదితో ఎందుకు పోల్చుతారు. ఈ రకమైన పోలికలు అవసరమా' అని ఆర్జేడీపై ఓవైసీ ఫైరయ్యారు.
పీఎం ప్రధాని నరేంద్ర మోదీ తప్ప ఇంకా ఎవరూ ఈ పని చేయలేరన్నట్లు ప్రవర్తిస్తారని ఓవైసీ విమర్శించారు. 2014కు ముందు దేశంలో ఏం జరగనట్లు.. ప్రస్తుతం మాత్రమే అంతా జరుగుతున్నట్లు ప్రధాని ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తారని ఆరోపించారు.
ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్:
పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలు యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్ పెను వివాదాని దారితీసింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్జేడీ. ఈ భవనం శవపేటిక మాదిరిగా సమాధి చేసిన ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, దీన్ని దేశం అంగీకరించదంటూ ఆర్జేడీ పార్టీ బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేసింది.
ఇదీ చదవండి:పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. ఇది నిజంగా అప్రతిష్ట: రాహుల్
Comments
Please login to add a commentAdd a comment