సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు బదిలీల జాబితాను ముందుగా సిద్ధం చేసిన ప్రభుత్వం.. శనివారం జీవో జారీ చేసింది. దీనిలో భాగంగా ప్రస్తుతం విజయవాడ సీపీగా సేవలు అందిస్తున్న ద్వారకా తిరుమలరావును రైల్వేస్ డీజీపీగా బదిలీ చేశారు.. ఆయన స్థానంలో విజయవాడ సీపీగా బీ శ్రీనివాసులను నియమించారు.
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు..
- రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావు
- విజయవాడ సీపీగా బి.శ్రీనివాసులు
- ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీగా ఎన్.బాలసుబ్రహ్మణ్యం
- రోడ్‌సేఫ్టీ అడిషనల్ డీజీపీగా కృపానంద త్రిపాటి ఉజేలా
- ఎస్‌ఈబీ డైరెక్టర్‌గా పిహెచ్‌డీ రామక్రిష్ణ
- గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆర్.ఎన్.అమ్మిరెడ్డి
- శ్రీకాకుళం ఎస్పీగా అమిత్ బర్దార్
- డీజీపీ కార్యాలయం(అడ్మిన్) ఏఐజీగా ఉదయ్ భాస్కర్
- విశాఖ డీసీపీ 1గా ఐశ్వర్య రస్తోగి
- ఐపీఎస్ అధికారి ఎస్.రంగారెడ్డిని హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశం
- ఎస్‌ఐబీ ఎస్పీగా బాబూజీ అట్టాడ
- విశాఖ రూరల్ ఎస్పీగా బి.కృష్ణారావు
- విజయవాడ రైల్వేస్ ఎస్పీగా సీహెచ్ విజయారావు
- పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా కె.నారాయణ నాయక్
- సీఐడీ ఎస్పీగా గ్రేవల్ నవదీప్ సింగ్
- గుంటూరు రూరల్ ఎస్పీగా విశాల్ గున్నీ
- మంగళగిరి ఏపీఎస్పీ కమాండెంట్‌గా ఎం.దీపిక
Comments
Please login to add a commentAdd a comment