crematorium
-
సర్పంచ్ కట్టించిన శ్మశానవాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం
పరకాల: ఓ సర్పంచ్ కొత్తగా కట్టించిన శ్మశానవాటిక.. ఆయన దహన సంస్కారాలతోనే ప్రారంభమయ్యింది. ఈ దురదృష్టకర ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబోతుపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... హైబోతుపల్లి గ్రామ సర్పంచ్ కంచ కుమారస్వామి (25) కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో సర్పంచ్ గత నెల 29న పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం చనిపోయాడు. కాగా, ఆ గ్రామాన్ని ఇటీవలే గ్రామపంచాయతీగా ప్రకటించారు. సర్పంచ్ కంచ కుమారస్వామి ఆధ్వర్యంలో గ్రామంలో శ్మశాన వాటిక (వైకుంఠధామం) నిర్మించారు. కానీ ప్రారంభించలేదు. ఈ క్రమంలో సర్పంచ్ కుమారస్వామి ఆత్మహత్య చేసుకోవడంతో.. కుటుంబ సభ్యులు ఆయన మృతదేహానికి అదే శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్ కట్టించిన శ్మశాన వాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం కావడంతో గ్రామస్తులంతా కంటనీరు పెట్టుకున్నారు. -
చైనాను వణికిస్తున్న కరోనా.. వీధుల్లోనే శవాలను కాల్చేస్తున్నారు..
కరోనా వైరస్ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్7 డ్రాగన్ దేశంలో విస్తృతంగా వ్యాప్తిస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే మహమ్మారి విషయంలో చైనా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కరోనా లెక్కలు వెల్లడించకుండా దాచేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతోంది. దీంతో చైనా కేసులు, మరణాలు వివరాలు బయటికి రావడం లేదు. చైనాలో కరోనా పరిస్థితులు ఊహకందని విధంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కోవిడ్ రోగులతో ఆసుపత్రులు అన్నీ కిక్కిరిపోతున్నాయి. రోగులకు సేవలు అందించేందుకు వైద్యులు సరిపోవడం లేదు. మరోవైపు శవాల కుప్పలతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. చాలా మంది మృతదేహాలను మార్చురీలోనే వదిలేస్తున్నారు. ఇక రాబోయే నెలల్లో చైనాలో 2 మిలియన్లకుపైగా కోవిడ్ మరణాలు సంభవించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనాకు సంబంధించి చైనా నుంచి వెలువుడుతున్న దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి కొన్ని భయంకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్కడ కోవిడ్ మరణాలు పెరిగిపోవడంతో శ్మశాన వాటికలు నిండిపోయాయి. రిజిస్ట్రేషన్ కోసం ఫ్యూనరల్ హోమ్ వద్ద ప్రజలు ఎగబడుతున్నారు. మరోవైపు అంత్యక్రియలు నిర్వహించే వారు(ఫ్యూనరల్ హోమ్స్) అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలే తమ సొంత ఖర్చులతో మృతదేహాలను వీధుల్లో దహన సంస్కరాలను నిర్వహిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో అంత్యక్రియలు జరిపేస్తున్నారు కుటుంబ సభ్యులు. చదవండి: భారత్‌లో కోవిడ్ భయాలు.. స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత? I've seen quite a few similar videos, but haven't posted any until now. Given what we learned from other sources about how difficult & expensive to cremate a body in a #crematorium in #CCPChina, I'm not surprised if someone in the countryside chose to do this.#ChinaCovidDeaths pic.twitter.com/hxhGdhPriS — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 3, 2023 ‘ఓ వ్యక్తి వాళ్ల తండ్రి కరోనాతో మృతిచెందాడు. శ్మశానవాటికలో మృతదేహాన్ని దహనం చేయడం ఖరీదుతో కూడుకుంది.దహన సంస్కారాలకు అయ్యే ఖర్చులను భరించలేక అతను తన తండ్రి మృతదేహాన్ని బహిరంగ స్థలాన్ని ఎంచుకొని అంత్యక్రియలు జరిపించాడు. ఇకపై అన్ని ప్రాంతాల్లో ఎవరైనా ఈ విధానాన్ని ఎంచుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటూ స్థానికులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. This is not a #BlackFriday rush. This is at #Suzhou Funeral Home, at 6am on Dec 30, 2022, people rushed to get a number as soon as the Funeral Home opened for registration. These ppl had been waiting since 9:00 pm on the previous night. #ChinaCovidSurge #ChinaCovidDeaths pic.twitter.com/vsh6h4HFOL — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 3, 2023 At Zhangjiagang, Suzhou City crematorium. Early in the morning, long line of funeral cars queuing. This is already 1 km away from the crematorium. #CCPChina #ChinaCovidCases #ChinaCovidDeaths #ChinaCovidSurge pic.twitter.com/LHM1Yko8Z0 — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) January 3, 2023 -
సమాజం విస్మరించిన అసలైన కోవిడ్ వారియర్స్ వాళ్లే: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: శ్మశానాల్లో అంత్యక్రియలు నిర్వర్తించే కార్మికులే సమాజం విస్మరించిన అసలైన కోవిడ్ యోధులని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. కోవిడ్ సమయంలో మరణించిన వారికి కుటుంబ సభ్యులే అంతిమ సంస్కారాలను చేయలేకపోయారని, అలాంటి సమయంలో శ్మశాన వాటిక కార్మికులు చేసిన వృత్తి ధర్మం మాటల్లో వర్ణించలేనిదని ఆయన కొనియాడారు. జేసీఐ బుద్ధ పూర్ణిమ సంస్థ ఆధ్వర్యంలో శ్మశాన కార్మికులకు చేయూతనందించేందుకు బుధవారం మాదాపూర్‌లోని ఈ–గెలేరియా మాల్ వేదికగా ‘బెస్ట్ సిగ్నేచర్’ అనే ఫండ్ రైసింగ్ కాంటెస్ట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ సజ్జనార్ తన సిగ్నేచర్‌తో కాంటెస్ట్‌లో పాల్గొని ఫండ్‌రైసింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో గౌరవప్రదంగా అంతిమ క్రియలను నిర్వర్తించిన నిజమైన హీరోల సంక్షేమానికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ఈ కాంటెస్ట్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల కోవిడ్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నగరంలోని దాదాపు ఐదు వందల శ్మశానాల్లో నాలుగు వేల మంది కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించారని జేసీఐ బుద్ధ పూర్ణిమ సంస్థ అధ్యక్షులు ధన్నారపు రాకేష్ తెలిపారు. ఈ కాంటెస్ట్‌లో భాగంగా వచ్చిన డబ్బులతో కార్మికుల పిల్లల పాఠశాల విద్య, ఆరోగ్య బీమా, వారి వృత్తిపరమైన భద్రత, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ కాంటెస్ట్‌లో భాగంగా పాల్గొనే వారు కనీసం రూ.500 కన్నా ఎక్కువ చెల్లించి తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలన్నారు. ఈ కాంటెస్ట్‌లో ఆకట్టుకునే సంతకం ఉన్న మొదటి విజేతకు రూ.25 వేలు, ఆ తరువాతి స్థానాల్లో రూ.15 వేలు, రూ. 10 వేల బహుమతులతో పాటు రూ. వెయ్యితో ఐదు కన్సోలేషన్ బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. ఔత్సాహికులు jcibph.in లేదా 903120 01980, 9951143775లో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో మెట్రో రైల్ అడ్వర్టైజ్ లీజింగ్ హెడ్ కెవి నాగేంద్ర ప్రసాద్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ ఆనందిత సిన్హా, గిరీష్ భట్, మనోహర్ భట్, సీఎస్ చలం, అనిల్ కుమార్ సిద్దూ, పీ వీరభద్రుడు, కేసీజీఎఫ్ బుధపూర్ణిమ అధ్యక్షుడు అనిల్ దండూ, రమేష్ దాడిగల, రఘురాజ్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: బస్సులన్నీ మునుగోడు వైపు.. శివారు వాసుల అవస్థలు) -
తల్లి రుణం తీర్చుకోవడానికి.. ఓ తనయుడి కష్టాలు
సాక్షి, చెన్నై: అనారోగ్యంతో తల్లి మరణించింది.. అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. కానీ నవమాసాలు మోసి కని పెంచిన తల్లి గనుక పుట్టెడు దుఃఖంలోనూ ఎలాగైన చివరి మజిలీ పూర్తి చేయాలన్న సంకల్పం అతన్ని శ్మశానం వరకు తీసుకెళ్లిగలిగింది. నాలుగేళ్లుగా ఆ తల్లి కోసం తెచ్చిన వీల్‌చైర్ అతనికి దిక్కయింది. తల్లి మృతదేహాన్ని అందులో కూర్చోబెట్టుకుని శ్మశానానికి తరలించాడు. ఆదరించే వాళ్లు ఎవరూ లేకపోవడం, ఆర్థిక కష్టాలు పెరగడంతో వీల్‌చైర్‌నే పాడెగా మార్చుకోవాల్సి వచ్చిందని ఆ తనయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తిరుచ్చి జిల్లా మనప్పారై భారతీయార్ నగర్‌కు చెందిన మురుగానందం ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. తన తల్లి రాజేశ్వరి(74) అంటే మురుగానందంకు ఎంతో ప్రేమ. నాలుగేళ్ల కిందట తల్లి అనారోగ్యంతో వీల్‌చైర్‌కు పరిమితం కావడంతో అన్నీ తానై సేవలు చేశాడు. ఇటీవల ఆమె శరీరంపై దద్దుర్లు రావడంతో ఆప్తులు, ఇరుగు పొరుగు వారు ఆ ఇంటి వైపు రావడం మానేశారు. దురదతో కూడిన ఈ పుండ్లు అంటువ్యాధి అని ప్రచారం జరగడంతో ఆమెకు సేవలు అందిస్తున్న మురుగానందంను కూడా దూరం పెట్టేశారు. ఆర్థిక కష్టాలతో.. తల్లిని ఇంట్లోనే ఉంచి కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చిన మురుగానందకు ఆర్థిక కష్టాలు పెరిగాయి. రానురాను ఆదరించే వాళ్లు, ఆదుకునే వాళ్లు ఎవరూ లేకపోవడంతో తల్లికి వైద్యం అందించడం భారంగా మారింది. పనికి వెళ్లలేక ఇంటి పట్టునే ఉండి తల్లిని చూసుకునేవాడు. ఈ పరిస్థితుల్లో గురువారం వేకువజామున రాజేశ్వరి కన్నుమూసింది. ఆమె ఒంటిపై అధికంగా పుండ్లు ఉండడంతో అంత్యక్రియలకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారని తెలిసి, ఆర్థిక ఇబ్బందులతో పాడె కట్టడానికి కూడా డబ్బుల్లేక మృతదేహాన్ని ఇన్ని రోజులు తన తల్లి కోసం వినియోగించిన వీల్‌చైర్‌నే పాడెగా మార్చేశాడు. అందులో మృతదేహాన్ని ఉంచి పడిపోకుండా, ఆమె చీర సాయంతో కట్టేశాడు. ఎవరి కంట పడకుండా 2.5 కి.మీ దూరం వీల్‌చైర్‌లోనే శవాన్ని మనప్పారై నగరపాలక సంస్థ ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు తీసుకొచ్చాడు. వీల్‌చైర్‌తో వస్తున్న వ్యక్తిని చూసి అక్కడి సిబ్బంది ప్రశ్నించారు. తన దీన పరిస్థితిని వారికి మురుగానందం విన్నవించాడు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది శ్రీధరన్‌తో పాటు మరికొందరు మురుగానందం పరిస్థితిని అర్థం చేసుకుని తమవంతుగా అంత్యక్రియలకు అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేసి, సాంప్రదాయబద్ధంగా లాంఛనాలను పూర్తి చేయించారు. అలాగే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి మురుగానందంకు మానసికంగా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. చదవండి: దేశాలు దాటిన ప్రేమ..తల్లిదండ్రుల అనుమతితో -
శ్మశాన వింత! చితిపై పడుకోబెట్టబోతుంటే హఠాత్తుగా కళ్లు తెరిచి..
న్యూఢిల్లీ: మరికొన్ని సెకన్లలో చితిపై పడుకోబెట్టి, నిప్పంటించబోతుంటే మృతి చెందిన వ్యక్తి ఒక్క సారిగా కళ్లు తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బంధువుల కథనం ప్రకారం.. నారేలాలోని టిక్రీ ఖుర్ద్ గ్రామానికి చెందిన సతీష్ భరద్వాజ్ (62) ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడిని దహన సంస్కారాల నిమిత్తం కుటుంబ సభ్యులు శ్మశానికి తరలించారు కూడా. ఐతే చితిపై పడుకోబెట్టడానికి మృతుడి శరీరంపైనున్న గుడ్డను తొలగించగానే, అకస్మాత్తుగా కళ్లు తెరిచి, ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన వారు వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే ఉన్న ఒక వైద్యుడు అతడిని పరీక్షించి శ్వాస తీసుకుంటున్నాడని, వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లో వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారని, ఈ సంఘటన ఈ రోజు మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుందని వృద్ధుడి బంధువులు మీడియాకు తెలిపారు. చదవండి: 15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్! -
శ్మశానానికి దారి చూపుతూ నాయకుల ఫ్లెక్సీలు.. సిగ్గుందా మీకు!
సాక్షి, బెంగళూరు : కోవిడ్ పేరుతో ప్రచారం పొందాలని ప్రయత్నించిన బీజేపీ నేతలు చివరకు నెటిజన్లతో చివాట్లు పెట్టించుకున్న సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. కోవిడ్ మృతుల అంత్యక్రియల కోసం అధికారులు నెలమంగల తాలూకా గిడ్డేనహళ్లి వద్ద ఉచితంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడే పబ్లిసిటీ పిచ్చితో నాయకులు ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యడియూరప్ప, రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్, బీడీఏ అధ్యక్షుడు ఎస్ఆర్ విశ్వనాథ్ తదితరుల ఫొటోలతో సోమవారం ఫ్లెక్సీ తయారు చేయించి శ్మశానానికి దారి...అంత్యక్రియలకు వచ్చేవారికి ఉచితంగా నీరు, కాఫీ, భోజనం ఏర్పాటు చేశామంటూ ప్రచారం చేసుకున్నారు. విషయం కాస్త పార్టీ పెద్దలకు తెలియడంతో నెలమంగల బీజేపీ నాయకులకు క్లాస్ తీసుకున్నారు. దీంతో సాయంత్రం సమయానికి ఫ్లెక్స్ తీయించేశారు. బీడీఏ అధ్యక్షుడు ఎస్ఆర్ విశ్వనాథ్ క్షమాపణలు కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో జనాలు.. ప్రధాని, సీఎం పరువు తీసేశారంటూ చీవాట్లు పెడుతున్నారు.ఫ్లెక్సీల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం నవ్వుతూ ఉన్న ఫోటోలు వేయడంతో నెటిజన్లు ‘మీకు సిగ్గు, మర్యాద ఏమైనా ఉందా.. కరోనాతో శవరాజకీయాలు చేస్తారా’ అంటూ బీజేపీ నాయకులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
దహన సంస్కారాలు కట్టెలతో కాదు పిడకలతో
