ఇసుక అక్రమ రవాణాకు నడిగూడెం కేంద్రంగా మారింది. కట్టడిచేసి, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు చెలరేగిపోతూ ప్రకృతి సంపదను విచ్చలవిడిగా కొల్లగొడుతున్నారు. మోతె మండలం ఉర్లుగొండ, తుమ్మగూడెం, రాయికుంట తండాల నుంచి నిత్యం ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా నడిగూడెం మండలం మీదుగా రవాణా అవుతున్నది.
కాగితరామచంద్రాపురం, నడిగూడెం మీదుగా మునగాల మండలం, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం, నడిగూడెం మండలం వల్లాపురం, త్రిపురవరం, వసంతాపురం, వాయిలసింగారం గ్రామాల మీదుగా ఇసుక రవాణా అవుతున్నది. అలాగే మండల పరిధిలోని చనుపల్లి, పాలారం గ్రామాల వెంట ఉన్న పాలేరు వాగు నుంచి కూడా నిత్యం ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నది. ఇక్కడ మాత్రం సంబందిత రెవిన్యూ అధికారుల కనుసన్నల్లో ఇసుక వ్యాపారం జరుగుతున్నదని ఆరోపణలున్నాయి. పాలేరు వాగులో ఇసుకను తరలించి కోదాడ, మునగాల ప్రాంతాల్లో ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.3500 నుంచి రూ.4000 వేల వరకు విక్రయిస్తున్నారు.
ప్రకృతి సంపద కొల్లగొడుతున్నారు!
Published Sun, Apr 19 2015 4:09 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM
Advertisement