సాక్షి, ఖమ్మం: దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. చింతకాని ఎస్‌ఐ రెడ్డబోయిన ఉమను ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు రోజుల క్రితం ఖమ్మం లో పర్యటించి మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను పరామర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి.. చింతకాని పీఏస్‌లో ఏమి జరిగిందన్న దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
డీజీపీ పర్యటన అనంతరం చింతకాని ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో మరి కొంతమంది పోలీస్ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అడ్డగూడురు పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. మరియమ్మ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
చదవండి: నేరేడ్‌మెట్: చదువు కోసం వచ్చి.. వ్యభిచారం
ఖమ్మం: భర్త చేత బలవంతంగా భార్య పన్ను పీకించి దారుణం
Comments
Please login to add a commentAdd a comment