బాలికను వేధిస్తున్న ఓ వ్యక్తిపై షీ టీమ్ కేసు నమోదు చేసింది. షీటీమ్ ఎస్సై బాబూలాల్ కథనం ప్రకారం నగరంలోని రమణగుట్ట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్,
ఖమ్మంక్రైం: బాలికను వేధిస్తున్న ఓ వ్యక్తిపై షీ టీమ్ కేసు నమోదు చేసింది. షీటీమ్ ఎస్సై బాబూలాల్ కథనం ప్రకారం నగరంలోని రమణగుట్ట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, 7వ తరగతి చదువుతున్న బాలికను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు షీ టీమ్ సిబ్బందిని ఆశ్రయించగా.. వారు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి టూటౌన్ సీఐ రాజిరెడ్డి ముందు హాజరుపరచగా ఆయన కౌన్సెలింగ్ నిర్వహించి పిటీ కేసు నమోదు చేశారు.
ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డ్రా
ఓ వ్యక్తి బ్యాంకు ఖాతానుంచి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డ్రా చేసిన సంఘటనపై త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. రంగనాయకులపేటకు చెందిన పాశం సత్యనారాయణ బ్యాంకు ఖాతా నుంచి రూ.19 వేలు డ్రా అయ్యాయి. ఆయన సంబంధిత బ్యాంకును ఆశ్రయించగా.. బ్యాంకు వారు ఆ డబ్బును గాంధీచౌక్ ప్రాంతంలోని ఓ ఏటీఎం నుంచి డ్రా చేసినట్లు తెలిపారు. బాధితుడు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.