మహిళల భద్రతే షీటీం లక్ష్యం
కళాశాలలో ఫిర్యాదుల పెట్టె
►అందుబాటులో వాట్సాప్ నంబరు 79975 55511
►ఫిర్యాదు మెసేజ్‌లు నేనే పరిశీలిస్తా
►ఎస్పీ విశ్వజిత్ కంపాటి
సిరిసిల్ల క్రైం : మహిళలు, విద్యార్థినులు, యువతుల కు భద్రత కల్పించడమే ధ్యేయంగా షీటీం ముందుకు సాగుతోందని ఎస్పీ విశ్వజిత్ కంపాటి అన్నారు. జిల్లా కేంద్రంలోని వాసవీకల్యాణ మండపంలో బుధవారం షీటీం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, అకృత్యాలను పోలీసుల దృష్టికి తెచ్చేలా వారిలో ధైర్యం నూరిపోస్తున్నామని తెలిపారు. తాము అందుబాటులోకి తెచ్చిన 79975 55511 వాట్సప్ నంబరుకు సమాచారమిస్తే తానే స్వయంగా పరిశీలిస్తానని, లేనిపక్షంలో 94409 04823 నంబరుకు సమాచారం అందించాలని సూచించారు. అత్యాచారాలు, హత్యాచారాలు, వేధింపులు 18– 60ఏళ్ల వయస్సుపైవారిపైనా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలు, విద్యార్థినులు, యు వతులపై జరిగే అకృత్యాలను నిరోధిం చేందుకరే షీటీంలను ప్రత్యేక డ్రెస్ కోడ్ లేకుండా ప్ర జల్లో మమేకం చేస్తున్నామన్నారు. ‘ఫ్రెండ్లీ పో లీసింగ్ అంటేనే తప్పు చేసిన వాడు భయపడాలి.. మంచి వాళ్లు స్నేహంగా పోలీసులతో మమేకమవ్వాలి.. షీటీంలకు దొరికిన పోకిరీ లపై నేరుగా కేసులు మోపే పరిస్థితి లేదని, ఒకటికి రెండుసార్లు కౌన్సెలింగ్ చేస్తామని, అయి నా మారకుంటే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సిరిసిల్లలో షీటీం పర్యవేక్షణాధికారి గా ఎస్సై శ్రీనివాస్ మంచి సేవలందిస్తున్నారని ఎస్పీ అభినందించారు. షీటీంలో మహిళా అధికారుల సంఖ్యను పెంచుతూనే సత్వరమే స్పం దించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నా రు. అన్ని విద్యాలయాల్లో ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేసి వారంలో ఒకరోజు వాటి ని తానే నేరుగా పరిశీలిస్తానని అన్నారు.
సిరిసిల్ల డీ ఎస్పీ సుధాకర్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కతిక సారథి కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ïటౌన్ సీఐ విజయ్‌కుమార్, రూరల్ సీఐ రవీందర్, వేములవాడ రూరల్ సీఐ మాధవి, ఎస్సై శ్రీని వాస్, న్యాయవాది సీహెచ్ మహేశ్‌గౌడ్, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు జక్కని రాజు, వైద్యురలు నహీంజా, విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ట్రస్మా జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ
సిరిసిల్ల ఎడ్యుకషన్ : తెలంగాణ గుర్తింపు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) జిల్లా కార్యాలయాన్ని ఎస్పీ విశ్వజిత్ ప్రారంభించారు. డీఈవో రాధాకిషన్ , ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, అధ్యక్షుడు రవిశంకర్, ఉపాద్యక్షుడు కోట మనోహర్, జిల్లా అధ్యక్షుడు ఆర్‌సీ రావు, ప్రధాన కార్యదర్శి నాగుల శ్రీనివాస్ గౌడ్, పట్టణ అ««దl్యక్షుడు గుగ్గిళ్ల జగన్ గౌడ్, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.