పకడ్బందీగా చట్టాల అమలు
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చట్టాల అమలుకు కృషి చేస్తుందని రాచకొండ కమిషనరేట్ షీ టీమ్స్ ఇన్‌చార్జి స్నేహిత పేర్కొన్నారు. మంగళవారం మంగళ్‌పల్లి గ్రామంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు షీ టీమ్స్‌పై అవగహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్నేహిత మాట్లాడుతూ కళాశాలల్లో ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఆకతారుులు బాలికలను ఇబ్బందులకు గురి చేస్తే నేరుగా షీ టీమ్స్, స్థానిక పోలీసులకు, లేదా 100 నెంబరుకు డయల్ చేసి ఫిర్యాదులు అందించాలని సూచించారు.
ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. రాచకొండ కమిషనర్ వాట్సాప్ నెంబరు 94906 17111 కూడా అందుబాటులో ఉంటుందన్నారు. అమ్మారుులు సామాజిక మాధ్యమాల్లో పర్సనల్ డాటా, ఫొటోలు పెట్టుకోవద్దని సూచించారు. ఆత్మరక్షణ కోసం కరాటే, కుంగ్‌ఫూలలో శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఇన్‌చార్జి మారుతి, సీఐ స్వామి, మహిళా పోలీసులు వరలక్ష్మి, రుద్రమదేవి ఫౌండేషన్ నిర్వాహకులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.