IPS transfer
-
ఏపీలో 16 మంది ఐపీఎస్‌ల బదిలీ
విజయవాడ, సాక్షి: 16 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్పీ&ఎల్ ఐజీగా రవిప్రకాష్ఇంటిలిజెన్స్ ఐజీగా పీహెచ్.డి.రామకృష్ణఇంటిలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్పఅడ్మినిస్ట్రేషన్ డీఐజీగా అమ్మిరెడ్డిరోడ్ సేఫ్టీ డీఐజీగా సీహెచ్.విజయరావుడీజీపీ ఆఫీస్ ఏఐజీగా సిద్ధార్ధ్ కౌశల్విశాఖ సిటీ డీసీపీగా మేరీ ప్రశాంతిఅనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హాకాకినాడ మూడవ బెటాలియన్ కమాండెంట్‌గా ఎం.దీపికఒంగోలు పీటీసీ ప్రిన్సిపల్‌గా జి.ఆర్.రాధికఇంటిలిజెన్స్ సెక్యూరిటీ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్పీటీవో ఎస్పీగా కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డివిజయవాడ క్రైమ్ డీసీపీగా తిరుమలేశ్వర్ రెడ్డిడీజీపీ హెడ్ క్వార్టర్స్ కు అట్టాడ బాపూజీ ,కె.వి.శ్రీనివాసరావు అటాచ్ మెంట్👉చదవండి : 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ జగన్ -
రెడ్‌బుక్ కుట్ర.. ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అమలుచేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం కక్ష సాధింపు చర్యలు పతాకస్థాయికి చేరుతున్నాయి. ఇందుకోసం పోలీసు వ్యవస్థనే భ్రష్టుపట్టించేందుకు బరితెగిస్తోంది. అందులో భాగంగానే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్‌గున్నీలను సస్పెండ్ చేస్తూ ఆదివారం మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ‘వలపు వల(హనీ ట్రాప్) వేసి బడా బాబులను బురిడీకొట్టించే కేసుల్లో నిందితురాలు కాదంబరి జత్వానీని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు తెరతీశారు. చంద్రబాబు ప్రభుత్వ కథా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో సాగిన ఈ కక్ష సాధింపు కుట్ర కోసం ఏకంగా న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడమే కాదు.. నిబంధనలనూ తుంగలో తొక్కారు. ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించకుండానే వారిని సస్పెండ్ చేయడంపట్ల పోలీసు వర్గాలు విభ్రాంతి వ్యక్తంచేస్తున్నాయి.విచారణ అధికారిగా జూనియర్ అధికారి..సాధారణంగా.. ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదులు వస్తే విచారణకు పాటించాల్సిన నిబంధనలను నిర్భీతిగా చంద్రబాబు సర్కారు ఉల్లంఘించింది. సస్పెన్షన్‌కు గురైన ముగ్గురిలో పీఎస్ఆర్ ఆంజనేయుడు డీజీ స్థాయి, కాంతిరాణ ఐజీ స్థాయి, విశాల్ గున్నీ డీఐజీ స్థాయి అధికారులు. వారిపై ఫిర్యాదులొస్తే వారికంటే ఉన్నతస్థాయి అధికారినిగానీ సమానస్థాయి అధికారికిగానీ విచారణ బాధ్యతలు అప్పగించాలి. కానీ, వారికంటే జూనియర్ అయిన ఎస్పీ స్థాయి అధికారిగా ఉన్న విజయవాడ డీసీపీ స్రవంతి రాయ్‌ను విచారణాధికారిగా నియమించడం గమనార్హం. ఆమె కూడా నిబంధనలను పాటించకుండానే విచారణ తంతు ముగించారు. ఫిర్యాదు వచ్చిన ముగ్గురు పోలీసు అధికారులను ఆమె కనీసం సంప్రదించనే లేదు. పైగా వారి నుంచి వివరాలు తెలసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ వాంగ్మూలాలు నమోదుచేయాలన్న కనీస నిబంధనను కూడా పాటించకపోవడం విడ్డూరం. మరి స్రవంతి ఏ ప్రాతిపదికన విచారణ నిర్వహించారన్నది అంతుబట్టడమే లేదు. ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లుగానే ఆమె ఏకపక్షంగా నివేదిక సమర్పించారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు కనుసన్నల్లోనే సాగినట్లు స్పష్టమవుతోంది. విచారణ ప్రక్రియ సక్రమంగా నిర్వహించారా లేదా అన్నది డీజీపీ కూడా పరిశీలించనే లేదు. ప్రభుత్వ ‘ముఖ్యనేత’ ఆదేశాల ప్రకారం ఈ ముగ్గుర్ని ఏకపక్షంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇదే కేసులో ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను కొన్నిరోజుల క్రితమే సస్పెండ్ చేశారు.ఏకపక్షంగా సస్పెన్షన్ ఉత్తర్వులు..పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేస్తూ జారీచేసిన ఉత్తర్వుల్లో అందుకు ఒక్క ఆధారాన్ని కూడా ప్రభుత్వం చూపించలేదు. ముంబై నటి కాదంబరి జత్వానీని నిబంధనలకు విరుద్ధంగా అరెస్టుచేసినందునే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. కానీ, ఆమె అరెస్టు ఎలా అక్రమం అనేందుకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేదు. ఎందుకంటే కాదంబరి జత్వానీ అరెస్టు అంశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి విజయవాడ పోలీసు అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారు. అదెలాగంటే..⇒ విజయవాడ న్యాయస్థానం నుంచి సెర్చ్ వారంట్ తీసుకుని మరీ పోలీసులు ముంబై వెళ్లారు.⇒ కాదంబరి జత్వానీని అరెస్టుచేసే విషయాన్ని ముంబై పోలీసులకు ముందుగానే తెలిపారు. వారి సహకారంతో వారి సమక్షంలోనే ఆమెను అరెస్టుచేశారు. ⇒ అనంతరం కాదంబరి జత్వానీ అరెస్టుకు సంబంధించిన పంచనామా నివేదికను ముంబై న్యాయస్థానానికి సమర్పించారు. ⇒ దాంతో ఆమె అరెస్టు సక్రమమేనని ముంబై న్యాయస్థానం నిర్ధారించి ఆమెను విజయవాడ తీసుకువెళ్లేందుకు అనుమతినిస్తూ పీటీ వారంట్ జారీచేసింది. ⇒ అనంతరం.. కాదంబరి జత్వానీని విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆమె అరెస్టు సక్రమమేనని విజయవాడ న్యాయస్థానం సైతం నిర్ధారించి.. ఆమెపై పోలీసులు నమోదు చేసిన అభియోగాలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలతో సంతృప్తి చెందింది. అందుకే ఆమెకు రిమాండ్ విధించింది. ..ఇలా కాదంబరి జత్వానీ అరెస్టు ప్రక్రియలో అప్పటి విజయవాడ పోలీసులు ఇంతగా నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే.. అసలు ఆమె అరెస్టు అక్రమమని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుండటం విడ్డూరంగా ఉంది. కనీసం ఒక్క ఆధారం కూడా చూపించకుండానే అక్రమ అరెస్టని ఏకపక్షంగా ప్రకటించడం ప్రభుత్వ కక్షసాధింపు చర్య తప్పా మరొకటి కాదని పోలీసు వర్గాలు విమర్శిస్తున్నాయి.కాదంబరి అక్రమాలకు స్పష్టమైన ఆధారాలు..వాస్తవానికి.. వలపు వల (హనీట్రాప్) వేసి బడాబాబులను బురిడీ కొట్టించడంతోపాటు కాదంబరి జత్వానిపై అనేక తీవ్రమైన అభియోగాలున్నాయి. తనపై యూపీలో కూడా పలు కేసులు ఉన్నాయని కాదంబరి జత్వానీనే తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఇక ఆమె కుక్కల విద్యాసాగర్ సంతకాలు ఫోర్జరీ చేసి ఆయన భూమిని అక్రమంగా విక్రయించేందుకు యత్నించారనడానికి కూడా ఆధారాలున్నాయి. డాక్టర్ కాకుండానే తనను తాను డాక్టరుగా ఆమె చెప్పుకున్నారు. బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం విధించిన షరతులకు లోబడే తాను ఇబ్రహీంపట్నంలో రెండు నెలలపాటు ఉన్నానని ఆమె తన పిటిషన్లోనే అంగీకరించారు. ఆ సమయంలో తమకు సహాయం కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారని కూడా తెలిపారు. అంటే.. అప్పటి విజయవాడ పోలీసులు నిబంధన మేరకే వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.ప్రభుత్వ పెద్దల కుట్రలో పాత్రధారులుగా విజయవాడ పోలీసులు.. అంతటి నేర చరిత్ర ఉన్న కాదంబరి జత్వానీ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ పోలీసులకు విశిష్ట అతిథిగా మారిపోయారు. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేసే కుట్ర అమలులో భాగంగా ఆమెకు ప్రభుత్వ అతిథి స్థాయిలో విజయవాడ పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారు. నిజానికి.. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న మహిళలు, బాలికల అత్యాచారాలపై కూడా ఏమాత్రం స్పందించని పోలీసులు కాదంబరి విషయంలో అత్యుత్సాహంతో వ్యవహరించారు. గతంలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా తప్పుల తడకగా ఉందని నెలక్రితం పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెతో తాజాగా మరో ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. రెండోసారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అరెస్టు చేసేందుకు డీసీపీ విశాల్ గున్నీని ప్రత్యేక విమానంలో ముంబై పంపించారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ, విశాల్ గున్నీ తదితరులు సాధారణ విమానంలోనే ముంబై వెళ్లారని.. విమాన టికెట్లు ముందురోజే బుక్ చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అంటే.. ప్రభుత్వ పెద్దల కక్ష సాధింపు కుట్రలో విజయవాడ పోలీసులు పాత్రధారులు, భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారన్నది సుస్పష్టం. ‘వలపు వల’ కేసుకు సంబంధించి నిందితురాలి విషయంలో పోలీసు వ్యవస్థ స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం దిగజారుస్తోందని పరిశీలకులు విమర్శిస్తున్నారు.క్యాట్‌ను ఆశ్రయించనున్న ముగ్గురు అధికారులు..ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా తమను సస్పెండ్ చేయడంపై పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించాలని పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ భావిస్తున్నట్లు సమాచారం. -
ఏపీలో 9 మంది ఐపీఎస్‌లు బదిలీ
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి ఐపీఎస్‌లను బదిలీ చేశారు. తాజాగా తొమ్మిది మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు.బదిలీ అయిన వారు వీరే..-లా అండ్ ఆర్డర్ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్-ఎస్పీఎఫ్ డీజీగా అంజనా సిన్హా- విజయవాడ సీపీగా ఎస్పీ రాజశేఖర బాబు- ఫైర్ సర్వీసెస్ డీజీగా పైదిరెడ్డి ప్రతాప్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీ.. రాచకొండ సీపీగా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.బదిలీల ప్రకారం.. రాచకొండ సీపీగా సుధీర్ బాబుఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషీ.రైల్వేస్ ఐజీగా రమేష్ నాయుడు, మల్టీ జోన్-2 ఐజీగా సత్యనారాయణవనపర్తి ఎస్పీగా గిరిధర్వరంగల్ ఐజీగా చంద్రశేఖర్ఆర్గనైజేషన్ ఏడీజీగా స్వాత్రిలక్రాగ్రేహౌండ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్రఎల్అండ్ఓ ఏడీజీగా మహేష్ భగవత్పీఎండ్ఎల్ ఏడీజీగా విజయ్ కుమార్మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డిఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామిబదిలీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
