సాక్షి, వరంగల్: వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేత వివాదం ముదురుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. పార్క్ స్థలం ఎకరం భూమి ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించుకుని ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయానికి ఇంటి నంబర్ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్ బీఆర్ఎస్ నేతలను స్టువర్ట్ పురం చెడ్డి గ్యాంగ్ దొంగలుగా రాజేందర్ రెడ్డి అభివర్ణించారు. భూ ఆక్రమణలు చేసిన బీఆర్ఎస్ నేతల మీద రౌడి షీట్ ఓపెన్ చేసి చెడ్డిల మీద తిప్పాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలైనా వదిలిపెడతాను కానీ... వినయ్ భాస్కర్ చేసిన పాపాలను వదిలిపెట్టనంటూ ఎమ్మెల్యే నాయిని నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment