nadigudem
-
స్త్రీనిధి రుణం.. మహిళలకు వరం !
సాక్షి, నడిగూడెం : పొదుపు సంఘంలో సభ్యులుగా చేరి నెలసరి పొదుపు చేస్తూనే ప్రభుత్వం కల్పించిన స్త్రీ నిధి రుణాల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటూ, సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారు పలు గ్రామాల మహిళలు. సంఘం ద్వారా వచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకుంటూ నెలసరి పొదుపు పాటిస్తూ ఉపాధి పొందుతున్నారు. స్వయం ఉపాధిపై దృష్టి.. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మంజూరైన స్త్రీ నిధి రుణాలతో పలువురు మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. కిరాణం, ఫ్యాన్సీ షాపులు, గొర్రెల పెంపకం, టైలరింగ్, గాజుల షాపులు ఇంకా పలు రంగాలను ఎంచుకొని లబ్ధిపొందుతున్నారు. స్వయం సహయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు చేసిన పొదపు సంఘం నిర్వహణను పరిగణలోకి తీసుకొని సంఘంలోని సభ్యులకు స్వయం ఉపాధి కల్పనకు రుణాలు మంజూరు చేస్తారు. ఒక్కో సంఘం పరిధిలో సభ్యులకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణంతో మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగలో యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. రూ. 1.69 కోట్లతో 445 మందికి రుణాలు.. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో స్త్రీనిధి పథకం కింద 445 మందికి రూ.1.69 కోట్లు ఇప్పటి వరకు రుణాలు సంబంధిత గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందించారు. సకాలంలో తీసుకున్న రుణాలను చెల్లిస్తే మరికొంత మందికి స్వయం ఉపాధి కల్పనకు రుణాలు మంజూరు చేయనున్నారు. సమభావన సంఘాల మహిళలు క్రమం తప్పకుండా పొదుపు పాటించి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు. టైలరింగ్‌తో ఉపాధి పొందుతున్నా : స్త్రీ నిధి కింద రూ.50 వేలు రుణం పొందాను. దీంతో ఆ డబ్బులను వృథా చేయకుండా టైలరింగ్ షాపు నిర్వహించుకుంటున్నాను. దీంతో ఉపాధి పొందుతున్నాను. నా కుటుంబానికి ఆసరాగా ఉంది. స్త్రీ నిధి పథకం మాలాంటి మహిళలకు తోడ్పాటునందిస్తుంది. – కాసర్ల శశిరేఖ, నారాయణపురం పొదుపులు చేసుకుంటున్నాము.. స్త్రీ నిధి పథకం ద్వారా రూ.50 వేలు రుణం తీసుకున్నాను. ఆ డబ్బులతో గొర్రెలను పెంచుకుంటున్నాను. తీసుకున్న రుణంలో ఎప్పటికప్పుడు చెల్లించుకుంటున్నాను. అలాగే పొదుపులు కూడా ప్రతి నెలా చేసుకుంటున్నాము. మాలాంటి వారికి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపయోగపడుతుంది. – నూకపంగు సామ్రాజ్యం, వల్లాపురం ప్రభుత్వ పథకాలనుసద్వినియోగం చేసుకోవాలి.. స్వయం సహయక సంఘాల కొరకు ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తుంది. సంబంధిత మహిళా సంఘాలు ఇలాంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. – రామలక్ష్మి, ఏపీఎం, గ్రామీణాభివృద్ధి సంస్థ, నడిగూడెం -
వంగలో సస్యరక్షణ పాటించాలి
నడిగూడెం : ప్రస్తుతం వాతావరణం చల్లబడుతుండడంతో వంగ పంటకు తెగుళ్లు, పురుగులు ఆశిస్తున్నాయి. నివారణ చర్యలు చేపట్టకపోతే పంట దిగుబడిపై ప్రభావం అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక పంట దిగుబడులు పొందవచ్చని కోదాడ ఉద్యానవన శాఖ అధికారి రవినాయక్ తెలిపారు. పురుగులు, తెగుళ్ల నివారణకు సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. ఆశించే పురుగులు.. నివారణ చర్యలు మొవ్వు, కాయతొలుచు పురుగు ఈ పురుగు నాటిన 30–40 రోజుల నుంచి ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలుగచేస్తుంది. కాయలు వంకర్లు తిరిగిపోతాయి. కొమ్మల చివర్ల పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు ఆశించిన కొమ్మలను తుంచివేయాలి. తొలిదశలో వేప నూనె లీటరు నీటికి 5 మి.లీ లేదా కార్బరిల్ 50 శాతం 3 గ్రాములు, లీటరు నీటికి, లేదా ప్రొఫెనోఫాస్ 2.మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు( దీపపు పురుగులు, పేనుబంక, లె ల్లదోమ) ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి, రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో ఆకులు పసుపు రంగులోకి మారి, పైకి ముడుచుకొని ఎండిపోతాయి. వీటి నివారణకు డైమీధోయేట్ లేదా మిథైల్‌డెమటాన్ లేదా ఫిప్రోనిల్ లీటరు నీటికి 2 మి.లీ చొప్పున పిచికారీ చేయాలి. ఎర్రనల్లి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి. ఆకులపై సాలె గూడు వంటి తీగలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆశించే తెగుళ్లు.. నివారణ చర్యలు ఆకుమాడు తెగులు నారును పొలంలో నాటిన తర్వాత 30 రోజులకు ఈ తెగులు ఆశిస్తుంది. ఆకులన్నీ మాడిపోయినట్లుగా కనిపిస్తాయి. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగుకు మారి వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా కన్పిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు, లేదా కార్బెండిజమ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఆకుమాడు, కాయకుళ్లు తెగులు ఆకులపై అక్కడక్కడ గోధుమ రంగుతో కూడిన మచ్చలు కన్పిస్తాయి. తెగులు ఉధృతమైతే ఆకులు మాడి రాలిపోతాయి. తెగులు సోకిన కాయలు పసుపురంగుకు మారి, కుళ్లిపోతాయి. దీని నివారణకు నారుమడిలో విత్తేముందు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల వీటిలో విత్తనాలను 30 నిమిషాలపాటు నానబెట్టి విత్తుకోవాలి. తెగులు సోకిన పొలంలో పంటమార్పిడి తప్పనిసరిగా పాటించాలి. కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2–3 సార్లు పిచికారీ చేయాలి. వెర్రి తెగులు ఆకులు సన్నగా మారి, పాలిపోయిన ఆకుపచ్చని రంగు కలిగి ఉంటాయి. మొక్కలు గుబురుగా, చీపురు కట్టలా కనబడతాయి. పూత, కాత లేకుండా మొక్కలు గొడ్డు బారిపోతాయి. ఇది వైరస్ తెగులు. దీని నివారణకు ఆశించిన మొక్కలను తొలగించి, నాశనం చేయాలి. నారుదశలో నాటడానికి ముందు 250 గ్రాములు కార్బోప్యూరాన్ గుళికలను 100 చ.మీ నారుమడికి వేయాలి. జాగ్రత్తలు.. ప్రధానంగా పురుగు ఆశించిన కాయలను, కొమ్మలను తుంచి నాశనం చేయాలి. అంతరపంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి పంటలను వేసుకోవాలి. లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 చొప్పున పెట్టాలి. తలనత్త ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి ఒక అంగుళం కిందికి తుంచి నాశనం చేయాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి. ఎకరానికి 200 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వేయాలి. -
దళితులకు భూమిని పంచాలంటూ వినతి
నడిగూడెం: మండల పరిధిలోని రామాపురం రెవిన్యూ పరిధిలో ఉన్న 190 సర్వే నంబర్లో గల భూములను ప్రభుత్వం దళితులకు మూడె ఎకరాల చొప్పున పంపిణీ చేయాలంటూ మంగళవారం ఉపతహసీల్దారు అహ్మద్ షరీఫ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సర్వే నెంబరు పరిధిలో 2200 ఎకరాలకు పైగా భూములు బీళ్లుగా ఉన్నాయని ఆ భూములను దళితులకు పంపిణీ చేస్తే బాంగుంటుందని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు పాతకొట్ల నాగేశ్వరరావు, దున్నా శ్రీనివాస్, దాసరి శ్రీను, దున్నా అంబేద్కర్, బాణాల నాగరాజు తదిరులున్నారు. -
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
త్రిపురవరం(నడిగూడెం): మండల పరిధిలోని త్రిపురవరంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణపు పనులను మంగళవారం ఆ గ్రామ సర్పంచ్ పందిరి పాపిరెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. త్రిపురవరం గ్రామ అభివృద్ధికి ఎమ్యెల్యే ఉత్తమ్ పద్మావతి నిధులను కెటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెట్పీటీసీ సభ్యుడు వల్లపురెడ్డి వీరారెడ్డి, ఆ గ్రామ మాజీ సర్పంచ్‌లు మందడి రంగారెడ్డి, కొత్త వెంకటరెడ్డి, ఎడమ కాల్వ మాజీ చైర్మన్ సీహెచ్.లక్ష్మినారాయణరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు దేవబత్తిని వెంకటనర్సయ్య, కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం మండల కన్వీనర్ మన్నెం అనంతరెడ్డి, కొత్త నారాయణరెడ్డి, షేక్.సైదులు, గుర్వయ్య, పంచాయతి రాజ్ ఏఈ గార్లపాటి వెంకటరెడ్డి, జేఈ నయీం, తదితరులు పాల్గొన్నారు. -
నిరుపయోగంగా కమ్యూనిటీ భవనాలు
నడిగూడెం: మండల పరిధిలోని పలు గ్రామాల్లో పదేళ్ల క్రితం కమ్యూనిటీల ఐఖ్యత, అభివద్ధి కోసం లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ భవనాలు నేడు నిరుపయోగంగా మారాయి. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతోనే ఆ భవనాలు నిరుపయోగంగా ఉంటున్నాయని ప్రజలు అంటున్నారు. ఆ భవనాలను నిర్మించిన నాటి నుంచి ప్రారంభించకపోవడంతో నేడు పలు గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. నిర్మాణ సమయంలో పలు మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ఉపయోగించుకోలేక పోతున్నామని ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దర్వాజలు, కిటికీలు దొంగలపాలు.. బృందావనపురం ఎస్సీ కమ్యూనిటీ భవనంలో దర్వాజలు, కిటికీలు దొంగలపాలయ్యాయి. రత్నవవరం, కాగితరామచంద్రాపురం, సిరిపురం, శ్రీరంగాపురం, రామాపురం, గ్రామాల్లోని ఎస్సీ కమ్యూనిటీ భవనాలు, శ్రీరంగాపురం, తెల్లబెల్లి, త్రిపురవరం, గ్రామాల్లోని బీసీ కమ్యూనిటీ భవనాలు పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. ఆరు నెలల కిందట వేణుగోపాలపురంలో ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనం ప్రారంభానికి నోచుకోలేదు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మండలంలో నిరుపయోగంగా ఉంటున్న కమ్యూనిటీ భవనాలను పరిశీలించి, దినపత్రికలు, మాస పత్రికలు, ఫ్యాన్లు, కుర్చీల ఏర్పాటు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉపయోగంలోకి తీసుకరావాలి.....ఎల్.వీరబాబు, మా గ్రామంలో బీసీ, ఎస్సీ కాలనీల్లో నిర్మించిన కమ్యూనిటీ భవనాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. లక్షల రూపాయల వ్యయంతో ఆ భవనాలను నిర్మించారు. కానీ ఉపయోగయోగ్యంగా లేవు. సంబంధిత అధికారులు స్పందించి కమ్యూనిటీ భవనాలను ఉపయోగంలోకి తీసుకరావాలి. మౌలిక సౌకర్యాలు కల్పించాలి.......కాసాని కిషోర్, నిరుపయోగంగా ఉంటున్న కమ్యూనిటీ భవనాల్లో ప్రజలకు కావాల్సిన దినపత్రిలు, వారపత్రికలు, మాస పత్రికలతో పాటు ఫ్యాన్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలి. దీంతో కమ్యూనిటీల్లో ఐక్యత పెరుగుతుంది. యువతకు కావాల్సిన పరిజ్ఞానం అందుతుంది. -
ఆర్థిక సాయం అందజేత
వాయిలసింగారం(నడిగూడెం): మండలంలోని వాయిలసింగారం గ్రామానికి చెందిన బొల్లం రాంబాయి (32) ఇటీవలె అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. కాగా రాంబాయి తెల్లబెల్లి సహకార సంఘంలో సభ్యురాలు కావడంతో శనివారం ఆ సంఘం చైర్మన్ చుండూరు వెంకటేశ్వరరావు నామిని అయిన మృతురాలు సోదరుడు లింగయ్యకు రూ.10 వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఈఓ దేవబత్తిని శ్రీనివాసరావు, డైర క్టర్లు చుండూరు మురళి, కుటుంబరావు, సత్యనారాయణ, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, కోటయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణే ప్రధాన ధ్యేయం
నడిగూడెం: మహిళల రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నట్లు షీ టీమ్ జిల్లా ఇన్చార్జ్ సునితా మోహన్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎస్పీ దుగ్గల్ ఆదేశాల మేరకు జిల్లాలో నిత్యం 50 షీ టీమ్ బృందాలు పాఠశాలలు, కళాశాలలు, కూడలుల వద్ద పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా మానసికంగా, ఫోన్ల ద్వారా వేధిస్తే నేరుగా 100 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 200 ఫిర్యాదులు ఫోన్ల ద్వారా వచ్చాయన్నారు. వాటిలో 45 ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకున్నామన్నారు. మిగతా వారికి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. అనంతరం సూర్యాపేట డీఎస్పీ రశీద్ మాట్లాడారు. చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టాలు కూడా కఠినంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్స్‌పాల్ ఎం.పవన్ కుమార్, స్థానిక సర్పంచ్ నూనె ఇందిరా నాగన్న, ఎస్సై బిల్లా కిరణ్ కుమార్, ప్రిన్స్‌పాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి నర్సిరెడ్డి, అద్యాపకులు సం ఘం రాష్ట్ర కార్యదర్శి అశోక్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ అధికారులు ఆవుల వెంకన్న, కర్నాటి శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాలిక, వివాహితపై లైంగికదాడి
నడిగూడెం ప్రేమించానంటూ వెంటబట్టాడు.. మాట్లాడుకుందామని చెప్పి బాలికను, ఆమె వదినను తోటలోకి రమ్మన్నాడు.. ఆపై తన స్నేహితుడితో కలిసి ఇద్దరిపై లైంగికదాడి చేశాడు.. ఇదీ.. నడిగూడెం మండలం బృందావనపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బృందావనపురం గ్రామానికి చెందిన జమ్మి వేణు ఇదే గ్రామానికి చెందిన 15 బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు. ఆమెకు మాయమాటలు చెప్పి నెల రోజుల క్రితం తోటలోకి రమ్మన్నాడు. అనుమానంతో ఆ బాలిక తన వదినను తీసుకుని వెళ్లింది. అప్పటికే వేణు తన స్నేహితుడు గోవర్దన్‌తో వేచిచూస్తున్నాడు. కాగా, తోటలోకి వెళ్లిన బాలిక, సదరు వివాహితపై ఇద్దరు కలిసి లైంగికదాడి చేశారు. కాగా, పెళ్లి విషయమై బాలిక వేణును నిలదీయంతో నిరాకరించాడు. దీంతో బాధితులు బుధవార పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేణుపై నిర్భయ, గోవర్ధన్‌పై లైంగికదాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ బిల్లా కిరణ్‌కుమార్ తెలిపారు. కోదాడ రూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. -
ప్రకృతి సంపద కొల్లగొడుతున్నారు!
ఇసుక అక్రమ రవాణాకు నడిగూడెం కేంద్రంగా మారింది. కట్టడిచేసి, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు చెలరేగిపోతూ ప్రకృతి సంపదను విచ్చలవిడిగా కొల్లగొడుతున్నారు. మోతె మండలం ఉర్లుగొండ, తుమ్మగూడెం, రాయికుంట తండాల నుంచి నిత్యం ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా నడిగూడెం మండలం మీదుగా రవాణా అవుతున్నది. కాగితరామచంద్రాపురం, నడిగూడెం మీదుగా మునగాల మండలం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం, నడిగూడెం మండలం వల్లాపురం, త్రిపురవరం, వసంతాపురం, వాయిలసింగారం గ్రామాల మీదుగా ఇసుక రవాణా అవుతున్నది. అలాగే మండల పరిధిలోని చనుపల్లి, పాలారం గ్రామాల వెంట ఉన్న పాలేరు వాగు నుంచి కూడా నిత్యం ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నది. ఇక్కడ మాత్రం సంబందిత రెవిన్యూ అధికారుల కనుసన్నల్లో ఇసుక వ్యాపారం జరుగుతున్నదని ఆరోపణలున్నాయి. పాలేరు వాగులో ఇసుకను తరలించి కోదాడ, మునగాల ప్రాంతాల్లో ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.3500 నుంచి రూ.4000 వేల వరకు విక్రయిస్తున్నారు. -
సింగారానికి ‘వల’
కోదాడటౌన్, న్యూస్‌లైన్ :నడిగూడెం మండలం సింగారం గ్రామ పరిధిలోని చెరువులో చేపల పెంపకానికి అనుమతి తీసుకునేందుకు కొందరు వల పన్నారు. వారి ప్రయత్నం ఫలిస్తే రెండు మంచినీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే అవకాశముంది. కోదాడ పట్టణంతో పాటు నియోజకవర్గం పరిధిలోని 27గ్రామాలకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. అయినా కొందరు నేతలు చేపల పెంపకానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సింగారం చెరువు ప్రతిఏటా సాగర్ నీటితో కళకళలాడుతోంది. దీనిని మంచినీటి కోసం ఉపయోగించుకోవడానికి జిల్లా అధికారులు ఈ చెరువును రిజర్వాయర్‌గా మార్చారు. 2009లో *14 కోట్లతో నాబార్డు సహకారంతో చెరువుకు సమీపంలో మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దీని ద్వారా కోదాడ నియోజకవర్గం పరిధిలోని 27 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. కోదాడ పట్టణానికి నీరందించేందుకు.. సింగారం చెరువు ద్వారా కోదాడ పట్టణానికి మంచినీటిని అందించేందుకు 2011లో *9 కోట్లతో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. దీని కోసం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని రామిరెడ్డిపాలెం వద్ద ఫిల్టర్బెడ్లను కూడా నిర్మించారు. దీని పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. వచ్చే వేసవిలో దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ లోగానే ఈ చెరువులో చేపల పెంపకానికి అనుమతి తీసుకొచ్చేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చెరువును రిజర్వాయర్‌గా మార్చక ముందు దీనిలో గ్రామానికి చెందిన మత్స్య సహకార సొసైటీ ఆధ్వర్యంలో చేపల పెంపకం చేపట్టేవారు. రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి భారీగానే దండుకునేవారు. పైరవీల జోరు.. కలెక్టర్‌పై ఒత్తిడి చేపల ఆదాయంపై కన్నేసిన రాజకీయ నాయకులు మత్య్సకారుల ఉపాధిని సాకుగా చూపి చేపల పెంపకానికి అనుమతి పొందేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు కొందరు కలెక్టర్‌ను కూడా కలిశారు. అయితే నిబంధనల ప్రకారం ఓ కలెక్టర్ నిషేధించిన దానిని తాను మళ్లీ అనుమతి ఇవ్వలేనని ప్రస్తుత కలెక్టర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో ఆయనపై రాజధాని స్థాయిలో తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. తెప్పలు, చిన్న వలలతో నష్టం లేదు చెరువులో మత్య్సకారులు తెప్పలపై, చిన్న వలలను ఉపయోగించి చేపలు పట్టుకోవడం వల్ల పెద్ద ఇబ్బం ది ఉండదు. ప్రతిరోజూ ఇలాగే చేపలు పట్టుకుంటే ఎవరికీ నష్టముండదు. కానీ, సొసైటీ వారు చేపల పెంపకాన్ని కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్నారు. వారే చేప పిల్లలను పోసి, ఫీడ్ వేసి, చేపలు పట్టుకుంటారు. వాటి బరువును బట్టి కిలోకి ఇంత అని సొసైటీకి డబ్బు చెల్లిస్తారు. ఈ డబ్బును సొసైటీలో సభ్యత్వం ఉన్న సభ్యులు పంచుకుంటారు. వీరిలో కొద్దిమందికి మాత్రమే చేపలు పటేట్టప్పుడు కాంట్రాక్టర్ పని కల్పిస్తాడు. ఈ విధంగా కాంట్రాక్టర్‌కు అప్పగించడం వల్ల ఫీడ్ వేసేందుకు, చేపలు పట్టడానికి పెద్ద వలలు వాడడంతో చెరువు నీరు కలుషితం అవుతుందని అధికారులంటున్నారు. తెప్పలపై గ్రామానికిచెందిన మత్స్య కారులే చేపలు పట్టుకుంటే అభ్యంతరం చెప్పేవారు ఉండరని, వారి ఉపాధికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని అధికారులే పేర్కొంటున్నారు. అలా కాకుండా కాంట్రాక్టర్‌కు అప్పగిస్తేనే ఇబ్బందులుఎదురవుతాయన్నారు.