న్యూఢిల్లీ: సాధారణంగా చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేయాలంటే కట్టెలు వినియోగిస్తారు. కానీ ఇకపై ఢిల్లీలో కట్టెల బదులు ఆవు పేడతో చేసిన పిడకలు వినియోగించనున్నారు. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇది అమలు చేయనున్నట్లు మేయర్ అనామిక ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు వాడే కట్టెల స్థానంలో ఆవుపేడతో చేసిన పిడకలను వినియోగించాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. శ్మశానవాటికల్లో దహన సంస్కారాలకు ఆవుపేడతో చేసిన పిడకలను వాడాలని నిర్ణయించినట్లు మేయర్ తెలిపారు. ఆవుపేడతో చేసిన పిడకలతో మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. ఇప్పటికే ఆవుపేడతో చేసిన పిడకలను శ్మశానవాటికల వద్ద సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. దీనికి పలు సామాజిక సంస్థల నుంచి మద్దతు లభిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పిడకలతో దహన సంస్కారాలు సంప్రదాయమని.. దీంతోపాటు ఖర్చు తక్కువ ఉండడంతో పేదలకు ప్రయోజనకరమని మేయర్ అనామిక వివరించారు. బీజేపీ పాలిత కార్పొరేషన్ కావడంతో ఇలాంటి నిర్ణయం తీసకోవడంతో ప్రతిపక్షాలతో పాటు ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం అమలుచేసింది. గంగానది కలుషితం కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేలా 2018లో దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలను వినియోగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పిడకలతో దహనం చేస్తే దోషం ఉండదని పండితులు చెబుతున్నారు. నాగపూర్, జైపూర్, రోహతక్, జలగావ్, ఇండోర్, రాయ్‌పూర్, రూర్కెలాల్లో కూడా ఆవుపేడతో తయారుచేసిన పిడకలతోనే దహన సంస్కారాలు చేస్తున్నారు. -
ఒకే గుంతలో 17 మృతదేహాలు ఖననం
మనిషి బతికినన్నాళ్లూ కష్టాలు..కన్నీళ్లే! కొందరు డబ్బు కోసం ఆరాటం. మరికొందరికి అనారోగ్యం..పేదరికం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి సమస్యలు వారివి. ఈ బాధలు ఎలాగూ తప్పవు. అయితే చివరి మజిలీలో కూడా చనిపోయిన వారి బంధువులకు ప్రశాంతత ఉండటంలేదు. శవాలను పూడ్చటాని ఆరడుగుల స్థలం కూడా దొరక్క.. ఏం చేయాలో తెలియక మృతదేహాలను వెంటే ఉంచుకొని ఉరుకులు.. పరుగులు పెట్టాల్సి వస్తోంది. ప్రకాశం, యర్రగొండపాలెం: కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోతారు. నెమ్మదిగా తేరుకొని మృతదేహాన్ని ఎక్కడ ఖననమో లేదా దహనమో చేయాలన్న ఆలోచనలో పడిపోతారు. అయితే గ్రామాల్లో శ్మశాన వాటికలు లేనవారు అప్పటికప్పుడు స్థలాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 1038 పంచాయతీలను కలుపుకొని మొత్తం 4,686 గ్రామాలున్నాయి. గతంలో పంచాయతీకి ఒకటి ప్రకారం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో శ్మశానాలు అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకుగాను రూ 67.84 కోట్లు కేటాయించారు. ఒక్కొక్క శ్మశానం అభివృద్ధికి రూ 6.60 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ఆ నిధులతో ముఖద్వారం, స్నానాలగది, దహనం చేయటానికి ఒక ప్లాట్‌ఫాం వంటి నిర్మాణాలకు ఖర్చుపెట్టాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వ కాలంలో ఈ శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తిగా పచ్చనేతల కనుసన్నల్లోనే జరిగాయి. వారు డబ్బులు దండుకున్నారేతప్ప పూర్తిస్థాయిలో నిర్మించలేదు. అనేక ప్రాంతాల్లో అర్ధాంతరంగా నిర్మాణాలు నిలిపి వేశారు. భయం గుప్పెట్లో చిన్నారులు పెద్దారవీడు మండలంలోని మద్దెలకట్టలో శ్మాశానాలు లేకపోవడం వలన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల మధ్య రోడ్డుకు సమీపంలో దహన సంస్కరణలు చేస్తున్నారు. అక్కడ చెట్లు నీడ ఉంటుంది. ఈ నీడను ఆసరగా తీసుకొని మృతదేహాలను దహనం చేయడం, ఇతర కర్మకాండలు చేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే ఆ రోజు పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు. దహన కార్యక్రమాలు చూసి అనేకమంది చిన్నారులు భయపడిన సంఘటనలున్నాయని గ్రామస్తులు తెలిపారు. కుళ్లిపోయిన శవాలు 2010లో పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాల గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు వరికోతల కోసం గుంటూరు జిల్లా మాచర్లకు వెళ్లారు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి చేరటానికి సిమెంటులోడుతో ఉన్న లారీ ఎక్కారు. మార్గమధ్యంలో లారీ బోల్తాపడటంటో ఆ గ్రామానికి చెందిన 17 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు శవాలను గ్రామంలోనే ఉంచి ఆందోళన చేపట్టాయి. మూడు రోజులపాటు శవాలు ఖననం చేయకపోవడంతో అవి కుళ్లి దుర్గంధం వ్యాపించింది. అయితే సమస్య పరిష్కారం అయినతరువాత ఆ మృతదేహాలను ఖననం చేయటానికి శ్మశానవాటికలేకుండా పోయింది. దీంతో ఒకే చోట జేసీబీతో పెద్దగుంత తీయించి 17 శవాలను ఒకే చోట ఖననం చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే నాటి ప్రభుత్వం శ్మశానం కోసం ఎకర స్థలాన్ని కేటాయించింది. అయిప్పటికీ ఆ స్థలానికి రక్షణలేకుండా పోయింది. పంట పొలాలుగా మార్చుకున్నారు త్రిపురాంతకం మండలంలోని సోమేపల్లి గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికతోపాటు సమీపంలో ఉన్న చెక్‌డ్యాంను సైతం కొందరు ఆక్రమించుకొని పంట పొలాలుగా మార్చుకున్నారు. ఈ గ్రామంలోని వాగు పోరంబోకు భూమి 43.35 ఎకరాలు ఉంది. దీనిని గ్రామస్తులు శ్మశాన వాటిక కింద, పశువులమేత బీడుకింద ఉపయోగించుకుంటున్నారు. అయితే కొంతమంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే క్రమంలో శ్మశాన వాటిక కింద వదలి పెట్టిన భూమిని, అక్కడే ఉన్న చెక్ డ్యాంను సైతం ఆక్రమించు కొని పంటలను వేసుకుంటున్నా అధికారుల్లో చలనం కనిపించడంలేదు. -
చివరి మజిలీకీ తిప్పలే!
ఆమదాలవలస రూరల్ : రాష్ట్రంలో అడుగడుగునా సిమెంటు రోడ్లంటూ ప్రభుత్వ ప్రచారాలు ఓ వైపు.. శ్మశానానికి వెళ్లేందుకు కనీసం రోడ్డు లేక పొలాల మధ్యనే శవాన్ని తరలించాల్సిన ‘నడక’యాతన మరోవైపు. మనిషి చివరి మజిలీ అంతిమయాత్రకు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి బుధవారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొర్లకోటలో దాపురించింది. గ్రామంలోని ఎస్సీ వీధికి చెందిన కలివరపు సరోజనమ్మ (60) అనారోగ్యంతో చనిపోయింది. ఈమె మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు శ్మశాన వాటికకు చేరుకునేందుకు రహదారి సదుపాయం లేకపోవడంతో సుమారు కిలో మీటర్ దూరం పంటపొలాల్లో నుంచి శవాన్ని తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. శ్మశానవాటికకు రహదారి ఏర్పాటు చేయాలని పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
శ్రీదేవికి కన్నీటి వీడ్కోలు..
ముంబై : ప్రముఖ సినీనటి శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబై విల్లేపార్లేలోని సేవా సమాజ్ శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. దీంతో దివి నుంచి భువికి దిగి వచ్చి, దశాబ్దాలపాటు వెండితెరను రాణిలా ఏలిన అతిలోక సుందరి మళ్లీ దివికి వెళ్లిపోయింది. మరపురాని పాత్రలతో అర్థ శతాబ్దం పాటు అశేష అభిమానగణాన్ని అలరించి, కోట్లాది హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న ఆమె... మానవా ఇక సెలవ్ అంటూ స్వర్గానికి సాగిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య ఆమెకు తుది వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది. మరోవైపు తమ అభిమాన నటిని కడసారి చూపు కోసం అభిమానులు శ్మశానవాటిక వద్దకు పోటెత్తారు. అంతకు ముందు సెలబ్రేషన్స్ క్లబ్ నుంచి విల్లేపార్లే వరకు సాగిన శ్రీదేవి అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అభిమాన నటిని చివరిసారి చూసుకునేందుకు కడసారి వీడ్కోలు పలికి, నివాళి అర్పించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అశేష జనవాహినితో ముంబై పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అంతిమ సంస్కారం సందర్భంగా శ్రీదేవిని... ఆమెకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీర కంచిపట్టు చీరతో అలంకరించారు. ఎప్పుడూ అందంగా కనిపించడం ఆమెకి అలవాటు. చివరిక్షణాల్లోనూ శ్రీదేవిని అలాగే తయారు చేశారు. అభిమానుల మనసుల్లో నుంచి ఆ మనోహర రూపం చెదిరిపోకుండా ఉండేలా ఆమె కుటుంబసభ్యులు చర్యలు తీసుకున్నారు. శ్రీదేవి భౌతికకాయాన్ని ఉంచిన వాహనాన్ని మల్లెపూలు, లిల్లీపూలతో అలంకరించారు. మల్లెపూలు అంటే శ్రీదేవి ఎంతో ఇష్టమట. అందుకే ఆమె పార్దీవదేహాన్ని తరలించే వాహనాన్ని ఆ పూలతోనే తీర్చిదిద్దారు. వాహనంలో శ్రీదేవి భౌతికకాయంతో పాటు ఆమె కుటుంబీకులు ఉన్నారు. తరలి వచ్చిన తారాలోకం అనంతలోకాలకు వెళ్లిపోయిన ప్రముఖ సినీనటి శ్రీదేవి చివరిచూపు కోసం స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు పోటెత్తారు.హేమామాలిని, ఐశ్వర్యారాయ్, జయాబచ్చన్, సుస్మితాసేన్, మాధురి దీక్షిత్, అక్షయ్ కుమార్, టబు, అజయ్ దేవగన్, కాజోల్, అర్జున్ కపూర్, సంజయ్ లీలా బన్సాలి, సారా అలీఖాన్, జాక్వలైన్ ఫెర్నాండెజ్, రీతేష్ దేశ్‌ముఖ్, అర్భాజ్ ఖాన్, ఇషా డియోల్, కరణ్ జోహార్, ఫరా ఖాన్, సుభాయ్ ఘాయ్ తదితరులు భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. అలాగే రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్,అర్జున్ సహా పలువురు దక్షిణాది నటులు శ్రీదేవి భౌతికకాయాన్ని వద్ద అశ్రునివాళి అర్పించారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ సినిమా రంగాలకు చెందిన ప్రముఖ నటీనటులంతా శ్రీదేవి ఇంటికి తరలివచ్చారు. తమతో కలసి నటించి, మెప్పించిన సహనటిని కడసారి సందర్శించి కన్నీటి నివాళి అర్పించారు. సినీ రంగంతో పాటు రాజకీయ, పారిశ్రామికరంగాలకు చెందిన ప్రముఖులు శ్రీదేవి ఇంటికి వచ్చి ఆమెకు అశ్రు నివాళి అర్పించారు. మరోవైపు విల్లేపార్లేలోని సేవా సమాజ్ శ్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో సినీ నటులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.నటి విద్యాబాలన్, ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఫర్హాన్ అక్తర్, దియా మిర్జా, ఆమె భర్త సాహిల్, అనిల్ అంబానీ, అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్ తదితరులు హాజరయ్యారు. -
శ్మశానంలో ఉచిత వైఫై
కొరుక్కుపేట(చెన్నై): చెన్నై అన్నానగర్, న్యూ ఆవడి రోడ్డులోని వేలాంగాడు శ్మశాన వాటికలో శనివారం నుంచి ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు శ్మశానవాటికలో శనివారం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(ఐసీడబ్ల్యూవో), గ్రేటర్ చైన్నై కార్పొరేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ మీనంబాక్కం సంయుక్త ఆధ్వర్యంలో ఈ వైఫై సేవలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఉచిత వైఫై ద్వారా అంత్యక్రియలను విదేశాల్లోని ఆప్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కలుగుతుందని చెప్పారు. అంత్యక్రియలకు రాలేని వారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుందని వివరించారు. -
వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు పూర్తి