ఎస్సైపై కానిస్టేబుల్‌ దాడి | constable attacked on sub inspector | Sakshi
Sakshi News home page

ఎస్సైపై కానిస్టేబుల్‌ దాడి

Published Mon, Jul 24 2017 11:23 AM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM

ఎస్సైపై కానిస్టేబుల్‌ దాడి - Sakshi

ఎస్సైపై కానిస్టేబుల్‌ దాడి

కొత్తగూడెంరూరల్‌: ఓ ఎస్సైపై సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ దాడి చేసి గాయపరిచాడు. పోలీసులు తెలిపిన వివరాలు... టేకులపల్లి మండలం శాంతినగర్‌ ప్రాంతానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గుగులోతు శ్రీనివాస్, తన భార్యతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాయించేందుకు కొత్తగూడెంలోని సెయింట్‌ మేరీస్‌ పాఠశాల కేంద్రానికి వచ్చాడు. ఆమెను లోనికి పంపించి, బయట తన బిడ్డను ఎత్తుకుని నిల్చున్నాడు. 9.10 గంటలకే పరీక్ష కేంద్రం గేటు మూసివేశారు. ఆ తరువాత వచ్చిన కొందరు అభ్యర్థులు, గేటును తోసుకుని లోపలికి వెళ్లిపోయారు. అక్కడ విధులు నిర్వహించేందుకు వచ్చిన ఎస్సై తిరుపతి, పరీక్ష కేంద్రం వద్దనున్న అభ్యర్థులను, సంబంధీకులను వెళ్లిపోవాలని సూచించారు.

దీంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడే బిడ్డను ఎత్తుకుని ఉన్న శ్రీనివాస్‌ (సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌)కు, ఎస్సైకి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే, ఎస్సై తిరుపతిని శ్రీనివాస్‌ నెట్టివేశాడు. కింద పడిన ఎస్సై తిరుపతి ఎడమ చేతికి, కుడి కాలికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీనివాస్‌ను వెంటనే ఎస్సై అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తన విధులను ఆటంకపరిచినందుకుగాను 332 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement