సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలాకాలం తర్వాత భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఒకేసారి 29 మంది సీనియర్ అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేయడంతో పాటు మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యురిటీ బ్యూరోలకు అధికారులను నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌కు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అడిషనల్ డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.
బదిలీలు ఇలా..
► అదనపు డీజీ ఆర్గనైజేషన్స్‌గా ఉన్న అదనపు డీజీ రాజీవ్‌రతన్‌ను తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు.
► అడిషనల్ డీజీ రైల్వేస్ రోడ్ సేఫ్టీగా ఉన్న సందీప్ శాండిల్యను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
► గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని అదనపు డీజీ ఆర్గనైజేషన్స్, లీగల్‌గా బదిలీ చేశారు.
► అదనపు డీజీ పర్సానెల్‌గా ఉన్న బి.శివధర్‌రెడ్డి రైల్వేస్, రోడ్ సేఫ్టీ అదనపు డీజీగా బదిలీ అయ్యారు.
► టీఎస్‌ఎస్పీ అదనపు డీజీగా ఉన్న అభిలాష బిస్త్‌ను అదనపు డీజీ వెల్ఫేర్, స్పోర్ట్స్‌గా బదిలీ చేశారు. అదేవిధంగా హోంగార్డ్స్ అదనపు డీజీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.
► ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న షికా గోయల్‌ను అదనపు డీజీ ఉమెన్ సేఫ్టీ, షీటీమ్స్, భరోసా సెంటర్స్‌గా బదిలీ చేశారు.
►టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావుకు అదనపు డీజీ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.
► ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్‌చార్జి స్వాతిలక్రాను టీఎస్‌ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా బదిలీ చేశారు.
► పోస్టింగ్ కోసం వెయింటింగ్‌లో ఉన్న విజయ్‌కుమార్‌ను గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీగా బదిలీ చేశారు.
► నార్త్‌జోన్ అదనపు డీజీగా ఉన్న వై.నాగిరెడ్డిని తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేశారు.
►పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న విక్రమ్ మాన్‌సింగ్‌ను హైదరాబాద్ సిటీ శాంతిభద్రతల అదనపు కమిషనర్‌గా నియమించారు.
► రాచకొండ అదనపు కమిషనర్‌గా ఉన్న జి.సుదీర్‌బాబును హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అదనపు సీపీగా బదిలీ చేశారు.
► మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న షాహ్నవాజ్ ఖాసీంకు మల్టీజోన్ –2 ఐజీగా బాధ్యతలు అప్పగించారు.
► వెయిటింగ్‌లో ఉన్న తరుణ్ జోషిని ఐజీ ట్రైనింగ్స్‌గా నియమించారు.
► వెయిటింగ్‌లో ఉన్న వీబీ కమలాసన్‌రెడ్డికి ఐజీ పర్సానెల్‌గా బాధ్యతలు అప్పగించారు.
► రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఎస్.చంద్రశేఖర్‌రెడ్డిని మల్టీజోన్–1 ఐజీగా బదిలీ చేశారు.
► హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీగా ఉన్న ఎం.రమేశ్‌ను డీఐజీ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్‌గా బదిలీ చేశారు.
► హైదరాబాద్ జాయింట్ సీపీగా ఉన్న కార్తికేయను డీఐజీ ఇంటిలిజెన్స్‌గా నియమించారు.
► తెలంగాణ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ కె.రమేశ్‌నాయుడును రాజన్న జోన్ డీఐజీగా బదిలీ చేశారు.
► సీఐడీ డీఐజీగా ఉన్న ఎం.శ్రీనివాసులును హైదరాబాద్ సిటీ సీఏఆర్ జాయింట్ సీపీగా బదిలీ చేశారు.
► వెయిటింగ్‌లో ఉన్న తఫ్సీర్ ఇక్బాల్‌ను డీఐజీ ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు బదిలీ చేశారు.
► హైదరాబాద్ జాయింట్ కమిషనర్‌గా ఉన్న డా.గజరావు భూపాల్‌ను రాచకొండ జాయింట్ సీపీగా నియమించారు.
► నల్లగొండ ఎస్పీగా ఉన్న రెమా రాజేశ్వరిని యాదాద్రి జోన్ డీఐజీగా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నల్లగొండ ఎస్పీగా కూడా కొనసాగుతారు.
► వెయిటింగ్‌లో ఉన్న ఎల్‌ఎస్ చౌహాన్‌ను జోగుళాంబ జోన్ డీఐజీగా ఎస్పీ ర్యాంకులో నియమించారు.
► వెయిటింగ్‌లో ఉన్న కె.నారాయణ్ నాయక్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా నియమించారు.
► సీఐడీలో ఎస్పీగా ఉన్న జె.పరిమళ హన నూతన్‌ను హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ అడ్మిన్‌గా బదిలీ చేశారు.
► వెయిటింగ్‌లో ఉన్న ఆర్.భాస్కరన్‌ను కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఎస్పీగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment