Probationary period
-
ట్రైనింగ్‌లో మొగ్గతొడిగిన ప్రేమ.. పెద్దల సమక్షంలో ఎస్ఐల పెళ్లి
Two Sub Inspectors Get Married At Khammam సాక్షి, ఖమ్మం (తల్లాడ): ఇద్దరు ప్రొబెషనరీ ఎస్ఐలు మూడు ముళ్ల బంధంతో శుక్రవారం ఒక్కటయ్యారు. వివరాల్లోకెళ్తే.. తల్లాడకు చెందిన యుద్దనపూడి శ్రీకాంత్ ఇల్లెందులో ప్రొబిషనరీ ఎస్ఐగా, నిజామాబాద్ జిల్లా బీమ్గల్లుకు చెందిన జోహన అదే జిల్లాలోని వేల్పూర్ మండలంలో ప్రొబిషనరీ ఎస్ఐగా పని చేస్తున్నారు. వారిద్దరు హైదరాబాద్‌లో గతేడాది శిక్షణ తీసుకున్నారు. శిక్షణ సమయంలో ఇద్దరు మనసులు కలిశాయి. చదవండి: (తెలంగాణ మున్సిపల్‌శాఖ కీలక ఉత్తర్వులు) ఒకరినొకరు ప్రేమించుకొని కులాంతర వివాహాం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ తల్లిదండ్రులకు తాము ప్రేమించుకున్న విషయం చెప్పారు. ఇరు వైపు పెద్దలు వారి ప్రేమను అంగీకరించి సాంప్రదాయ బద్దంగా ఎంగేజ్మెంట్ నిర్వహించి, తల్లాడ ఆర్బీ గార్డెన్లో వివాహం జరిపించారు. వివాహా వేడుకకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (Hyderabad: నర్సుని రూమ్‌లో బంధించి అత్యాచారం..) -
చినగంజాం ఎస్సై తొలగింపు
గుంటూరు క్రైం : బాధ్యతారహితంగా ఉన్న ప్రకాశం జిల్లా చినగంజాం ఎస్సై దిడ్ల కిషోర్‌బాబును విధుల నుంచి తొలగిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కిషోర్‌బాబు.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు పలు మార్లు అధికారులు గుర్తించారు. తీరు మార్చుకోవాలని అధికారులు హెచ్చరించినా ఆయనలో మార్పు రాకపోవడంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్సై కిషోర్‌బాబును విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్సై సస్పెన్షన్ భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా ఏకపక్షంగా వ్యవహరించిన ప్రకాశం జిల్లా పామూరు ఏఎస్సై షేక్ గౌస్‌బాషాను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అదే గ్రామానికి చెందిన ఇల్లూరి రమణమ్మ ఈ ఏడాది జనవరి 28న భూ వివాదంలో మరో వర్గం వారు తనపై దాడికి యత్నించారని ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ భూమిని ఖాళీ చేసే విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఏఎస్సై ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకుండా కేసు నమోదు చేశారు. పోలీసు ప్రతిష్టను దెబ్బతీసేలా ఏఎస్సై వ్యవహరించారని ఎస్పీ అందజేసిన నివేదిక ఆధారంగా ఏఎస్సై గౌస్‌బాషాను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు క్రైం : చినగంజాం ఎస్సై పనితీరుపై ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కిశోర్‌బాబు తొలుత మద్దిపాడులో ప్రొబేషనరీ ఎస్సైగా పని చేశారు. అక్కడి నుంచి చినగంజాం బదిలీ అయ్యరు. సాధారణంగా కొత్తగా ఎస్సై విధుల్లో చేరిన తర్వాత రెండేళ్ల పాటు ప్రొబేషనరీ పిరియడ్ ఉంటుంది. అతని ప్రవర్తన, పనితీరు, ప్రజలకు సేవ చేసిన తీరుతెన్నులను పరిశీలించిన తర్వాత పోలీస్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. అనంతరం సబ్ఇన్స్పెక్టర్గా అప్‌గ్రేడ్ చేస్తారు. అప్‌గ్రేడ్ కాకుండానే తొలగించడం గమనార్హం.