
నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న రాహుల్..
సాక్షి, వరంగల్: నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న రాహుల్.. చాపర్‌లో వరంగల్ చేరుకోనున్న రాహుల్.. వరంగల్ సుప్రభా హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లనున్నారు.
కాగా, బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకొనున్నారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు.