TS: ఐపీఎస్‌ల బదిలీలు.. రాచకొండ సీపీ ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త సీపీలు వీరే.. రాచకొండ సీపీ.. సుధీర్‌బాబు హైదరాబాద్ సీపీ.. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ సీపీ.. అవినాశ్ మహంతి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్.. సందీప్ శాండిల్యా మరోవైపు.. చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. -
ఇద్దరు మహిళా ఐపీఎస్‌లపై వేటు
సాక్షి, చైన్నె: ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ర్యాలీ, మరోవైపు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి కారణంగా దురైన ట్రాఫిక్ కష్టాలు ఇద్దరు మహిళా ఐపీఎస్‌లకు కష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో ఆ ఇద్దరు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ కంపల్సరీ వెయిటింగ్లో ఉంచారు. ఈ మేరకు మంగళవారం హోంశాఖ కార్యదర్శి పి. అముదా ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. బీజేపీ నేతృత్వంలో సోమవారం సాయంత్రం చైన్నెలో సనాత ధర్మానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. నుంగంబాక్కంలోని హిందూ దేవదాయ శాఖ కార్యాలయం వైపుగా బీజేపీ శ్రేణులు చొచ్చుకెళ్తున్నా పోలీసులు కొంత దూరం వరకు అడ్డుకోలేదు. ఈ పరిణామాలతో నుంగంబాక్కం పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. ఫలితంగా వాహనదారుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. అంతకు ముందు ఆదివారం రాత్రి పనయూరు సమీపంలో జరిగిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి రూపంలో ట్రాఫిక్ కష్టాలు తీవ్రమయ్యాయి. ఈ సెగ ఏకంగా సీఎం స్టాలిన్‌కు కూడా తగిలింది. ఆయన కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఈ రెండు ఘటనల పరిణామాలతో ఇద్దరు మహిళా ఐపీఎస్‌లపై పోలీసు బాసులు కన్నెర్ర చేశారు. అన్నామలై ర్యాలీ పుణ్యమా గ్రేటర్ చైన్నె పోలీసు(తూర్పు) లా అండ్ ఆర్డర్ డీఐజీ, జాయింట్ కమిషనర్ దిశా మిట్టల్, ఏఆర్ రెహ్మాన్ కారణంగా తాంబరం కమిషనరేట్ పరిధిలోని పల్లికరణై డిప్యూటీ కమిషనర్ దీపా సత్యన్‌ను బదిలీ చేశారు. ఈ ఇద్దర్నీ కంపల్సరీ వెయిటింగ్లో ఉంచారు. అలాగే, చైన్నె ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ ఎన్ఫోర్సుమెంట్ సెల్ ఎస్పీగా ఉన్న ఆదర్శ్ పచిరాను తిరునల్వేలి తూర్పు డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. రచ్చకెక్కిన మరక్కుమా..నెంజం! -
IAS,IPS బదిలీల విచారణ అత్యవసరంగా చేపట్టాలని తెలంగాణ హైకోర్టును కోరిన కేంద్రం
-
29 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలాకాలం తర్వాత భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఒకేసారి 29 మంది సీనియర్ అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేయడంతో పాటు మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యురిటీ బ్యూరోలకు అధికారులను నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌కు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అడిషనల్ డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. బదిలీలు ఇలా.. ► అదనపు డీజీ ఆర్గనైజేషన్స్‌గా ఉన్న అదనపు డీజీ రాజీవ్రతన్ను తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. ► అడిషనల్ డీజీ రైల్వేస్ రోడ్ సేఫ్టీగా ఉన్న సందీప్ శాండిల్యను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ► గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని అదనపు డీజీ ఆర్గనైజేషన్స్, లీగల్‌గా బదిలీ చేశారు. ► అదనపు డీజీ పర్సానెల్గా ఉన్న బి.శివధర్‌రెడ్డి రైల్వేస్, రోడ్ సేఫ్టీ అదనపు డీజీగా బదిలీ అయ్యారు. ► టీఎస్ఎస్పీ అదనపు డీజీగా ఉన్న అభిలాష బిస్త్‌ను అదనపు డీజీ వెల్ఫేర్, స్పోర్ట్స్‌గా బదిలీ చేశారు. అదేవిధంగా హోంగార్డ్స్ అదనపు డీజీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ► ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న షికా గోయల్‌ను అదనపు డీజీ ఉమెన్ సేఫ్టీ, షీటీమ్స్, భరోసా సెంటర్స్‌గా బదిలీ చేశారు. ►టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావుకు అదనపు డీజీ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ► ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జి స్వాతిలక్రాను టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా బదిలీ చేశారు. ► పోస్టింగ్ కోసం వెయింటింగ్‌లో ఉన్న విజయ్‌కుమార్‌ను గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీగా బదిలీ చేశారు. ► నార్త్‌జోన్ అదనపు డీజీగా ఉన్న వై.నాగిరెడ్డిని తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేశారు. ►పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న విక్రమ్ మాన్సింగ్ను హైదరాబాద్ సిటీ శాంతిభద్రతల అదనపు కమిషనర్‌గా నియమించారు. ► రాచకొండ అదనపు కమిషనర్‌గా ఉన్న జి.సుదీర్‌బాబును హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అదనపు సీపీగా బదిలీ చేశారు. ► మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న షాహ్నవాజ్ ఖాసీంకు మల్టీజోన్ –2 ఐజీగా బాధ్యతలు అప్పగించారు. ► వెయిటింగ్లో ఉన్న తరుణ్ జోషిని ఐజీ ట్రైనింగ్స్గా నియమించారు. ► వెయిటింగ్లో ఉన్న వీబీ కమలాసన్‌రెడ్డికి ఐజీ పర్సానెల్గా బాధ్యతలు అప్పగించారు. ► రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఎస్.చంద్రశేఖర్‌రెడ్డిని మల్టీజోన్–1 ఐజీగా బదిలీ చేశారు. ► హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీగా ఉన్న ఎం.రమేశ్‌ను డీఐజీ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్‌గా బదిలీ చేశారు. ► హైదరాబాద్ జాయింట్ సీపీగా ఉన్న కార్తికేయను డీఐజీ ఇంటిలిజెన్స్‌గా నియమించారు. ► తెలంగాణ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ కె.రమేశ్‌నాయుడును రాజన్న జోన్ డీఐజీగా బదిలీ చేశారు. ► సీఐడీ డీఐజీగా ఉన్న ఎం.శ్రీనివాసులును హైదరాబాద్ సిటీ సీఏఆర్ జాయింట్ సీపీగా బదిలీ చేశారు. ► వెయిటింగ్లో ఉన్న తఫ్సీర్ ఇక్బాల్‌ను డీఐజీ ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు బదిలీ చేశారు. ► హైదరాబాద్ జాయింట్ కమిషనర్‌గా ఉన్న డా.గజరావు భూపాల్‌ను రాచకొండ జాయింట్ సీపీగా నియమించారు. ► నల్లగొండ ఎస్పీగా ఉన్న రెమా రాజేశ్వరిని యాదాద్రి జోన్ డీఐజీగా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నల్లగొండ ఎస్పీగా కూడా కొనసాగుతారు. ► వెయిటింగ్లో ఉన్న ఎల్ఎస్ చౌహాన్‌ను జోగుళాంబ జోన్ డీఐజీగా ఎస్పీ ర్యాంకులో నియమించారు. ► వెయిటింగ్లో ఉన్న కె.నారాయణ్ నాయక్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా నియమించారు. ► సీఐడీలో ఎస్పీగా ఉన్న జె.పరిమళ హన నూతన్‌ను హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ అడ్మిన్‌గా బదిలీ చేశారు. ► వెయిటింగ్లో ఉన్న ఆర్.భాస్కరన్‌ను కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఎస్పీగా నియమించారు. -
తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు.. ఇన్చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. డిసెంబర్ 31వ తేదీతో ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో బదిలీలు జరిగాయి. బదిలీల అనంతరం తెలంగాణ ఇన్చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. - సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్. - రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్. - ఏసీబీ డీజీగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు. - లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్. - హోంశాఖ కార్యదర్శిగా జితేందర్. -
భారీగా ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు బదిలీల జాబితాను ముందుగా సిద్ధం చేసిన ప్రభుత్వం.. శనివారం జీవో జారీ చేసింది. దీనిలో భాగంగా ప్రస్తుతం విజయవాడ సీపీగా సేవలు అందిస్తున్న ద్వారకా తిరుమలరావును రైల్వేస్ డీజీపీగా బదిలీ చేశారు.. ఆయన స్థానంలో విజయవాడ సీపీగా బీ శ్రీనివాసులను నియమించారు. ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావు విజయవాడ సీపీగా బి.శ్రీనివాసులు ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీగా ఎన్.బాలసుబ్రహ్మణ్యం రోడ్‌సేఫ్టీ అడిషనల్ డీజీపీగా కృపానంద త్రిపాటి ఉజేలా ఎస్ఈబీ డైరెక్టర్‌గా పిహెచ్డీ రామక్రిష్ణ గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆర్.ఎన్.అమ్మిరెడ్డి శ్రీకాకుళం ఎస్పీగా అమిత్ బర్దార్ డీజీపీ కార్యాలయం(అడ్మిన్) ఏఐజీగా ఉదయ్ భాస్కర్ విశాఖ డీసీపీ 1గా ఐశ్వర్య రస్తోగి ఐపీఎస్ అధికారి ఎస్.రంగారెడ్డిని హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశం ఎస్ఐబీ ఎస్పీగా బాబూజీ అట్టాడ విశాఖ రూరల్ ఎస్పీగా బి.కృష్ణారావు విజయవాడ రైల్వేస్ ఎస్పీగా సీహెచ్ విజయారావు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా కె.నారాయణ నాయక్ సీఐడీ ఎస్పీగా గ్రేవల్ నవదీప్ సింగ్ గుంటూరు రూరల్ ఎస్పీగా విశాల్ గున్నీ మంగళగిరి ఏపీఎస్పీ కమాండెంట్‌గా ఎం.దీపిక -
ఏపీలో11మంది ఐపీఎస్‌ల బదిలీ
హైదరాబాద్: 11మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. గురువారం ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి... ►పి. వెంకటరామిరెడ్డి - అనంతపురం పీటీసీ ప్రిన్సిపాల్ ►పీఎస్ఆర్ అంజనేయులు - డైరెక్టర్ పోలీస్ కమ్యూనికేషన్ ►అతుల్ సింగ్ - పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ ►ఎహసాన్ రజా - హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి ►శ్యామ్ సుందర్- ఎస్పీ పీటీవో ►ఇ. దామోదర్ - డైరెక్టర్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ►మాదిరెడ్డి ప్రతాప్ - ఎస్పీఎఫ్ డీజీ ►టీఏ త్రిపాఠి- అగ్నిమాపక శాఖ డీజీ ►త్రిపానంద త్రిపాఠి ఉజేలా- ఐజీ హోంగార్డ్ ►జి.సూర్యప్రకాశ్ రావు- పోలీస్ ప్రధాన కార్యాలయం ►ఎన్. మధుసూదన్ రెడ్డి- డీఐజీ, సిబ్బంది వ్యవహారాలు