పెళ్లి తర్వాత కథ మలుపు.. చివరకు.. | Lovers Get Married By She Team In Khammam | Sakshi
Sakshi News home page

పెళ్లి తర్వాత కథ మలుపు.. చివరకు..

Published Mon, Jan 11 2021 7:06 PM | Last Updated on Mon, Jan 11 2021 7:13 PM

Lovers Get Married By She Team In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం : పెద్దలు వారి ప్రేమను కాదన్నారు. అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత కథ మలుపు తిరిగి, కొన్ని ఊహించని సంఘటనలతో చివరకు ప్రేమించిన వాడితో అమ్మాయికి రెండో పెళ్లి అయింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.  వివరాలు.. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం నర్సింహులు గూడెంకు చెందిన కళ్యాణ్, నేలకొండపల్లి మండలం చెరువు మాదారంకు చెందిన యడవల్లి పావని గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కానీ, ఆ ఇద్దరి ప్రేమను వారి కుటుంబాలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమెకు వేరే సంబంధం చూసి వివాహం చేశారు. అయితే పెళ్లైన కొద్ది రోజుల్లోనే అనారోగ్యంతో ఉన్న ఆమెను స్ధానిక అసుపత్రిలో వైద్య  పరిక్షలు చేయించిన భర్తకు అప్పటికే అమె గర్భవతి అని తెలిసింది.

దీంతో అసలు ప్రేమ విషయం తెలుసుకుని భార్యకు విడాకులు ఇచ్చాడు. ఏమి చేయాలో తోచని పరిస్థితితో ఆ యువతి షీ టీం సీఐ అంజలిని కలిసింది. ప్రేమ విషయం సీఐకి చెప్పింది. తర్వాత సీఐ అంజలి గతంలో ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులను సదరు యువతి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇరువురి కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించారు. వారి సమక్షంలో ప్రేమించిన యువకుడితో వివాహం చేయించారు. దంపతులకు సీఐ అంజలి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement