
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుది మోసపూరిత బడ్జెట్ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఆధారాలతో బయటపెట్టారన్నారు. ఈరోజు(గురువారం) చంద్రబాబు మోసపూరిత బడ్జెట్ పై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ‘ సూపర్ సిక్స్ సహా 143 హామీలు అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. జగన్ రూ. 14 లక్షల కోట్లు అప్పు చేసినట్లు చంద్రబాబు విష ప్రచారం చేశారు. చివరకు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ. 6 లక్షల కోట్లే అని తేల్చారు. అంటే ఇచ్చిన హామీల అమలను ఎగ్గట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు రూ. 36 వేల కోట్లు ఎగ్గొట్టారు.
ప్రజాస్వామ్య విరుద్ధంగా చంద్రబాబు వ్యాఖ్యలు
నిరుద్యోగులకు రూ.52 వేల కోట్లు బకాయి పెట్టారు. తల్లికివందనం కింద రూ.13,050 కోట్లు అవసరమైతే రూ.8 వేల కోట్లి మాత్రమే కేటాయించారు. అంటే ఇది ఎగ్గొట్టే ఉద్దేశం కాదా? , అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల కోట్లు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ మహిళలకు రూ. 45 వేల కోట్లు ఎగ్గొట్టారు. దీపం పథకం కింద అరకొర నిధులే కేటాయించారు. పెన్షన్ కూడా ఇప్పటికే 4 లక్షల మందికి కట్ చేశారు . అమరావతి అద్బుతదీపం అన్నారు. వేల కోట్లు అప్పు తెచ్చి కడుతున్నారు. టీడీపీ వారికి తప్ప ఇంకెవరికీ పనులు చేయవద్దంటూ ప్రజాస్వామ్య విరుద్ధంగా మాట్లాడారు. ఆయన మాటలు చూస్తుంటే చంద్రబాబు బుర్ర పని చేయటం లేదనిపిస్తోంది.

పవన్ అధికారాన్ని వదిలేసి ప్రతిపక్ష హోదా తీసుకో..
పవన్ కళ్యాణ్ అధికారాన్ని వదిలేసి ప్రతిపక్ష హోదా తీసుకోవాలి. జగన్ ఎవరి దయాదాక్షణ్యంతో రాజకీయాలలోకి రాలేదు. ఢిల్లీ కోటని ఢీకొట్టి మరీ వచ్చారు. లోకేష్ లాగా తన తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి రాలేదు. చంద్రబాబు అంత నీచుడు, 420 మరెవరూ లేరని ఎన్టీఆర్, హరికృష్ణ, నారా రామ్మూర్తి ఆత్మలు ఘోషిస్తున్నాయి. లోకేష్ చేస్తున్న దుర్మార్గాలకు ఈసారి ఘోర ఓటమి తప్పదు. నాదెండ్ల మనోహర్ బియ్యం దొంగ, లంచాల కోరు. పీడిఎస్ బియ్యం అమ్ముకుంటున్న దొంగ నాదెండ్ల మనోహర్. తనిఖీల పేరుతో బెదిరించి కోట్లకు కోట్లకు వసూలు చేస్తున్నారు.
మాది పోరాటం చేసి, రాటు తేలిన రాజకీయ పార్టీ
సూపర్ సిక్స్ హామీల అమలుకు రూ.79,876 కోట్లు అవసరమా? కాదా?, మరి మీరు కేటాయించినది ఎంత? అనేదానికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ మీద కాపులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎంతోమంది బీసీలు, కాపులను వదిలేసి తన అన్నకు పదవులు ఇవ్వటం కరెక్టు కాదు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచవద్దని పవన్ కళ్యాణ్ ని కోరుతున్నాను. చంద్రబాబు కుట్రల మీద దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో పుస్తకం రాశారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే వేదిక మీదకు వచ్చారు. మా పార్టీ నేతలపై పెట్టే అక్రమ కేసులు నిలపడవు. సోనియా గాంధీ ఎన్ని కేసులు పెట్టినా జగన్ నిలపడ్డారు. మాది పోరాటం చేసి, రాటు తేలిన రాజకీయ పార్టీ. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానికి మేము సిద్దమే. బూతులు తిట్టే అయ్యన్నపాత్రుడు స్పీకర్ అంట’ అని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment