షీ–టీమ్‌ల బలోపేతానికి నోడల్‌ టీమ్‌ | SHE Nodal Team Appointed As Women's Protection Division By Swati Lakra | Sakshi
Sakshi News home page

షీ–టీమ్‌ల బలోపేతానికి నోడల్‌ టీమ్‌

Published Fri, Dec 20 2019 3:33 AM | Last Updated on Fri, Dec 20 2019 3:33 AM

SHE Nodal Team Appointed As Women's Protection Division By Swati Lakra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో షీ–టీమ్‌ల పనితీరును మరింత బలోపేతం చేసే దిశగా వుమెన్‌ సేఫ్టీ వింగ్‌ ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లోని షీ–టీమ్‌లకు శిక్షణ ఇవ్వడం, ఫిర్యాదులపై నియమిత సమయంలో చర్యలు చేపట్టారా? లేదా? వంటి పలు అంశాలను పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా రాష్ట్రస్థాయిలో షీ నోడల్‌ టీమ్‌ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని మహిళా రక్షణ విభాగం కార్యాలయంలో గురువారం ఈ ప్రత్యేక షీ–టీమ్‌ విభాగాన్ని వుమెన్‌ ప్రొటెక్షన్‌ విభాగం ఐజీ స్వాతి లక్రా ప్రారంభించారు. హైదరాబాద్‌లో క్యాబ్‌లను బుక్‌ చేసుకోగానే బుక్‌ చేసిన వారి సమాచారంతోపాటు క్యాబ్‌ ప్రయాణించే మార్గాన్ని తెలుసుకునేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్నామని స్వాతి లక్రా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement