
బీసీ సంఘాల అభినందన సమావేశంలో సీఎం రేవంత్
మీ సహకారంతోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది
అందుకే మనసు పెట్టి మీకు న్యాయం చేసే ప్రయత్నం చేశా..
చిత్తశుద్ధితో బీసీల గణన చేశాం.. దానిని చట్టం చేశాం..
పొలిటికల్ ట్రాప్‌లో పడవద్దని పిలుపు.. 10 లక్షల మందితో సభ పెట్టాలని సూచన
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల ప్రజ ల మద్దతు లేకుండా తెలంగాణలో ఎవరూ అ ధికారంలో కొనసాగలేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీసీల సహకారంతోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని చెప్పా రు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మనసు పెట్టి పనిచేశానని, పక్కాగా బీసీ జనా భా లెక్కలతో డాక్యుమెంట్ తయారు చేసి, చట్టం చేసి రక్షణ కల్పించామని వెల్లడించారు.
బీసీ సంఘాలు పొలిటికల్ ట్రాప్‌లో పడి కులగణన విషయంలో విమర్శలు చేయవద్దన్నారు. బీసీ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో.. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో పలు బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సీఎంను బీసీ సంఘాల నేతలు శాలు వాలతో సత్కరించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘మీరు నాకు అభినందనలు చెబుతున్నా రు. ఈ అభినందనలన్నింటినీ మూటగట్టి తీసుకెళ్లి రాహుల్‌గాం«దీకిస్తా. భారత్‌జోడో యాత్ర సందర్భంగా కృష్ణా మండలం మీదుగా తెలంగాణలో ప్రవేశించినప్పటి నుంచి చార్మినార్ వరకు రాహుల్‌గాంధీ ఒకటే మాట చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రాష్ట్రాలతోపాటు కేంద్రంలో అధికారంలోకి వస్తే జాతీ య స్థాయిలో కులగణన చేస్తామన్నారు. మీ సహకారంతోనే తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. అందుకే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనసు పెట్టి పని చేశా.
నిబద్ధతతో ముందుకు వెళ్లాం..
కులగణన చేసేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సబ్‌కమిటీ చైర్మన్‌గా నియమించాం. కొందరు దీన్ని కూడా తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లగలిగిన నిబద్ధత, అధికారులతో పని చేయించగలిగిన నైపుణ్యం ఉన్న నాయకుడు కనుకనే ఆయనకు బాధ్యత ఇచ్చాం. బీసీల జనాభాకు సంబంధించి ఏ పరీక్షకైనా, ఎలాంటి స్రూ్కటినీలో అయినా నిలబడేలా పక్కా డాక్యుమెంట్ రూపొందించాం. దాన్ని లాకర్‌లో దాచిపెట్టదల్చుకోలేదు.
డాక్యుమెంట్‌ను బిల్లు పెట్టి చట్టం చేశాం. అందుకే బీసీల కులగణన విషయంలో నేను చరిత్రలో ఉండిపోతా. దేశంలో ఏ రాష్ట్రంలో కులగణన జరిగినా తెలంగాణకు వచ్చి నేర్చుకుని పోవాలి. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు కూడా ఇంతటి కీర్తిని ఊహించి ఉండరు. అదే తరహాలో తెలంగాణలో బీసీల గణన గురించి ఇప్పటికిప్పుడు చర్చ జరగకపోవచ్చుగానీ మున్ముందు మాత్రం కచి్చతంగా తెలంగాణ గురించి చెప్పుకోవాల్సిందే.
తప్పు ఉందంటే.. నష్టం చేసుకున్నట్టే..
బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి. కులగణన లో తప్పు ఉందని అంటే.. మీకు మీరు నష్టం చేసుకున్నట్టే. స్వయంగా పర్యవేక్షణ చేస్తూ, అందరినీ భాగస్వాములను చేశాను కాబట్టే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. వాయిదా వేయాలనుకుంటే పదేళ్లకు కూడా వీడని విధంగా చిక్కుముళ్లు వేయొచ్చు. ఓబీసీలతో కాంగ్రె స్ పార్టీకి చరిత్రాత్మక అనుబంధం ఉంది. బీసీల మద్దతు లేకుండా ఎవరూ అధికారంలో కొనసాగలేరు.
అడగాలి కొట్లాడాలే తప్ప మమ్మల్ని అనుమానించి అవమానిస్తే లాభం లేదు. బీసీల గణన విషయంలో తెలంగాణ ఇచి్చన డాక్యుమెంట్ ఓ బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిది. అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని కూడా సవరించుకున్నాం. అలాగే ఈ డాక్యుమెంట్‌ను కూడా భవిష్యత్తులో అవసరమైతే సవరించుకుంటాం.
10 లక్షల మందితో సభ పెట్టండి
బీసీ కుల గణన ప్రక్రియలో ఎన్నో పరిణామాలను ఎదుర్కొన్నా. అవన్నీ బయటకు చెప్పను. రిస్క్ చేసి బీసీల జనాభా లెక్కలు తేల్చా. మీరు అభినందనలు ఇక్కడే తెలపడం కాదు. పరేడ్ గ్రౌండ్స్‌లో 10 లక్షల మందితో సభ పెట్టండి. రాహుల్‌గాందీని పిలిపిస్తా. అభినందించండి. ఆయనకూ బలం వస్తుంది. దేశం మొత్తం కుల గణన జరపాలని పోరాడే శక్తి వస్తుంది’ అని సీఎం రేవంత్ అన్నారు.
సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం, పొంగులేటి, వీహెచ్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు ఈర్ల శంకరయ్య, రాజ్‌ఠాకూర్, వాకిటి శ్రీహరి, ప్రకాశ్‌గౌడ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, టి. చిరంజీవులు, దాసు సురేశ్ పాల్గొన్నారు.
సీఎం చెప్పిన ఏడంతస్తుల కథ
బీసీల కులగణన విషయంలో రాజకీయ నాయకుల విమర్శలను పెద్దగా పట్టించుకోనుగానీ బీసీ సంఘాలు మాత్రం విమర్శలు చేయవద్దని, తమను బాధ పెట్టవద్దని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘బీసీల గణనకు నేను పునాదులు వేశా. స్లాబ్ వేసి ఓ అంతస్తు కట్టా. ఆ ఇంట్లోకి రండి. వచ్చి కాపురం చేయండి. అన్నం వండుకుని తినండి. మీకు వీలున్నప్పుడు రెండో అంతస్తు, మూడో కట్టుకోండి. అలా కాకుండా మాకు ఏడంతస్తుల భవనం కట్టివ్వలేదు. మేం ఆ ఇంట్లోకి రామంటే మీకే నష్టం.
ఏడంతస్తులు కట్టేలోపు పునాదులు శిథిలమై స్లాబ్ కూలిపోతుంది. బీసీ సంఘాలు పొలిటికల్ ట్రాప్‌లో పడొద్దు. నేనిచ్చిన డేటా మీకు లంకెబిందెల్లాంటిది. కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కొట్లాడితేనే దేశానికి స్వాతంత్య్రం వచి్చంది. కొట్లాడితే జనగణనలో కులగణన జరగదా? ఒక్కసారి జనగణనలో కులగణన ప్రారంభమైతే ప్రతి పదేళ్లకోసారి బీసీల జనాభా ఎంత ఉందో తేలిపోతుంది’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.