SP Viswajith kampati
-
మంచు తుపాను కమ్మేసింది
18,500 అడుగుల ఎత్తుకు వెళ్లా.. - సామాన్యులెవరూ వెళ్లలేరు - మైనస్ డిగ్రీల్లోనే ఉష్ణోగ్రతలుంటాయి - లడఖ్ పర్యటనపై ఎస్పీ విశ్వజిత్ కంపాటి సిరిసిల్ల: ‘దేశ సరిహద్దుల్లో మన సైన్యం నిత్యం కంటికి రెప్పలా కాపలాకాసే విధానాన్ని కళ్లారా చూశా.. సముద్రమట్టానికి 18,500 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ లభించని మంచుకొండల్లో గస్తీ తిరిగే ఆర్మీ.. ఎవరికి ఏం జరిగినా జనావాసాలకు చేరాలంటే కనీసం 8 గంటలు ప్రయాణించాల్సిందే.. ఇలాంటి ప్రాంతంలో రేయింబవళ్లు మనవాళ్లు రక్షణగా ఉండడం నిజంగా గొప్ప విషయం’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి అన్నారు. 1959లో సీఆర్ïపీఎఫ్ గస్తీ బృందాన్ని చైనా బలగాలు దొంగదెబ్బ తీసి.. మెరుపు దాడి చేయడంతో 20 మంది జవాన్లు చనిపోయారు.. వారి త్యాగాన్ని స్మరిస్తూ ఏటా లడఖ్ ప్రాంతంలోని హాట్ స్ప్రింగ్‌లో నిర్మించిన అమరజవాన్ల స్థూపానికి నివాళులు అర్పిస్తుంటారు. ఇందుకోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది అధికారుల బృందం లడఖ్ వెళ్లింది. ఆ బృందంలో తెలంగాణ రాష్ట్రం నుంచి జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఒక్కరే వెళ్లారు. 2013 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విశ్వజిత్.. గత ఆగస్టు 21 నుంచి ఈనెల 10 వరకు 20 రోజుల పాటు దేశ సరిహద్దుల్లోకి వెళ్లి భారత వీరజవాన్లకు నివాళి అర్పించి వచ్చారు. ఈ సందర్భంగా తన పర్యటన అనుభవాలను మంగళవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... మంచుపర్వతాల మధ్య ప్రయాణం.. చండీగఢ్ నుంచి వాహనంలో మా ప్రయాణం మొదలైంది. 3 రాత్రులు, 4 రోజులపాటు మా ప్రయాణం సుమారు వెయ్యి కిలోమీటర్లు సాగింది. నిజానికి ఆ రోడ్లు అంతగా బాగుం డవు. గుట్టలు, మంచుపర్వతాలతో నిండి ఉంటుంది. అందుకే అంతసమయం పట్టింది. ఇద్దరు అధికారులు వెనక్కి వచ్చారు.. హాట్స్ప్రింగ్కు చేరడానికి శారీరకంగా ఫిట్‌గా ఉండాలి. మానసికంగా దృఢత్వం కావాలి. ఎందుకంటే భూమికి 16,000 అడుగుల ఎత్తులో గాలిలో ఆక్సిజన్ ఉండదు. ఆస్తమా వంటి శ్వాసకోశవ్యాధులతో బాధపడే వారు రాకూడదు. నాతోపాటు వచ్చిన ఇద్దరు అధికారులు ముందుకు సాగలేక వెనక్కి వచ్చారు. నాకు ఐపీఎస్ ట్రెయినింగ్‌లో కశ్మీర్ లోని అనంతనాగ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. మా వెంట భారత ఆర్మీ జవాన్లు, ఐటీ బీపీ బలగాలు హాట్‌స్ప్రింగ్ వరకు వచ్చాయి. నివాళి అనిర్వచనీయమైన అనుభూతి చైనా సరిహద్దుల్లో ఎడారిని తలపించే మంచు గుట్టల మధ్య.. హాట్‌స్ప్రింగ్ వద్ద అమరులైన జవాన్లకు నివాళి అర్పించడం అనిర్వచనీ యమైన అనుభూతిని ఇచ్చింది. మరోసారి అవకాశం వస్తే.. మళ్లీ వెళ్లాలనిపిస్తుంది. మంచుతుపాను కమ్మేసింది.. సాయుధ పోలీసుల మధ్య హాట్స్ప్రింగ్కి చేరుకున్నాం. అక్కడి ఆర్మీతో కలిసి నివాళి అర్పించిన తర్వాత ఒక్కడినే బైక్‌పై కొంత ముందుకు వెళ్లాను. నా సహచరులంతా వద్దని వారించారు. కానీ వెళ్లాను. ఎత్తయిన ప్రాంతం కావడంతో ఆక్సిజన్ కరువైంది. వెనక్కి వద్దామని నిర్ణయించుకునే లోగానే మంచుతుపాను కమ్మేసింది. కొంతసేపు ఆ తుపానును ఆస్వాదించి తిరిగి వెనక్కి వచ్చాను. అక్కడేం జరిగినా వైద్యం అందా లంటే 8 గంటలు ప్రయాణించాల్సిందే. ఫోన్లు పనిచేయవు. కనుచూపు మేరలో మంచు కనిపిస్తుంది. నేను వెళ్లి వచ్చిన తెల్లారే ఆ ప్రాంతంలో హెలిక్యాప్టర్ క్రాష్ అయింది. మన జవాన్ల సేవలకు సలాం.. అక్కడ ప్రతికూల పరిస్థితుల్లో చలిలో, మంచు తుపానుల్లో మన జవాన్లు సరిహ ద్దుల్లో గస్తీ తిరగడం కళ్లారా చూశాను. వాళ్ల కు సలాం చేయాలనిపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో కార్గి ల్, లడఖ్, లే సరిహద్దుల్లో మన ఆర్మీ గస్తీ సేవలు అద్భుతం. నేను చిన్నప్పుడు చదు వుకున్న స్కూల్లో స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంలో జై జవాన్.. జై కిసాన్ అన్న నినాదాలు మళ్లీ స్ఫురణకు వచ్చాయి. అందుకే దేశానికి సరిహద్దుల్లో రక్షణగా ఉన్న జవాన్‌కు.. అన్నం పెట్టే రైతు కు మనం ఎప్పుడు రుణపడి ఉండడమే మన వారికి ఇచ్చే నిజమైన గౌరవం. -
ఫైనాన్స్ కంపెనీలపై ఉక్కుపాదం
► నెలవారీ చిట్టీలపై జిల్లా పోలీసు బాస్ ఆరా ► ప్రజలను బురిడీ కొట్టించే సంస్థలపై నజర్ ► మండలాల వారిగా వివరాల సేకరణ ఎల్లారెడ్డిపేట: ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలపై పోలీసులు ఉక్కుపాదం మోపడానికి సన్నద్దమవుతున్నారు. ఫైనాన్స్ కంపెనీల ద్వారా చిరువ్యాపారులు, రైతులకు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పులు ఇస్తూ అధిక మొత్తంలో వడ్డీలు గుంజడమే కాకుండా వారి ఆస్తులను కాజేస్తున్న తీరుపై ఇప్పటికే పోలీసులకు పలు ఫిర్యాదులందగా వీటిపై లోతుగా పరిశీలన ప్రారంభించారు. జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ప్రైవేట్ ఫైనాన్స్ లు, నెలవారి చిట్టిలపై నజర్ వేశారు. జిల్లా బాస్ ఆదేశాలతో జిల్లాలోని 13మండలాల్లో పోలీసులు గ్రామాల్లో జరిగే నెల వారి చిట్టిలు, ఫైనాన్స్ కంపెనీల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఎంటర్ప్రైజెస్లపై కఠిన చర్యలు తీసుకున్న ఎస్పీ జిల్లాలో అనుమతులు లేకుండా నెల వారి చిట్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆ దిశలో వీటిపై పూర్తివివరాలు, నిర్వాహకులు, వడ్డీల వసూలుపై పూర్తిస్థాయిలో వివరాలను సేకరించడానికి స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దింపినట్లు సమాచారం. ముఖ్యంగా సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో ప్రైవేట్ ఫైనాన్స్ లు, నెలవారి చిట్టీలు జోరుగా సాగుతున్నట్లు తెలుసుకొని వాటిని అదుపు చేయడానికి ఆ ప్రాంతాల్లోని పోలీసులను ఎస్పీ అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ఇసుకపై సీరియస్.. అక్రమంగా ఇసుక తరలించే విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఎల్లారెడ్డిపేటలో ఇసుక తరలించే వ్యక్తులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే జిల్లా వ్యాప్తంగా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని జిల్లా బాస్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. -
మహిళల భద్రతే షీటీం లక్ష్యం
కళాశాలలో ఫిర్యాదుల పెట్టె ►అందుబాటులో వాట్సాప్ నంబరు 79975 55511 ►ఫిర్యాదు మెసేజ్‌లు నేనే పరిశీలిస్తా ►ఎస్పీ విశ్వజిత్ కంపాటి సిరిసిల్ల క్రైం : మహిళలు, విద్యార్థినులు, యువతుల కు భద్రత కల్పించడమే ధ్యేయంగా షీటీం ముందుకు సాగుతోందని ఎస్పీ విశ్వజిత్ కంపాటి అన్నారు. జిల్లా కేంద్రంలోని వాసవీకల్యాణ మండపంలో బుధవారం షీటీం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, అకృత్యాలను పోలీసుల దృష్టికి తెచ్చేలా వారిలో ధైర్యం నూరిపోస్తున్నామని తెలిపారు. తాము అందుబాటులోకి తెచ్చిన 79975 55511 వాట్సప్ నంబరుకు సమాచారమిస్తే తానే స్వయంగా పరిశీలిస్తానని, లేనిపక్షంలో 94409 04823 నంబరుకు సమాచారం అందించాలని సూచించారు. అత్యాచారాలు, హత్యాచారాలు, వేధింపులు 18– 60ఏళ్ల వయస్సుపైవారిపైనా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులు, యు వతులపై జరిగే అకృత్యాలను నిరోధిం చేందుకరే షీటీంలను ప్రత్యేక డ్రెస్ కోడ్ లేకుండా ప్ర జల్లో మమేకం చేస్తున్నామన్నారు. ‘ఫ్రెండ్లీ పో లీసింగ్ అంటేనే తప్పు చేసిన వాడు భయపడాలి.. మంచి వాళ్లు స్నేహంగా పోలీసులతో మమేకమవ్వాలి.. షీటీంలకు దొరికిన పోకిరీ లపై నేరుగా కేసులు మోపే పరిస్థితి లేదని, ఒకటికి రెండుసార్లు కౌన్సెలింగ్ చేస్తామని, అయి నా మారకుంటే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సిరిసిల్లలో షీటీం పర్యవేక్షణాధికారి గా ఎస్సై శ్రీనివాస్ మంచి సేవలందిస్తున్నారని ఎస్పీ అభినందించారు. షీటీంలో మహిళా అధికారుల సంఖ్యను పెంచుతూనే సత్వరమే స్పం దించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నా రు. అన్ని విద్యాలయాల్లో ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేసి వారంలో ఒకరోజు వాటి ని తానే నేరుగా పరిశీలిస్తానని అన్నారు. సిరిసిల్ల డీ ఎస్పీ సుధాకర్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కతిక సారథి కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ïటౌన్ సీఐ విజయ్‌కుమార్, రూరల్ సీఐ రవీందర్, వేములవాడ రూరల్ సీఐ మాధవి, ఎస్సై శ్రీని వాస్, న్యాయవాది సీహెచ్ మహేశ్‌గౌడ్, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు జక్కని రాజు, వైద్యురలు నహీంజా, విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ట్రస్మా జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ సిరిసిల్ల ఎడ్యుకషన్ : తెలంగాణ గుర్తింపు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) జిల్లా కార్యాలయాన్ని ఎస్పీ విశ్వజిత్ ప్రారంభించారు. డీఈవో రాధాకిషన్ , ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, అధ్యక్షుడు రవిశంకర్, ఉపాద్యక్షుడు కోట మనోహర్, జిల్లా అధ్యక్షుడు ఆర్సీ రావు, ప్రధాన కార్యదర్శి నాగుల శ్రీనివాస్ గౌడ్, పట్టణ అ««దl్యక్షుడు గుగ్గిళ్ల జగన్ గౌడ్, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.