బంజారాహిల్స్ (హైదరాబాద్): భవన నిర్మాణ దారులు... నిర్మాణ సామాగ్రిని రోడ్డుపై ఉంచితే వారికి చిక్కులే..! ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరగనున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా నోడల్ బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద రోడ్డు పక్కన నిర్మాణ సామాగ్రి ఉంటే వెంటనే వారికి నోటీసులు జారీ చేయాలని అధికారులు తలపెట్టారు. భవన నిర్మాణదారులు తమ సామాగ్రిని నిర్ధేశించిన ప్రాంతంలోనే ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం రోడ్ల పక్కన నిర్మాణాలు జరుగుతుంటే నిర్మాణ సామాగ్రిని ఫుట్‌పాత్‌లపైన, రోడ్లపైన పెడుతుండటంతో పాదచారులు, వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్న నేపథ్యంలో అధికారులు ఈ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఐదు రోజుల్లోపు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని యోచిస్తున్నారు.
అసౌకర్యం కలిగిస్తే నోటీసులే!
Published Thu, May 14 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM
Advertisement
Advertisement