Nodel teams
-
షీ–టీమ్‌ల బలోపేతానికి నోడల్ టీమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షీ–టీమ్‌ల పనితీరును మరింత బలోపేతం చేసే దిశగా వుమెన్ సేఫ్టీ వింగ్ ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లోని షీ–టీమ్‌లకు శిక్షణ ఇవ్వడం, ఫిర్యాదులపై నియమిత సమయంలో చర్యలు చేపట్టారా? లేదా? వంటి పలు అంశాలను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రస్థాయిలో షీ నోడల్ టీమ్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని మహిళా రక్షణ విభాగం కార్యాలయంలో గురువారం ఈ ప్రత్యేక షీ–టీమ్ విభాగాన్ని వుమెన్ ప్రొటెక్షన్ విభాగం ఐజీ స్వాతి లక్రా ప్రారంభించారు. హైదరాబాద్‌లో క్యాబ్‌లను బుక్ చేసుకోగానే బుక్ చేసిన వారి సమాచారంతోపాటు క్యాబ్ ప్రయాణించే మార్గాన్ని తెలుసుకునేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని స్వాతి లక్రా తెలిపారు. -
అసౌకర్యం కలిగిస్తే నోటీసులే!
బంజారాహిల్స్ (హైదరాబాద్): భవన నిర్మాణ దారులు... నిర్మాణ సామాగ్రిని రోడ్డుపై ఉంచితే వారికి చిక్కులే..! ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరగనున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా నోడల్ బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద రోడ్డు పక్కన నిర్మాణ సామాగ్రి ఉంటే వెంటనే వారికి నోటీసులు జారీ చేయాలని అధికారులు తలపెట్టారు. భవన నిర్మాణదారులు తమ సామాగ్రిని నిర్ధేశించిన ప్రాంతంలోనే ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోడ్ల పక్కన నిర్మాణాలు జరుగుతుంటే నిర్మాణ సామాగ్రిని ఫుట్‌పాత్‌లపైన, రోడ్లపైన పెడుతుండటంతో పాదచారులు, వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్న నేపథ్యంలో అధికారులు ఈ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఐదు రోజుల్లోపు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని యోచిస్తున్నారు.