నడిగూడెం: మహిళల రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నట్లు షీ టీమ్ జిల్లా ఇన్‌చార్జ్ సునితా మోహన్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎస్పీ దుగ్గల్ ఆదేశాల మేరకు జిల్లాలో నిత్యం 50 షీ టీమ్ బృందాలు పాఠశాలలు, కళాశాలలు, కూడలుల వద్ద పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా మానసికంగా, ఫోన్‌ల ద్వారా వేధిస్తే నేరుగా 100 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 200 ఫిర్యాదులు ఫోన్‌ల ద్వారా వచ్చాయన్నారు.
వాటిలో 45 ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకున్నామన్నారు. మిగతా వారికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. అనంతరం సూర్యాపేట డీఎస్పీ రశీద్ మాట్లాడారు. చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టాలు కూడా కఠినంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్స్‌పాల్ ఎం.పవన్ కుమార్, స్థానిక సర్పంచ్ నూనె ఇందిరా నాగన్న, ఎస్సై బిల్లా కిరణ్ కుమార్, ప్రిన్స్‌పాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి నర్సిరెడ్డి, అద్యాపకులు సం ఘం రాష్ట్ర కార్యదర్శి అశోక్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు ఆవుల వెంకన్న, కర్నాటి శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళల రక్షణే ప్రధాన ధ్యేయం
Published Fri, Sep 4 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM
Advertisement