Probationary Two Sub Inspectors Get Married In Khammam, Details Inside - Sakshi
Sakshi News home page

Sub Inspector Of Police: ట్రైనింగ్‌లో మొగ్గతొడిగిన ప్రేమ.. పెద్దల సమక్షంలో ఎస్‌ఐల పెళ్లి

Published Fri, Dec 10 2021 9:01 PM | Last Updated on Sat, Dec 11 2021 7:35 PM

Probationary Sub Inspectors Wedding Khammam District - Sakshi

Two Sub Inspectors Get Married At Khammam
సాక్షి, ఖమ్మం (తల్లాడ): ఇద్దరు ప్రొబెషనరీ ఎస్‌ఐలు మూడు ముళ్ల బంధంతో శుక్రవారం ఒక్కటయ్యారు. వివరాల్లోకెళ్తే.. తల్లాడకు చెందిన యుద్దనపూడి శ్రీకాంత్‌ ఇల్లెందులో ప్రొబిషనరీ ఎస్‌ఐగా, నిజామాబాద్‌ జిల్లా బీమ్‌గల్లుకు చెందిన జోహన అదే జిల్లాలోని వేల్పూర్‌ మండలంలో ప్రొబిషనరీ ఎస్‌ఐగా పని చేస్తున్నారు. వారిద్దరు హైదరాబాద్‌లో గతేడాది శిక్షణ తీసుకున్నారు. శిక్షణ సమయంలో ఇద్దరు మనసులు కలిశాయి.

చదవండి: (తెలంగాణ మున్సిపల్‌శాఖ కీలక ఉత్తర్వులు)

ఒకరినొకరు ప్రేమించుకొని కులాంతర వివాహాం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ తల్లిదండ్రులకు తాము ప్రేమించుకున్న విషయం చెప్పారు. ఇరు వైపు పెద్దలు వారి ప్రేమను అంగీకరించి సాంప్రదాయ బద్దంగా ఎంగేజ్‌మెంట్‌ నిర్వహించి, తల్లాడ ఆర్‌బీ గార్డెన్‌లో వివాహం జరిపించారు. వివాహా వేడుకకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

చదవండి: (Hyderabad: నర్సుని రూమ్‌లో బంధించి అత్యాచారం..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement