Rahul Gandhi
-
రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని.. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హెచ్ఐసీసీలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమేనని.. ఆధునిక సోషల్ మీడియాతో అంతా మారిపోయిందంటూ చెప్పుకొచ్చారు. నిన్ననే ఇక్కడకు రావాల్సిన ఉన్నా.. కశ్మీర్‌కు వెళ్లడంతో రాలేకపోయాయన్నారు.పాతతరం రాజకీయం ఓ రకంగా అంతరించిపోయిందని.. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రలో 4 వేల కిలోమీటర్లు నడిచానన్నారు. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. వాదన వినిపించేందుకు కొత్త దారులు వెతుక్కోవాల్సి వస్తుంది. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు.విద్యా, వైద్యం తదితర అంశాలపై నూతన పాలసీలను రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశాను. దేశ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి నా పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది. విద్వేష రాజకీయాలను మార్చాలని అర్థం చేసుకున్నాను. ఎంతో మందిని కలిసిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇండియాలో నూతన రాజకీయాలను నిర్మిద్దాం. అందరి ఆలోచనలు స్వీకరించి నూతన విధానాన్ని కొనసాగిద్దాం. పాదయాత్రలో ఒక వ్యక్తి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పారు. ప్రేమ, ఆప్యాయతను ప్రజలతో పంచుకోవడం మొదలు పెట్టాను. పాదయాత్రలో అనేక మందిని కలిసిన తర్వాత విద్వేషపు బజారుల్లో ప్రేమ దుకాణాన్ని తెరిచానని స్లోగన్ తీసుకున్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు.అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యం: సీఎం రేవంత్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. భారత్ సమ్మిట్‌లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నా.. తెలంగాణకు ఎంతో గొప్ప చరిత్రతో పాటు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు ఉద్యమానికి నాయకత్వం వహించారు. వారి పోరాటం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని రేవంత్ అన్నారు. -
Rahul Gandhi: ‘సుప్రీం’ మందలింపు.. ఆ వెంటనే చిక్కులు!
ముంబై/న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చిక్కుల్లో పడ్డారు. పరువు నష్టం కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పుణే కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. స్వాతంత్ర సమరయోధుడు వీరసావర్కర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.ఏఎన్ఐ కథనం ప్రకారం.. 2023 మార్చి 5వ తేదీన లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ వీరసావర్కర్(Veer Savarkar)ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు గానూ రాహుల్‌పై సావర్కర్ దగ్గరి బంధువు పుణే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన కోర్టు.. మే 9వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.మరోవైపు.. సావర్కర్‌పై మరో సందర్భంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలనుగానూ కేసు నమోదు అయ్యింది. అయితే.. తాజాగా ఆ కామెంట్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.2022లో.. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్ర అకోల్‌లో రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.అయితే, దీనిపై అనేకసార్లు విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని న్యాయస్థానం (ACJM) రాహుల్‌కు రూ.200 జరిమానా కూడా విధించింది. అయితే.. ఈ కేసులో తనకు జారీ చేసిన సమన్లను అలహాబాద్ హైకోర్టు రద్దు చేయడానికి నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తాజాగా.. విచారణ జరిపిన సుప్రీం కోర్టు రాహుల్‌ను గట్టిగానే మందలించింది.వీర్ సావర్కర్‌కు (Vinayak Damodar Savarkar) మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని పేర్కొన్న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం.. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని మందలించింది. స్వాతంత్ర్య సమరయోధులను ఎగతాళి చేయడం తగదని.. మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులపై ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించమని పేర్కొంది. ఇకనుంచి వాళ్లను అపహాస్యం చేస్తే ఇకపై కోర్టు సుమోటోగా విచారణ చేపడుతుందని తెలిపింది.అదే సమయంలో.. రాహుల్‌పై దాఖలైన కేసులో ఆయనపై క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. రాహుల్‌పై ఫిర్యాదు చేసిన నృపేంద్ర పాండేకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. -
హైదరాబాద్ : ‘భారత్ సమ్మిట్-2025.. విదేశీ ప్రతినిధులకు ఘనస్వాగతం (ఫొటోలు)
-
ఐక్యంగా ఎదుర్కొందాం
శ్రీనగర్: దేశ ప్రజలంతా కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. మనమంతా ఐక్యంగా ఉంటే ఉగ్రవాదం అంతం కావడం ఖాయమని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి, విభజన తీసుకురావాలన్న లక్ష్యంతోనే పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిందని అన్నారు. కలిసి ఉంటున్న సోదరుల మధ్య గొడవలు పెట్టాలన్నదే ముష్కరుల ఉద్దేశమని ఆరోపించారు. ముష్కర మూకల కుట్రలను తిప్పికొట్టడానికి మనమంతా ఒక్కటై చేతులు కలపాలని సూచించారు. ఐక్యమత్యమే మన బలమని ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని శాశ్వతంగా ఓడించడానికి యావత్ దేశం ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ శుక్రవారం జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని సైనిక ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న పహల్గాం ఉగ్రవాద దాడి బాధితుడిని పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని బాధితుడికి భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. పహల్గాం దాడి అత్యంత దారుణమని చెప్పారు. ఈ ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించారని తెలిపారు. ఈ దాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన సానుభూతి ఉంటుందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొనే చర్యలు పూర్తి మద్దతు ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రతిపక్షం మొత్తం ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రజలపై దాడుల జరుగుతుండడం విచారకరమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మన సోదర సోదరీమణులను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమంతా ఒక్కటి కావాలని కోరారు. మరోవైపు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. అంతకుముందు జమ్మూకశ్మీర్ వ్యాపారులు, విద్యార్థి సంఘాల నాయకులు, పర్యాటక రంగ ప్రతినిధులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
సమరయోధులపై అపహాస్యమా?
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. వీర సావర్కర్‌ను మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారని గుర్తు చేసింది. ‘‘మీ నానమ్మ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా సావర్కర్‌ను ప్రశంసిస్తూ లేఖ రాశారని మీకు తెలుసా? మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు తెచ్చిపెట్టిన వారిని ఇలా అవమానిస్తారా?’’ అంటూ ఆగ్రహం వెలిబు చ్చింది. ‘‘మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని సుమోటోగా తీసుకుంటాం’’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం శుక్రవారం హెచ్చరించింది. ‘‘ఇలాగే వదిలేస్తే మున్ముందు ‘గాంధీ బ్రిటిష్‌వారికి సేవకుడు’ అని కూడా చెబుతారు. ఎందుకంటే వైస్రాయ్ను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు గాంధీ ‘మీ నమ్మ కమైన సేవకుడు’ అంటూ మాట్లాడేవారు. స్వాతంత్య్ర యోధులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించబోం’’ అని స్పష్టం చేసింది. సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది. యూపీలో దాఖలైన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది. -
నేడు కశ్మీర్‌కు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం జమ్ముకశ్మీర్ వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్ర దాడి బాధితులను ఆయన పరామర్శించనున్నారు. అనంతనాగ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న బాధితులతో రాహుల్ మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని తిరిగి వచ్చిన రాహుల్ గురువారం సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొన్నారని తెలిపాయి. అనంతరం అఖిల పక్ష సమావేశంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం.. మృతులకు ఘన నివాళిఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి ముమ్మాటికీ భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యేనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు పాకిస్తానే సూత్రధారి. ఈ ఉగ్రవాద చర్య మన గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఇటు వంటి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలను, సీమాంతర ఉగ్రవాదా న్ని సమష్టిగా, దృఢసంకల్పంతో ఎదుర్కోవాలని పునరుద్ఘాటి స్తున్నాం అంటూ సీడబ్ల్యూసీ పేర్కొంది.నిఘా వైఫల్యాలపై విశ్లేషణ అవసరం..ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ ఎత్తి చూపింది. ‘పహల్గాం మూడంచెల భద్రతా వ్యవస్థ కలిగి ఉండే శత్రుదుర్బేధ్యమైన అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇంతటి తీవ్ర దాడి చోటుచేసుకుంది. ఈ సమయంలో నిఘా వైఫల్యాలు, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టాల్సిన అవసరం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎంతో అవస రం. బాధిత కుటుంబాలకు నిజంగా న్యా యం జరిగే ఏకైక మార్గం ఇదే’ అని సీడబ్ల్యూసీ పేర్కొంది. అలాగే, లక్షలాది మంది పాల్గొనే అమర్నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. పర్యాటకంపై ఆధారపడ్డ కశ్మీర్ ప్రజల జీవనోపాధిని కాపాడాలి’ అని కేంద్రానికి సూచించింది.రాజకీయ ప్రయోజనాలొద్దు..ప్రజల్లో విభజన బీజాలు నాటేందుకు పహల్గాం దాడిని బీజేపీ అధికారిక, అనుకూల సోషల్ మీడియా వేదికలు వాడుకోవడం దారుణమని సీడబ్ల్యూసీ తెలిపింది. కాగా, పహల్గాం దాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పించేందుకు శుక్రవారం పార్టీ శ్రేణులు అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో క్యాండిల్మార్చ్ నిర్వహిస్తాయని అనంతరం కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. -
కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
-
Boston: ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందని, ఆ వ్యవస్థలోనే ఏదో తప్పు ఉందంటూ వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రస్తావననూ ఆయన తీసుకొచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఆదివారం బోస్టన్‌లో ప్రవాస భారతీయులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Election Fraud) 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. అలాంటప్పుడు అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేయగలరు?. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని రాహుల్ అన్నారు.बोस्टन : चुनाव आयोग ने हमें शाम 5:30 बजे तक के मतदान के आंकड़े दिए और शाम 5:30 बजे से 7:30 बजे के बीच 65 लाख मतदाताओं ने मतदान किया. ऐसा होना शारीरिक रूप से असंभव है :राहुल गांधी #RahulGandhi #MaharashtraElection #ElectionCommission #RahulGandhiUSA #Boston pic.twitter.com/8kSVOhZ6BU— Sumit Kumar (@skphotography68) April 21, 2025‘‘ఎన్నికల సంఘం(Election Commission) రాజీ పడినట్లు ఇక్కడే అర్థమవుతోంది. ఆ వ్యవస్థలోనే ఏదో తప్పిదం ఉంది. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. మహా ఎన్నికలకు సంబంధించిన వీడియోలు చూపించాలని మేం అడిగాం. అందుకు ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికగా ఆయన అమెరికా భారత్ మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. సోమవారం బ్రౌన్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ ఈసీపై ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. అయితే.. రాహుల్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చనే ఆరోపణలను కూడా తోసిపుచ్చుతూ వస్తోంది. అయినప్పటికీ వరుసగా ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఓటర్ల జాబితాల ఆధారంగా ప్రతిపక్షాలు ఈసీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. -
‘వారు బెయిల్ తెచ్చుకున్న నిందితులు’
హైదరాబాద్: డూప్లికేట్ గాంధీ కుటుంబానికి భారతీయ చట్టాలు వర్తించవా?, రాజ్యాంగానికి అతీతులని అనుకుంటున్నారా?, నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాజేసేందుకు డూప్లికేట్ గాంధీ కుటుంబం చేసిన కుట్ర’ అంటూ కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకున్న నిందితులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ. ఇందులో బీజేపీ, మోదీ పాత్ర ఏముంది?, కాంగ్రెస్ కార్యకర్తలారా....నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్లో మీ వాటా ఉంది. మీరు ధర్నా చేయాల్సింది.... టెన్ జన్ పథ్ సోనియా ఇంటి ముందు. తప్పు చేస్తే సోనియా సహా అందరూ జైలుకు వెళ్లక తప్పదు.రాహుల్ స్పూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఫోర్త్ సిటీకి చెందిన 50 వేల కోట్ల ఆస్తులను కాజేసే కుట్ర. సుబ్రమణ్యస్వామి కేసులతో బీజేపీకి ఏం సంబంధం?, బూతులు మాట్లాడితే చప్పట్లు కొడుతుంటే నివారించాల్సింది పోయి సమర్ధిస్తారా?, దావోస్ పెట్టుబడులు ఎటు పోయాయ్?...జపాన్ పర్యటన కూడా అంతే. కాంగ్రెస్, బీఆర్ఎస్ జాన్ జబ్బలు.... బీఆర్ఎస్ అవినీతి కేసులన్నీ నీరుగార్చడమే నిదర్శనం.విద్యుత్ కొనుగోళ్ల స్కాంపై నివేదిక ఇచ్చినా కేసీఆర్ కు కనీసం నోటీసు ఎందుకు ఇవ్వలేదు?, బెంగాల్ తరహా పరిస్థితులు తెలంగాణలో వచ్చే ప్రమాదముంది. దీనికి ముమ్మాటికీ కారణం రేవంత్ రెడ్డి కాబోతున్నరు. రేవంత్ ఆర్ధిక సహకారంతోనే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మజ్లిస్ ఆందోళన చేస్తోంది. దీనిని అడ్డుకోకపోతే జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించక తప్పదు’ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. -
‘రోహిత్ వేముల’ చట్టాన్ని తీసుకురండి
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విన్నవించారు. ఈ మేరకు సిద్ధరామయ్యకు ఒక లేఖ రాశారు రాహుల్ గాంధీ. విద్యా వ్యవస్థలో కులం పేరుతో దూషణలకు చెక్ పడాలంటే ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలని, దీనిలో భాగంగా కర్ణాటకలో రోహిత్ వేముల పేరుతో ఒక చట్టాన్ని చేసి దాన్ని అమలు చేయాలని రాహుల్ కోరారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ సైతం కుల వివక్షను ఎదుర్కోన్నారనే విషయాన్ని రాహుల్ ఇక్కడ ప్రస్తావించారు. ఆ సమయంలోనే కాదు.. నేటికీ ఇంకా కుల వివక్ష ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయాలని సిద్ధరామయ్యను కోరారు. ఈ చట్టం చేయడానికి సిద్ధరామయ్య అంగీకరించి అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఏ స్థాయిలో విద్యార్థి అయినా కుల వివక్షకు గురైతే అది నిజంగా సిగ్గు చేటన్నారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీ కులాలు ఈ తరహా కుల వివక్షను ఎదుర్కోనే వారిలో ముందు వరసలో ఉన్నారన్నారు. ప్రధానంగా విద్యాస్థాయిలోనే ఈ కుల వివక్షకు గురి కావడం అధికంగా ఉందన్నారు. నవనాగరిక సమాజంలో ఇప్పటికే లక్షల మంది కుల వివక్ష బారిన పడుతున్నారన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న రోహిత్ వేముల అనే విద్యార్థి ఇక్కడ కులం పేరుతో హత్య చేయబడ్డాడని రాహుల్ ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రోహిత్ వేముల.. 2016లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. హెచ్‌సీయూ విద్యార్థి అయిన రోహిత్ వేముల.. వేధింపులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో ఆ సమయంలో దళిత సంఘాలు ఉద్యమించాయి. -
వచ్చే వారం అమెరికాకు రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వచ్చే వారం అమెరికాకు వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపక సిబ్బందితో జరిగే ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ మీడియా పబ్లిసిటీ విభాగం చీఫ్ పవన్ ఖేరా గురువారం ఈ విషయం తెలిపారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. అదేవిధంగా, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆఫీసు బేరర్లు, సభ్యులతో సమావేశమవుతారు. -
‘మోదీకి రాహుల్ గాంధీ భయపడతారా?’
హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను ఈడీ తన చార్జిషీట్ లో నమోదు చేయడాన్ని టీపీసీసీ వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా నగరంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కేసులకు భయపడతారా?, దేశం కోసం త్యాగం చేసిన వారి రక్తం రాహుల్ గాంధీలో పారుతోంది. కేసులు పెడతా.. జైల్లో పెడతా అంటే స్వతంత్ర ఉద్యమంలో నెహ్రా తలొగ్గలేదు. బ్రిటీష్ వాళ్లకే గాంధీ కుటుంబం భయపడలేదు. మోదీకి రాహుల్ గాంధీ భయపడతారా?, అఫ్ట్రాల్ బీజేపీకి రాహుల్ గాంధీ భయపడరు. కుట్రలో బాగంగా రాహుల్ గాంధీపై కేసు. బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తుంది పార్టీ. ఈవీఎంలతో ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతోంది. గుజరాత్లో మోదీకి రాహుల్ గాంధీ సవాల్ చేయడంతో కేసులు బనాయిస్తున్నారు’ అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై సమీక్షంతకుముందు పుప్పలగూడ పరిసరాల్లో 400 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ముందే జాగ్రత్త పడుతున్న యువనేత
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న బిహార్ శాసనసభ ఎన్నికలపై విపక్షాల ‘ఇండియా’ కూటమి ఇప్పటికే తమ వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. జనతాదళ్(యూ) నేతృత్వంలోని నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న కసితో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) తన మిత్రపక్షాలనైన కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో తొలిదశ చర్చలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌తో పాటు బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్, ఆర్జేడీ నాయకులు మనోజ్ ఝా, సంజయ్ యాదవ్ పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో పొత్తులు, సీట్ల పంపకాలు, ఎన్నికల అజెండా తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అధికారమే లక్ష్యంగా.. గత 2020లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ–జేడీయూలు ఎన్డీఏ కూటమిగా, ఆర్జేడీ–కాంగ్రెస్‌లు మహాఘట్బంధన్ కూటమిగా బరిలో దిగాయి. 243 స్థానాలున్న బిహార్‌లో ఎన్డీఏ కూటమి 125 స్థానాలను కైవలం చేసుకుంది. మహాఘట్బంధన్ కూటమి 110 స్థానాలను దక్కించుకుంది. దీంతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నితీశ్ కుమార్ (Nitish Kumar) 2022లో బీజేపీతో విభేదించి మహాఘట్బంధన్లో చేరి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం మళ్లీ 2024లో మహాఘట్‌బంధన్‌తో బంధం తెంచుకుని తిరిగి బీజేపీ చెంతనచేరారు. కమలదళం దన్నుతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తాను కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో చేరి అతిపెద్ద తప్పు చేశానని, ఇకపై అలాంటి తప్పులకు తావివ్వబోనని వ్యాఖ్యానించారు. నితీశ్ అంత మోసకారి మరొకరు లేరని, ఆయన విశ్వాస ఘాతకుడంటూ కాంగ్రెస్, ఆర్జేడీలు ఆయనపై విమర్శలు గుప్పించాయి. నితీశ్ అవకాశ వాదానికి గట్టిగా బదులివ్వాలనే దృఢ సంకల్పంతో ఉన్న రెండు పార్టీలు ఆయన్ను బలంగా ఢీకొట్టాలని భావిస్తున్నాయి. చదవండి: సోనియా, రాహుల్ గాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలుప్రస్తుతం అసెంబ్లీలో 243 స్థానాలకు గానూ బీజేపీకి 78, జేడీయూకి 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆర్జేడీకి 75, కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేయగా, ఈసారి దాదాపు 90 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఆర్జేడీ గత ఎన్నికల్లో 144 స్థానాల్లో పోటీ పడగా, ఈ సారి 150కి పైగా స్థానాల్లో పోటీకి ఉవ్విళ్లూరుతోంది. మిత్రపక్షాలైన లెఫ్ట్ పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల సంసిద్ధతను మొదలుపెట్టి సీట్ల పంపకాలు, ఎన్నికల ప్రచార అంశాలపై ఆర్జేడీ తొలి దశ చర్చలకు శ్రీకారం చుట్టింది. నితీశ్‌ను బీజేపీ హైజాక్ చేసిందన్న తేజస్వి ఈ భేటీ అనంతరం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని, ఏప్రిల్ 17న పట్నాలో కాంగ్రెస్ నాయకులతో జరిగే తదుపరి సమావేశంలో మరిన్ని వివరాలను చర్చిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను బీజేపీ హైజాక్ చేసిందని, ఎన్డీఏ పాలనలో ఎటువంటి అర్థవంతమైన అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు సహా ఇతర పార్టీలతో కూడిన మహాఘటబంధన్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ చర్చించి ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాయని, ఈ విషయంలో ఊహాగానాలకు తావివ్వరాదని అన్నారు. -
National Herald: సోనియా, రాహుల్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ కౌంటర్
ఢిల్లీ: దేశంలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారని ఘాటు విమర్శలు చేశారు బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్.నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిరసనలకు బీజేపీ కౌంటరిచ్చింది. తాజాగా బీజేపీ సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ..‘కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ.. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్‌కు ఇచ్చే హక్కు లేదు. స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ప్రజల గొంతును బలోపేతం చేయడానికి ఏర్పాటుచేసిన ఈ వార్తా పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారు. ఈ కేసును కొట్టివేయించడానికి సోనియాగాంధీ, రాహుల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి.చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అక్రమాలకు పాల్పడినవారు తప్పించుకోవడానికి ఇది కాంగ్రెస్ పాలన కాదు. ఇక్కడ రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదు. దేశ రాజధానిలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ నుంచి ముంబై, లక్నో, భోపాల్, పట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రజాఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేయడానికి ఈ కార్పొరేట్ కుట్ర పన్నారు. ‘అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్’ (ఏజేఎల్)కు సంబంధించిన 99% షేర్లను కేవలం రూ.50 లక్షలకు బదలాయించుకొని, రూ.రెండు వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని గాంధీ కుటుంబం తప్పుడు మార్గాన కైవసం చేసుకుంది’ అంటూ ఆరోపణలు చేశారు.మరోవైపు.. రవిశంకర్ ప్రసాద్ ఆరోపణలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా మాట్లాడుతూ..%స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారు నేషనల్ హెరాల్డ్, గాంధీ కుటుంబం, కాంగ్రెస్‌ను ద్వేషించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆర్ఎస్ఎస్ ఆక్రమించింది. లాభాపేక్షలేని సంస్థపై మనీలాండరింగ్ కేసు, అక్కడ నిధుల మార్పిడి జరగలేదు. ఆస్తి హక్కులు బదిలీ చేయబడలేదు. ఇది నరేంద్ర మోదీ భయాన్ని చూపిస్తుంది. ఈ కేసు రాజకీయ ప్రేరేపితం మాత్రమే. మేము న్యాయ వ్యవస్థను విశ్వసిస్తాము. దీనిపై మేము చట్టబద్ధంగా పోరాడి న్యాయం పొందుతాము. ప్రతిపక్షాల గొంతును అణిచివేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకున్నారు. మోదీ ప్రభుత్వానికి ఎటువంటి ఆధారాలు లేవు. వారు ప్రతిపక్షాల ప్రతిష్టను దిగజార్చాలని మాత్రమే కోరుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. -
నేషనల్ హెరాల్డ్ కేసు.. చార్జ్‌షీట్‌లో సోనియా గాంధీ, రాహుల్ పేర్లు
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ భారీ షాకిచ్చింది. వీరిద్దరి పేర్లను ఈడీ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తునకు నోటీసులిచ్చిన ఈడీ.. తాజాగా సోనియా, రాహుల్ పేర్లను చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఈనెల 25వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది.కాగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కేసులో రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఏజెఎల్, యంగ్ ఇండియన్పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఏజెఎల్.. నేషనల్ హెరాల్డ్ న్యూస్ ప్లాట్ఫారం (వార్తాపత్రిక, వెబ్ పోర్టల్)నకు ప్రచురణకర్తగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్‌లో 38 శాతం వాటాలతో అధిక వాటాదారులుగా ఉన్నారు. ఈడీ తన దర్యాప్తులో.. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఉద్దేశపూర్వకంగా ప్రయోజనం చేకూర్చేదిగా పనిచేసిందని ఆరోపించింది. సంస్థ విలువను గణనీయంగా తక్కువగా అంచనా వేసి , రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను ఏజెఎల్ సేకరించిందని ఈడీ గుర్తించింది. రూ. 18 కోట్ల వరకు బోగస్ దానాలు, రూ. 38 కోట్ల వరకు బోగస్ అడ్వాన్స్ అద్దె, రూ. 29 కోట్ల వరకు బోగస్ ప్రకటనల రూపంలో అక్రమంగా రాబడిని సంపాదించుకునేందుకు యంగ్ ఇండియన్ ప్రయత్నించిందని ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే రూ. 661 కోట్ల ఏజెఎల్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులిచ్చింది. ఈడీ కార్యాలయాల వద్ద ధర్నాకు ఏఐసీసీ పిలుపునేషనల్ హెరాల్డ్ కేసు చార్జి షీట్ లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ పార్టీ నిరసనకు సిద్ధమైంది. రేపు(బుధవారం) ఈడి కార్యాలయాలవద్ద ధర్నాకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందిన, ప్రతిపక్షాలపై ఇది నేరుగా చేస్తున్న దాడిగా అభివర్ణించింది. ప్రతీకార రాజకీయాలకు ఇది పరాకాష్టని,ఈ అంశంపై తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. -
ఇది కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు!
కాంగ్రెస్ పునర్వైభవం, కాంగ్రెస్ కన్నా దేశానికి ఎక్కువ అవసరమనే ప్రజల ఆకాంక్షని పార్టీ నాయకత్వం గ్రహించినట్టుంది. కానీ, అదెలా జరగాలనే విషయంలో దానికొక స్పష్టత లేదని ఏఐసీసీ 86వ జాతీయ సమావేశాన్ని చూస్తే అర్థమవుతుంది. పాత విషయాల వల్లెవేతే తప్ప... జాతికి నూతన ఆశలు కల్పించే, మిత్రపక్షాలకు కొత్త నమ్మిక ఏర్పరిచే, పార్టీ శ్రేణులకు తాజా ప్రేరణనిచ్చే అంశా లేవీ తీర్మానాల్లోకి రాలేదు. కాలం చెల్లిన అంశాలను వల్లెవేయడం కాకుండా కాలంతో కాలు కదిపితేనే కాంగ్రెస్‌కు మళ్లీ పాత రోజులు వస్తాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు బలంగా నమ్ము తున్నారు. ఆ దిశలో నాయకత్వమే చొరవ చూపటం లేదు. జాతిపిత గాంధీజీ ఆశ్రమం నెలకొల్పిన సబర్మతి నదీ తీరంలో జరిగిన రెండు రోజుల కాంగ్రెస్ జాతీయ సదస్సు (Congress National Convention) ‘మరో భేటీ’ లాగ, సాదాసీదాగానే ముగిసింది. కాంగ్రెస్ మహామహుల పుట్టిల్లయి ఉండీ, మూడు దశాబ్దాలుగా అధికారానికి పార్టీ దూరమైన గుజరాత్ (Gujarat) నేల నుంచి గట్టి సందేశం ఇచ్చి ఉండాల్సిందనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. సదస్సు చప్పగా సాగిందని పార్టీ ముఖ్యనేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.కాంగ్రెస్ లేని భారత్ (కాంగ్రెస్ ముక్త్ భారత్) నెలకొల్పాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముమ్మరంగా ప్రచారం చేస్తూ, పార్టీ ప్రభుత్వాలను కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితం చేసిన తరుణంలో... ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ మిశ్రమ ఫలితాలు సాధించిన 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్టీ నాయకత్వాన్ని కుంగదీసింది. ముఖ్యంగా హరియాణా, మహారాష్ట్రల్లో గెలిచే పరిస్థితులుండీ బీజేపీ నేతృత్వపు ఎన్డీయే కూటమి చేతిలో ఓటమి తప్పలేదు. జమ్మూ–కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విపక్ష ‘ఇండియా కూటమి’ నెగ్గినా అక్కడ కాంగ్రెస్ ప్రభావ రహితమైన మైనర్ పార్ట్‌నర్‌గానే ఉంది. కొన్ని చోట్ల జాతీయ పార్టీని, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తుల్ని, మరికొన్ని చోట్ల జతకట్టిన మతతత్వ శక్తుల్నీ... ఇలా ఆ యా రాష్ట్రాల్లో భిన్నమైన ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్‌కుంది. అందుకే, ప్రస్తుత భేటీ కాంగ్రెస్‌కు ముఖ్యమైనదిగా పార్టీ శ్రేణులు పరిగణించాయి.యువతరాన్ని ఆకట్టుకోవాల్సిందే!ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్‌ను ఎవరు సొంతం చేసుకుంటున్నారు అన్నది ఇవాళ్టి యువతకు పట్టే అంశం కానేకాదు. పటేల్, నెహ్రూల మధ్య, లేని అంతరాల్ని ఎగదోస్తూ ప్రత్యర్థులు రాజేసే రాజకీయ కుంపటి చుట్టూ కాంగ్రెస్ తిరగాల్సిన అవసరమే లేదన్నది సగటు కాంగ్రెస్ కార్యకర్త మనోభావన! భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందనే కాంగ్రెస్ ఘాటైన విమర్శకు 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే ‘పొలిటికల్ డివిడెండ్స్’ లభించాయి. ‘ఇండియా కూటమి’కి 150 స్థానాలు మించి రావని దేశంలోని 16 ప్రముఖ సర్వే సంస్థలు వేసిన అంచనాల్ని తలకిందులు చేస్తూ, 235 స్థానాలు గెలుచుకోవడం ఈ ప్రచార ప్రభావమే! 400 స్థానాలు ఆశించిన బీజేపీ సొంతంగా 240, కూటమికి 293 స్థానాలతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. మళ్లీ అదే నినాదాన్ని ఎంత బిగ్గరగా వినిపించినా.... తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయలేదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, అభివృద్ధి లేమి వంటి సమస్యలు ప్రజల నిత్య ఆలోచనల్లో ఉన్నాయి. ఆయా అంశాల్లో ప్రభుత్వం ఎంతగా విఫలమైందో ఎండగట్టే విపక్ష ఎత్తుగడలు యువతను ఆకట్టుకోవడానికి పనికొస్తాయి.‘కులగణన’ ఒక స్థాయి వరకు సానుకూల ఫలితాలిచ్చినా, తదుపరి ప్రతికూలించే ప్రమాదముందనే అభిప్రాయాన్ని పార్టీలోని ఒక వర్గం వ్యక్తం చేస్తోంది. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలనే ప్రజాభిప్రాయం స్వాగతించదగిందనీ, లేకుంటే ప్రాంతీయ శక్తుల ప్రాబల్యం పెరుగుతుందనే భావనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ కూడా జరిగిన జాతీయ సదస్సు ఈ విషయంలో ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోయిందనే భావన శ్రేణుల్లో ఉంది.ఆశ, ఆకాంక్ష అయితేనే...పార్టీ కీలక తీర్మానానికి మద్దతు పలుకుతూ, సదస్సులో ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఒక మాటన్నారు: ‘కాంగ్రెస్ అంటే పగ. ప్రతీకారం కాకుండా ప్రజలకు ఒక ఆశ, ఆకాంక్ష అవ్వాలి. కాంగ్రెస్ అంటే కేవలం గత వైభవమే కాకుండా, సానుకూల దృక్పథం కలిగిన ఒక ఆశావహ భవిష్యత్ కావాలి. వ్యతిరేకిస్తూ చేసే విమర్శ మాత్రమే కాకుండా సద్యోచన, నిర్మాణాత్మక సహకారం అందించే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండాలి.’సదస్సు రెండో రోజు సాంఘిక శాస్త్ర పాఠంలా సాగిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగంలో ప్రధానంగా కాంగ్రెస్ కృషిని, త్యాగాలను ప్రశంసించడంతో పాటు బీజేపీ, ఆరెస్సెస్‌ది విపరీత భావజాలమంటూ విమర్శలు గుప్పించారు. ‘రాహుల్ ఇలా మాట్లాడాలి. కానీ, మాట్లాడరు’ అంటూ సంపాదకుడు హరీశ్ ఖరే ఒక రోజు ముందుగా ‘ద వైర్’ వేదికగా వెలువరించిన ప్రసంగ(వ్యాస)ంలోని ముఖ్యాంశాలను రాహుల్ నిజంగానే ప్రస్తావించలేదు. ‘..మతఛాందసం, వేర్పాటువాదం, నియంతృత్వాలకు వ్యతిరేకంగా నా శక్తి మొత్తాన్ని వెచ్చించి కడదాకా పోరాడుతానని విస్పష్టంగా ప్రకటిస్తున్నాను..’ అనే మాటలతో మొదలై, ‘.. గాంధీ, నెహ్రూ కుటుంబానికి చెందిన వాడినైనందున, మా తండ్రి, నాయనమ్మ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినందున... సహజంగానే నేను ప్రధానమంత్రి పదవికి అర్హుడనైతానని మీలో కొందరు భావిస్తుండవచ్చు. కానీ, నాకా ఆలోచన లేదు. నేను గానీ, మా కుటుంబంలో మరెవరైనా గానీ, ఆ పదవిని ఆశించడం లేదు’ అనే మాటలతో హరీశ్ వ్యాసం సాగుతుంది. ఆయన రాసినట్టుగానే ఇవేవీ రాహుల్ మాట్లాడలేదు.ఈ పద్ధతి సరికాదు!పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తామంటూనే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పార్టీ బలహీనపడే పరిస్థితులను అధినాయకత్వం ఉపేక్షించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. కొన్నిసార్లు పరోక్షంగా అధిష్ఠానమే ప్రోత్సహిస్తోంది. ఇందుకు తెలంగాణ, కర్ణాటకలో ప్రత్యక్ష ఉదంతాలున్నాయి. తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి మీనాక్షీ నటరాజన్ నేరుగా సచివాలయానికి వెళ్లి, మంత్రివర్గ ఉపసంఘంతో, అధికారులతో భేటీ అయి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) భూవివాదాంశాన్ని సమీక్షించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. పార్టీ కార్యాలయమైన గాంధీభవన్‌లో కాకుండా నేరుగా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థి ప్రతినిధులు, పౌర సంఘాల వారితో ఆమె ముచ్చటించారు. మళ్లీ వచ్చి, ఆ అంశాలను మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ, ఆయా ప్రతినిధులు, వర్గాల వారితో అది చర్చిస్తుందన్న ముఖ్యమంత్రి మాటలు అమలు కాకముందే, ఆమె ఈ ‘హడావిడి’ చర్యలకు పూనుకున్నారు. ఆమె ఏ హోదాతో సచివాలయంలో ఉపసంఘంతో, అధికారులతో భేటీ అయ్యారనే ప్రశ్న సహజంగానే తలెత్తింది. ఇది సదరు మంత్రివర్గాన్ని, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన పరిస్థితి. ప్రత్యర్థి పార్టీల విమర్శలకూ, సొంత పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికీ కారణమైంది. అంతకు ముందు ఇన్చార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షీపై ఒక రకం ఆరోపణలుంటే, గాంధేయవాది, ప్రజాస్వామ్య ప్రేమికురాలు, నిరాడంబరనేత అని పేరున్న మీనాక్షి చొరవను, ఒక అతి చేష్టగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.చదవండి: కన్నీరు కార్చడమే దేశద్రోహమా?ఢిల్లీలో బీసీ ధర్నా రోజు, అప్పటివరకు స్పందించకుండా ఉండి, ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత రాహుల్, సోనియాలు బీసీ నాయకుల్ని కలవటం కూడా తప్పుడు సంకేతాలనిచ్చిందనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. ఇది పార్టీకి అంత మంచిది కాదు.- దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, పీపుల్స్ పల్స్ -
‘దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్సరే తీయాలి’.. AICCలో రాహుల్
గాంధీ నగర్ : దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్సరే తీయాలని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రెండో రోజు ‘అఖిల భారత కాంగ్రెస్ కమిటీ’ (ఏఐసీసీ) సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. దళితులు,ఆదివాసీలు,పేదల కోసం కాంగ్రెస్ పనిచేస్తోంది. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ నిత్యం పోరాటం చేస్తుంది. కులగణనతో దేశంలో ఓబీసీల సంఖ్య తేలుతుంది. తెలంగాణలో కులగణన చేపట్టాం. జాతీయ స్థాయిలో జనగణన చేసే వరకు పోరాడుతాం. కుల గణనతో ఏ వర్గం జనాభా ఎంత ఉంటుందో తేలుతుందని వ్యాఖ్యానించారు. LIVE: Nyaypath - AICC Session | Ahmedabad, Gujarat https://t.co/8snXJNmtEM— Rahul Gandhi (@RahulGandhi) April 9, 2025 గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళవారం ప్రారంభమైన ఏఐసీసీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 1,700 మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. తొలిరోజు ఏప్రిల్ 8న విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఏప్రిల్ 9న ఏఐసీసీ సభ్యులతో సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ రెండు సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సీఎంలు దీనిలో పాల్గొన్నారు. -
మీరూ టీచరేగా.. దయచేసి జోక్యం చేసుకోండి
న్యూఢిల్లీ: బెంగాల్ టీచర్ల తొలగింపు వ్యవహారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ లేఖ రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని.. ఏ తప్పూ చేయని టీచర్లకు న్యాయం జరిగేలా చూడాలని కోరారాయన. 2016 టీచర్ రిక్రూట్మెంట్లో భారీ మోసం జరిగిందంటూ 25 వేల నియామకాలను ఇటు కలకత్తా హైకోర్టు రద్దు చేయగా.. అటు సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థించింది. అయితే.. నియామకాల సమయంలో జరిగిన నేరాలు ఖండించదగ్గవే అయినప్పటికీ.. ఏ తప్పూ చేయనివాళ్ల ఉద్యోగాలు పోవడం తీవ్ర అన్యాయం కిందకు వస్తుందని రాహుల్ గాంధీ అంటున్నారు. ఏ తప్పు చేయకుండా చట్టపరంగా ఉద్యోగాలు పొందిన వాళ్లు సైతం నష్టపోవడం ఇక్కడ బాధాకరం. దాదాపుగా దశాబ్దంపాటుగా విధులు నిర్వహిస్తున్న ఈ కళంకం లేని టీచర్లను తొలగించడం.. విద్యా వ్యవస్థకు ఆటంకం కలిగించడమే అవుతుంది. అంతేకాదు.. వాళ్ల కుటుంబాలూ ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతాయి.గతంలో మీరూ ఓ టీచరే కదా. కాబట్టి.. ఈ మానవతప్పిదం కారణంగా జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఏ మోసానికి, తప్పునకు పాల్పడకుండా ఉద్యోగాలు సాధించిన వాళ్లను.. తిరిగి కొనసాగించేలా ప్రభుత్వాన్ని కొరతారని మీకు విజ్ఞప్తి చేస్తున్నా అని లేఖలో రాష్ట్రపతి ముర్మును రాహుల్ గాంధీ కోరారు. ఈ లేఖను తన ఎక్స్ ఖాతాలోనూ పోస్ట్ చేశారాయన. I have written to the Honourable President of India, Smt. Droupadi Murmu ji, seeking her kind intervention in the matter of thousands of qualified school teachers in West Bengal who have lost their jobs following the judiciary's cancellation of the teacher recruitment process.I… pic.twitter.com/VEbf6jbY2F— Rahul Gandhi (@RahulGandhi) April 8, 2025 -
స్టాక్‌మార్కెట్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
పాట్నా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మార్కెట్లపై(భారత్ సహా) ప్రతికూల ప్రభావం చూపెడుతున్నాయి. ఇవాళ కూడా దేశీయ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్‌పై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi On Stock Market) కీలక వ్యాఖ్యలు చేశారు.స్టాక్ మార్కెట్(StockMarket)లో డబ్బు అపరిమితంగా సృష్టించబడుతుందని, అయితే అది అందరికీ లాభం చేకూర్చదని అన్నారాయన. సోమవారం పాట్నా(బీహార్)లో సంవిధాన్ సురక్షా సమ్మేళన్ పేరిట జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారాయన.అమెరికా అధ్యక్షుడి(US President) నిర్ణయం.. మన స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తోంది. మన దేశంలో ఒక శాతం కంటే తక్కువ మందే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెడుతున్నారు. అంటే.. ఇది అందరి కోసం కాదని అర్థం. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడం అనేది ఓ భ్రమ. ప్రత్యేకించి.. యువత స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండండి అని రాహుల్ గాంధీ సందేశం ఇచ్చారు.#WATCH | Patna, Bihar | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The US president has led to a tumble in the stock market. Less than 1% of the people here have their money invested in the stock market, which means the stock market is not a field for you. Unlimited money… pic.twitter.com/UNhSIHV4mv— ANI (@ANI) April 7, 2025 -
తరచూ బీహార్‌కు రాహుల్.. మహాకూటమి ప్లాన్ ఏమైనా..
పట్నా: బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని వివిద పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, కార్యకర్తలు ఉత్పాహంతో కార్యరంగంలోకి దూకుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మూడు నెలల్లో మూడవసారి రాష్ట్రాన్ని సందర్శించడం పలు చర్చలకు దారితీస్తోంది.बिहार के युवा साथियों, मैं 7 अप्रैल को बेगूसराय आ रहा हूं, पलायन रोको, नौकरी दो यात्रा में आपके साथ कंधे से कंधा मिलाकर चलने।लक्ष्य है कि पूरी दुनिया को बिहार के युवाओं की भावना दिखे, उनका संघर्ष दिखे, उनका कष्ट दिखे। आप भी White T-Shirt पहन कर आइए, सवाल पूछिए, आवाज़ उठाइए -… pic.twitter.com/LhVUROFCOW— Rahul Gandhi (@RahulGandhi) April 6, 2025ఎన్డీఏ నేతృత్వంలోని బీహార్ సర్కారు(Bihar Government)ను అధికారం నుంచి దించే దిశగా రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా బీహార్ యువతకు మద్దతుగా బెగుసరాయ్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన ‘పలాయన్ రోకో, నౌకరీ దో’ పాదయాత్రలో రాహుల్ భాగస్వామ్యం వహించారు. ఇది కూడా ఆయన వ్యూహంలో భాగమేననే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ పాదయాత్రకు ఎన్ఎస్యూఐ జాతీయ ఇన్చార్జ్ కన్హయ్య కుమార్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశంలో ‘బీహార్‌లోని యువ స్నేహితులారా, నేను ఏప్రిల్ 7న బెగుసరాయ్‌కు వస్తున్నాను. ‘పలాయన్ రోకో, నౌకరీ దో’ యాత్రలో మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. గతంలో బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం పలు విమర్శలను ఎదుర్కొంది. నాడు కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ(RJD)తో కలిసి 70 సీట్లలో పోటీ చేసినప్పటికీ, కేవలం 19 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. తాజాగా కాంగ్రెస్.. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)తో కలిసి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనిని చూస్తుంటే బీహార్‌లో మరిన్ని సీట్లను సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘ఏ’ టీమ్‌గా పోటీ చేస్తుందని, ‘బి’ టీమ్ కాదని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: Waqf (Amendment) Bill: నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ.. ఎన్సీ ఎమ్మెల్యేల రభస -
ఇక చర్చిల ఆస్తులపై గురి!
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం క్రైస్తవ సంస్థల ఆస్తులేనని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాజాగా పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ బిల్లులోని అనేక అంశాలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీ శనివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో నడిచే ‘ఆర్గనైజర్’లోని కథనాన్ని ఉదహరించారు. కాథలిక్ సంస్థలకు దేశవ్యాప్తంగా 7 కోట్ల హెక్టార్ల భూములున్నాయని, ఇంత భారీగా భూములున్న ప్రభుత్వేతర సంస్థ ఇదేనంటూ అందులో పేర్కొన్నారని రాహుల్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ కన్ను ఇప్పుడిక కాథలిక్ భూములపై పడినట్లు ఈ కథనంతో అర్థమవుతోందని ఆరోపించారు. ముస్లిం వర్గం ఆస్తులే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లు ఇతర వర్గాలకు లక్ష్యంగా చేసుకోవడానికి ఒక ఉదాహరణగా ఉంటుందని రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అతి త్వరలోనే క్రైస్తవుల ఆస్తులపై ఆర్ఎస్ఎస్ దృష్టి పడనుందని ఆయన జోస్యం చెప్పారు. ‘ఇటువంటి దాడుల నుంచి మనకు రక్షణ కల్పించే ఏకైక సాధన రాజ్యాంగం. రాజ్యాంగాన్ని మనం కలిసికట్టుగా పరిరక్షించుకుందాం’అని పిలుపునిచ్చారు. ఇండియన్ చర్చ్ యాక్ట్–1927 ప్రకారం బ్రిటిషర్ల పాలనలో కాథలిక్ సంస్థలు అత్యధికంగా భూములు సంపాదించుకున్నట్లు ఆర్గనైజర్ కథనం పేర్కొంది. అయితే, వలస పాలనలో లీజుకిచ్చిన భూములను చర్చి ఆస్తులుగా పరిగణనలోకి రావంటూ 1965లో భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. -
దళితులు, గిరిజనుల కోసం సబ్ ప్లాన్ తెచ్చాం
సాక్షి, న్యూఢిల్లీ: దళితులు, గిరిజనుల కోసం గత యూపీఏ ప్రభుత్వం సబ్ ప్లాన్ తీసుకొచ్చిందని, దీని వల్ల తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా వర్గాలకు తగిన ప్రయోజనాలు లభిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం దళిత, గిరిజనుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రముఖులను కలిసిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్ ) చైర్పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య కూడా రాహుల్‌ను కలిసిన వారిలో ఉన్నారు. వారితో కలిసిన చిత్రాన్ని రాహుల్ శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఇటీవల నేను దళిత, గిరిజన వర్గాలకు చెందిన పరిశోధకులు, సామాజిక కార్యకర్తలను కలిశాను. కేంద్ర బడ్జెట్లో కొంత భాగాన్ని దళితులు, గిరిజనులకు అందించేలా జాతీయ చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి చట్టం ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అమలులో ఉంది. ఈ వర్గాలకు అక్కడ నిర్దిష్ట ప్రయోజనాలు లభించాయి. యూపీఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో దళితులు, ఆదివాసీల కోసం ‘సబ్ ప్లాన్‘తీసుకొచి్చంది. కానీ మోదీ ప్రభుత్వ హయాంలో ఇది బలహీనపడింది. బడ్జెట్లో చాలా తక్కువ భాగం ఈ వర్గాలకు చేరుతోంది. వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అనే అంశంపై ఇప్పుడు మనం ఆలోచించాలి. దళితులు, ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన పథకాలకు బడ్జెట్లో న్యాయమైన వాటాను నిర్ధారించే జాతీయ చట్టం మనకు అవసరం’అని రాహుల్ పేర్కొన్నారు. -
మీ అనుమతితోనే ఈ విధ్వంసమా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బోధిస్తున్న నీతి సూత్రాలను తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కుతున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఓ వైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతుండగా, రేవంత్ తన అనాలోచిత చర్యలతో రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాందీని ఉద్దేశిస్తూ హరీశ్‌రావు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలో వికృత పాలన సాగుతోందని ఆరోపించారు.‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చట్టం చేస్తామని మీరు అంటున్నా, రేవంత్‌రెడ్డి మాత్రం బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూలుస్తున్నా, మీరు మౌనంగా ఎందుకు ఉంటున్నారు? రేవంత్ విధ్వంసపూరిత వైఖరితో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జంతుజాలం ఆవాసాన్ని కోల్పోయింది. వర్సిటీ అంశంలో మీ పార్టీ అనుబంధ విభాగం ఎన్ఎస్యూఐ సహా అన్ని వర్గాలు రేవంత్ ప్రభుత్వ తీరును ఖండించాయి’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విధ్వంసం మీ అనుమతితోనే సాగుతోందా? ‘రోహిత్ వేముల ఆత్మహత్య సమయంలో హెచ్‌సీయూ సందర్శన వచ్చిన మీకు.. బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు ఎస్కార్ట్‌తో పంపి నిరసన తెలిపే అవకాశం కల్పించింది. ఆపదలో అండగా ఉంటానని హెచ్‌సీయూ విద్యార్థులకు మీరు హామీ ఇచ్చినా.. రేవంత్ దుర్మార్గాలపై మౌనం వహించడం ఆశ్చర్యకరం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేంతరవరకు వర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసకాండ కొనసాగించింది. క్రోనీ కాపిటలిజం, అదానీ వ్యాపార విస్తరణపై దేశవ్యాప్తంగా మీరు పోరాటం చేస్తున్నారు.కానీ మీ సీఎం రేవంత్ తెలంగాణలో అదానీకి ఎర్ర తివాచీ పరిచారు. నల్లగొండలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ, లగచర్లలో ఫార్మా విలేజ్ మూలంగా భూములు కోల్పోతున్న రైతులపై దాడులు జరుగుతున్నా మీరు మౌనంగానే ఉన్నారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండ, విధ్వంస పాలన మీ అనుమతితో కొనసాగుతోందా?’అని రాహుల్‌గాం«దీని హరీశ్‌రావు ప్రశ్నించారు. -
బీసీ రిజర్వేషన్ల పెంపుకోసం కొట్లాడుతాం
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేయటంద్వారా సామాజిక న్యాయ సాధనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దారి చూపిందని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాం«దీ, రాహుల్‌గాంధీ అన్నారు. కులగణనను పూర్తి చేయడంతో పాటు దానికి అసెంబ్లీ ఆమోదం పొందిన తీరు అభినందనీయమని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవ వల్ల విద్య, ఉద్యోగాల్లో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు.బీసీ రిజర్వేషన్ల పెంపునకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ వెలుపలా, లోపలా ఈ తీర్మానం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, బీర్ల అయిలయ్య, రాజ్‌ఠాకూర్, వీర్లపల్లి శంకర్, సంజీవ్‌రెడ్డి తదితరులు సోనియా, రాహుల్‌లను పార్లమెంట్ ప్రాంగణంలో విడివిడిగా కలిశారు.జనగణన, బీసీ బిల్లుపై తీర్మానం, జంతర్‌మంతర్‌లో ధర్నా గురించి వారికి వివరించారు. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుపై కీలక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ధర్నాకు హాజరు కాలేకపోయానని రాహుల్‌గాంధీ ఈ సందర్భంగా చెప్పారు. బీసీలకు సామాజిక న్యా యం జరిగేవరకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్రం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. రాహుల్, సోనియాతో భేటీ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చర్చించేందుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారు. రిజర్వేషన్ల అమలుకై ఎక్కడికైనా వచ్చేందుకు సీఎం రేవంత్‌తో సహా కేబినెట్ మంత్రులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హెచ్‌సీఏ భూములు వాస్తవంగా ప్రభుత్వానికి చెందినవని చెప్పారు. ఈ భూముల విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రతినిధి బృందం కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్రకుమార్‌ను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చించింది. -
చైనా అధీనంలో 4 వేల చ.కి.మీ. భూభాగం
న్యూఢిల్లీ: నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు మనం భారత్– చైనా దౌత్య సంబంధాల వజ్రోత్సవాలను జరుపుకొంటున్నామని ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ గురువారం లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కొత్త టారిఫ్‌లు భారత ఆర్థికవ్యవస్థ నడ్డి విరుస్తాయని పేర్కొన్నారు. చైనా దురాక్రమణ, అమెరికా టారిఫ్‌లపై కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘చైనా ఒకవైపు 4,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. మరోవైపు కొద్దికాలం కిందట మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చైనా రాయబారితో కలిపి కేక్ కట్ చేశారు. ఇది చూసి నేను నివ్వెరపోయా. చైనా ఆక్రమించిన నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం సంగతేమిటి? అక్కడ ఏం జరుగుతోంది?’ అని రాహుల్ నిలదీశారు. గాల్వాన్ లోయలో ఘర్షణలను ఉటంకిస్తూ 20 మంది భారత జవాన్లు అమరులయ్యారని గుర్తుచేశారు. ‘ఒకవైపు వీరి త్యాగం.. మరోవైపు కేక్ కట్ చేసి (చైనా రాయబారితో కలిసి) సంబరాలు జరుపుకుంటున్నాం. ఏమిటిది? చైనా తో సరిహద్దుల్లో సాధా రణ పరిస్థితులు నెలకొ నడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ దానికి మునుపు యథా తథస్థితిని పునరుద్ధరించాలి’ అని రాహుల్ గాంధీ పేర్కొ న్నారు. ‘మొదట మన భూభాగాన్ని తిరిగిపొందాలి. ఆక్రమిత భూభాగానికి సంబంధించి రాష్ట్ర పతి, ప్రధానమంత్రులు చైనాకు లేఖలు రాశారని నా దృష్టికి వచ్చింది. ఈ విషయం మనవాళ్ల ద్వారా తెలియలేదు. భారత్‌లోని చైనా రాయబారి లేఖల విషయాన్ని చెప్పారు’ అని రాహుల్ అన్నారు. సమర్థ విదేశీ విధానం అంటే విదేశాలతో సమాన స్థాయిలో సంబంధ బాంధవ్యాలను నెరపడం. ఒకవైపు చైనా మన 4 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. మరోవైపు అమెరికా అకస్మాత్తుగా భారత్‌పై టారిఫ్‌లు విధించింది అని కాంగ్రెస్ నేత పేర్కొ న్నారు. అమెరికా టారిఫ్‌లు భారత్‌కు శరాఘా తమని అభిప్రాయపడ్డారు. మన ఆటోమొబైల్ రంగం, ఫార్మా పరిశ్రమ, వ్యవసాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. -
‘మీరెళ్లి చైనీయులతో కలిసి చైనా సూప్ తాగండి’
న్యూఢిల్లీ,సాక్షి: లోక్‌సభలో రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 4వేల స్కైర్ కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. మన భూముని మనం తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా కేంద్రం ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ దిగువ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘భారత్ భూభాగంలో ఏం జరుగుతోంది నాకు అర్ధం కావడం లేదు. చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించింది. మన భూమి మనకు వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు .. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు లేఖ రాయాలి. చైనా 4వేల స్కైర్ కిలోమీటర్ల భారత భూమిని ఆక్రమించుకుంది. ఈ విషయం నన్ను మరింత షాక్‌కు గురిచేసింది. మన భూమిని మనం ఎలా తిరిగి స్వాధీనం చేసుకోవాలి? అని ఆలోచించాల్సి ఉంది. అలా చేయడం లేదు. భారత విదేశాంగ కార్యదర్శి చైనా రాయబారితో కలిసి కేక్ కట్ చేస్తున్నారు. చైనా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. చైనాను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై కేంద్రం సభలో ప్రకటన చేయాలి. భారత్‌పై అమెరికా 26శాతం సుంకాలు విధించింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి’ అని అన్నారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. రాహుల్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఎవరి కాలంలో ఈ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోకి తీసుకుంది? డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనా అధికారులతో సూప్ తాగిన వ్యక్తులు ఎవరు? రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనీయుల నుండి డబ్బు ఎందుకు తీసుకుంది?’ అని అడిగారు. అలాంటి వారికి నేను ఒక్కటే చెబుతున్నా.. భారత్ భూభాగాన్ని చైనా ఒక్క అంగుళం కూడా తీసుకోలేదు. ఈ తరహా రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని రాహుల్‌కు హితువు పలికారు. -
‘లోక్ సభలో నాకు మైకు ఇవ్వడం లేదు’
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై(Lok Sabha Speaker Om Birla) ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ మైక్ ఇవ్వడం లేదు. నేను మాట్లాడితే ఆయన పారిపోతున్నారని’ ఎద్దేవా చేశారు.లోక్‌సభలో తన ప్రసంగంపై రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘సభలో స్పీకర్ ఓం బిర్లా తాను మాట్లాడేందుకు అనుమతించడం లేదని, కార్యకలాపాలను నిర్వహించడానికి ఇది సరైన మార్గం కాదని అన్నారు. ‘ఏం జరుగుతుందో నాకు తెలియదు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని ఆయన్ని అభ్యర్థించాను. కానీ అతను (స్పీకర్) పారిపోయాడు. ఇది సభను నడపడానికి మార్గం కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా స్పీకర్ నా గురించి అసత్యాలు మాట్లాడుతున్నారు. సభను వాయిదా వేస్తున్నారు. ఇదంతా ఎందుకు.ప్రతిపక్ష నాయకుడికి సభలో ప్రసంగించడానికి అవకాశం ఇవ్వడమే ఈ సమావేశం ఉద్దేశ్యం. నేను లేచి నిలబడినప్పుడల్లా నాకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదు. మేం ఏం చెప్పాలని అనుకుంటున్నామో అది చెప్పాలి. అందుకు మైక్ ఇవ్వాలి కదా. ఇవ్వడం లేదు. నేను ఏం చేయలేదు. నిశ్శబ్దంగా కూర్చున్నాను. అరె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 7-8 రోజులుగా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. లోక్‌సభలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కుట్ర జరుగుతోంది. ఆ రోజు కూడా అంతే ప్రధాని మోదీ కుంభమేళా గురించి మాట్లాడారు. ఆ సమయంలో నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోదీని ప్రశ్నించాలని అనుకున్నాను. కానీ నాకు అనుమతి ఇవ్వలేదు. స్పీకర్ విధానం ఏంటో నాకు తెలియదు. కానీ మమ్మల్ని మాట్లాడటానికి అనుమతించడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. -
యూపీలో అన్ని మతాల ప్రజలు సురక్షితమేనా?
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మైనారిటీల భద్రతపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానొక యోగినని.. మనుషులంతా సంతోషంగా ఉండాలన్నదే తన అభిమతమని.. అందుకే రాష్ట్రంలో అన్ని మతాల వాళ్లు సురక్షితంగా ఉండగలుగుతున్నారని అన్నారు. ఈ క్రమంలో కేవలం హిందూ మతానికే బీజేపీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శల ప్రస్తావనతో ఆయనకో ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ..‘‘ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లో హిందువుల దుకాణాలు తగలబడితే.. ఆ వెంటనే ముస్లింల దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యేవి. హిందువుల ఇళ్లకు నిప్పంటుకుంటే.. కాసేపటికే ముస్లింల ఇళ్లూ తగలబడిపోయేవి. అయితే ఇదంతా 2017కి ముందు నాటి పరిస్థితి. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంతా మారిపోయింది. వంద మంది హిందువుల మధ్య ఒక ముస్లిం సురక్షితంగా ఉంటున్నారు. అదే వంద మంది ముస్లింల మధ్య ఒక హిందువుకు భద్రత ఉంటోందా?.. లేదు కదా. అందుకు బంగ్లాదేశ్‌నే ఉదాహరణగా తీసుకోండి. పాకిస్థాన్ మరో ఉదాహరణ. అఫ్గనిస్థాన్‌లో ఏం జరిగిందో తెలుసు కదా!. అవతలివాడు కొట్టక ముందే జాగ్రత్త పడడంలో తప్పేముంది?’’ అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.హిందువులు బాగున్నారంటే.. ముస్లింలూ బాగున్నట్లే. నేనొక సాధారణ ఉత్తర ప్రదేశ్ పౌరుడిని. నేనొక యోగిని. నా దృష్టిలో అంతా సమానమే. ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అదే రాష్ట్ర అభివృద్ధికి కీలకం కూడా అని అన్నారాయన. సనాతన ధర్మం ఈ భూమ్మీదే అతిపురాతన మతం అని, దానిని అనుసరించేవారు ఇతరుల విశ్వాసాలను దెబ్బతీయబోరని అన్నారు. హిందూ పాలకులు దండెత్తి ఇతర దేశాలకు ఆక్రమించుకున్న దాఖలాలు కూడా చరిత్రలో లేవన్నారు. కానీ, బదులుగా మనకు దక్కుతోంది ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీలాంటి ‘నమునా’ వల్లే బీజేపీ ఇవాళ దేశంలో బలంగా ఉండగలిగిందని యోగి అన్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా తిరిగారు. విదేశాలకు వెళ్లి మాతృదేశాన్నే తిడతారు. అందుకే ఆయన ఉద్దేశాలేంటో ప్రజలు అర్థం చేసుకోగలిగారు. ఇలాంటి ‘నమునా మనుషులే’ ఇప్పుడు బీజేపీకి కావాల్సింది. అప్పుడే దారులన్నీ సరిచేసుకుంటూ ముందుకు పోగలం. అయోధ్య, కుంభమేళా సహా దేశ ప్రతిష్టకు పేరు తెచ్చే ఏ సందర్భానైనా వివాదం చేయడమే కాంగ్రెస్‌కు తెలుసు అని అన్నారాయన. చట్టాన్నిగౌరవిస్తున్నాం, లేకుంటేనా..ప్రార్థనా స్థలాల వివాదాలపైనా సీఎం యోగి ఏఎన్ఐ ఇంటర్వ్యలో కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని.. కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని.. లేకుంటే ఈ పాటికే ఏం జరిగి ఉండేదో ఎవరికి తెలుసనని అన్నారాయన. భారతీయ వారసత్వానికి ఆలయాలే గుర్తింపుగా అభివర్ణించిన సీఎం యోగి.. అలాంటి వాటిని వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి చాటి చెప్పడమే తమ అభిమతమని అన్నారు. దేవుడు ఇచ్చిన కళ్లు.. ఆ కళ్లు ఉన్న ప్రతీ ఒక్కరూ ఇది చూడాల్సిందే. శంభల్‌లో ఏం జరిగింది.. అదే సత్యం అని యోగి పేర్కొన్నారు. ఆలయాలను కూల్చి మసీదులు కట్టి అల్లా కూడా అంగీకరించడని ఇస్లాంలోనే ఉంది. అలాంటప్పుడు వాళ్లు ఆ పని ఎలా చేయగలిగారు?. ప్రస్తుతానికి శాస్త్రీయ ఆధారాలతో మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఒక్కొక్కటిగా బయట పెట్టి వెలుగులోకి తీసుకొస్తామని చెప్పారాయన. -
8 వారాలు కాదు.. 4 వారాలే గడువు
లక్నో: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వానికి(Rahul Gandhi Citizenship) సంబంధించిన కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పౌరసత్వ వ్యవహారం తేల్చే విషయంలో కేంద్రానికి నాలుగు వారాల గడువు విధించింది అలహాబాద్ హైకోర్టు.రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ కర్ణాటకకు చెందిన విగ్నేష్ శిశిర్ అనే బీజేపీ కార్యకర్త అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్‌లో ఈ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని, కాబట్టి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 84(ఏ) ప్రకారం ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. తాజాగా.. జరిగిన విచారణ సందర్భంగా సంచలన విషయాల పేరిట కోర్టు ముందు కొన్ని విషయాలు ఉంచారు. ‘‘రాహుల్ గాంధీ పౌరసత్వంపై యూకే ప్రభుత్వం నుంచి వచ్చిన మెయిల్ సమాచారం మా దగ్గర ఉంది. అక్కడి పౌరసత్వ జాబితాలో రాహుల్ గాంధీ పేరు ఉంది. అందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను మేం కోర్టుకు సమర్పించాం. భారత చట్టాల ప్రకారం.. ద్వంద్వ పౌరసత్వం చెల్లదు. వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే.. భారత పౌరసత్వం రద్దు అయిపోతుంది’’ అని శిశిర్ అంటున్నారు.ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది నవంబర్లోనే ద్విసభ్య ధర్మాసనం కేంద్ర హోం శాఖ నుంచి ఈ పిటిషన్‌పై వివరణ కోరింది. అయితే అందుకు సమగ్ర వివరాల సేకరణకు గడువు కావాలని కేంద్రం కోరడంతో అనుమతించింది. తాజా విచారణలోనూ 8 వారాల గడువు కోరగా.. అందుకు నిరాకరిస్తూ 4 వారాల గడువు మాత్రమే ఇచ్చింది. మరోవైపు.. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఆరోపణలతో 2019లోనే ఓ పిటిషన్ వేశారు. 2003లో స్థాపించబడిన ఓ బ్రిటిష్ కంపెనీ రికార్డుల్లో రాహుల్ గాంధీ పేరు యూకే పౌరుడిగా ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతకు నాలుగేళ్ల ముందే.. 2015లో అప్పటి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ టీఆర్ గెడెలకు ఈ అంశంపై సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాశారు. అయితే ఆ టైంలో ప్రతిస్పందన రాలేదు. తాజాగా.. అలహాబాద్ హైకోర్టులోనూ ఒకే తరహా పిటిషన్ ఫైల్ కావడాన్ని ప్రస్తావించిన ఢిల్లీ హైకోర్టు.. తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు.. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలను కాంగ్రెస్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వస్తోంది. ఆయన భారతీయుడేనంటూ చెబుతోంది. మరోవైపు ఇది తన ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నమేనని రాహుల్ గాంధీ, తన సోదరుడు పుట్టింది.. పెరిగింది ఈ గడ్డ మీదేనంటూ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఇంతకు ముందే ప్రకటించారు. -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది
-
మీ మద్దతు లేకుండా అధికారం కష్టం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల ప్రజ ల మద్దతు లేకుండా తెలంగాణలో ఎవరూ అ ధికారంలో కొనసాగలేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీసీల సహకారంతోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని చెప్పా రు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మనసు పెట్టి పనిచేశానని, పక్కాగా బీసీ జనా భా లెక్కలతో డాక్యుమెంట్ తయారు చేసి, చట్టం చేసి రక్షణ కల్పించామని వెల్లడించారు. బీసీ సంఘాలు పొలిటికల్ ట్రాప్‌లో పడి కులగణన విషయంలో విమర్శలు చేయవద్దన్నారు. బీసీ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో.. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పలు బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సీఎంను బీసీ సంఘాల నేతలు శాలు వాలతో సత్కరించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మీరు నాకు అభినందనలు చెబుతున్నా రు. ఈ అభినందనలన్నింటినీ మూటగట్టి తీసుకెళ్లి రాహుల్‌గాం«దీకిస్తా. భారత్‌జోడో యాత్ర సందర్భంగా కృష్ణా మండలం మీదుగా తెలంగాణలో ప్రవేశించినప్పటి నుంచి చార్మినార్ వరకు రాహుల్‌గాంధీ ఒకటే మాట చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రాష్ట్రాలతోపాటు కేంద్రంలో అధికారంలోకి వస్తే జాతీ య స్థాయిలో కులగణన చేస్తామన్నారు. మీ సహకారంతోనే తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. అందుకే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనసు పెట్టి పని చేశా. నిబద్ధతతో ముందుకు వెళ్లాం.. కులగణన చేసేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సబ్‌కమిటీ చైర్మన్‌గా నియమించాం. కొందరు దీన్ని కూడా తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లగలిగిన నిబద్ధత, అధికారులతో పని చేయించగలిగిన నైపుణ్యం ఉన్న నాయకుడు కనుకనే ఆయనకు బాధ్యత ఇచ్చాం. బీసీల జనాభాకు సంబంధించి ఏ పరీక్షకైనా, ఎలాంటి స్రూ్కటినీలో అయినా నిలబడేలా పక్కా డాక్యుమెంట్ రూపొందించాం. దాన్ని లాకర్లో దాచిపెట్టదల్చుకోలేదు. డాక్యుమెంట్‌ను బిల్లు పెట్టి చట్టం చేశాం. అందుకే బీసీల కులగణన విషయంలో నేను చరిత్రలో ఉండిపోతా. దేశంలో ఏ రాష్ట్రంలో కులగణన జరిగినా తెలంగాణకు వచ్చి నేర్చుకుని పోవాలి. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు కూడా ఇంతటి కీర్తిని ఊహించి ఉండరు. అదే తరహాలో తెలంగాణలో బీసీల గణన గురించి ఇప్పటికిప్పుడు చర్చ జరగకపోవచ్చుగానీ మున్ముందు మాత్రం కచి్చతంగా తెలంగాణ గురించి చెప్పుకోవాల్సిందే. తప్పు ఉందంటే.. నష్టం చేసుకున్నట్టే.. బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి. కులగణన లో తప్పు ఉందని అంటే.. మీకు మీరు నష్టం చేసుకున్నట్టే. స్వయంగా పర్యవేక్షణ చేస్తూ, అందరినీ భాగస్వాములను చేశాను కాబట్టే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. వాయిదా వేయాలనుకుంటే పదేళ్లకు కూడా వీడని విధంగా చిక్కుముళ్లు వేయొచ్చు. ఓబీసీలతో కాంగ్రె స్ పార్టీకి చరిత్రాత్మక అనుబంధం ఉంది. బీసీల మద్దతు లేకుండా ఎవరూ అధికారంలో కొనసాగలేరు. అడగాలి కొట్లాడాలే తప్ప మమ్మల్ని అనుమానించి అవమానిస్తే లాభం లేదు. బీసీల గణన విషయంలో తెలంగాణ ఇచి్చన డాక్యుమెంట్ ఓ బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిది. అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని కూడా సవరించుకున్నాం. అలాగే ఈ డాక్యుమెంట్‌ను కూడా భవిష్యత్తులో అవసరమైతే సవరించుకుంటాం. 10 లక్షల మందితో సభ పెట్టండి బీసీ కుల గణన ప్రక్రియలో ఎన్నో పరిణామాలను ఎదుర్కొన్నా. అవన్నీ బయటకు చెప్పను. రిస్క్ చేసి బీసీల జనాభా లెక్కలు తేల్చా. మీరు అభినందనలు ఇక్కడే తెలపడం కాదు. పరేడ్ గ్రౌండ్స్‌లో 10 లక్షల మందితో సభ పెట్టండి. రాహుల్‌గాందీని పిలిపిస్తా. అభినందించండి. ఆయనకూ బలం వస్తుంది. దేశం మొత్తం కుల గణన జరపాలని పోరాడే శక్తి వస్తుంది’ అని సీఎం రేవంత్ అన్నారు. సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం, పొంగులేటి, వీహెచ్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు ఈర్ల శంకరయ్య, రాజ్‌ఠాకూర్, వాకిటి శ్రీహరి, ప్రకాశ్‌గౌడ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, టి. చిరంజీవులు, దాసు సురేశ్ పాల్గొన్నారు. సీఎం చెప్పిన ఏడంతస్తుల కథ బీసీల కులగణన విషయంలో రాజకీయ నాయకుల విమర్శలను పెద్దగా పట్టించుకోనుగానీ బీసీ సంఘాలు మాత్రం విమర్శలు చేయవద్దని, తమను బాధ పెట్టవద్దని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘బీసీల గణనకు నేను పునాదులు వేశా. స్లాబ్ వేసి ఓ అంతస్తు కట్టా. ఆ ఇంట్లోకి రండి. వచ్చి కాపురం చేయండి. అన్నం వండుకుని తినండి. మీకు వీలున్నప్పుడు రెండో అంతస్తు, మూడో కట్టుకోండి. అలా కాకుండా మాకు ఏడంతస్తుల భవనం కట్టివ్వలేదు. మేం ఆ ఇంట్లోకి రామంటే మీకే నష్టం. ఏడంతస్తులు కట్టేలోపు పునాదులు శిథిలమై స్లాబ్ కూలిపోతుంది. బీసీ సంఘాలు పొలిటికల్ ట్రాప్‌లో పడొద్దు. నేనిచ్చిన డేటా మీకు లంకెబిందెల్లాంటిది. కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కొట్లాడితేనే దేశానికి స్వాతంత్య్రం వచి్చంది. కొట్లాడితే జనగణనలో కులగణన జరగదా? ఒక్కసారి జనగణనలో కులగణన ప్రారంభమైతే ప్రతి పదేళ్లకోసారి బీసీల జనాభా ఎంత ఉందో తేలిపోతుంది’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
తెలంగాణ మార్గం చూపింది.. దేశమంతా జనగణన జరగాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మరో వాగ్దానాన్ని నెరవేరుస్తూ బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించిందని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. జనగణన విషయంలో తెలంగాణ.. దేశానికి ఓ మార్గం చూపిందని, ఈ జనగణన దేశమంతా జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ మంగళవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశా రు. ‘జనగణన ద్వారా మాత్రమే వెనుకబడిన వర్గాల హక్కులు సాధ్యమవుతా యని కాంగ్రెస్ పార్టీ మరోమారు స్పష్టం చేసింది. తెలంగాణ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇప్పటి వరకు రిజర్వేషన్ల విషయంలో ఉన్న 50 శాతం పరిమితి తొలగింపునకు మార్గం సుగమమైంది. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించనుంది’ అని రాహుల్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మీకు అండగా ఉంటాం: ప్రియాంక ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది. 42% రిజర్వేషన్లతో బీసీ వర్గాలు మరింత అభివృద్ధి సాధిస్తారు. తెలంగాణ ప్రజలు, బీసీ వర్గాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది కేవలం రిజర్వేషన్ల కల్పన మాత్రమే కాదు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం. మీరు మమ్మల్ని నమ్మినట్టుగానే, మేం మీకు అండగా ఉంటాం. జై తెలంగాణ, జైహింద్, జైకాంగ్రెస్’ అని ప్రియాంక ఫేస్బుక్లో పోస్టు చేశారు. కలలు సాకారమవుతున్నాయి: సీఎం రేవంత్ రాహుల్, ప్రియాంకాగాంధీలు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘గర్వించదగిన రోజు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం వాగ్దానాలను నెరవేర్చుతోంది. రాహుల్, ప్రియాంక నేతృత్వంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కలలను సాకారం చేస్తూ, ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, ప్రతి గ్యారంటీని నిజం చేస్తూ ముందుకెళుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన విప్లవాత్మక నిర్ణయం. సామాజిక న్యాయ అమలులో తెలంగాణ దేశానికి మార్గదర్శనం చేయడం గర్వకారణం. ఆ ఇద్దరి ప్రేరణకు ధన్యవాదాలు’ అని రేవంత్‌రెడ్డి రీట్వీట్ చేశారు. -
‘రాహుల్‌కు వియాత్నాంపై అంత ఇంట్రెస్ట్ ఏమిటో..?’
న్యూఢిల్లీ: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వియాత్నాం పర్యటనపై బీజేపీ మరోసారి విమర్శల వర్షం కురిపించింది. ప్రత్యేకంగా న్యూ ఇయర్, హోలీ సమయాల్లో రాహుల్ వియాత్నాంకు వెళ్లడానికి కారణం ఏమిటో అని సెటైర్లు వేసింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ వియాత్నాం పర్యటనను ప్రధానంగా టార్గెట్ చేశారు. వియాత్నాం పర్యటనలు పదే పదే చేయడంపై రాహుల్ గాంధీనే క్లారిటీ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తరచు వియాత్నాం అంటూ విమానం ఎక్కుతున్నారని, ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలకే కాకుండా, ఇప్పుడు హోలీ సంబరాల సమయంలో కూడా రాహుల్ వియాత్నాంలోనే ఉన్నారన్నారు. రాహుల్ ఆ దేశ పర్యటనకు వెళ్లడానికి ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని తమకు కూడా చాలా ఆతృతగా ఉందన్నారు.గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు జాతీయ సంతాప సభ ఏర్పాటు చేసిన సమయంలో కూడా రాముల్ గాంధీ వియాత్నాంలోనే ఉన్నారు. అప్పుడు కూడా బీజేపీ విమర్శలు ఎక్కువ పెట్టింది. తమ నాయకుడు మన్మోహన్ సింగ్ సంతాప సభకు దూరంగా ఉండి రాహుల్ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడింది. ఈ జనవరిలో రాహుల్ వియాత్నాం పర్యటనకు వెళ్లిన సమయంలో బీజేపీ విమర్శించగా, కాంగ్రెస్ సంయమనం పాటించింది,. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకడు హరీష్ రావత్.. రాహుల్ ను వెనకేసుకొచ్చారు. వియాత్నాం ఎకానామిక్ ఫ్రేమ్ వర్క్ ను స్టడీ చేయడానికి రాహుల్ అక్కడకు వెళ్లారంటూ చెప్పుకొచ్చారు. One heard Rahul Gandhi is in Vietnam in Holi after being there during the New Year as well. He is spending more time in Vietnam than his constituency. He needs to explain his extraordinary fondness for Vietnam. The frequency of his visit to that country is very curious: BJP… pic.twitter.com/Bxm0wEFfHK— Press Trust of India (@PTI_News) March 15, 2025 -
ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్.. పేపర్ లీకేజీలపై రాహుల్ ట్వీట్
ఢిల్లీ: ప్రశ్నాపత్రాల లీకేజీలను వ్యవస్థాగత వైఫల్యంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా.. లీక్‌ల కారణంగా కష్టపడి చదివే ఎంతో మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని.. దీనిపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కన పెట్టి కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు.‘ప్రశ్నాపత్రాల లీకులతో ఆరు రాష్ట్రాల్లోని 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్న రాహుల్.. వీటి కారణంగా కష్టపడి చదివే విద్యార్థులతో పాటు వారి కుటుంబాలు కూడా ఒత్తిడికి గురవుతున్నాయన్నారు. వారి కష్టానికి తగిన ఫలితం అందడం లేదన్నారు. దీంతో కష్టపడి పనిచేయడం కంటే నిజాయితీగా లేకపోవడమే మంచిదనే తప్పుడు సంకేతాలు భవిష్యత్ తరాలకు వెళ్తుందంటూ అభిప్రాయవ్యక్తం చేసిన రాహుల్.. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు.‘‘ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం లీకులను అడ్డుకోలేకపోయింది. ఇది వారి వైఫల్యానికి నిదర్శనం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కనబెట్టి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వీటిని అరికట్టగలం. ఈ పరీక్షలు మన పిల్లల హక్కు. దాన్ని ఎలాగైనా రక్షించాలి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.6 राज्यों में 85 लाख बच्चों का भविष्य ख़तरे में - पेपर लीक हमारे युवाओं के लिए सबसे ख़तरनाक "पद्मव्यूह" बन गया है।पेपर लीक मेहनती छात्रों और उनके परिवारों को अनिश्चितता और तनाव में धकेल देता है, उनके परिश्रम का फल उनसे छीन लेता है। साथ ही यह अगली पीढ़ी को गलत संदेश देता है कि… pic.twitter.com/nWHeswvMOC— Rahul Gandhi (@RahulGandhi) March 13, 2025 -
ఈసీకి జ్ఞానోదయం ఎప్పుడు?
తటస్థతకు తిలోదకాలొదిలి అవకతవకలకు అసలైన చిరునామాగా మారిన ఎన్నికల సంఘం(ఈసీ) సిగ్గుపడాల్సిన విషయమిది. ఆరోపణలొచ్చినప్పుడూ, ఫిర్యాదులందినప్పుడూ మౌనంతోనో, దబా యింపుతోనో తప్పించుకోజూస్తున్న ఈసీపై సోమవారం పార్లమెంటు ఉభయసభలూ దద్దరిల్లాయి. మహారాష్ట్రలో వోటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ ఆరోపణలు చేసి మూణ్ణెల్లవుతోంది. నెల క్రితం కూడా ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ మీడియా సమావేశంలో ఈసీపై అభియోగాలు మోపారు. అయిదు నెలల వ్యవధిలో కొత్తగా 39 లక్షలమంది వోటర్లు ఎలా పుట్టుకొచ్చారని ప్రశ్నించారు. అవి ఆధార రహితం, తప్పుదోవ పట్టించే అభాండాలని చెప్పటం తప్ప నిర్దిష్టంగా ఫలానా చోట ఏం జరిగిందో, వోటర్ల సంఖ్య పెరగటానికి కారణమేమిటో వివరించే ప్రయత్నం ఈసీవైపు నుంచి లేదు! అటు బెంగాల్లో ఈ మాదిరి అవకతవకలే బయటపడి ఆ సంస్థ పరువు బజారుపాలు చేశాయి. వోటర్ల జాబితా అవకతవకలతోపాటు నకిలీ వోటరు కార్డులు రాజ్యమేలుతున్నాయని తృణమూల్ ఫిర్యాదు చేస్తే మూడు నెలల్లో సరిచేస్తామన్న జవాబొచ్చింది. వెనువెంటనే దర్యాప్తు చేసి దీనివెనక జరిగిందేమిటో తేల్చిచెప్పడానికి బదులు సరిచేస్తామనటంలో మర్మమేమిటి? అక్కడే కాదు... హరియాణా, గుజరాత్, ఒడిశా, యూపీల్లో సైతం ఇలాగే జరిగిందని విపక్ష సభ్యులు ఆరో పించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఢిల్లీలోనూ ఇదే తంతు నడిచిందని ఆప్ ఆరోపణ. రాజ్యాంగ సంస్థగా ఎంతో హుందాగా, నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన సంస్థ ఇలా అడుగడు గునా కంతలతో, లోపాయికారీ వ్యవహారాలతో ఎన్నికలు జరిపించటం సిగ్గుచేటు కాదా?ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ నిష్టగా నిర్వహించాల్సిన క్రతువు. అది కాస్తా ఈమధ్య కాలంలో నవ్వుల పాలవుతున్న వైనం కనబడుతున్నా తనకేం సంబంధం లేనట్టు ఆ సంస్థ ప్రవర్తి స్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిరుడు ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమితో కొత్తగా చుట్టరికం కుదిరిందన్న ఏకైక కారణంతో అప్పటి విపక్ష నాయకులు చెప్పినట్టల్లా అధికారు లను బదిలీలు చేశారు. పర్యవసానంగా ఇతర జిల్లాల్లో జరిగిన దారుణ ఉదంతాల సంగతలా ఉంచి పల్నాడు ప్రాంతం ఎంతటి హింసను చవిచూసిందో, ఎన్ని గ్రామాల ప్రజలు ఇళ్లూ వాకిళ్లూ వదిలి ప్రాణభయంతో పారిపోయారో మీడియా సాక్షిగా వెల్లడైంది. పోలింగ్ కేంద్రాల దురాక్రమణ, తెల్లారుజాము వరకూ పోలింగ్ తంతు కానివ్వటం వంటి అరాచకాలకు అంతులేదు. సాయంత్రం గడువు ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రం గేట్లు మూసి ఆ ఆవరణలో ఉన్నవారికి మాత్రమే స్లిప్‌లిచ్చి వోటు వేయటానికి అనుమతించాలని నిబంధనలు చెబుతున్నాయి. క్యూలో చిట్టచివర గేటు దగ్గర ఉన్నవారికి ఒకటో నంబర్ స్లిప్ ఇవ్వటంతో మొదలెట్టి బూత్ సమీపంలో ఉన్నవారికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఓటేశాక ఆ స్లిప్‌లు భద్రపరచాలి. సీసీ టీవీ ఫుటేజ్‌లు భద్ర పరచాలి. ఇదంతా జరిగిందా? పోలింగ్ ముగిసిన నాలుగురోజుల తర్వాత 12.5 శాతం వోటింగ్ పెరిగినట్టు చూప టానికి ఈసీ ఏమాత్రం మొహమాట పడలేదు. ఇదంతా ఎక్కడ బయటపడుతుందోనన్న కంగా రుతో పరాజితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే సమయానికే ఈవీఎంల డేటా ఖాళీ చేశారు. వీవీప్యాట్ స్లిప్‌లు ధ్వంసం చేశారు. ఈవీఎంలలో రికార్డయిన ఓట్ల లెక్కలు బయటకు తీసి, అవి వీవీప్యాట్ స్లిప్‌లతో సరిపోల్చాలని కోరితే డమ్మీ గుర్తులతో కొత్తగా నమూనా వోటింగ్ నిర్వహించ టానికి సిద్ధపడ్డారు! ఇక భద్రపరిచిన ఈవీఎంలలో చార్జింగ్ ఎలా పెరుగుతుందో ఇంతవరకూ చెప్పలేకపోయింది. వీటిపై వైఎస్సార్ కాంగ్రెస్ నిలదీస్తే జవాబివ్వటానికి ఈసీకి నోరు పెగలదు. పార్లమెంటులో ఇంత దుమారం రేగాక డూప్లికేట్ కార్డులపైనా, వోటర్ల జాబితా అవకతవక లపైనా సాధికారికంగా, పద్ధతిగా జవాబివ్వడానికి బదులు వేరే మార్గం ఎంచుకుంది. ‘ఈసీ వర్గాలు’ అనే పేరుతో ఒక వివరణ బయటికొదిలింది. ఆ సంస్థ తనను తాను ఏమనుకుంటున్నదో గానీ ఇలా మీడియాకు లీకులివ్వటం మర్యాదైన సంగతి కాదు. ఒక పార్టీయో లేదా ప్రభుత్వమో తమ ఆలోచనలపై ప్రజాస్పందనేమిటో తెలుసుకోవటానికి లీకులిస్తుంటాయి. దాని ప్రయోజనం దానికుంటుంది. కానీ ఈసీ అలా చేయటంలో ఆంతర్యమేమిటి? ఉదాహరణకు డూప్లికేట్ వోటర్ కార్డులు వారసత్వపు సమస్యగా తేల్చిచెప్పింది. 2008–13 మధ్యే ఈ కార్డులు జారీ అయ్యాయన్నది. అదే నిజమనుకుంటే ఆ సంగతి ఈసీకి ఎప్పుడు తెలిసింది? తెలిశాక తీసుకున్న చర్యలేమిటి? ఇన్నాళ్లూ సరిచేయక పోవటానికి కారణాలేమిటి? అధికారికంగా ఇలాంటి తెలివితక్కువ జవాబు లిస్తే మరిన్ని ప్రశ్నలు వచ్చిపడతాయన్న భయంతోనే ఆ సంస్థ లీకులతో సరిపెట్టింది.ఎంతకాలం ఈ దాగుడుమూతలు? ఎన్నాళ్లు ఈ అవకతవకలు? ఎన్నికల ప్రక్రియపైనా, వివిధ దశల్లో చోటుచేసుకున్న అక్రమాలపైనా ఫిర్యాదులొస్తే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఇప్పుడు పార్లమెంటులో పెద్ద రాద్ధాంతం జరిగాక లీకులివ్వటం, అవి మరిన్ని సందేహాలకు తావీయటం అప్రదిష్ట కాదా? ఇందువల్ల తమ విశ్వసనీయత దెబ్బతింటుందన్న ఇంగితజ్ఞానం కూడా లేదా? ఓడిన రాజకీయ పార్టీలు మాత్రమే కాదు... సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన ఎస్‌వై ఖురేషీ సైతం గతంలోనూ, ఇప్పుడూ కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల సంఘం తీరు సవ్యంగా లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతున్నదని హెచ్చరించారు. కనుక ఆ సంస్థ ఇప్పటికైనా పారదర్శకతతో వ్యవహరించటం నేర్చుకోవాలి. తప్పును తప్పుగా ఒప్పుకొనే నిజాయితీ ప్రదర్శించాలి. లేనట్టయితే ప్రజానీకం దృష్టిలో దోషిగా మిగలక తప్పదు. -
ఈసీ తీరుపై... అన్నీ అనుమానాలే!
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల సంఖ్యలో అనూహ్య పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలను కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలన్నీ సోమవారం లోక్‌సభలో లేవనెత్తాయి. వీటిపై సందేహాలు, నానాటికీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతనే ప్రశ్నార్థకంగా మార్చాయంటూ ఆందోళన వెలిబుచ్చాయి. పైగా వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం అరకొర స్పందన మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నాయి. కనుక ఈ మొత్తం అంశంపై లోక్‌సభలో పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇది ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో చేస్తున్న డిమాండని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఓటర్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందా అని ప్రశ్నించారు. ‘‘కేంద్రం తయారు చేయదన్నది నిజమే. కానీ ఇవన్నీ మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అందుకే ఈ అంశంపై సవివరమైన చర్చకు మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఓటర్ల జాబితాల విశ్వసనీయతను దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలన్నీ ప్రశ్నిస్తున్నాయి. మహారాష్ట్రతో సహా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు దీనిపై అనుమానాలు లేవనెత్తాయి’’ అని గుర్తు చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమంటూ సమాజ్‌వాదీ, ఆర్జేడీ, బిజూ జనతాదళ్, ఆప్ కూడా గొంతు కలిపాయి. దీన్ని పార్లమెంటు చర్చకు స్వీకరించాల్సిందేనని పట్టుబట్టాయి. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఓటర్ల జాబితా అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తారు. ‘‘ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డు నంబర్లలో నకిలీల సమస్య దశాబ్దాలుగా ఉంది. కానీ పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన అనంతరమే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. సమస్యను మూడు నెలల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది’’ అంటూ దృష్టికి తెచ్చారు. అంటే ఇంతకాలంగా తప్పిదాలు జరుగుతూ వస్తున్నట్టే కదా అని ఆయన ప్రశ్నించారు. ‘‘బెంగాల్, హరియాణాల్లో నకిలీ ఓటరు కార్డులు దొరికాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. దానిపై అందరూ ప్రశ్నలు లేవనెత్తారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఇలాగే జరిగింది. ఇవన్నీ తీవ్రమైన లోటుపాట్లే. వచ్చే ఏడాది బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలున్నందున ఆలోపే ఓటర్ల జాబితాలను పూర్తిగా సవరించాలి’’ అని డిమాండ్ చేశారు. ఈ తప్పిదాలపై దేశ ప్రజలకు ఈసీ బదులివ్వాల్సిందేనన్నారు. ఈ అంశంపై సమగ్ర చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలతో హోరెత్తించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పక్షపాతరహితంగా వ్యవహరించాలని సమాజ్‌వాదీ సభ్యుడు ధర్మేంద్రయాదవ్ అన్నారు. ‘‘మహారాష్ట్రలో నెలల వ్యవధిలోనే కొత్తగా లక్షలాది ఓటర్లు ఎలా పుట్టుకొచ్చారు? ఢిల్లీలోనూ అదే జరిగింది. 2022లో యూపీలోనూ ఇదే చేశారు’’ అని ఆరోపించారు.రాజ్యసభలోనూ... రాజ్యసభలో కూడా జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రయత్నించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అందుకు అనుమతివ్వలేదు. దీనితో పాటు డజనుకు పైగా అంశాలపై 267వ నిబంధన కింద చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఇచి్చన నోటీసులన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. ‘‘మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆర్నెల్లలోనే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇదెలా సాధ్యం? దీనిపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ వద్ద సమాధానమే లేదు. ఓటింగ్ ప్రక్రియ కోసం ఉపయోగించిన ఫొటో ఓటర్ల జాబితాను ఎక్సెల్ ఫార్మాట్లో మాకు అందజేయాలని డిమాండ్ చేస్తే ఈసీ నేటికీ స్పందించనే లేదు. దేశవ్యాప్తంగా ఓటర్ల పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించడం, డూప్లికేట్ ఈపీఐసీ నంబర్ల వంటి తీవ్ర తప్పిదాలు, లోటుపాట్లు ఇష్టారాజ్యాంగా చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ ఎన్నికల ప్రక్రియ తాలూకు సమగ్రతనే సవాలు చేస్తున్నాయి. పైగా ఈ తప్పిదాలను స్వయంగా ఈసీయే అంగీకరించింది. కనుక వీటన్నింటిపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందే. అందుకు మోదీ సర్కారు అంగీకరించాల్సిందే’’ అంటూ అనంతరం ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తద్వారా ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్నేళ్లుగా ఘోరంగా విఫలమవుతోందని అంతకుముందు టీఎంసీ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ సభలో దుయ్యబట్టారు. ఇందుకు ఈసీపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘డూప్లికేట్ ఓటర్ కార్డుల అంశాన్ని సీఎం మమతే తొలిసారి లేవనెత్తారు. దీనిపై ఈసీ ఇచ్చిన వివరణ ఎన్నికల నిర్వహణ నిబంధనలకే విరుద్ధంగా ఉంది’’ అని ఆరోపించారు. అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం, ఈసీపై ఉందని ఆప్ సభ్యుడు సంజయ్‌సింగ్ అన్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరియాణా పౌరులకు విచ్చలవిడిగా ఓటరు కార్డులిచ్చారని ఆరోపించారు. తద్వారా ఎన్నికల ప్రక్రియనే ప్రహసనంగా ఈసీ మార్చేసిందని దుయ్యబట్టారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. ‘‘ఎన్నికల ప్రక్రియే పార్లమెంటు ఉనికికి ప్రాణం. ఎన్నికల అవకతవకలపై ఇక్కడ చర్చించేందుకు అవకాశమివ్వకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు’’ అన్నారు. -
సజాతి ధ్రువాల వికర్షణ
శశి థరూర్‌కీ, కాంగ్రెస్ నాయకత్వానికీ మధ్య తలెత్తినట్లుగా కనిపిస్తున్న విభేదాలను ఆసక్తికరంగా మారుస్తున్నది ఏమిటంటే,ఇరు వర్గాల గురించి ఆ విభేదాలు బయటికి ఏం వెల్లడిస్తున్నాయన్నదే. విభేదాలున్నా యన్న సంగతిని వారు ఒప్పుకొని, అంగీకరించకున్నా... ఒకటైతే వాస్తవం. వారు ఒకరి కొకరు పూర్తిగా భిన్నమైనవారు. బహుశా సమస్యకు మూలం, ప్రధానంగా అదే అయి వుండాలి. శశి థరూర్ ఫక్తు రాజకీయ నాయకుడు కారు. ముఠాలను, రహస్య మంతనాలను ఆయన నడపరు. బదులుగా, ఆయన తన సొంత ప్రతిభ, నైపుణ్యాల మీద ఆధారపడినవారు. దీనర్థం – ఆయనకు దాపరికాలేం ఉండవని. రాజకీయంగా పైకి రావాలన్న ఆకాంక్ష, గుర్తింపు కోసం ఆరాటం మాత్రమే ఉన్నాయని. అంతేకాదు, తన వైపునకు దృష్టిని మళ్లించుకోవాలని కూడా ఆయన కోరుకుంటారని అర్థమౌతోంది. ముందుకు సాగేందుకు ఆయన విధానం అది. అందులో విజయం సాధించారు కూడా. ట్విట్టర్లో ఆయన్ని అనుస రించే అసంఖ్యాక అభిమానులు, ఆయనకు గల ‘గుర్తింపు యోగ్యత’ ... ఇందుకు సాక్ష్యం. కాంగ్రెస్ నాయకత్వం, కనీసం ఇందిరాగాంధీ హయాం నుంచి చూసినా కూడా – ముఖస్తుతులు చెల్లించే వారి ద్వారా వర్ధిల్లుతూనే వచ్చింది. వారంతా గాంధీల అనుచరులు. వారి నాయకులు గాంధీలు. వారు తమ రాజకీయ జీవితాన్నంతా గాంధీల సేవకే అంకితం చేసినవారు. రాహుల్ గాంధీని మించి తాము శోభిల్లకూడదనీ, సోనియా గాంధీకి ఎదురు చెప్పకూడదనీ నేర్చుకున్నవారు. ఇక ఇప్పుడైతే ప్రియాంకా గాంధీకి పల్లకి మోయటానికి తయారవు తున్నవారు. అంతేనా, ఈ తరహా కుటుంబ ఆరాధనను నియమ బద్ధం చేయటానికి... గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించలేదని తమను తాము నమ్మించుకుంటున్నవారు ఈ అనుచరులు. చిన్నపాటి పోలికలు శశి, రాహుల్‌ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేయిస్తాయి. శశి తన ప్రతిభ, తెలివితేటలతో కష్టపడి పైకొచ్చినవారు. రాహుల్ బలం ఆయన ఇంటిపేరు. రాహుల్ స్వయంగా సాధించిన రాజకీయ విజయాలు పరిమితమైనవి. లేదా, ఏమంతగా గుర్తింపులో లేనివి. తగని సమయాలలో విహార యాత్రలకు వెళ్లిపోవటం ఆయన అభిరుచి. శశి బలం... దీర్ఘమైన ఆయన ఆంగ్ల పదాడంబరత, ఆహ్లాద కరమైన ఆయన నడవడిక. రాహుల్ స్పష్టంగా మాట్లాడలేని వ్యక్తిగా కనిపిస్తారు. రాహుల్‌కు తనేం చెప్పాలనుకుంటున్నారో దానిని వ్యక్తపరిచే విషయంలో సమస్యలు ఉన్నాయని చాలామంది నమ్ము తారు. శశి రచయిత. ఇరవైకి పైగా పుస్తకాలు రాశారు. ఆకాంక్షలు గల యువతను ఆయన ఆకర్షిస్తారు. రాహుల్ ఎప్పుడూ కూడా పేదలను, ఆర్థికంగా లేదా సామాజికంగా అణచివేతకు గురవుతున్నవారిని ఉద్దేశించి మాట్లాడుతుంటారు. మొత్తానికి, వీళ్లిద్దరూ భిన్న ప్రపంచాలలో ప్రకాశిస్తున్నవారు. మాజీ దౌత్యవేత్తగా శశి తీరు వివేకవంతంగా, వినయపూర్వకంగా, తన ప్రత్యర్థులు సాధించిన విజయాలను సైతం అంగీకరించే విధంగా ఉంటుంది. అందుకే మోదీ అమెరికా పర్యటనను, లేదా కేరళలో సీపీఎం స్టార్టప్‌లను అభివృద్ధి పరచటాన్ని ఆయన ప్రశంసించకుండా ఉండలేకపోయారు. రాహుల్ శైలి ఇందుకు విరుద్ధంగా కఠినంగా, గాయపరిచేలా ఉంటుంది. మాటల బాక్సర్ అతడు. కమిలిపోయేలా గట్టి దెబ్బ కొడతారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ అతి సునాయాసంగా అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. పార్టీలో అతడిది ప్రశ్నించేవారే లేని, సర్వదా ఆమోదంపొందిన ఆరోహణ. ఇందుకు భిన్నమైనది శశి థరూర్ రాజకీయ జీవితం. అది వెలుగులను విరజిమ్మేదేమీ కాదు. ఆయన కొంతకాలం విదేశాంగ, మానవ వనరుల అభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. 2014 తర్వాత రెండు పార్లమెంటరీ సెలక్ట్ కమిటీలకు చైర్మన్‌గా ఉన్నారు. అంతకుమించి, కాంగ్రెస్‌లో అగ్రశ్రేణి నాయ కుడిగా ఎప్పుడూ లేరు. ఆయన తన గతం వల్ల లేదా తన సహాయక రాజకీయేతర క్రీయాశీలతల వల్ల మాత్రమే ప్రసిద్ధులు. ఆయన్ని తన భవిష్యత్ నేతగా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేకపోతోంది. ఇవన్నీ కూడా నాలో మూడు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అవి శశి థరూర్‌కు, ఆయన పార్టీ అయిన కాంగ్రెస్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాలకు సంబంధించినవని నేను నమ్ముతున్నాను. మొదటిది, గొప్ప గౌరవ మర్యాదలను పొందుతూ, రాహుల్‌కు ప్రత్యర్థులు కావచ్చునని పరిగణన పొందుతున్న ప్రతిభావంతులైన వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో కాంగ్రెస్ పార్టీకి తెలియటం లేదన్న విషయాన్ని ఈ విభేదాలు సూచిస్తున్నాయా?బయటి ప్రపంచానికి రాహుల్, శశి ఎలా కనిపిస్తారో ఒక్క క్షణం ఆలోచించండి. రాహుల్‌ను వారసత్వపు అర్హత గల రాజపుత్రుడిగా చూస్తారు. శశిని ప్రతిభకు, పనితీరుకు ప్రతీకగా చూస్తారు. కాంగ్రెస్ తన అధ్యక్ష వంశానికి విధేయతతో... ప్రతిభకు, పని తీరుకు మిగిల్చి ఉంచిన ఆ కాస్త చోటును కూడా పరిమితం చేసేసిందా?రెండవది... పార్లమెంటు లోపల గానీ, పార్లమెంటు బయట గానీ, పార్టీలో శశి థరూర్ పోషించవలసిన పాత్ర చాలా స్వల్ప మైనదిగా మాత్రమే ఉంది. ఆయన నేర్పును, నైపుణ్యాలను ఉపయో గించుకునే విషయంలో – అలాంటి అలవాటు లేకపోవటం కారణంగా – కాంగ్రెస్ జాగ్రత్త పడుతూ రావటమే కారణమా? ఒకప్పుడు విశాల గుడారమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నెరవేర్చదగిన ఆకాంక్షలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోయిందా?మూడవది, తానెప్పటికీ గెలవలేనని తెలుసు; తన ఆశయం, కనీసం తన ఉద్దేశం ఏమిటని ఆలోచించేవారిని అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందని తెలిసినా శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీ పడి తప్పు చేశారా? ఆ ఎన్నికలను ప్రజాస్వా మ్యబద్ధం చేయటానికే ఆయన పోటీలో నిలబడ్డారని నాకు తెలుసు. సాధారణంగానైతే ఆ చొరవను మెచ్చుకోవాలి. కానీ పోటీ లేకుండా అభ్యర్థిని గెలవనిచ్చే కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇదంతా జరిగినట్లయిందా?నాల్గవ ప్రశ్న కూడా ఉంది. సాధారణమైన ప్రశ్న. శశి థరూర్ కనుక కాంగ్రెస్ నుండి విడిపోతే అది ఆ పార్టీకి ఏపాటి ఎదురు దెబ్బ అవుతుంది? ఆయన విషయానికొస్తే కేరళలో ఆయన ఆశలు విఫలం కావచ్చు. ఒకటి మాత్రం చెప్పగలను. ఆయన కాంగ్రెస్‌ను వీడతారో లేదో గానీ, బీజేపీలో చేరతారంటే మాత్రం నేను నమ్మలేను.» కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాం నుంచి చూసినా కూడా – ముఖస్తుతులు చెల్లించే వారి ద్వారానే వర్ధిల్లుతూ వచ్చింది. వారంతా రాహుల్ గాంధీని మించి తాము శోభిల్లకూడదనీ, సోనియా గాంధీకి ఎదురు చెప్ప కూడదనీ నేర్చుకున్నవారు.» రాహుల్ గాంధీ అతి సునాయాసంగా అత్యున్నత స్థానానికి చేరుకోగలిగారంటే అందులో ఆశ్చర్యం లేదు. పార్టీలో అతడిది ప్రశ్నించేవారే లేని ఆరోహణ. ఇందుకు భిన్నమైనది శశి థరూర్ రాజకీయ జీవితం.- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- కరణ్ థాపర్ -
మీకు మీరే ట్రోల్ చేసుకుంటున్నారు.. బాగుందయ్యా రాహుల్!
అహ్మదాబాద్: కొందరు కాంగ్రెస్ నేతలు.. బీజేపీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల ఆ పార్టీకి కలిసొచ్చే ఏమీ లేదని, వాళ్లని వారే ట్రోల్ చేసుకుంటున్నారంటూ గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల్లా విమర్శించారు. ‘ రాహుల్ గాంధీ మిమ్మల్ని మీరే ట్రోల్ చేసుకుంటున్నారు. మీ పార్టీని కూడా బానే ట్రోల్ చేస్తున్నారు. ఆయన్ని ఆయన అద్దంలో చూసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ గుజరాత్ లో గెలవలేకపోతుందనే అసహనం. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వివాహాల్లో గుర్రాల చేత డ్యాన్స్ చేయించే వారి మాదిరిగా ఉన్నారని, మరి కొంతమంది పోటీల్లో పరుగెత్తే పెళ్లి గుర్రాల్లా ఉన్నారని రాహుల్ అంటున్నారు. అంటే మీ పార్టీ కార్యకర్తలు జంతువులా? అని ప్రశ్నించారు షెహజాద్. కనీసం మీ పార్టీ కార్యకర్తల్ని మనుషుల మాదిరి చూడండి.. అంతే కానీ వారిని గుర్రాలతో పోలుస్తారా? అంటూ నిలదీశారు.కాగా, ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్‌గా ఉన్న వారిని బయటకు పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు’ అని రాహుల్ వార్నింగ్ ఇచ్చారు. -
కాంగ్రెస్ నేతలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
గాంధీనగర్: గుజరాత్లో కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ. గుజరాత్లో కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్‌గా ఉన్న వారిని బయటకు పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో నేతలకు కొదవలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 22 శాతం ఓట్లు పెరిగాయి.. అసాధ్యం అనుకున్న చోట వారు సాధించి చూపించారు.గుజరాత్లో కూడా కాంగ్రెస్‌కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్నది.. కానీ అందుకు భిన్నంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను రోజురోజుకూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.. అందరూ పార్టీ లైన్లో ఉండి పనిచేయాల్సింది.. గీత దాటిన వారిపై వేటు వేయడానికి ఎంతో సమయం పట్టదు.. ఇప్పుటికైనా మించిపోయిందేమీ లేదు. వైఖరి మార్చుకొని పార్టీ కోసం పనిచేయాలి. పీసీసీ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే, గత 30 ఏళ్లుగా గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో లేదు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతీసారీ 2007, 2012, 2017, 2022, 2027 అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చలు జరుగుతాయి. కానీ ప్రశ్న ఎన్నికల గురించి కాదు. మన బాధ్యతలను నెరవేర్చే వరకు గుజరాత్ ప్రజలు మనల్ని ఎన్నికల్లో గెలిపించరు. ప్రజల పట్ల మనం బాధ్యతతో ఉన్న రోజున వారే మనకు అధికారం ఇస్తారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. #WATCH | Ahmedabad, Gujarat: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "...Gujarat is stuck, it is unable to see the way, Gujarat wants to move forward. I am a member of the Congress party and I am saying that the Congress party of Gujarat is unable to show it the way, and… pic.twitter.com/UYBZ5BdvfM— ANI (@ANI) March 8, 2025 -
రాహుల్ గాంధీ ధారావి పర్యటపై సెటైర్లు
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత తాజాగా ముంబైలోని ధారావి ప్రాంతంలో పర్యటించారు(Dharavi Visit). అయితే ఈ పర్యటనలో కాంగ్రెస్ నేతలెవరూ కనిపించకపోవడంపై శివసేన నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్(Sanjay Nirupam) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.గురువారం ధారావిలోని ఛామర్ స్టూడియోను సందర్శించిన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. డిజైనర్ సుధీర్ రాజ్బర్ & టీంను కలిశారు. ఆపై సోషల్ మీడియాలో రాజ్బర్ బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు కూడా.Sudheer Rajbhar of Chamar Studio encapsulates the life and journey of lakhs of Dalit youth in India. Extremely talented, brimming with ideas and hungry to succeed but lacking the access and opportunity to connect with the elite in his field. However, unlike many others from his… pic.twitter.com/VOtnA9yqSD— Rahul Gandhi (@RahulGandhi) March 6, 2025 అయితే ఒక కాంగ్రెస్ నేతగా కాకుండా.. యూట్యూబర్‌లాగా రాహుల్ ధారావిలో పర్యటించారంటూ సంజయ్ నిరుపమ్ ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ముంబై కాంగ్రెస్ యూనిట్ డబ్బుల్లేక దివాళా తీసిందని సెటైర్లు కూడా వేశారు. ముంబైలో కాంగ్రెస్‌కు ఓట్లు మాత్రమే కాదు.. డబ్బులు కూడా లేకుండా పోయాయి. చాలాకాలంగా ముంబై కాంగ్రెస్ కార్యాలయం కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఆ బకాయిలు రూ. 5 లక్షల దాకా పేరుకుపోయాయి. అందుకే.. కావాలనే రాహుల్ కాంగ్రెస్ నేతలను కలవకుండా వెళ్లిపోయారు. ఒక కాంగ్రెస్ నేతలా కాకుండా.. యూట్యూబర్‌లాగా ఆయన పర్యటన సాగింది. గతంలో నేను ముంబై కాంగ్రెస్ యూనిట్ చీఫ్‌గా నాలుగేళ్లపాటు పని చేశా. కానీ, ఏనాడూ ఇంత ఘోరమైన పరిస్థితులు మాత్రం లేవు’’ అని సంజయ్ నిరుపమ్ అన్నారు.బాల్‌థాక్రే పిలుపుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంజయ్ నిరుపమ్.. ఆ తర్వాత కాంగ్రెస్‌తోనూ అనుబంధం కొనసాగించారు. ఒకసారి శివసేన నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 2009-14 మధ్య కాంగ్రెస్ నుంచి లోక్‌సభ ఎంపీగా పని చేశారు. అయితే కిందటి ఏడాది ఏప్రిల్‌లో క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్ ఆయనపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. షిండే శివసేన వర్గంలో చేరారు. -
‘20 ఏళ్లుగా అనుకుంటున్నా.. కానీ రాహుల్ అనుకోలేదు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంతగానో సేవ చేసిన తనను పార్టీ ప్రస్తుతం గుర్తించకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి మణి శంకర్ మళ్లీ పెదవి విప్పారు. పార్టీకి ఇంకా సేవ చేద్దామని ఉన్నా తనను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తానొక వృద్ధుడిని అని పక్కన పెట్టేశారని, తాను మరీ అంత వృద్ధుడినేమీ కాదన్నారు 83 ఏళ్ల మణిశంకర్ అయ్యర్. జాతీయ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మణి శంకర్ అయ్యర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.‘ ఇప్పుడు నేనేమీ మాట్లాడినా బీజేపీ వక్రీకరిస్తుంది. వారు కచ్చితంగా ఆ పని చేస్తారు. మీతో మాట్లాడిన దానిని వక్రీకరిస్తారు. కానివ్వండి.. వారు అలా చేస్తే మనం చేసేదేమీ ఉండదు.. మా పార్టీలోని పవన్ ఖారే నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. నా సేవలు పార్టీకి అవసరం లేదని తేల్చి చెప్పేశారు. ఏ రకంగానే నా సేవలు అవసరం లేదన్నారు. ఇక ‘గాంధీ’ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ షిప్ పై మణి శంకర్ అయ్యర్ స్పందించారు. ‘ మా ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. వారు నన్నేమీ శత్రవుగా చూడటం లేదు. కానీ రాహుల్ గాంధీ.. నన్ను బాగా వృద్ధుడిగా చూస్తున్నారు. నేను వృద్ధుడ్నే కానీ.. మీరు అనుకునేంత వృద్ధుడ్ని కాదు. ఇదే వారు నన్ను సంప్రదించకపోవడానికి ప్రధాన కారణం’ అని చెప్పుకొచ్చారు.ఇక రాహుల్ గాంధీకి మెంటార్ గా వ్యవహరిస్తారా అని అడిగిన ప్రశ్నకు.. మణిశంకర్ అయ్యర్ తనదైన శైలిలో జవాబిచ్చారు. ‘ రాహుల్ కు మెంటార్ గా ఉండాలని గత 20 ఏళ్లగా సిద్ధంగా ఉన్నా. కానీ వారు నన్ను కోరుకోవడం లేదు. నా అభిప్రాయాన్ని వారు మీద నేను బలవంతంగా రుద్దలేను కదా. నేను ఉండాలని కోరుకుంటున్నా. కానీ రాహుల్ అనుకోవడం లేదు’ అని అన్నారు. కాంగ్రెస్ లో కొంతమంది తనపై లేనిపోనివి చెప్పి తనను వారి నుంచి దూరం చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు అయ్యర్.మరి ఈ విషయాల్ని రాహుల్ గాంధీ సమక్షంలోనే నివృత్తి చేసుకోవచ్చు కదా అని అడిగిన మరో ప్రశ్నకు అయ్యర్ బదులిస్తూ.. ‘ నేను ఎలా కలుస్తాను.. వారు కలిసే అవకాశం ఇవ్వకపోతే నేను కలవగలను. 2004లొ రాహుల్ నా మాట గౌరవం ఇచ్చేవారు. ఆ సందర్భంలో మీరు నా తండ్రికి స్నేహితుడు.. అందుకు మీ మాట వింటాను.. మా తండ్రి మీ మాట విన్నారు.. నేను కూడా మీ మాట వింటాను’ అని ఒకానొక సందర్భంలో సంగతిని అయ్యర్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వారిని కలిసే పరిస్థితి లేదన్నారు. వారే తనను దూరం పెడుతున్నారన్నారు. అటు రాహుల్, ఇటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎవర్నీ నేను కలవలేకపోతున్నా. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగా లేకపోయినా కలవడానికి లేకుండా ఉంది. నేను వారు గురించి ఎందుకు డిస్టర్బ్ కావాలి. నాకేమైనా ఇప్పుడు ఎంపీ పోస్ట్ కోసం వారిని కలవాలా? ఏంటీ, అని అయ్యర్ తిరిగి ప్రశ్నించారు. -
నా కూతురి ఎదుగుదల చూసి ఓర్వలేకే హత్య : హిమాని తల్లి
-
బీజేపీ దళిత వ్యతిరేకి
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌లో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడం పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తంచేశారు. దళితుల హక్కులు, ప్రయోజనాలను కాపాడే బాధ్యత కలిగిన కమిషన్‌లో ఖాళీలను భర్తీ చేయకపోవడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రెండు కీలక పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉంటున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటే అధికార బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. దళితుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని గుర్తుచేశారు. కమిషన్‌ను ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చడం రాజ్యాంగంపై, దళితుల సామాజిక హక్కులపై ప్రత్యక్షంగా దాడి చేయడమే అవుతుందని తేల్చిచెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలని, కమిషన్‌లో ఖాళీలను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ అచేతనంగా మిగిలిపోతే దళితులు సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. వారి ఫిర్యాదులపై ఎవరు స్పందించారని ప్రశ్నించారు. -
రాహుల్ గాంధీపై కేసు? ప్రీతి జింటా ఏమందంటే?
ఒకరు చేసిన పనికి మరొకర్ని నిందించడం సరికాదంటోంది హీరోయిన్ ప్రీతి జింటా (Preity Zinta). కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు తనపై ఆరోపణలు గుప్పించినందుకుగానూ రాహుల్‌గాంధీపై ప్రతీకారం తీర్చుకోవడం తనకిష్టం లేదని చెప్తోంది. తాజాగా ప్రీతి జింటా సోషల్ మీడియాలో చిట్‌చాట్ (ఆస్క్ మీ ఎనీథింగ్) నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది.రాహుల్ తప్పు లేదుఈ క్రమంలోనే ఓ వ్యక్తి రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేసు పెడుతున్నావా? అని అడిగాడు. అందుకు ప్రీతి.. ఇతరులు చేసిన పనికి ఆయనను దూషించడం సరికాదు. ఎవరో చేసిన పనికి రాహుల్ గాంధీ బాధ్యుడెలా అవుతారు? ఏదైనా సమస్యను నేరుగా పరిష్కరించడానికే ప్రయత్నిస్తాను తప్ప పరోక్ష యుద్ధాల ద్వారా కాదు. రాహుల్ గాంధీతో నాకు ఎటువంటి సమస్య లేదు. కాబట్టి ఆయనను ప్రశాంతంగా బతకనిద్దాం. అలాగే నేనూ శాంతియుతంగా జీవిస్తాను అని చెప్పుకొచ్చింది.బీజేపీతో దోస్తీ అంటూ ఆరోపణలుకాగా ఇటీవల కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రీతిజింటాపై తీవ్ర ఆరోపణలు చేసింది. న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి నటి తీసుకున్న రూ.18 కోట్ల రుణాన్ని బీజేపీ మాఫీ చేసిందని ఆరోపించింది. అందుకుగానూ ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని ఆరోపించింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని ఆమె ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ప్రీతి లేదని బదులిచ్చింది. చాలా ఏళ్లుగా కొన్ని పార్టీలు టికెట్లు ఆఫర్ చేస్తున్నాయని, కానీ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. కంగనాను నమ్ముతున్నానుఅలాగే మన దేశంలోని సోషల్ మీడియా చాలా విషపూరితంగా మారిపోయిందని పేర్కొంది. ఏ చిన్న కామెంట్ చేసినా దాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారంది. తనకు రాజకీయాలంటే అస్సలు ఆసక్తి లేదని నొక్కి చెప్పింది. కంగనా (Kangana Ranaut) గురించి చెప్తూ.. ఆమె ఒక అద్భుతమైన నటి.. అలాగే ఫ్యాషన్ ఐకాన్. ఇప్పటివరకు డైరెక్టర్‌గా తను చేసిన పనిని చూడలేదు. కానీ మంచి దర్శకురాలు కాగలదని నమ్ముతున్నాను. రాజకీయ నాయకురాలిగా తన ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. హిమాచల్ ప్రదేశ్వాసులకు అంతా మంచే చేస్తుందని నమ్ముతున్నాను అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చింది. I don’t think it’s fair to vilify anyone like that, as he is not responsible for someone else’s actions. I believe in handling problems or issues directly & not through proxy battles. I also have no problem with Rahul Gandhi, so let him live in peace & I will live in peace too 😀 https://t.co/LAAGOdOJri— Preity G Zinta (@realpreityzinta) February 27, 2025 చదవండి: సెల్ఫీ ఇస్తా.. ఫ్రీగా దోసె వేసిస్తావా?.. చెఫ్ ఆన్సర్‌కు ఆశ్చర్యపోయిన నటి -
అత్యవసరంగా నేర్చుకోవాల్సింది!
రాజకీయ నాయకుడి సత్తా ఏమిటో గుర్తించాలంటే వాళ్లు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో గమనించాలి. పార్టీ, కుటుంబం, లేదా వ్యక్తిగతమైన తప్పులను ఒప్పుకొంటారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు ఇది మరీ ముఖ్యమవుతుంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ... ఆ మాటకొస్తే ఆయన కుటుంబం, నాయనమ్మ కూడా బలహీనులనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం కార్నెల్ యూనివర్సిటీలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థికవేత్త కౌశిక్ బసు ఎమర్జెన్సీ గురించి రాహుల్ గాంధీని ఒక ప్రశ్న వేశారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ‘పొర బాటు’గా అభివర్ణించారనీ, ‘‘కాంగ్రెస్ పార్టీ ఏ దశలోనూ దేశంలోని వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం చేయలేదనీ’’ రాహుల్ వివరించారు. రెండు విషయాల్లోనూ రాహుల్ తప్పే చెప్పారు. ఎందుకంటే, అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు సుమారు లక్ష మందిని అరెస్ట్ చేసింది. పత్రికలపై నిషేధాజ్ఞలు విధించారు. న్యాయ, అధికార వ్యవస్థలను ఇష్టారీతిన వాడుకున్నారు. అత్యంత దారుణమైన రీతిలో రాజ్యాంగాన్ని మార్చేశారు. అçప్పుడు ఆయనకు ఐదేళ్లు అయినప్పటికీ, రాహుల్ గాంధీ ఇవన్నీ తెలుసుకొని ఉండాలి!వ్యూహాత్మక సమర్థనలుఅత్యవసర పరిస్థితిని ‘పొరబాటు’ అని ఇందిరా గాంధీ అన్నారనడం కూడా అబద్ధమే. ఆమె స్వయంగా దానికి బాధ్యత వహించారు. అందులో సందేహం లేదు. ఆ తరువాత జరిగిన ఎన్ని కల్లో ఘోరంగా ఓడిపోయారు. కానీ దాన్ని ‘పొరబాటు’ అన్నారనడం అవాస్తవం. ఎమర్జెన్సీ అకృత్యాలను సమర్థించుకునేందుకు ఇందిర రకరకాల ఎత్తులు పన్నారు. ఆమె మాటల్లో దానిపట్ల సమర్థింపే కనిపించేది. ఇందిరా గాంధీ అనుసరించిన వ్యూహాల్లో ఒకటి, అవసరానికి మించి జరిగిన ఘటనను అంగీకరించడం. 1978 జూలైలో మేరీ కరాస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘పత్రికలను అణచివేయడం మరీ గట్టి చర్య’’ అని వ్యాఖ్యానించారు. ఇంకోలా చెప్పాలంటే, కట్టడి చేసేందుకు ఇంకొంచెం తేలికైన పద్ధతి ఉంటే బాగుండేదని అర్థం.అంతేతప్ప, పత్రికలను నియంత్రించడం పొరబాటైతే కాదు.ఇంకో వ్యూహం ఉంది. ఇతరులు తప్పులు చేశారు... నేను మాత్రం వాటికి బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పడం. 1978 జనవరి 24న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఇందిరా గాంధీ యవ త్మాల్ (మహారాష్ట్ర)లో ఇచ్చిన ఒక ప్రసంగంపై కథనాన్ని ప్రచురించింది. ‘‘తప్పులు చేసిన ఇతరులు తమ అతిని ఒప్పుకొనేందుకు సిద్ధంగా లేరు. నేను మాత్రం జరిగిన తప్పులకు బాధ్యత తీసుకుంటున్నాను’ అని ఇందిరాగాంధీ చెప్పారు’’ అని ఉంది అందులో.ఇక మూడో వ్యూహం: ఏ రకమైన తప్పులు జరిగినా వాటిని చాలా చిన్నవిగా చూపించి ఒప్పుకోవడం. మేరీ కారస్ ఇంట ర్వ్యూలోనే ఇందిరా గాంధీ ‘‘రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకోవడం, పత్రికా స్వాతంత్య్రాన్ని హరించడం మినహా అసాధార ణమైనవి ఏవీ లేవు’’ అని వ్యాఖ్యానించారు. తుర్క్‌మాన్ గేట్ (ఢిల్లీ) వద్ద కొంతమంది మరణించిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు, ‘‘హింస జరగలేదు... అవి ఒకట్రెండు విడి ఘటనలు’’ అని తేల్చే శారు. దేశ ప్రజలందరినీ ఆందోళనకు గురి చేసిన బలవంతపు కుటుంబ నియంత్రణ కూడా పెద్దగా జరగలేదంటారు ఇందిర. ‘‘తప్పుడు ప్రచారమే మమ్మల్ని ఓడించింది. అలాగని మేమేమీ తప్పులు చేయలేదని అనడం లేదు. అయితే వాటిని కొండంత చేసి చూపించారు. బలవంతపు కుటుంబ నియంత్రణ విషయంలోనూ ఇదే జరిగింది. విషయాలను వాళ్లు ఎట్లా ప్రచారం చేస్తారంటే... చెప్పాలంటే నా దృష్టిలో అవి అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లే కాదు. ప్రచారం మాత్రమే. వారు చెప్పేంత స్థాయిలో జరగలేదు. కొన్ని కేసులున్నాయి కానీ... చాలా కేసుల గురించి వాకబు చేసిన ప్పుడు తప్పని తేలింది’’ అని ఇందిర 1978 మార్చి 26న పాల్ ఆర్ బ్రాస్‌తో జరిపిన సంభాషణలో స్పష్టం చేశారు. ఇప్పటివరకూ చెప్పుకొన్న ప్రతి అంశంలోనూ ఇందిరాగాంధీ కొన్ని నిర్దిష్ట అంశాల గురించి అంటే... నిషేధాజ్ఞలు, అరెస్టులు, తుర్క్‌మాన్ గేట్, బలవంతపు కుటుంబ నియంత్రణ వంటి వాటి గురించి మాట్లాడారే కానీ... అత్యవసర పరిస్థితి గురించి నేరుగా మాట్లాడలేదు. అత్యవసర పరిస్థితిలోంచి ఈ తప్పులను వేరుగా చూపే ప్రయత్నం చేశారు. దీన్నిబట్టే అత్యవసర పరిస్థితి విధింపుపై ఇందిరా గాంధీకి ఎలాంటి ఇబ్బందీ లేదన్నది ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. క్షమాపణ చెప్పలేదు!1978 జనవరి 24న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం, అత్యవసర పరిస్థితి సమయంలో ఇతరులు చేసిన తప్పులు, అక్రమాలకు ఇందిరా గాంధీ బాధ్యత వహిస్తూనే, ‘‘ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో దేశంలోని పరిస్థితి ఏమిటో ఆలోచించాలి’’ అని శ్రోతలను కోరారు. ‘‘అన్నివైపులా గందరగోళం నెలకొని ఉండింది. పరిస్థితి అలాగే కొనసాగి ఉంటే భారత్ పరిస్థితి బంగ్లా దేశ్లా అయ్యేదని వ్యాఖ్యానించారు.’’ ‘‘రోగానికి చికిత్స చేసేందుకు ఇచ్చిన ఔషధమే ఎమర్జెన్సీ’’ అని అన్నారు.ఎమర్జెన్సీకి సంబంధించి మీరేదైనా భిన్నంగా చేసేవారా? అని పాల్ బ్రాస్ అడిగినప్పుడు ఇందిర ఇచ్చిన సమాధానం ‘లేదు’ అని. సూటి ప్రశ్నకు వచ్చిన మొట్టమొదటి స్పందన అది. ఆ తరువాత... ఎమర్జెన్సీ కష్టాలను, బాధలను ‘వ్యక్తిగతంగా’ చూడలేకపోవడం తన తప్పు అని అన్నారు. ‘‘నా తప్పేమిటి అంటే... ఆ విషయాలను వ్యక్తిగతంగా చూడకపోవడం, చర్చించకపోవడం.’’ ఇవీ ఆమె మాటలు!కాబట్టి విషయమైతే స్పష్టం. ఎమర్జెన్సీ ఒక పొరబాటు అని ఇందిరా గాంధీ ఎప్పుడూ అనుకోలేదు. అందుకు క్షమాపణ కూడా చెప్పలేదనడం నిస్సందేహం. 1977 ఎన్నికల్లో ఓటమికి బాధ్యతను మాత్రం అంగీకరించారు. దానికి అతిపెద్ద కారణం ఎమర్జెన్సీ అన్నారే గానీ, అది తప్పు అని మాత్రం అనలేదు. నా పరిశోధనలో ఎంతో సాయం చేసిన, ఇందిరా గాంధీ ఆత్మకథ రాసిన సాగరికా ఘోష్ కూడా దీనితో ఏకీభవిస్తారు. ఎమర్జెన్సీ విధించడం తప్పు అని ఇందిరా గాంధీ అన్న దాఖలా నాకు ఎక్కడా కనిపించలేదు.మౌలికంగా భిన్నమా?ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థల్లో తనవాళ్లను ప్రవేశపెడుతోందని ఇప్పుడు ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ... ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రవర్తన మాత్రం ‘మౌలికంగా భిన్నం’ అంటారు. ఇది కూడా తప్పే. అప్పట్లో ఓ జూనియర్ న్యాయమూర్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా చేయడంతో హెచ్.ఆర్.ఖన్నా రాజీనామా చేయాల్సి వచ్చింది. హోంశాఖ కార్యదర్శి నిర్మల్ ముఖర్జీ వంటి నిబద్ధత కలిగిన అధికారులను పదవుల నుంచి తప్పించారు. రాహుల్ గాంధీ ఎక్కడ పప్పులో కాలేశారో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితినీ, ఎమర్జెన్సీ పరిస్థితినీ వేరుగా చూపాలని ఆయన భావించారు. తద్వారా ఇప్పటితో పోలిస్తే అప్పటి పరిస్థితి మెరుగు అన్న భావన కల్పించాలని అనుకున్నారు. అందుకే ‘‘కాంగ్రెస్ పార్టీ ఏ రోజూ వ్యవస్థలను వశపరచుకోవాలని అనుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు. ఇంకో అంశం... ఎమర్జెన్సీని నానమ్మ ‘పొరబాటు’ అన్నారని చెప్పడం ద్వారా ఆ అంశంపై మరిన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురు కాకుండా జాగ్రత్తపడ్డారు. చర్చను ముగించేందుకుగానూ, కొంత నష్టపోవడం అన్నమాట. అయితే రాహుల్ మాటలు అప్పట్లోనే వివాదాన్ని సృష్టించాయి. ఆయన జ్ఞానం, తీర్పరితనం, నిజాయితీ, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం... అన్నింటిపై సందేహాలు వచ్చాయి. ఈ విషయాలన్నింటిలోనూ ఆయన చాలా తేలికగా ఓడి పోయారేమో అనిపిస్తుంది. ఇదో గూగ్లీ అనుకుంటే రాహుల్ బౌల్డ్ అయ్యారు. దీన్ని ఒక పరీక్షగా అనుకుంటే రాహుల్ దీంట్లో పాస్ కాలేదు. జనాలను ఆకట్టుకోవాలన్నది రాహుల్ ఉద్దేశమైతే అది కూడా జరగలేదు. రాహుల్ ఈ దేశ ప్రధాని అయితే... ఇబ్బంది కరమైన పరిస్థితులను, మరీ ముఖ్యంగా తన కుటుంబ గత చరిత్ర గురించి ఎదుర్కోవడం ఎలాగో ఏదో ఒక రోజు కచ్చితంగా నేర్చు కోవాల్సి ఉంటుంది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అదానీ వివాదం దేశానికి సంబంధించింది
రాయ్‌బరేలీ: అదానీ గ్రూప్ వివాదం వ్యక్తిగతమంటూ ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ‘అదానీ వ్యవహారం నా వ్యక్తిగతం కాదు..దేశానికి సంబంధించిన వ్యవహారం’అంటూ కుండబద్దలు కొట్టారు. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ..అధ్యక్షుడు ట్రంప్‌తో అదానీపై వన లంచాల ఆరోపణలపై చర్చించారా అని మీడియా ప్రశ్నించగా.. ‘అది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం, ఇద్దరు ప్రముఖ ప్రపంచ నేతలు కలుసుకున్నప్పుడు ఇటువంటివి చర్చకు రావు’అని పేర్కొనడం తెలిసిందే. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ట్రంప్ కూడా అదానీ వ్యవహారాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. రాహుల్ శుక్రవారం సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలోని లాల్గంజ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..‘నరేంద్ర మోదీ జీ, ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు..దేశానికి సంబంధించినది. మీరు నిజంగా భారత ప్రధానే అయితే అదానీ వివాదం గురించి ఆరాతీసి ఉండేవారు. ఆరోపణలపై విచారణకు అవసరమైతే అదానీని అమెరికా పంపిస్తానని ట్రంప్‌కు చెప్పి ఉండేవారు. అలాంటిదేమీ లేకుండా, కేవలం వ్యక్తిగతమంటూ వదిలేశారు’అని రాహుల్ పేర్కొన్నారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీను తన మిత్రుడని పేర్కొన్న మోదీ, ఆయన గురించి ట్రంప్‌ను ఎలాంటి విషయాలు అడగలేదని కూడా చెప్పారని రాహుల్ అన్నారు. అమెరికాలో అదానీపై అవినీతి, దొంగతనం కేసు పెండింగ్‌లో ఉందని రాహుల్ తెలిపారు. సోలార్ పవర్ కాంట్రాక్టుల కోసం అమెరికా కంపెనీలు భారత్‌లోని అధికారులకు రూ.2,100 కోట్ల మేర లంచాలు ఇచ్చినట్లు గత బైడెన్ ప్రభుత్వంలోని న్యాయశాఖ ఆరోపించింది. ఇందులో అదానీ గ్రూప్‌కు కూడా సంబంధమున్నట్లు తెలిపింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూపు నిరాధారాలంటూ ఖండించింది. యోగి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ కాదు..అసలు ఇంజినే లేదు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. యూపీలో ఉన్నది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదు..ఘోరంగా విఫలమైన అసలు ఇంజినే లేని ప్రభుత్వమంటూ ఎద్దేవా చేశారు. కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంచిగా పనిచేస్తుండగా, యూపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత విఫలమైన ప్రభుత్వమని దుయ్యబట్టారు. యూపీ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదన్నారు. మరో వైపు, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణలో మునిగిపోయిందని చెప్పారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. కర్ణాటక, తెలంగాణ మాదిరిగా తయారు చేస్తుంది. నోట్ల రద్దు వల్లే అవినీతితోపాటు చదువుకున్న యువతలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఉద్యోగావకాశాలను సృష్టించాలంటే మొదటగా చేయాల్సిన పని చిన్న పరిశ్రమలను బలోపేతం చేసిన రక్షణ కల్పించడమే’ అని రాహుల్ సూచించారు. వ్యక్తిగతమన్న మోదీ వ్యాఖ్యలపై -
రాహుల్ గాంధీపై బీజేపీ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఆగ్రహం
-
రాహుల్ గాంధీపై బండి సంజయ్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్
-
రాహుల్ గాంధీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళా ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కులం, మతంపై చర్చ జరుగుతుండటం దురదృష్టకరం. 1994లో మోదీ కులాన్ని బీసీగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.‘‘రాహుల్ తల్లి సోనియా గాంధీ క్రిస్టియన్. రాహుల్ తాత ఫిరోజ్‌ఖాన్ గాంధీ. రాహుల్ మాత్రం బ్రాహ్మణ్ అంటున్నారు. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయితే.. రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతారు. తండ్రి కులమే కొడుకుకు వస్తుందన్న కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. నరేంద్ర మోదీ పక్కా ఇండియన్’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.10 శాతం ముస్లింలను బిసీలుగా మార్చారు. బీసీలకు ఇచ్చేది 32 శాతమే. 42 శాతం ఎలా అవుతుంది?. లవ్ జిహాదీ, మత మార్పిడిలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ చట్టం రావాలి. హిందూ బీసీలకు 42 శాతం ఇస్తే కేంద్రం సహకరిస్తుంది. మమ్మల్ని మతతత్వ వాదులు అన్నా పర్వాలేదు’’ అని బండి సంజయ్ చెప్పారు. -
ఢిల్లీ టూర్ లో రాహుల్ తో సీఎం రేవంత్ భేటీ
-
ప్రసంగాలు కాదు, యువతకు ప్రోత్సాహం కావాలి
సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ)పై కేవలం మాటలు చెబితే సరిపోదని, నిర్మాణాత్మక కార్యాచరణ కావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. మన పోటీదార్లు ఏఐలో నూతన సాంకేతిక విధానాలతో ముందుకు దూసుకెళ్తుంటే, మన ప్రధాని నరేంద్ర మోదీ టెలిప్రాంప్టర్తో ప్రసంగాలు ఇవ్వడానికే పరిమితం అవుతున్నారని ఆక్షేపించారు. మన దేశంలో ప్రతిభకు కొదవ లేదని, కావాల్సిందల్లా ప్రోత్సాహమేనని సూచించారు. బలమైన ఉత్పత్తి వ్యవస్థను నిర్మించాలన్నారు. ఉత్త మాటలు పక్కనపెట్టి, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, తద్వారా మన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఈ మేరకు రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యుద్ధరీతుల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టేలా డ్రాగన్ దేశం చైనా అత్యాధునిక డ్రోన్ల ఉత్పత్తి ప్రారంభించిందని వెల్లడించారు. డ్రోన్ల తయారీ రంగంలో మనం బలమైన పోటీదారుగా ఎదిగేలా ఒక సమగ్ర వ్యూహాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్ టెక్నాలజీపై 9 నిమిషాల నిడివి గల వీడియోను రాహుల్ గాంధీ షేర్ చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం ఇలాంటి సాంకేతికతను అభివృద్ధి చేయగల ప్రతిభ, ఇంజనీరింగ్ స్కిల్స్ ఇండియాకు ఉన్నాయని స్పష్టంచేశారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాను మాట్లాడిన వీడియోను సైతం రాహుల్ గాంధీ షేర్ చేశారు. యుద్ధ రంగంలో డ్రోన్ల ప్రాధాన్యతను ఆయన ఈ వీడియోలో ప్రస్తావించారు. -
కమిటీ లేదా కమిషన్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రెండో విడత కులగణన పూర్తయిన వెంటనే, దానిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసే దిశగా అధ్యయనం చేయాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాందీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జరిపిన భేటీలో నిర్ణయించారు. ఇందుకోసం కమిషన్ లేదా ఉన్నతస్ధాయి కమిటీ ఏర్పాటు చేయాలని.. అది ఇచ్చే నివేదిక మేరకు చట్టం తేవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. విద్య, వైద్య, ఉపాధి రంగాలతోపాటు వివిధ పదవుల నియామకాలు, నిధులు, కేటాయింపులు సహా విధానపరమైన నిర్ణయాలన్నీ కులగణన ఆధారంగా ఉండేలా భవిష్యత్ ప్రణాళికలు రూపొందించాలని అభిప్రాయానికి వచ్చారని సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎస్సీ వర్గీకరణ, కులగణన అంశాలపై చర్చించేందుకు శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. శనివారం మధ్యాహ్నం రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చించారు. దేశానికి రాష్ట్రమే రోడ్‌మ్యాప్ కావాలి రాష్ట్రంలో కులగణన నిర్వహించిన తీరు, అసెంబ్లీ ఆమోదం, చట్టబద్ధత కల్పించే దిశగా ప్రణాళికలు, బహిరంగ సభ తదితర అంశాలను రాహుల్‌కు రేవంత్ వివరించారు. కచ్చితత్వంతో, పూర్తి పారదర్శకంగా కులగణన నిర్వహించామని, బీసీల జనాభా గతం కన్నా 6% మేర పెరిగిందని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తామని.. త్వరగా ఆమోదించేలా బీజేపీపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. దీని పై రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికే దిక్సూచిలా ఉండాలని, సామాజిక న్యాయంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శి కావాలని సూచించారని తెలిసింది. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని సమాచారం. పార్టీ,ప్రభుత్వ పదవులతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సామాజిక న్యాయ అంశానికి ప్రాధాన్యతనిచ్చి బలహీన వర్గాలకు రాజకీయ న్యాయం చేయాలని రాహుల్ సూచించారని తెలిసింది. ఎస్సీ వర్గీకరణపై చట్టం.. ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో బిల్లుపెట్టి, చట్టం చేస్తామని, ఆ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని రాహుల్ గాం«దీతో రేవంత్ పేర్కొన్నారని తెలిసింది. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేస్తామని వివరించారని సమాచారం. ఇక కులగణన డిమాండ్‌తో దేశవ్యాప్త ఉద్యమం చేయాలని, ఇందుకోసం ఇండియా కూటమి పక్షాలను కలుపుకొని పోవాలని ఈ భేటీలో నిర్ణయించారని తెలిసింది. ఇండియా కూటమి ఎంపీల ఆధ్వర్యంలో పార్లమెంటులో ఆందోళన చేపట్టాలని తీర్మానించారని సమాచారం. ఇండియా కూటమి ఆధ్వర్యంలో సభ నిర్వహించే అంశంలో కూటమి పార్టీల ముఖ్యమంత్రులతో సమన్వయం చేసే బాధ్యతలను రేవంత్‌కు రాహుల్ గాంధీ అప్పగించారని తెలిసింది. ప్రతిపక్షాలు కాచుకుని ఉన్నాయి.. ఇటీవలి ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ, సీఎల్పీ సమావేశంలో వెలువడిన అభిప్రాయాలు, ప్రతిపక్షాల విమర్శలు వంటి అంశాలపైనా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు దూకుడుగా ఉన్నాయని, చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తాయని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే అవకాశాలున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని రాహుల్ సూచించారని సమాచారం. ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. అందరితో సమన్వయం మొదలు ప్రభుత్వ పథకాల అమలు, కీలక నియామకాల వరకు అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటానని రేవంత్ పేర్కొన్నట్టు సమాచారం. -
టీ అమ్మితే తప్పేంటి?: లక్ష్మణ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఒక పేదవాడు కుటుంబ ఆదాయం కోసం టీ అమ్మాడు తప్పేంటి? అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మోదీ కులాన్ని, వేసుకునే బట్టలను, తినే తిండిని, రాహుల్ గాంధీ విమర్శించారంటూ ఆయన మండిపడ్డారు. కరీంనగర్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్ కా వికాస్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 5 వేల 700 కోట్లు తెలంగాణాలో రైల్వే అభివృద్ధికి కేటాయించారు. చర్లపల్లిలో కొత్త టెర్మినల్ ను కట్టింది బీజేపీ కాదా?. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లను రిస్ట్రక్చర్ చేసిన ఘనత బీజేపీది కాదా?. మెదక్, సిద్ధిపేట, కొమురవెల్లికి రైల్వేస్టేషన్లు ఇచ్చింది మోదీ ప్రభుత్వమే’’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.‘‘12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల యూరియాను మోదీ ప్రభుత్వం ఉత్పత్తి చేస్తోంది. జహిరాబాద్‌లో ఇండస్ట్రియల్ కారిడర్‌ను తీర్చిదిద్దాం. 82 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నాం. తెలంగాణ భవిష్యత్ నిర్ధేశించే ఎన్నికలు కాబట్టి అందరూ అలోచించి ఓటు వేయాలి. మోస పూరితమైన రేవంత్ రెడ్డి మాటల తూటాలకు ప్రజలు మోసపోవద్దు’’ అంటూ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. -
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలతో సహా పలు కీలకాంశాలపై రాహుల్‌తో సుమారు 45 నిమిషాలపాటు చర్చించారు. పీసీసీ నూతన కార్యవర్గం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు.. తదితర అంశాలతో వీళ్ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే.. కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన నేపథ్యంలో వాటి గురించి రాహుల్‌కు సీఎం రేవంత్ వివరించినట్లు సమాచారం. తెలంగాణలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దానికి ముఖ్యఅతిథిగా రావాలని రాహుల్‌ను రేవంత్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏఐసీసీ(AICC) అగ్రనేతలతో భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. పొలిటికల్ మైలేజ్ వచ్చేలా.. సూర్యాపేటలో బీసీ కులగణన, మెదక్‌లో ఎస్సీ వర్గీకరణ భారీ సభలు నిర్వహించాలనుకుంటోంది. ఇదిలా ఉంటే.. రేవంత్ విషయంలో అధిష్టానం అసంతృప్తిగా ఉందని, ఈ కారణం చేతనే రాహుల్ గాంధీతో ఆయనకు గ్యాప్ నెలకొందనే ప్రచారం నడిచింది. అయితే.. అదంతా ఉత్త ప్రచారమేనని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కొట్టిపారేయగా, తాజాగా రాహుల్‌తో భేటీ అనంతరం సీఎం రేవంత్ కూడా స్వయంగా ఖండించారు. -
ఖజానా ఖాళీ.. తలలు పట్టుకుంటున్న సీఎం,డిప్యూటీ సీఎం
సాక్షి,హైదరాబాద్ : కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు నిధులు సర్దుబాటు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తలలు పట్టుకుంటున్నారని’ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి కోతల రాయుళ్లు.ఐటీఐఆర్ తీసుకొచ్చి బీజేపీ నేతలు మాట్లాడాలి. నేనేంటో,నా పనితనం ఏంటో రాష్ట్ర నేతలకు, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలకు తెలుసు. నా అవసరం అనుకుంటే జగ్గారెడ్డికి పదవి ఇస్తారు. జగ్గారెడ్డి పదవి ఉన్నా ..లేకున్నా పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాడు.బీజేపీ నేతలు సీఎం రేవంత్‌ను రెచ్చగొట్టి తిట్టించుకుంటారు. ఎన్నికలకు చాలా సమయం ఉంది.. పింక్ బుక్ అంటూ రెచ్చగొట్టకు కవిత. కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. నిధులు సర్దుబాటు చేయలేక మా సీఎం, డిప్యూటీ సీఎం తలలు పట్టుకుంటుంన్నారు.వరంగల్‌కు రావాలంటే రాహుల్ గాంధీ భయపడతారా?..రాహుల్ గాంధీ ఓంట్లోనే భయం లేదు.. కన్యాకుమారి టూ కాశ్మీర్ పాదయాత్ర చేశారు. కేసీఆర్ కనీసం పది కిలోమీటర్లు పాదయాత్ర చేయగలరా? ఐటీఐఆర్ కోసం అవసరం అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను కలుస్తా. ఐటీఐఆర్ ద్వారా వేల ఉధ్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వస్తాయి’ అని అన్నారు. -
‘వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ పారిపోయారు’
సాక్షి,హైదరాబాద్ : వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో జాగృతి మహిళా నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.‘వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.అదే వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదు. వరంగల్ డిక్లరేషన్‌పై రైతులు ప్రశ్నిస్తారని ఆయన భయపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చే వరకు వెంటబడతామని’ కవిత వ్యాఖ్యానించారు. భద్రతా పరమైన ఇబ్బందులు.. రాహుల్ పర్యటన రద్దురాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, షెడ్యూల్ ప్రకారం నిన్న సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చాపర్‌లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుని 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది. -
రాహుల్ వరంగల్ పర్యటన రద్దు
సాక్షి, వరంగల్: రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చాపర్‌లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుని 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది. -
తెలంగాణకు రాహుల్ గాంధీ
-
సడన్ టూర్.. నేడు వరంగల్‌కు రాహుల్ గాంధీ
సాక్షి, వరంగల్: నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న రాహుల్.. చాపర్‌లో వరంగల్ చేరుకోనున్న రాహుల్.. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లనున్నారు.కాగా, బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకొనున్నారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. -
‘మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనే’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పై మరోసారి ధ్వజమెతారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. ఐరన్‌లెగ్ ముఖ్యమంత్రి రేవంత్.. ఢిల్లీ పోయి కాంగ్రెస్‌కు గుండుసున్న తీసుకొచ్చిండని విమర్శించారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పతనాన్ని రేవంత్ ప్రారంభించి.. ఢిల్లీలో ముగించాడని తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా రేవంత్ దాన్ని కొనసాగిస్తారని కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు.‘రాహుల్ గాంధీ (Rahul Gandhi)దేశంలో బీజేపీని గెలిపించి వస్తున్నాడు. ఈ దేశంలో నరేంద్ర మోదీకి, బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్‌గాంధీనే. కాంగ్రెస్‌ను ఓటేస్తే రైతుబంధుకు చరమగీతం అని కేసీఆర్ ముందే చెప్పారు. ఆయన హెచ్చరించినట్లే జరగింది. తెలంగాణ ప్రజల తిడుతున్నతిట్టు రేవంత్ వింటే తట్టుకోలేడు. ఏడాది లోపే కాంగ్రెస్ పార్టీ దగాకోరు నైజాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు కారణంగానే మెతుకు ఆనంద్ ఓడిపోయాడు. మోసగాళ్లంతా పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు నికార్సైన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ రేవంత్ రెడ్డి సూచనలతోనే సభ నడిపిస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వడం లేదు. ప్రజా పాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైకివ్వడానికి వణికిపోతున్నాడు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫుట్ బాల్ ఆడుతున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు. -
రాహుల్ కంగ్రాట్స్.. బీజేపీని గెలిపించారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కంగ్రాట్స్.. మరోసారి బీజేపీని గెలిపించారు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ మరోసారి బీజేపీని గెలిపించారని పేర్కొన్నారు. వెల్డన్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో, కేటీఆర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!Well done 👏 https://t.co/79Xbdm7ktw— KTR (@KTRBRS) February 8, 2025ఇదిలా ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. మూడోసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒక్క స్థానంలోనైనా ప్రభావం చూపించకలేకపోయింది. ఈ ఎన్నికల్లో గుండు సున్నా చుట్టేసింది. గత రెండు ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అక్రమాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ అవకతవకలు(irregularities)చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ఆరోపించారు. రాష్ట్రంలోని వయోజనుల కంటే నమోదైన ఓటర్లే ఎక్కువమంది ఉన్నారన్నారు. అయిదేళ్ల క్రితం కంటే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఐదు నెలల కాలంలో ఎక్కువ మంది పేర్లను జాబితాలో చేర్చారని చెప్పారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్ని కలు, అసెంబ్లీ ఎన్నికలనాటి ఓటరు జాబి తాను ఇవ్వాలంటూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌లు, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)లు కోరినా ఈసీ ఇప్పటి వరకు స్పందించలేదని ఆయన తెలిపారు. దీనిపై తాము చట్ట ప్రకారం ముందుకెళతామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ(ఎస్పీ)నేత సుప్రియా సూలేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది ఓటర్ల పేర్ల తొలగింపు లేక బదిలీ చేశారని, వీరిలో ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, మైనారిటీ వర్గాల వారే ఉన్నారని రాహుల్ వివరించారు. కొత్తగా చేర్చిన ఓటర్ల కంటే తొలగింపునకు గురైన పేర్లే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు అనుమానిస్తున్నాయని ఆయన చెప్పారు.5 నెలల్లోనే 39 లక్షల కొత్త ఓటర్లు‘మహారాష్ట్ర ఎన్నికలకు(Maharashtra election)సంబంధించి ఈసీని పలు ప్రశ్నలు అడిగాం. 2019 విధాన సభ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల మధ్యలో ఐదేళ్ల వ్యవధిలో మహారాష్ట్రలో 32 లక్షల ఓటర్ల పేర్లను చేర్చారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలు, 2024 అసెంబ్లీ ఎన్నికలకు గాను కేవలం ఐదు నెల్ల వ్యవధిలో ఏకంగా 39 లక్షల కొత్త ఓటర్ల పేర్లు చేరాయి’అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అంత స్వల్ప వ్యవధిలో అంత ఎక్కువ మంది ఓటర్లను కొత్తగా ఎలా చేర్చారు? ఈ 39 లక్షల మంది ఓటర్లు ఎవరు? 39 లక్షల మంది హిమాచల్ ప్రదేశ్ మొత్తం జనాభాతో సమానం. అయిదేళ్లలో కంటే కేవలం ఐదు నెలల్లో మహారాష్ట్రలో ఈసీ ఎక్కువ మంది ఓటర్లు ఎందుకు చేర్చింది?’అని ఆయన ప్రశ్నించారు. కొత్త ఓట్లు బీజేపీ ఖాతాలోకేమహారాష్ట్రలో వయోజనుల జనాభా 9.54 కోట్లు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 9.7 కోట్లు. మహారాష్ట్రలోని మొత్తం వయోజనుల కంటే నమోదైన ఓటర్లు ఎక్కువ మంది ఉండటం ఎలా సాధ్యమని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటు బ్యాంకు యథాతథంగా ఉండగా కొత్తగా చేరిన ఓటర్లలో ఎక్కువ మంది బీజేపీకే ఓటేశారన్నారు. ఉదాహరణకు కంతీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సాధించిన మెజారిటీ కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్యతో సమానంగా ఉందని ఆయన వివరించారు. అదేవిధంగా, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన ప్రతిపక్షాలకు పడిన ఓట్ల సంఖ్యలో ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదని కూడా ఆయన చెప్పారు. తమ ప్రశ్నలకు ఈసీ ఎందుకు బదులివ్వడం లేదన్నారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఈసీకుందన్నారు. లేకుంటే తమ తదుపరి చర్య న్యాయస్థానాలను ఆశ్రయించడమేనని స్పష్టం చేశారు.అలాగైతే కేంద్రానికి బానిస అన్నట్లే..శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ...‘ఈసీ సజీవంగా, సొంతంగా పనిచేయగలిగి ఉంటే రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి అది బానిసగా మారినట్లే భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంకెళ్ల నుంచి ఈసీ బయటకు రావాలి’అని అన్నారు. ఎన్నికల్లో గెలిచాక కూడా తమ పార్టీకి చెందిన మల్షిరాస్ ఎమ్మెల్యే ఉత్తమ్ జన్కార్ మళ్లీ ఎన్నికలు జరపాలని, ఈసారి బ్యాలెట్‌ను వాడాలని డిమాండ్ చేయగా, ప్రభుత్వం అక్కడికి పోలీసులను పంపించిందని ఎన్సీపీ(ఎస్పీ)నేత సుప్రియా సూలే ఆరోపించారు.అన్ని గణాంకాలను వెల్లడిస్తాం: ఈసీమహారాష్ట్ర ఎన్నికల్లో అవకత వకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన పలు ఆరోపణలపై ఈసీ స్పందించింది. పూర్తి గణాంకాలతో లిఖిత పూర్వకంగా సమాధానమిస్తామని స్పష్టం చేసింది. -
ఎన్నికల ప్రక్రియపై రాహుల్ సంచలన ఆరోపణలు..వెంటనే స్పందించిన ‘ఈసీ’
న్యూఢిల్లీ:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెంటనే స్పందించింది. ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రశ్నలను,సూచనలను తాము గౌరవిస్తున్నామని త్వరలో ఈ విషయంపై స్పందిస్తామని పేర్కొంది. మహారాష్ట్ర ఓటర్ల జాబితా వివరాలన్నీ రాతపూర్వకంగా వెల్లడిస్తామని తెలిపింది. ఈ మేరకు ఈసీ శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా, ఈసీ ప్రకటనకు ముందు రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. జనాభా కంటే ఎక్కువగా మహారాష్ట్ర ఎన్నికల్లో పలు చోట్ల ఓట్లు నమోదయ్యాయన్నారు. గతేడాది మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు, నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కొత్తగా 35 లక్షల మంది ఓటర్లుగా చేరడమేంటని రాహుల్ ప్రశ్నించారు.ప్రతిపక్షాలకు చెందిన పార్టీలన్నీ కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన ఎందరో ప్రజల ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని,కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లు ఉన్నా అక్కడి ఓటర్లను మరో పోలింగ్ బూత్‌కు మార్చారని ఆరోపించారు.మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలు తమకు ఇవ్వాలని ఈసీని కోరామని, దీనిద్వారా కొత్తగా చేరిన ఓటర్లు ఎవరనేదానిపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఇంతేగాక ఎంతమంది ఓటర్లను తొలగించారో,ఒక బూత్‌నుంచి మరొక బూత్‌కు ఓటర్లను ఎందుకు బదిలీ చేశారో తెలుస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలున్నందునే ఓటర్ల జాబితాను తమకు ఇచ్చేందుకు ఈసీ ముందుకు రాలేని రాహుల్ అన్నారు. -
రాహుల్ గాంధీపై ప్రివిలేజ్‌మోషన్
న్యూఢిల్లీ:ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.వాస్తవాలను వక్రీకరించిన భారత్ పరువు పోయేలా మాట్లాడినందుకుగాను రాహుల్‌గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రక్రియ ప్రారంభించాలని స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు దూబే స్పీకర్‌కు ఒక లేఖ రాశారు.మేక్ ఇన్ ఇండియా ఫెయిలనందుకే చైనా భారత్‌ను ఆక్రమించిందని రాహుల్ అవాస్తవాలు మాట్లాడారని స్పీకర్‌కు రాసిన లేఖలో దూబే పేర్కొన్నారు.పార్లమెంట్ వేదికగా దేశం పరువు తీసేలా రాహుల్ మాట్లాడరని ఆరోపించారు. రాహుల్ తన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించలేదని, కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని దూబే గుర్తు చేశారు.కాగా, లోక్‌సభలో సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్‌గాంధీ మాట్లాడారు. చైనా భారత్‌లో కొంత భాగాన్ని ఆక్రమించిందన్నారు. ఇంతేగాక విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ అమెరికా పర్యటనపైనా రాహుల్ విమర్శలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తీరుపైనా రాహుల్ మాట్లాడారు. రాహుల్ ప్రసంగంలోని ఈ అంశాలన్నీ వివాదాస్పదమయ్యాయి. -
కులగణనతోనే ఆ వర్గాలకు న్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నిర్వహించిన కులగణనలో విస్మయపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయని.. జనాభాలో 90శాతం మంది దళితులు, ఆదివాసీలు, మైనార్టీటలు, ఓబీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశమంతటా ఇదే తరహా ధోరణి ఉందని, కులగణనతోనే ఆ వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్వ హించిన కులగణన అంశాన్ని ప్రస్తావించారు.‘‘తెలంగాణలో మేం కుల గణన నిర్వహించాం. అందులో విస్మయపరిచే అంశాలు గుర్తించాం. తెలంగాణలో సుమారు 90శాతం మంది దళితులు, ఆదివాసీలు, మైనార్టీటలు, ఓబీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. దేశం మొత్తంలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని నేను నమ్ముతున్నా. దేశంలో ఓబీసీల జనాభా 50శాతానికిపైగా ఉంది. ఇంకా గమనిస్తే అది 55% వరకు ఉండొచ్చు. 16% దళితులు, 9% ఆదివాసీలు, 15% మైనార్టీలు ఉన్నారు..’’అని రాహుల్ పేర్కొన్నారు. అందరికీ భాగస్వామ్యం అందాలి.. దేశంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా అందులో అందరికీ భాగస్వామ్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని రాహుల్ పేర్కొన్నారు. ‘‘దళితులు, ఆదివాసీ, ఓబీసీ, మైనార్టీటలు ఈ దేశానికి ఆస్తుల వంటివారు. కానీ దేశంలోని ఎలాంటి పెద్ద కార్పొరేట్ సంస్థలను పరిశీలించినా.. అవి దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు, మైనార్టీటల యాజమాన్యంలో లేవు. పెద్దపెద్ద మీడియా సంస్థలు ప్రధాని మోదీకి మద్దతిస్తాయి. ప్రతిరోజూ నవ్వు ముఖాన్ని ప్రదర్శిస్తాయి. అలాంటి మీడియా ఎన్నడూ ఈ వర్గాల వారిని పట్టించుకోవడం లేదు. కేంద్రం ఎలాంటి కొత్త అభివృద్ధి నమూనాను ఆవిష్కరించాలని భావించినా.. అది కేవలం కులగణనను ఈ సభలో టేబుల్‌పై ఉంచితేనే సాధ్యమవుతుంది. ఒక్కసారి కులగణన చేస్తేనే దేశంలోని 90శాతం జనాభా సంపద, శక్తి ఉందో తెలుస్తుంది’’అని చెప్పారు. బీజేపీ ఎంపీలకు అధికారం లేదన్న రాహుల్.. మండిపడ్డ బీజేపీ.. రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో లోక్‌సభలో అధికార పార్టీ సీట్లను చూపిస్తూ.. ‘‘బీజేపీలో ఓబీసీ, దళిత, ఆదివాసీ ఎంపీలు ఉన్నారు. జనాభాలో వారు 50 శాతంగా ఉన్నా వారికి కచి్చతంగా అధికారం మాత్రం లేదు. మీరు అధికారపక్షంలో కూర్చున్నా.. నోరు మెదపలేరు. అదే దేశంలో వా స్తవం’’అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఇతర ఎంపీలు లేచి.. ప్రధాని మోదీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందిన వారని.. మీకు కళ్లు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.తన ప్రసంగాన్ని కొనసాగించిన రాహుల్.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టినప్పుడే ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందని, వెంటనే కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలో కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించాలని కోరారు. ‘‘కులగణనకు ఏఐని వర్తింపజేసినప్పుడు ఆ శక్తిని ఊహించండి. కులగణన నుంచి మనకు లభించే డేటాను ఏఐతో విశ్లేíÙంచినప్పుడు.. ఏఐ తో మనం ఏం చేయగలమో, ఈ దేశంలో సామాజిక విప్లవంతో ఏం చేస్తామో ఊహించండి’’అని రాహుల్ పేర్కొన్నారు.ఆ హల్వా ఎవరికి తినిపించారో! ఇటీవలి బడ్జెట్ సెషన్ సందర్భంగా హల్వా తయారీకి సంబంధించిన ఫొటో అంశాన్ని రాహుల్ గుర్తు చేశారు. ‘‘గత సెషన్లో హల్వా తయారు చేసే ఫొటో గుర్తుండే ఉంటుంది. ఈసారి ఆ ఫొటోనే బయటికి రాలేదు. హల్వా తినిపించారు. కానీ ఎవరికి తినిపించారో చూపించలేదు’’అని రాహుల్ ఎద్దేవా చేశారు. -
మహారాష్ట్రలో 70 లక్షల ఓటర్లను కలిపారు
న్యూఢిల్లీ: గత ఏడాది జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు మహారాష్ట్రలో ఉన్న ఓటర్ల సంఖ్య హఠాత్తుగా నవంబర్ నెల వచ్చేసరికి 70 లక్షలు పెరిగిందని లోక్‌సభలో విపక్షనేత రాహు ల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా సోమవారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమగ్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అదే రాష్ట్రంలో జూన్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ ఉన్న ఓటర్ల సంఖ్యకు నవంబర్‌లో ఎలా 70 లక్షల ఓటర్లు పెరుగుతారు?. గత ఐదేళ్లలో పెరిగిన ఓట్ల కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ. మొత్తం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల సంఖ్యకు సమాన స్థాయిలో ఓటర్లను కలిపారు. ఇందులో మతలబు ఏంటో కేంద్ర ఎన్నికల సంఘం తేల్చాలి. ఈసీ దీనిపై స్పష్టతనివ్వాలి’’అని రాహుల్ డిమాండ్‌చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత షిర్డీలోని ఒక భవంతి అడ్రస్‌తో దాదాపు 7,000 ఓట్లను కలిపారని రాహుల్ చెప్పారు. -
రాహుల్‌గాంధీకి జైశంకర్ కౌంటర్
న్యూఢిల్లీ:తనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో విమర్శలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు తాను అమెరికా వెళ్లడంపై రాహుల్ సోమవారం(ఫిబ్రవరి3) లోక్‌సభలో చేసిన వ్యాఖ్యల పట్ల జైశంకర్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ చేసిన ఆరోపణలను ఖండించారు.ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు గతేడాది డిసెంబరులో జైశంకర్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.‘డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని అమెరికాను కోరేందుకు జైశంకర్ వెళ్లి ఉంటారు. ఆహ్వానం కోసం మూడు నుంచి నాలుగు సార్లు ఆయనను అక్కడి పంపారు’అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై విదేశాంగ మంత్రి జైశంకర్ మండిపడ్డారు.రాహుల్ గాంధీ చెప్పేదంతా అవాస్తవమని కొట్టిపారేశారు.తన అమెరికా పర్యటనపై రాహుల్ గాంధీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని,తాను జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లోని సెక్రటరీ,ఎన్ఎస్ఏను కలిసేందుకు అక్కడి వెళ్లానని జైశంకర్ తెలిపారు.ప్రధాని మోదీకి ఆహ్వానం కోసం తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు’అని జైశంకర్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పష్టతనిచ్చారు. -
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం
-
యూపీఏపైనా రాహుల్ విమర్శలు.. లోక్‌సభలో ఆసక్తికర పరిణామం
న్యూఢిల్లీ:ఇటీవల జరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం అంశంపై లోక్‌సభలో రాహుల్‌గాంధీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సోమవారం(ఫిబ్రవరి3) లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్‌గాంధీ మాట్లాడారు. మోదీ ప్రభుత్వానికి దేశ ఆర్థిక వ్యవస్థపై సీరియస్‌నెస్ లేదని విమర్శించారు. ట్రంప్ ప్రమాణస్వీకారానికి మోదీని ఆహ్వానించాలని అడిగేందుకే దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను ముందుగా అమెరికా పంపారని రాహుల్‌గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్‌గాంధీ ఆధారాల్లేని ఆరోపణలు చేయవద్దని మంత్రి కిరణ్ రిజిజు హితవు పలికారు.ఇది రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి అంశమని,ప్రధానమంత్రికి ఆహ్వానంపై ఏది పడితే అది మాట్లాడవద్దని సూచించారు. దీనికి స్పందించిన రాహుల్‌గాంధీ మీ మనశ్శాంతికి భంగం కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. అనంతరం రాహుల్ చైనా ఆక్రమణలపై మాట్లాడారు. భారత్‌లో కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకుందని ప్రధాని మోదీ చెప్పేదానికి,సైన్యం చెప్పేదానికి పొంతన లేదని విమర్శించారు. వెంటనే స్పీకర్ ఓంబిర్లా కలుగజేసుకుని ఆధారాలు లేకుండా ఇలాటి విషయాలు సభలో మాట్లాడడం సరికాదన్నారు.యూపీఏనూ విమర్శించిన రాహుల్‌గాంధీ..యువతకు ఉద్యోగాల కల్పన అంశంపై రాహుల్‌గాంధీ లోక్‌సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన దేశం వృద్ధి చెందుతోంది. అయితే వృద్ధిలో ప్రస్తుతం వేగం తగ్గింది. ఉద్యోగాలు కల్పించే విషయంలో గత యూపీఏ, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వాలు రెండు యువతకు సమాధానం చెప్పలేకపోయాయని రాహుల్ అన్నారు. మేకిన్ ఇండియా మంచిదే అయినప్పటికీ దానితో ఒరిగేది ఏమీ లేదన్నారు. జీడీపీలో తయారీ రంగ వాటా తగ్గిపోయిందని రాహుల్ విమర్శించారు. -
కేజ్రీ యమునా జలం తాగాలి: రాహుల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు సరఫరా చేసే దుర్గంధపూరిత నీరు తాగాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ప్రధాని మోదీ మాదిరిగానే కేజ్రీవాల్ కూడా తప్పుడు హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. హౌజ్ కాజీ చౌక్‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. 2020 అల్లర్ల బాధితులను తరఫున తనతోపాటు తన పార్టీ మాత్రమే మద్దతుగా నిలిచిందని, అణచివేతకు గురయ్యే వారికి ఇకపైనా దన్నుగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రేమ, సోదరభావాన్ని పంచే కాంగ్రెస్ కావాలో విద్వేషాన్ని, హింసను ప్రేరేపించే బీజేపీ కావాలో తేల్చుకోవాలని ప్రజలను ఆయన కోరారు. -
బుల్లి కారులో వచ్చి శీష్‌మహల్ స్థాయికి ఎదిగారు
న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ అబద్ధాలు మాట్లాడుతూ, తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారన్నారు. రాజకీయాలను మారుస్తానంటూ చిన్న కారులో వచ్చిన ఈ వ్యక్తి నేడు వాగన్ ఆర్ కారులో శీష్ మహల్‌కు వెళ్లే స్థాయికి ఎదిగారంటూ మండిపడ్డారు. ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో అధికార నివాసం శీష్ మహల్లో విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసిన ఈయన ఇప్పుడు ఇతర పార్టీలు అవినీతికి పాల్పడ్డాయంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. గత పదేళ్లలో అవినీతిలో మునిగి తేలడం, కాలుష్యాన్ని పెంచడం మినహా ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ చేసిందేమీ లేదన్నారు. సమాజంలో హింసను, విద్వేషాలను బీజేపీ వ్యాపింపజేస్తోందని, తమ కాంగ్రెస్‌పార్టీ మాత్రమే ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని చెప్పారు. తన మంత్రివర్గాన్ని నవ రత్నాలంటూ కేజ్రీవాల్ చెప్పుకుంటున్న వారిలో ఒక్కరూ ఓబీసీ, మైనారిటీ, దళిత, గిరిజన వర్గాలకు చెందిన వారు లేరన్నారు. అందరూ అగ్ర కులాలకు చెందిన వారేనని రాహుల్ చెప్పారు. ‘ఢిల్లీ రాజకీయాల్లో మార్పు తెస్తానమంటూ ప్రకటించుకున్న కేజ్రీవాల్.. అతిపెద్ద మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. యమునా నదిలో మునిగి, యమునా జలాలను తాగుతానని ఐదేళ్ల క్రితం చెప్పిన కేజ్రీవాల్ ఆ విషయం మర్చేపోయారు’అని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి ఢిల్లీ ఎన్నికలు అవకాశవాద పోటీ కాదని చెప్పారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆశయాలను పరిరక్షించే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. మదీపూర్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ బీజేపీపైనా విమర్శలు సంధించారు. సమాజంలో కులాలు, భాషల ప్రాతిపదికన విభేదాలు పెంచి, హింసను బీజేపీ ఎగదోస్తోందన్నారు. ప్రజలను సమస్యల నుంచి మళ్లించేందుకు, సంపదను బడా పారిశ్రామిక వేత్తల ధారాదత్తం చేసేందుకు కుట్రలు పన్నుతోందని చెప్పారు. టాప్ 25 పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన మోదీజీ..ఢిల్లీలోని విద్యార్థులు, చిరు వ్యాపారులు, గృహిణుల రుణాలెన్నిటిని రద్దు చేశారు? అంటూ ప్రశ్నించారు. మోదీ, కేజ్రీవాల్ ఒక్కటే అవినీతి విషయంలో ప్రధాని మోదీ, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇద్దరూ ఒక్కటేనని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ముస్తాఫాబాద్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆమె.. విభేదాలు సృష్టించడమే బీజేపీ నైజమని చెప్పారు. మోదీ రాజ్‌మహల్ గురించి ఆప్ నేతలు మాట్లాడుతుంటే, కేజ్రీవాల్ శీష్ మహల్ గురించి బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, ఈ రెండు పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు తెచ్చేందుకే తప్ప ప్రజలకు రహదారులు, మంచి నీరు, విద్య వంటి వాటి గురించి బీజేపీ మాట్లాడటం లేదని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌కు మోదీకి మధ్య తేడాయేలేదన్నారు. -
యమునలో స్నానమెప్పుడు చేస్తారు
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు యమునా నది కాలుష్యం చుట్టూ తిరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గురువారం యమునా నదిలో విహరిస్తున్న వీడియోను విడుదల చేసి.. ఈ మురికి కాసారంలో ఎప్పుడు స్నానం చేస్తారని అరవింద్ కేజ్రీవాల్‌కు సవాల్ విసిరారు. యమునా కాలుష్యం ప్రధాని నరేంద్ర మోదీ, కేజ్రీవాల్‌ల నిర్లక్ష్యం, అవినీతి ఫలితమేనని రాహుల్ ఆరోపించారు. రాహుల్ బుధవారం యమునా నదిలో విహరించి.. నది దుస్థితిని వీడియో తీశారు. ‘నాలాగా మీరు ఢిల్లీ వాసులైనట్లయితే యమునా నది పరిస్థితిని చూసి తీవ్రంగా విచారిస్తూ ఉంటారు. బుధవారం ఉదయం నేను యమునా నదికి వెళ్లాను. స్థానికులు, పడవలు నడిపేవాళ్లు, ఉద్యమకారులతో మాట్లాడాను. యమునా నదిలో ఎటు చూసినా చెత్తే. మురికినీళ్లే. దుర్వాసన వెదజల్లుతోంది. నీటి శుద్ధి తర్వాత వ్యర్థాలను తిరిగి యమునలోనే వదిలేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. యమునా నదిలో స్నానమాచరించడానికి గతంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్లు. ఇప్పుడు అతికొద్ది మంది మాత్రమే వస్తున్నారు. అదీ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి’అని రాహుల్ అన్నారు. ‘ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యమునను శుద్ధి చేస్తామని కేజ్రీవాల్ శుష్క వాగ్దానాలు చేస్తున్నారు. నేను యమునా నదిలో మునక వేస్తాను లేదంటే మాకు ఓటు వేయకండి అంటూ సుదీర్ఘ ఉపన్యాసాలిస్తున్నారు. ఇప్పుడు యమునా నీటిని ఒక సీసాలో తీసుకొని ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. ఇది యమునా నదిని అవమానించడమే కాదు.. ఢిల్లీ ప్రజలను అపహస్యం చేయడమే’అని రాహుల్ విమర్శించారు. ‘కేజ్రీవాల్ జీ 2025 వచ్చింది. మీరెప్పుడు యమునా నదిలో మునక వేస్తారు. ఢిల్లీ ఎదురుచూస్తోంది’అని రాహుల్ ప్రశ్నించారు. యమున శుద్ధి పేరిట డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపించారు. -
యమున నీటిని తాగే దమ్ముందా?
న్యూఢిల్లీ: యమునా నది నీరు విషపూరితంగా మారుతున్న సంగతి నిజమేనని, ఈ నీటిలో అమ్మోనియం స్థాయి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నది నీటిలో అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉందన్నారు. ఇది కచ్చితంగా విషంతో సమానమేనని అన్నారు. కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు యమునా నది నీటిని ప్రజల సమక్షంలో బహిరంగంగా తాగే దమ్ముందా? అని సవాలు విసిరారు. ఎగువ రాష్ట్రంలో హరియాణాలో ఈ నదిలో విషపదార్థాలు కలుస్తున్నాయని మరోసారి ఆరోపించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం నదిని విషతుల్యం చేస్తోందన్నారు. కేజ్రీవాల్‌కు హరియాణా కోర్టు సమన్లుయమున నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హరియాణా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హరియాణా ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపట్టింది. ఫిబ్రవరి 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ బుధవారం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. యమునా నదిని హరియాణా ప్రభుత్వం విషతుల్యం చేస్తున్నట్లు ఆధారమేంటో చెప్పాలని, నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. -
ఓవైపు గాంధీ పరివార్.. మరోవైపు గాడ్సే పరివార్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో రెండు పరివారాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకటి గాంధీ పరివారం.. మరోటి గాడ్సే పరివారం. గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్‌గాంధీ పోరాడుతున్నారు. గాడ్సే పరివారం నుంచి మోదీ ఉన్నారు. మనమంతా గాంధీ పరివారంగా రాహుల్‌గాందీకి మద్దతుగా నిలవాలి. రాహుల్ నేతృత్వంలో దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి..’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, ఓ యుద్ధమని అభివర్ణించారు. ‘రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడే వారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునే వారికి మధ్య ఈ యుద్ధం జరుగుతోంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ మోదీ రాజ్యాంగాన్ని మార్చే పనిలో ఉన్నారు. గజనీ మహ్మద్ నాడు భారత్‌ను దోచుకునేందుకు యత్నించినట్టు నేడు రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ యత్నిస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు. మోదీ యత్నాలు ముందే గుర్తించిన రాహుల్‌గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. నాడు బ్రిటిషర్ల నుంచి దేశాన్ని మహాత్మాగాంధీ రక్షించినట్టు నేడు బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు ఆయన నిలబడ్డారు. ఈ యుద్ధంలో అందరూ రాహుల్‌గాంధీతో కలిసి నడవాలి. రాజ్యాంగ పరిరక్షణ కోసం కలిసికట్టుగా పోరాడాలి..’ అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నేతాజీపై రాహుల్ గాంధీ పోస్ట్.. ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పశ్చిమ బెంగాల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై తన ఎక్స్ ఖాతాలో ఆయన చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదంగా మారడమే ఇందుకు కారణం. అఖిల భారతీయ హిందూ మహసభ(ABHM) ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జనవరి 23వ తేదీన నేతాజీ జయంతి. ఆరోజున రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అయితే అందులో ఆయన పేర్కొన్న నేతాజీ మరణం తేదీపై ఏబీహెచ్ఎం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు దక్షిణ కోల్‌కతాలోని భవానిపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఎల్గిన్ రోడ్‌లోని నేతాజీ(Netaji) పూర్వీకుల నివాసం వద్ద రాహుల్ పోస్టుకు నిరసనగా అఖిల భారతీయ హిందూ మహసభ ధర్నాకు దిగింది. నేతాజీ తొలుత కాంగ్రెస్‌ను, ఆపై దేశాన్ని విడిచిపెట్టారు. అందుకు ఆ పార్టీ విధానాలే కారణం. ఇప్పుడు రాహుల్ గాంధీ దానిని కొనసాగిస్తున్నారేమో. రాబోయే రోజుల్లో దేశ ప్రజలే ఆయన్ని(రాహుల్‌ను) శిక్షిస్తారు. నేతాజీ జీవితంపై ఎవరైనా వక్రీకరణలు చేస్తే మా స్పందన ఇలాగా ఉంటుంది అని ఏబీహెచ్ఎం హెచ్చరించింది. నేతాజీ అదృశ్యం.. ఆయన మరణం చుట్టూరా నెలకొన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేతాజీ ఆగష్టు 18, 1945న చనిపోయారంటూ రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అయితే.. అదే తేదీన నేతాజీ సైగాన్ నుంచి మంచూరియా వెళ్తున్న క్రమంలో తైహోకూ (ప్రస్తుత తైపాయి) వద్ద ఆ విమానం కూలిపోయిందనే ప్రచారం ఒకటి ఉంది. -
ఢిల్లీ పోస్టర్ వార్‌లో ఆసక్తికర మలుపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఓపక్క ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభల మైకుల గోలతో రాజధాని మారుమోగిపోతోంది. మరోపక్క సోషల్ మీడియాలో పార్టీల పోస్టర్ వార్లు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.నిజాయితీలేని వ్యక్తులందరినీ నిజాయితీపరుడైన కేజ్రీవాల్ మించిపోయారు అంటూ ట్యాగ్‌లైన్ ఉంచింది. ఆ పోస్టర్లో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి, ఢిల్లీ బీజేపీ లీడర్లు ఉన్నారు. అయితే.. రాహుల్ గాంధీ ఫొటోను సైతం ఉంచడంతో అది చర్చనీయాంశమైంది. ఆప్ సర్కార్‌పై, ఆ పార్టీ కన్వీనర్‌పై అరవింద్ కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ గురువారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. షీలా దీక్షిత్ హయాంలోనే ఢిల్లీ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. అయితే.. కేజ్రీవాల్ పాలనలో జరిగిన అభివృద్ధికి ఆమె హయాంలో జరిగిన పనులకు అసలు పొంతనే లేదని అన్నారు. అంతకు ముందు సైతం ఆయన కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.కేజ్రీవాల్ కూడా మోదీ తరహాలోనే తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారని విమర్శించారు. కాలుష్య నివారణ, రాజధాని ద్రవ్యోల్బణం లాంటి విషయాల్లో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. అలాగే.. దళితులను, గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ కీలక నేతలు సైతం ఆప్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్.. కేజ్రీవాల్‌ను దేశ వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. దీంతో.. ఆయన ఫొటోను కూడా తాజా పోస్టర్లో ఉంచారు. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌పై పోటీకి దిగిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కొడుకు) ఫొటోను కూడా ఉంచారు.]మరోవైపు.. బీజేపీ కూడా సోషల్ మీడియాలో ఆప్దా(డిజాస్టర్) సిరీస్ భాగంగా వరుస పోస్టర్లను వదులుతోంది. గూండాలు, నేరస్తులైన ‘‘ఆప్-దా గ్యాంగ్’’కు ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం నేర్పబోతున్నారంటూ తాజాగా మరో పోస్టర్ వదిలింది. ఇండియా కూటమిలో భాగమైన ఆప్ కాంగ్రెస్‌ల మధ్య పోటీ రాజకీయ చర్చకు దారి తీసింది. హర్యానా, ఢిల్లీ.. ఇలా వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య పోటీ తప్పడం లేదు. ఇండియా కూటమి జాతీయ రాజకీయాల వరకు.. అదీ లోక్‌సభ ఎన్నికలకే పరిమితమని కూటమి పార్టీలు స్పష్టత ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిజాయితీ కూడిన పాలనకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఫొటోతో ఆప్ ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీ విషయంలో జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని చెబుతోంది. ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు చోటు అక్కర్లేదని ఆప్ వాదిస్తోంది. అయితే దానికి కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. మొత్తం 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే తేదీన ఫలితాలను ప్రకటించనుంది. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నారు. -
రాహుల్ గాంధీపై పాలవ్యాపారి కేసు
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్‌గాంధీపై బీహార్‌లో ఓ కేసు నమోదు అయ్యింది. ఓ పాలవ్యాపారి తనకు రూ.250 నష్టం వాటిల్లిందని, అందుకే రాహుల్ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణమని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) తాజాగా ఢిల్లీ కోటా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన మాటలతో దిగ్భ్రాంతికి లోనైన ముకేష్ కుమార్ చౌదరి అనే వ్యక్తి.. తన చేతిలో ఉన్న పాలబకెట్ను వదిలేశాడట. దీంతో పాలన్నీ నేలపాలై.. అతనికి నష్టం వాటిల్లిందట!.ఈ షాక్ నుంచి తేరుకుని అతను నేరుగా సమస్తిపూర్(Samastipur) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాహుల్‌గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాహుల్ మాటలతో నేను షాక్‌కి లోనయ్యా. నా చేతిలో ఉన్న బకెట్‌ను వదిలేశా. లీటర్ పాలు రూ.50.. మొత్తం రూ.250 నష్టం కలిగింది. రాహుల్ అలా మాట్లాడతారని అనుకోలేదు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఆయనపై కేసు పెడుతున్నట్లు చెప్పాడతను. దీంతో ఈసారి షాక్ తినడం పోలీసుల వంతు అయ్యింది. చేసేదిలేక.. బీఎన్ఎస్లో పలు సెక్షన్ల ప్రకారం రాహుల్‌పై కేసు నమోదు చేశారు.జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ప్రతీ సంస్థలను బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS)లు స్వాధీనం చేసుకున్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు దేశంతో పోరాడాల్సి వస్తోంది’’ అని అన్నారు. అయితే..‘దేశంతో పోరాటం’ అని వ్యాఖ్యపై దేశం నలుమూలల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడగా.. ఆయన దేశంలోని వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ సమర్థించింది.ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే అసోం(Assam) రాజధాని గౌహతిలో మోంజిత్ చెటియా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రాహుల్ గాంధీ రేకిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు ఆయన పాల్పడినట్లు అందులో ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీకి ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో జార్ఖండ్‌లోని చైబాసా పట్టణంలో బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన హంతకుడు అని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమిత్ షా పరువుకు నష్టం కలిగించేలా రాహుల్ మాట్లాడారని ఆరోపించారు. రాహుల్‌పై పరువునష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని రాహుల్ గాం«దీని రాంచీలోని మెజిస్టీరియల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఆయన తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జార్ఖండ్ ప్రభుత్వానికి, బీజేపీ నేత నవీన్ ఝాకు నోటీసు జారీ చేసింది. రాహుల్ దాఖలు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కింది కోర్టులో రాహుల్‌పై విచారణ నిలిపివేయాలని తేల్చిచెప్పింది. రాహుల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. -
‘ఇదేమి దుస్థితి.. వందలాది మంది రోగులు ఫుట్‌పాత్‌పైనే..’
ఢిల్లీ: ‘వారికి అత్యంత ఖరీదైన వైద్యం(high-quality healthcare) చేయించుకునే స్థోమత లేదు. నాణ్యమైన వైద్యం చేయించుకునేందుకు వారి స్థాయి సరిపోవడం లేదు. అందుకే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలోని వందలాది మంది రోగులు రోడ్లపైనే ఉంటున్నారు. ఫుట్‌పాత్‌లే వారికి దిక్కు అవుతున్నాయి.’ అని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖా మాత్యులు జేపీ నడ్డాకు, ఢిల్లీ సీఎం అతిషికి లేఖ రాశారు రాహుల్ గాంధీ.‘ ఢిల్లీలోని ఎయిమ్స్(AIIMS) దగర్గ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ బయట చూస్తే వందలాది మంది రోగులు ఫుట్‌పాత్‌లపైనే ఉంటున్నారు. ఈ దుస్థితి ఎందుకొచ్చిందనేది ఆలోచన చేస్తే కోట్ల మంది ప్రజలకు మెరుగైన వైద్యం చేయించుకునే పరిస్థితి దేశంలోలేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ వంటి మహా నగరంలో ఎయిమ్స్ వంటి ప్రముఖ ఆస్పత్రికి అధిక భారంగా మారింది. దేశంలో హెల్త్ సిస్టమ్ మారాలి. అందుకే కేంద్ర హెల్త్ మినిస్టర్.జేపీ నడ్డాకు విన్నవించుకుంటున్నా. హెల్త్ సిస్టమ్‌లోని లోపాల్ని గుర్తించండి, మొదటిగా దేశంలోన ఉన్న ఎయిమ్స్ ఆస్పత్రిల్లో పరిస్థితిని చక్కదిద్దండి. ఎంత తొందరగా ఆ సమస్యను పరిష్కారిస్తానే ఇక్కడ ముఖ్యం. వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలు బలోపేతం కావాలి. ఇది అన్నిస్థాయిల్లోనూ జరగాల్సిన అవశ్యకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయండి’ అని రాహుల్ పేర్కొన్నారు.రాహుల్ ‘వైట్ టీ–షర్ట్’ ఉద్యమం కాంగ్రెస్ అగ్రనేత (రాహుల్ గాంధీ సామాన్యులకు హక్కుల సాధనే లక్ష్యంగా ఆదివారం వైట్ టీ–షర్ట్’ఉద్యమం ప్రారంభించారు. తన ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఆదివారం ‘ఎక్స్’లో..‘ఆర్థిక న్యాయం కోరుకునే వారు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నిరసించేవారు, సామాజిక సమానత్వం కోసం పోరాడేవారు, అన్ని వివక్షలను వ్యతిరేకించేవారు, దేశంలో శాంతి స్థిరతలను కోరుకునే వారు తెల్ల టీ–షర్ట్‌లను ధరించండి. ఉద్యమంలో పాల్గొనండి’అని కోరుతూ ఓ వీడియో షేర్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలు, ఉద్యోగులను పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వం దృష్టంతా కేవలం కొందరు పెట్టుబడిదారులను మరింత ధనవంతులను చేయడంపైనే ఉంది. అందుకే, అసమానతలు పెరుగుతూ పోతున్నాయి. తమ రక్తం, స్వేదంతో దేశం కోసం కృషి చేస్తున్న సామాన్యుల పరిస్థితి మరింత దిగజారుతోంది. -
న్యాయం, సమానత్వం కోసం.. రాహుల్ ‘వైట్ టీ–షర్ట్’ ఉద్యమం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత (Rahul Gandhi)రాహుల్ గాంధీ సామాన్యులకు హక్కుల సాధనే లక్ష్యంగా ఆదివారం , (white T-shirt)‘వైట్ టీ–షర్ట్’ఉద్యమం ప్రారంభించారు. తన ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఆదివారం ‘ఎక్స్’లో..‘ఆర్థిక న్యాయం కోరుకునే వారు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నిరసించేవారు, సామాజిక సమానత్వం కోసం పోరాడేవారు, అన్ని వివక్షలను వ్యతిరేకించేవారు, దేశంలో శాంతి స్థిరతలను కోరుకునే వారు తెల్ల టీ–షర్ట్‌లను ధరించండి. ఉద్యమంలో పాల్గొనండి’అని కోరుతూ ఓ వీడియో షేర్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలు, ఉద్యోగులను పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వం దృష్టంతా కేవలం కొందరు పెట్టుబడిదారులను మరింత ధనవంతులను చేయడంపైనే ఉంది. అందుకే, అసమానతలు పెరుగుతూ పోతున్నాయి. తమ రక్తం, స్వేదంతో దేశం కోసం కృషి చేస్తున్న సామాన్యుల పరిస్థితి మరింత దిగజారుతోంది. వారు అనేక అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురి కావాల్సి వస్తోంది’అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఇటువంటి పరిస్థితుల్లో, వారికి న్యాయం, హక్కులు దక్కేందుకు గట్టిగా నినదించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఇందుకు వైట్ టీ–షర్ట్ ఉద్యమం చేపట్టామన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనాలనుకునే వారు, ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కావాలనుకునే వారు https://whitetshirt.in/home/hin అనే లింకును తెరవాలని, లేదా 9999812024 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని ఆయన కోరారు. -
కూలదోయబోయి కూలబడ్డారు
పట్నా: వరుసగా రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచామన్న విజయగర్వంతో రాజ్యాంగాన్నే కూలదోసే సాహసంచేసి, మూడోసారి మెజార్టీ తగ్గడంతో మళ్లీ రాజ్యాంగం వద్ద ప్రధాని మోదీ ప్రణమిల్లారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. శనివారం పట్నాలోని చరిత్రాత్మక సదాఖత్ ఆశ్రమం వద్ద గాందీజీ విగ్రహం వద్ద నివాళులర్పించాక పార్టీ కార్యకర్తలతో ‘కార్యకర్తా సమ్మేళన్’తర్వాత ‘సంవిధాన్ సురక్షా సమ్మేళన్’సభల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రతిని చేతబట్టుకుని ప్రసంగించారు. ‘‘మూడో సా రి కూడా మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టి ఉంటే ఈ రాజ్యాంగాన్ని కూలదోసేవారు. కానీ విపక్షాలు ఐక్యంగా పోరాడటంతో ఆయన కల లు కలగానే మిగిలిపోయాయి. 400పార్ నినాదాన్ని ఓటర్లు దారుణంగా తిరస్కరించడంతో మెజారిటీ తగ్గిపోయి మోదీ మళ్లీ రాజ్యాంగం వద్ద సాగిలపడ్డారు’’అని రాహుల్ అన్నారు. దీంతో అక్కడున్నవాళ్లంతా గొల్లున నవ్వారు. 543 సీట్లున్న లోక్‌సభలో 400కుపైగా సీట్లొస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని పలువురు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు ఎన్డీఏ కూటమి భారీ విజయశాతాన్ని తగ్గించేసిన సంగతి తెల్సిందే. ‘‘బుద్ధుడు, అంబేడ్కర్, నారాయణ గురు, మహాత్మా ఫూలేవంటి ఎందరో ప్రముఖుల ప్రగతిశీల భావనల నుంచే రాజ్యాంగం ఆవిర్భవించింది’’అని రాహుల్ అన్నారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రాహుల గాంధీ
-
జెండాకు నమస్కరించని వారు దేశం గురించి మాట్లాడతారా?: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నూతన కాంగ్రెస్(congress Office) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ కార్యాలయ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) పార్టీ జెండా ఎగురవేశారు. ఆరు అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఇక, కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul Gandhi) మాట్లాడుతూ.. దేశాన్ని విచ్చిన్నం చేసే వారిని ఆపగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. జాతీయ జెండాకు నమస్కరించరని వారు దేశం గురించి మాట్లాడుతున్నారు. స్వాతంత్ర్య పోరాటాన్ని కించపరిచే విధంగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో పోరాడుతూనే ఉంటాం. బ్రిటీష్ వారితో పోరాడిన యోధులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ భవనం ప్రతీ కార్యకర్తకు చెందుతుంది. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "The Constitution was essentially attacked yesterday by Mohan Bhagwat when he said that the Constitution was not the symbol of our freedom, but also after that, thousands of our workers died in Punjab, Kashmir,… pic.twitter.com/ghK13PDOk2— ANI (@ANI) January 15, 2025ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ భవనంలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులోనే కాంగ్రెస్ కార్యకలాపాలు నిర్వహించింది. 1978 నుంచి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా ఉంది.9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. కోట్లా మార్గ్‌కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా.. అక్బర్ రోడ్డు నుంచి కూడా కార్యకలాపాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2008లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. అనంతరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకున్నారు. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం మొదలు పెట్టారు. 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం సాగింది.#WATCH | Congress MP Sonia Gandhi inaugurates 'Indira Bhawan', the new headquarters of the party in Delhi Congress president Mallikarjun Kharge, MP Rahul Gandhi and other prominent leaders of the party also present pic.twitter.com/9X7XXNYEOn— ANI (@ANI) January 15, 2025 -
ఈ నెల 27న రాష్ట్రానికి ఖర్గే, రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఈనెల 27వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలు రాష్ట్రానికి వచ్చే అవకాశముందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహించనున్న జైబాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సంవిధాన్ బచావో బహిరంగ సభకు వీరు హాజరవుతారని చెప్పారు. ఈనెల 27న వీలుకాకుంటే వచ్చే నెల మొదటి వారంలో ఖర్గే, రాహుల్‌లు వస్తారని అన్నారు.శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన ఇష్టాగోష్టి మాట్లాడుతూ, ఈనెలాఖరుకల్లా మిగిలిన కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తి చేస్తారని, ఈ మేరకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. దీంతో పాటు పార్టీ కార్యవర్గాన్ని కూడా ఈ నెలాఖరుకు ప్రకటిస్తామని చెప్పారు. ఈసారి టీపీసీసీకి ముగ్గురు లేదా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారని, ఎంతమందికి ఆ పదవి ఇవ్వాలన్న విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కూడా మారుస్తామని, సమర్థులైన నాయకుల కోసం చూస్తున్నామని చెప్పారు.పార్టీ కార్యవర్గం నియామకంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏం మాట్లాడారన్నది పరిశీలించాల్సి ఉందని, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నుంచి త్వరలోనే చేరికలుంటాయని, ఎమ్మెల్యేలు కూడా చేరతారని మహేశ్‌గౌడ్ వెల్లడించారు. ఈనెల 14వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నామని, 15వ తేదీన ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటామన్నారు. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్
పుణే: హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలెదుర్కొంటున్న కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిలిచ్చింది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం రాహుల్ వర్చువల్‌గా హాజరు కావడంతో ఎంపీ/ ఎమ్మె ల్యేల ప్రత్యేక కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ జోషి ఈ మేరకు కోర్టుకు ష్యూరిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 18వ తేదీన తదుపరి విచారణ ఉంటుందని, ఈ కేసులో ప్రత్యక్షంగా రాహుల్ హాజరయ్యే అవసరం లేకుండా కోర్టు మినహాయింపు ఇచ్చిందని లాయర్ మిలింద్ చెప్పారు.ఇదీ చదవండి: కోల్డ్ కాఫీ చేసిన రాహుల్ గాంధీ, వైరల్ వీడియో -
కోల్డ్ కాఫీ చేసిన రాహుల్ గాంధీ, వైరల్ వీడియో
కాంగ్రెస్ నాయకుడు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకు సంబంధించి ఒక వీడియో నెట్టింట సందడిగా మారింది. ఏ ప్రదేశానికి వెళ్లినా, ఏ మీటింగ్‌కు హాజరైనా జనంతో మమేకం కావడం రాహుల్ గాంధీకి బాగా అలవాటు. అలా ఇటీవల కాఫీ చైన్‌ను సందర్శించిన సందర్భంగా, స్వయంగా కోల్డ్ కాఫీ తయారు చేశారు. కెవెంటర్స్ స్టోర్‌ను సందర్శించి అక్కడ కోల్డ్ కాఫీ తయారు చేసిన అనుభవాన్ని సోషల్ స్వయంగా రాహుల్ గాంధీ మీడియాలో పంచుకున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక పాపులర్ కాఫీ షాప్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు, సిబ్బందితో సంభాషించారు. కొత్త తరం, కొత్త మార్కెట్ కోసం మీ లెగసీ బ్రాండ్‌ను ఎలాంటి మార్పులు తీసుకొస్తారు అని అడిగినపుడు కెవెంటర్స్ యువ వ్యవస్థాపకులు తన కొన్ని విలువైన విషయాలను పంచుకున్నారని తెలిపారు. అక్కడున్న అభిమానులతో సెల్ఫీలకు ఫోజులిచ్చారు. రాహుల్ దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. (లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్డేట్ ఇదే!)కెవెంటర్స్ సిబ్బంది కోల్డ్ కాఫీ ఎలా తయారు చేస్తారో చూడాలనుకుంటున్నారా అని అడిగి మరీ కోల్డ్ కాఫీ తయారీ గురించి వివరించేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే “లేదు,లేదు.. నేను తయారు చేస్తాను’’ అంటూ తానే చేస్తానని రాహుల్ ముందుకు రావడం విశేషం. స్టోర్ సిబ్బంది సూచనలతో దాన్ని తయారుచేసి కస్టమర్‌కు అందించడం ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాదు కెవెంటర్స్ నిజాయితీగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారంటూ కితాబిచ్చారు. తరతరాలుగా మన ఆర్థిక వృద్ధికి ఊతమిస్తున్నఇలాంటివారికి మద్దతివ్వాలని పేర్కొన్నారు రాహుల్. ఇదీ చదవండి: బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!కెవెంటర్స్ సహ వ్యవస్థాపకులు అమన్ అరోరా ,అగస్త్య దాల్మియాతో వారి వ్యాపారం ,విస్తరణ ప్రణాళికల గురించి కూడా మాట్లాడారు. ఇపుడు తమ దృష్టిని టైర్ 2, టైర్ 3 ,టైర్ 4 నగరాలపై కేంద్రీకరిస్తున్నామని తెలిపారు.How do you shake up a legacy brand for a new generation and a new market?The young founders of Keventers shared some valuable insights with me recently.Play-fair businesses like Keventers have driven our economic growth for generations. We must do more to support them. pic.twitter.com/LSdiP8A9bQ— Rahul Gandhi (@RahulGandhi) January 9, 2025కాగా కెవెంటర్స్ సంస్థ ఇటీవలే వందేళ్లు పూర్తిచేసుకుంది. ఇటీవల కంపెనీ వాఫ్ఫల్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇవి భారతదేశం అంతటా 170 కి పైగా ప్రత్యేకమైన రిటైల్ బ్రాండ్ షాపులలో అందుబాటులో ఉన్నాయి. రూ. 99 ప్రారంభ ధరకు, కెవెంటర్స్ వాఫ్ఫల్స్ ఆరు ప్లేవర్లలో లభిస్తాయి. క్లాసిక్ హనీ బటర్, లోటస్ బిస్కాఫ్, కిట్ కాట్ క్రంచ్, నుటెల్లా, ట్రిపుల్ చాక్లెట్ . వైట్ చాక్లెట్. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
మన్మోహన్సింగ్ను ఎన్డీఏ అవమానించింది: రాహుల్
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్(Manmohan Singh) అంత్యక్రియల వేళ ఆయన్ను బీజేపీ తీవ్రంగా అవమానించిందని ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శించారు. దేశానికి పదేళ్ల పాటు విలువైన సేవలందించిన ఆయన్ను బీజేపీ నేతృత్వంలోని(BJP-Led NDA) ఎన్డీఏ అవమానించిన తీరు బాధాకరమన్నారు. మన్మోహన్ అంత్యక్రియల్ని నిగమ్ బోధ్ వద్ద నిర్వహించి ఆయన్ని అవమానపరిచారన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ లో రాహుల్ విమర్శలు గుప్పించారు.‘మన్మోహన్ భారతదేశానికి ముద్దుబిడ్డ. సిక్కు కమ్యూనిటీకి తొలి ప్రధాని కూడా. పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించారు. ఆయన హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఆర్థికరంగంలో ఒక సూపర్ పవర్‌గా భారతదేశం ఎదగడంలో ఆయన సేవలు వెలకట్టలేనివి. ఆయన విధానాల వల్ల ఇప్పటికీ పేదలకు, వెనుకబడిన వర్గాలకు ఎంతో మేలు చేకూరుతుంది. అటువంటి ఆయన్ను అంత్యక్రియల విషయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అవమానించింది. ఇప్పటివరకు దేశానికి ప్రధానులుగా చేసిన వారికి అంత్యక్రియలు అనేవి అధికారిక శ్మశాన వాటికలో జరిగేవి. దీనివల్ల ప్రధానుల అంతిమ సంస్కరాల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. మరి మన్మోహన్ సింగ్ విషయంలో మాత్రం ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్( Nigam Bodh Ghat)లో నిర్వహించారు. ఇది ఆయన్ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అవమానించినట్లే’ అని ధ్వజమెత్తారు. మన్మోహన్‌సింగ్‌కు స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తేనే ఆయనకు అత్యంత గౌరవం ఇచ్చిన వారమవుతున్నామన్నారు రాహుల్. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్మారక చిహ్నం నిర్మించాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు. भारत माता के महान सपूत और सिख समुदाय के पहले प्रधानमंत्री डॉ मनमोहन सिंह जी का अंतिम संस्कार आज निगमबोध घाट पर करवाकर वर्तमान सरकार द्वारा उनका सरासर अपमान किया गया है।एक दशक के लिए वह भारत के प्रधानमंत्री रहे, उनके दौर में देश आर्थिक महाशक्ति बना और उनकी नीतियां आज भी देश के…— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2024 -
ప్రముఖులతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (ఫొటోలు)
-
తీవ్ర ప్రమాదంలో రాజ్యాంగం
బెళగావి: మన రాజ్యాంగం మునుపెన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడం హోం మంత్రి అమి త్ షా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దేశ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ కమి టీ(సీడబ్ల్యూసీ) సమావేశం డిమాండ్ చేసింది. అమిత్ షా చర్య రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్ఎస్ఎస్–బీజేపీలు దశాబ్దాలుగా సాగిస్తున్న కుట్రలో భాగమేనని మండిపడింది. సీడబ్ల్యూసీ సమావేశం గురువారం కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడారు. పెరుగుతున్న ధరలు, అవినీతి, రాజ్యాంగంపై దాడి వంటి వాటిపై పాదయాత్రలు వంటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను 13 నెలలపాటు చేపడతామన్నారు. జవాబుదారీతనం, సమర్థత ప్రాతిపదికగా పారీ్టలో భారీగా సంస్థాగత ప్రక్షాళన చేపడతామని చెప్పారు. అసత్యాలను వ్యాప్తి చేసే వారిపై పోరాటానికి పారీ్టకి 2025 సంస్థాగత సాధికారిత వత్సరంగా ఉంటుందని ఖర్గే తెలిపారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు ప్రాంతీయ, నూతన నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేసి ఏఐసీసీ నుంచి బూత్ స్థాయి వరకు ఎన్నికలు జరుపుతామన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవం కల్పించేందుకు పార్టీ పోరాడుతుందన్నారు. ఖర్గేతోపాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్న ‘నవ సత్యాగ్రహ బైఠక్’ఈ మేరకు రెండు రాజకీయ తీర్మానాలను చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’వంటి విధానాలను తీసుకురావడం ద్వారా సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. న్యాయవ్యవస్థ, ఎన్నిక కమిషన్, మీడియాలను తీవ్ర ఒత్తిడులకు గురిచేసి అనుకూలంగా మార్చుకుంటోంది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాలకు పాలకపక్షం తీవ్ర అవరోధాలు కలిగించింది. పోలింగ్ పత్రాలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేలా ఎన్నికల నిబంధనావళిని మార్చుకుంటోంది’అంటూ సీడబ్ల్యూసీ మండిపడింది. హరియాణా, మహారాష్ట్రలలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సమగ్రత దెబ్బతిందని ఆరోపించింది. మైనారిటీ వర్గం లక్ష్యంగా విద్వేషం, హింసను ప్రభుత్వమే ప్రేరేపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కుల గణనను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఆర్థిక పురోగతి మందగించిందని, అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాలని, ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులివ్వాలని కోరింది. మహాత్ముని ఆశయాలకు భంగం: సోనియా గాంధీ మహాత్మా గాం«దీయే స్ఫూర్తిగా తమ పార్టీ ఇకపైనా కొనసాగుతుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ స్పష్టం చేశారు. మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు, సంస్థలకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీజీ హత్యకు దారి తీసిన విషపూరిత వాతావరణాన్ని సృష్టించిన శక్తులైన మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్లతో పోరాడాలంటూ ఆమె కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం సోనియా ఈ మేరకు సీడబ్ల్యూసీకి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. -
World Year Ender 2024: హద్దులు దాటిన విమర్శలు.. వివాదాల్లో రాజకీయ ప్రముఖులు
2024కు త్వరలో వీడ్కోలు చెప్పబోతున్నాం. 2025ను స్వాగతించేందుకు సిద్ధమవుతున్నాం. ఈ 2024లో మనకు కొన్ని మంచి అనుభవాలతోపాటు చేదు రుచులు కూడా ఎదురయ్యాయి. అదే సమయంలో కొందరు రాజకీయ ప్రముఖలు తమ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలేమిటో, ఆ ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.మల్లికార్జున్ ఖర్గేఈఏడాది కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. ఆయన తన విమర్శల్లో ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లను టార్గెట్‌గా చేసుకున్నారు. ‘భారత్‌లో రాజకీయంగా అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది బీజేపీ, ఆర్ఎస్ఎస్’ అంటూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సాంగ్లీలో జరిగిన బహిరంగ సభలో ఖర్గే వ్యాఖ్యానించారు. ‘అవి విషం లాంటివి. ఆ పాము కాటేస్తే మనిషి చనిపోతాడు. అలాంటి విష సర్పాలను చంపేయాలి’ అని కూడా అన్నారు. ఇదేవిధంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసిన ఖర్గే ఆయనను తైమూర్ లాంగ్‌తో పోల్చారు. 400 సీట్లు ఖాయమనే నినాదం అందుకున్న మోదీ ప్రభుత్వం అటు జేడీయూ, ఇటు టీడీపీల అండదండలపైనే ఆధారపడిందని ఖర్గే విమర్శించారు. అలాగే ప్రధాని మోదీని అబద్ధాల నేత అని కూడా ఖర్గే వ్యాఖ్యానించారు. ఇవి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.లాలూ ప్రసాద్రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన విమర్శలతో ఈ ఏడాది హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఆయన బీహార్ సీఎం నితీష్ కుమార్ చేపట్టిన మహిళా సంవాద్ యాత్రపై విరుచుకుపడ్డారు. దీనిపై జేడీయూ, బీజేపీలు లాలూపై ప్రతివిమర్శలకు దిగాయి. ‘ఇంతకుముందు లాలూజీ శారీరకంగా మాత్రమే అనారోగ్యంతో ఉన్నారని, ఇప్పుడు మానసికంగా కూడా అస్వస్థతకు గురయ్యారని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి విమర్శించారు. నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా లాలూ చేసిన వ్యాఖ్యానాలు చాలా అసహ్యకరమైనవి, అవమానకరమైనవని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు.రాహుల్ గాంధీరాహుల్ తన విదేశీ పర్యటనల సందర్భంగా భారత్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించే ప్రకటనలు చేశారు. వాషింగ్టన్లో రాహుల్ మాట్లాడుతూ భారత్‌లో మతస్వేచ్ఛ తగ్గుతోందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించినప్పుడే రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి భారతదేశంలో లేదని రాహుల్ మరో కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఇవి పెను రాజకీయ దుమారాన్ని రేపాయి.గిరిరాజ్ సింగ్కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఛత్ పండుగ రోజున స్వచ్ఛత గురించి మాట్లాడుతూ సిమ్లాలోని ఒక మసీదు వివాదంపై వ్యాఖ్యానించారు. ఇవి తీవ్ర దుమారాన్ని రేపాయి. మనం ఐక్యంగా ఉంటే మహ్మద్ ఘోరీ, మొఘల్ లాంటివారెవరూ మనల్ని ఓడించలేరని కూడా గిరిరాజ్ సింగ్ అన్నారు.ఇల్తిజా ముఫ్తీఇల్తిజా ముఫ్తీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె. ఆమె ‘హిందుత్వం’ను ఒక వ్యాధిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇల్తిజా ముఫ్తీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియోను పోస్ట్ చేసి, ఈ వివాదానికి తెరలేపారు.సామ్ పిట్రోడాలోక్సభ ఎన్నికల సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఉత్తర భారత్‌లోని ప్రజలు తెల్లగా కనిపిస్తారని, తూర్పు భారత్‌లోని వారు చైనీయులుగా కనిపిస్తారని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. అలాగే దక్షిణ భారత్ ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని, పశ్చిమ భారతదేశ ప్రజలు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారన్నారు. సామ్ ప్రకటనపై దుమారం రేగడాన్ని చూసిన కాంగ్రెస్ వీటికి దూరంగా ఉంది. ఈ వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంది.భాయ్ జగ్తాప్కాంగ్రెస్ నేత భాయ్ జగ్తాప్ గతంలో ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూ ‘ఎన్నికల కమిషన్ ఒక కుక్క.. ప్రధాని మోదీ బంగ్లా బయట కూర్చుని కాపలా కాస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటైన ఏజెన్సీలన్నీ ఇప్పుడు కీలుబొమ్మలుగా మారాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఈ ఏజెన్సీలు దుర్వినియోగమవుతున్నాయి. వ్యవస్థను ఎలా తారుమారు చేస్తున్నారో దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు తెలియజేస్తున్నాయని’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: World Year Ender 2024: నిత్యం వెంటాడిన మూడో ప్రపంచ యుద్ధ భయం -
పార్లమెంట్ వద్ద తోపులాటలో ఎంపీలకు గాయాలు.. CISF కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: ఇటీవల పార్లమెంట్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ నిరసనల వేళ తోపులాట కారణంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఈ వ్యవహారంపై సీఐఎస్ఎఫ్(CISF) కీలక ప్రకటన చేసింది. ఆరోజున తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదని వెల్లడించింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్ తెలిపారు.పార్లమెంట్ వద్ద తోపులాట వ్యవహారంపై సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీకాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదన్నారు. సెక్యూరిటీలో భాగంగా ఎలాంటి ఆయుధాల కూడా పార్లమెంట్ లోపలికి వెళ్లలేదు. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ఎలాంటి విచారణ జరపడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ భద్రత బాధ్యతలు సీఐఎస్ఎఫ్ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. ఇటీవల బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్ వద్ద కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్లపై పడిపోయారు. దీంతో, ఆయనకు గాయమైంది. అనంతరం, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, తనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul gandhi) తోసేయడం వల్లే గాయపడ్డినట్టు ఆరోపించారు. ఈ ఘటన సందర్బంగా మరో బీజేపీ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్ కూడా గాయపడ్డారు.పరస్పరం పోలీసులకు ఫిర్యాదుపార్లమెంటు ఘటనలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎంపీలపై బీజేపీ బృందం డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా రాహుల్‌పై కేసు నమోదైంది. బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ బృందం ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.ఉభయ సభల్లోనూ వాగ్వాదంఅంతకుముందు.. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ఉభయ సభల్లో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. ఇరు సభల్లో ప్రతిపక్ష సభ్యులు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
ఇదేనా అంబేడ్కర్ వారసత్వం!
అనుకున్నట్టే పార్లమెంటు శీతాకాల సమావేశాలు పరస్పర వాగ్యుద్ధాలతో మొదలై ఘర్షణలతో ముగిశాయి. పార్లమెంటు ముఖద్వారం వద్ద అధికార, విపక్ష సభ్యులు ఒకరినొకరు తోసుకోవటం, ఒకరిద్దరు గాయడటం, పోలీసు కేసుల వరకూ పోవటం వంటి పరిణామాలు అందరికీ దిగ్భ్రాంతి కలిగించాయి. తమ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లు గాయపడ్డారని బీజేపీ అంటున్నది. కాదు... వారే తమను పార్లమెంటులోకి వెళ్లకుండా అడ్డగించారని, ఆ తోపులాటలో కిందపడ్డారని కాంగ్రెస్ చెబుతున్నది. వారు అడ్డగించటం వల్ల తమ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా గాయపడ్డారని, ముగ్గురు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై భౌతికదాడికి పాల్పడ్డారని వివరి స్తున్నది. రెండు వర్గాలూ అటు స్పీకర్‌కూ, ఇటు పోలీసులకూ ఫిర్యాదులు చేసుకున్నాయి. నాగా లాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సభ్యురాలు కోన్యాక్ తనతో రాహుల్ గాంధీ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నదంటున్నారు. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏదో వివాదం రేకెత్తి ఒకరిపైకొకరు లంఘించటం, ఘర్షణపడటం, కుర్చీలు విసురుకోవటం, దుర్భాషలాడుకోవటం రాష్ట్రాల్లో సర్వసాధారణమైంది. కానీ ఇదేమిటి... దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించే అత్యున్నత చట్టసభ ఇంత చట్టుబండలు కావటం ముందూ మునుపూ విన్నామా? సమావేశాల ప్రారంభంలోనే అదానీ వ్యవహారంపై విపక్షాలు పెద్ద రగడ సృష్టించాయి. ఆయనపై అమెరికాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అరెస్టు చేస్తారని వచ్చిన వార్తలు నిజం కావని ప్రముఖ న్యాయవాదులు చెప్పాక అది సద్దుమణిగింది. వివాదాలు ఉండొచ్చు... విధానాల విషయంలో విభేదాలుండొచ్చు. కానీ చట్టసభ అనేది అధి కార, విపక్షాలు ప్రజలకు గరిష్టంగా మేలు చేయటానికి గల అవకాశాలను అన్వేషించే వేదిక. తమ నిర్ణయాల పర్యవసానం గుర్తెరగకుండా పాలకపక్షం ప్రవర్తిస్తున్నప్పుడు విపక్షాలు నిరసన గళం వినిపిస్తాయి. అందువల్ల పాలకపక్షం తనను తాను సరిదిద్దుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అది లేనప్పుడు కాస్త ఆలస్యం కావొచ్చుగానీ... అధికార పక్షానికి ప్రజలే కళ్లు తెరిపిస్తారు. ఇందిరాగాంధీ ఏలుబడిలో ఎమర్జెన్సీ విధించినప్పుడేమైంది? ఆ తర్వాత వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా రద్దుచేసినప్పుడు భంగపాటు తప్పలేదు. ఏకంగా 400 మంది సభ్యుల బలం ఉన్న రాజీవ్‌గాంధీ ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు కూడా ఆయనకు చేదు అను భవాలే ఎదురయ్యాయి. 2020లో వచ్చిన సాగుచట్టాలు కూడా ఎన్డీయే సర్కారు ఉపసంహరించు కోక తప్పలేదు. ఏ విషయంలోనైనా తక్షణమే అమీతుమీ తేల్చుకోవాలనుకునే మనస్తత్వం వల్ల ఉన్న సమస్య కాస్తా మరింత జటిలమవుతున్నది. ఇటీవలి కాలంలో చట్టసభలు బలప్రదర్శన వేదికలవు తున్నాయి. సమస్య ఎదురైనప్పుడు దాని ఆధారంగా అవతలి పక్షం అంతరంగాన్ని బయటపెట్టి ప్రజలు గ్రహించేలా చేయటం అనే మార్గాన్ని వదిలి బాహాబాహీ తలపడటం అనేది దుష్ట సంప్రదాయం. అందువల్ల చట్టసభ అంటే సాధారణ పౌరుల్లో చులకన భావం ఏర్పడటం తప్ప సాధించే దేమీ ఉండదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఎవరు అవమానించారు... ఎవరు నెత్తిన పెట్టుకున్నారన్న విషయమై ఏర్పడిన వివాదం కాస్తా ముదిరి పరస్పరం క్రిమినల్ కేసులు పెట్టుకోవటం వరకూ పోవటం విచారకరం. బీజేపీ ఎంపీలు అప్పటికే బైఠాయించిన ప్రధాన ద్వారంవైపునుంచే పార్లమెంటులోకి ప్రవేశించాలని కాంగ్రెస్ అనుకోవటం వల్ల బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి వేరే ద్వారంనుంచి వెళ్లమని భద్రతా సిబ్బంది చేసిన సూచనను రాహుల్ గాంధీ బేఖాతరు చేశారని, పైగా ఇతర సభ్యులను రెచ్చగొట్టారని బీజేపీ ఫిర్యాదు సారాంశం. దేశంలో ఏదో ఒకమూల నిత్యమూ సాగిపోతున్న విషాద ఉదంతాలు గమనిస్తే డాక్టర్ అంబే డ్కర్ నిజమైన వారసులెవరన్న అంశంలో భౌతికంగా తలపడిన రెండు పక్షాలూ సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకపక్క పార్లమెంటులో ఈ తమాషా నడుస్తుండగానే తన పెళ్లికి ముచ్చటపడి గుర్రంపై ఊరేగుతున్న ఒక దళిత యువకుడిపై ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆధిపత్య కులాలవారు దాడిచేసి కొట్టారన్న వార్త వెలువడింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా కులోన్మాదులు చేసిన చర్య కాదు. దశాబ్దాలుగా ఇలాంటి ఘోరాలు సాగుతూనే ఉన్నాయి. తాము ఉపయోగించే బావిలో లేదా చెరువులో దప్పిక తీర్చుకున్నారన్న ఆగ్రహంతో దళితులపై దాడులు చేసే సంస్కృతి ఇంకా పోలేదు. చాలాచోట్ల రెండు గ్లాసుల విధానం ఇంకా సజీవంగా ఉంది. మన రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చర్చిస్తుండగానే... డాక్టర్ అంబేడ్కర్ వారసత్వం గురించి పార్టీలు పోటీపడుతుండగానే వాస్తవ స్థితిగతులు ఇలా ఉన్నాయి.సైద్ధాంతిక విభేదాలను ఆ స్థాయిలో మాట్లాడుకుంటే, ఆరోగ్యకరమైన చర్చల ద్వారా అన్ని విషయాలనూ ప్రజలకు తేటతెల్లం చేస్తే మెరుగైన ఫలితం వస్తుంది. నిజానిజాలేమిటో అందరూ గ్రహిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ తన జీవితకాలమంతా రాజీలేని పోరాటం చేశారు. మెజారిటీ ప్రజానీకం ప్రయోజనాలను దెబ్బతీసే భావాలనూ, చర్యలనూ అడుగడుగునా తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు నిర్వహించారు. అంతేతప్ప అవతలిపక్షంపై హింసకు దిగలేదు. ఆయన వారసత్వం తమదేనంటున్నవారు వాస్తవానికి తమ చర్యల ద్వారా ఆ మహనీయుడి స్మృతికీ, ముఖ్యంగా ఆయన నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగానికీ అపచారం చేస్తున్నామని గుర్తిస్తే మంచిది. -
KSR Live Show: రాహుల్ గాంధీపై కేసు తప్పదా?.. బీజేపీ నేత కిశోర్ కామెంట్స్
-
రాహుల్‌గాంధీపై హత్యాయత్నం కేసు
న్యూఢిల్లీ:లోక్‌సభలో ప్రతిపక్షనేత,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది. గురువారం(డిసెంబర్19) పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ తోయడం వల్లే తమ ఇద్దరు ఎంపీలు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్‌గాంధీపై కేసు పెట్టింది.‘మా పార్టీ రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.దాడి చేయడంతో పాటు దాడికి ప్రేరేపించారని ఫిర్యాదు చేశాం. నిరసన సమయంలో ఏం జరిగిందో ఎంపీలు ఇప్పటికే చెప్పారు’ అని బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.BJP files police complaint against Rahul Gandhi for assault, incitementRead @ANI Story | https://t.co/ls6lEzdYdB#BJP #AnuragThakur #RahulGandhi #policecomplaint pic.twitter.com/sMqjgPbEvL— ANI Digital (@ani_digital) December 19, 2024 ‘రాహుల్ వైఖరి ఆమోదయోగ్యమైందికాదు.అలాగే నేరపూరితమైంది కూడా. అందుకే ఈ రోజు మేమంతా ఆయనపై ఫిర్యాదు చేశాం.పార్లమెంట్‌లోకి శాంతియుతంగా వెళ్లేందుకు భద్రతా సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించారు. ఆ దారిలో వెళ్లాలని పదేపదే అభ్యర్థించారు. కానీ రాహుల్ మాత్రం ఆ అభ్యర్థనను తిరస్కరించారు’ అని మరో ఎంపీ బన్సూరీ స్వరాజ్ చెప్పారు.అమిత్ షా వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే: రాహుల్‌గాంధీ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ రాహుల్‌గాంధీపై ఈ ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. అలాగే అదానీ అంశంపై చర్చ వారికి ఇష్టం లేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఖర్గే,రాహుల్‌గాంధీ గురువారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. -
రాహుల్ అనుచితంగా ప్రవర్తించారు: మహిళా ఎంపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై నాగాలాండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్నాన్ కొన్యాక్ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ బయట గురువారం(డిసెంబర్19) జరిగిన నిరసనల్లో తనకు రాహుల్ అత్యంత దగ్గరగా వచ్చి అసౌకర్యానికి కారణమయ్యారని ఆరోపించారు. గట్టిగా అరుస్తూ తనకు అత్యంత సమీపంలోకి వచ్చి తనతో అనుచితంగా ప్రవర్తించారని, ఇది తనను అసౌకర్యానికి గురి చేసిందని ఫిర్యాదు అనంతరం ఎంపీ కొన్యాక్ చెప్పారు. కాగా,పార్లమెంట్లో గురువారం గందరగోళం నెలకొంది. అంబేద్కర్‌ను అవమానించి కాంగ్రేస్సేనని బీజేపీ.. కాదు..కాదు బీజేపీ నేతలే రాజ్యాంగ నిర్మాతను అవమానించారంటూ అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు. ఎంపీలు చేట్టిన నిరసనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పార్లమెంట్ సిబ్బంది ఎంపీ సారంగిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో గందరగోళం.. రేపటికి వాయిదా -
పార్లమెంట్ వద్ద గందరగోళం.. ఉభయ సభలు మధ్యాహ్ననికి వాయిదా
Parliament Session Live Updates..👉పార్లమెంట్ వెలుపల గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా. Rajya Sabha adjourned till 2 pm today amid uproar in the House over Union HM Amit Shah's statement in the House on Babsaheb Ambedkar. pic.twitter.com/j4ol3Ix4Ui— ANI (@ANI) December 19, 2024తోపులాట ఇలా జరిగింది.. 👉ఇండియా బ్లాక్, బీజేపీ నేతలు ఒకరిపైపు ఒకరు దూసుకెళ్లారు. నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో గుంపు ఏర్పడటంతో ఒకరినొకరు తోసుకున్నారు. దీంతోనే ఆయన కింద పడిపోయినట్టు తెలుస్తోంది. #WATCH | MPs of INDIA bloc and BJP came to face at the Parliament premises earlier today while carrying out their respective protests over Dr BR Ambedkar.INDIA MPs are demanding an apology and resignation of Union Home Minister Amit Shah over his remarks on Babasaheb Ambedkar… pic.twitter.com/IhryQTbKoQ— ANI (@ANI) December 19, 2024 పార్లమెంట్ వద్ద తోపులాట.. బీజేపీ ఎంపీకి గాయంపార్లమెంట్ బయట కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది.ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగీ కింద పడిపోయారు. దీంతో, ఆయనకు కంటి వద్ద గాయమై స్వలంగా రక్తం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా బీజేపీ ఎంపీ సారంగి మాట్లాడుతూ.. తనను కాంగ్రెస్ నేత రాహుల్ తోసివేసినట్టు చెప్పారు. రాహుల్ కారణంగానే తాను గాయపడినట్టు ఆరోపించారు. #WATCH | Delhi | BJP MP Pratap Chandra Sarangi says, "Rahul Gandhi pushed an MP who fell on me after which I fell down...I was standing near the stairs when Rahul Gandhi came and pushed an MP who then fell on me..." pic.twitter.com/xhn2XOvYt4— ANI (@ANI) December 19, 2024అనంతరం, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను పార్లమెంట్ లోపలికి వెళ్లే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నన్ను లాగే ప్రయత్నం జరిగింది. అనంతరం, లోపులాట చోటుచేసుకుంది. #WATCH | Lok Sabha LoP Rahul Gandhi says, "This might be on your camera. I was trying to go inside through the Parliament entrance, BJP MPs were trying to stop me, push me and threaten me. So this happened...Yes, this has happened (Mallikarjun Kharge being pushed). But we do not… https://t.co/q1RSr2BWqu pic.twitter.com/ZKDWbIY6D6— ANI (@ANI) December 19, 2024 లోక్‌సభ వాయిదాpic.twitter.com/Ng1cxNL4oI— LOK SABHA (@LokSabhaSectt) December 19, 2024రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేడ్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు చేసిన ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదాపడ్డాయి.పార్లమెంటు వద్ద బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలుపార్లమెంటు వద్ద బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటాపోటీ నిరసనలు కొనసాగుతున్నాయి.రాజ్యసభలో అంబేద్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన కాంగ్రెస్అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక తదితరులుకాంగ్రెస్ పార్టీనే అంబేడ్కర్‌ను అవమానించిందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీల నిరసన#WATCH | Delhi | INDIA bloc holds protest march at Babasaheb Ambedkar statue in the Parliament complexThey will march to Makar Dwar, demanding an apology and resignation of Union Home Minister Amit Shah over his remarks on Babasaheb Ambedkar in Rajya Sabha. pic.twitter.com/4cmM90DWpY— ANI (@ANI) December 19, 2024 #WATCH | Delhi: BJP MPs protest in Parliament, alleging insult of Babasaheb Ambedkar by Congress party. pic.twitter.com/HRF2UFfucd— ANI (@ANI) December 19, 2024శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇంకా బీజేపీ చేసేదేమీ లేదు. అమిత్ షా దేశానికి హోంశాఖ మంత్రి. అంబేద్కర్‌పై అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయన అంబేద్కర్‌కు క్షమాపణలు చెప్పడం నేరమేమీ కాదు కదా?. అంబేద్కర్‌ది దేవుడి లాంటి వ్యక్తిత్వం. దేశంలోని వెనుకబడిన వారికి గౌరవం అందించిన వ్యక్తి. అంబేద్కర్ విషయంలో అమిత్ షా తప్పుడు పదాలు ఉపయోగించారు. కాబట్టి క్షమాపణ చెప్పాల్సిందే. #WATCH | Shiv Sena (UBT) leader Sanjay Raut says, "BJP has no work left. BJP is a party which is sitting idle. Amit Shah is the Home Minister of the country. If he has made a mistake, if there was a slip of the tongue, he should apologise. There is no crime in apologising over Dr… https://t.co/JdVCWRpk0k pic.twitter.com/OTojRiNotq— ANI (@ANI) December 19, 2024 -
‘అమిత్‌షా క్షమాపణలు చెప్పాల్సిందే’
ఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో భారత రాజ్యాంగం పై చర్చ రెండు రోజుల పాటు చర్చ జరిగింది. మంగళవారం జరిగిన చర్చ సమయంలో అమిత్‌షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ అంబేద్కర్ పేరును వినియోగించుకోవడం 'ఫ్యాషన్'గా మారిందని అన్నారు. అంబేద్కర్,అంబేద్కర్ అని జపం చేస్తున్నారు. బదులుగా దేవుడి పేరు తలుచుకుంటేనైనా పుణ్యం వస్తుంది. స్వర్గానికి వెళ్లొచ్చని విరుచుకు పడ్డారు. "अभी एक फैशन हो गया है- अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर, अंबेडकर..इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता."अमित शाह ने बेहद घृणित बात की है. इस बात से जाहिर होता है कि BJP और RSS के नेताओं के मन में बाबा साहेब अंबेडकर जी को लेकर बहुत नफरत है.नफरत… pic.twitter.com/UMvMAq43O8— Jairam Ramesh (@Jairam_Ramesh) December 17, 2024 అయితే, అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. మనుస్మృతిని విశ్వసించే వారు ఖచ్చితంగా అంబేద్కర్‌తో విభేదిస్తారు' అని ట్వీట్లో పేర్కొన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్‌ను హోంమంత్రి అవమానించడంతో బీజేపీ-ఆర్ఎస్ఎస్ త్రివర్ణ పతాకానికి వ్యతిరేకమని, వారి పూర్వీకులు అశోక్ చక్రాన్ని వ్యతిరేకించారని, సంఘ్ పరివార్ ప్రజలు మనుస్మృతిని అమలు చేయాలనుకుంటున్నారని ఖర్గే అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడి కంటే తక్కువేం కాదు.. ఆయన దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, పేదల దూతగా ఉంటారని చెప్పారు. -
రాహుల్ గాంధీకి ప్రధాని మ్యూజియం లేఖ
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ రాసిన లేఖలను, మరికొన్ని పత్రాలను వెనక్కి ఇచ్చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని, ప్రధానమంత్రి సంగ్రహాలయం కోరింది. సోనియా గాంధీ వాటిని తీసుకెళ్లారని.. వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ మ్యూజియం సభ్యుడొకరు ఆయనకు లేఖ రాశారు.2008 యూపీఏ పాలనలో.. అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అప్పటి పీఎంఎంఎల్(Prime Ministers' Museum and Library) డైరెక్టర్ అనుమతితో ఆ పత్రాలన్నింటిని తీసకెళ్లారు. అయితే వాటిని ఇప్పుడు వెనక్కి ఇవ్వాలంటూ పీఎంఎంఎల్ సభ్యుడు రిజ్వాన్ ఖాద్రి, రాహుల్‌కు లేఖ రాశారు. ఒకవేళ ఒరిజినల్ లేఖలు ఇవ్వడం ఇష్టంలేని తరుణంలో ఫొటోకాపీలు లేదంటే డిజిటల్ కాపీలైనా ఇవ్వాలని కోరారు.అయితే ఈ పత్రాల గురించి నెహ్రూ కుటుంబాన్ని కోరడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మ్యూజియం వార్షిక సమావేశం జరిగింది. అందులో.. నెహ్రూ సంబంధిత లేఖలు, ఇతరత్రా పేపర్లు కనిపించకుండా పోవడంపై చర్చ జరిగింది. చారిత్రకంగా అవి ఎంతో ప్రాధాన్యం పత్రాలుగా అభిప్రాయపడుతూ.. వాటిని ఎలాగైనా వెనక్కి రప్పించాలని పీఎంఎంఎల్ మండలి నిర్ణయించింది. ఈ విషయంలో అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావించింది. ఈ మేరకు.. సెప్టెంబర్‌లో సోనియా గాంధీని కోరుతూ ప్రధాని మ్యూజియం ఓ లేఖ రాసింది. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇప్పుడు రాహుల్ గాంధీకి మరో లేఖ రాసింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న టైంలో పలు కీలక పత్రాలు సైతం.. ఆ సేకరణలో ఉన్నట్లు పీఎంఎంల్ భావిస్తోంది. అలాగే.. ఎడ్విన్ మౌంట్‌బాటెన్, అల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ లాంటి ప్రముఖలతో నెహ్రూకు మధ్య జరిగిన ఉత్తర-ప్రత్యుత్తరాలు ఆ కలెక్షన్స్‌లో ఉన్నాయి.నెహ్రూ దస్తూరితో ఉన్న ఈ లేఖలను 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో(ఇప్పుడదే ప్రధానుల మ్యూజియంగా మారింది) భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో వాటిని సుమారు 51 బాక్సుల్లో సోనియా గాంధీ నివాసానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పీఎంఎంల్ మండలి కాలపరిమితి ఈ నవంబర్లోనే ముగియాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో.. ఆ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగించడం గమనార్హం.ఇదీ చదవండి: ‘తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నెహ్రూ పేరు వాడుకుంటున్నారు’ -
సావర్కర్‌ను ప్రశంసించిన ఇందిరా గాంధీ: బీజేపీ
న్యూఢిల్లీ: సావర్కర్‌పై రాహుల్ గాంధీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. సావర్కర్‌ను ఇందిరాగాంధీ కూడా ప్రశంసించారని పేర్కొంది. సావర్కర్ స్వాతంత్య్ర పోరాటం గురించి తెలియాలంటే అండమాన్‌లోని సెల్యూలార్ జైలును రాహుల్ సందర్శించాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ఎన్డీఏ భాగస్వామి శివసేన (షిండే) ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా లోక్‌సభలో ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘రాహుల్ నాన్నమ్మ ఇందిర కూడా సావర్కర్‌ను భారతదేశపు గొప్ప పుత్రుడంటూ పొగిడారు. సావర్కర్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు’’ అన్నారు. సావర్కర్‌ను కొనియాడుతూ పండిట్ బాఖ్లేకు ఇందిర రాసిన లేఖను సభలో చదివి వినిపించారు. సావర్కర్‌ను ప్రశంసించినందుకు ఇందిర కూడా కాంగ్రెస్ లెక్క ప్రకారం రాజ్యాంగ వ్యతిరేకి అవుతారా అని ప్రశ్నించారు. సావర్కర్‌పై విమర్శలు రాహుల్‌కు అలవాటుగా మారాయని మండిపడ్డారు. -
మనుస్మృతి మద్దతుదారులు!
న్యూఢిల్లీ: ‘‘బీజేపీకి, ఆరెస్సెస్‌కు రాజ్యాంగంపై విశ్వాసం లేదు. అవి కేవలం మనుస్మృతినే చట్టంగా భావిస్తున్నాయి. దానికే మద్దతిస్తున్నాయి’’ అని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ మన దేశం రాజ్యాంగం ఆధారంగానే నడుస్తుంది తప్ప మనుస్మృతి ప్రకారం కాదని తేలి్చచెప్పారు. ‘‘పాలక పక్షానికి సుప్రీం నేత అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శించారు. అందులో భారతీయతే లేదన్నారు. మనుస్మృతి ప్రకారమే దేశం నడవాలని కోరుకున్నారు. ఇప్పుడు బీజేపీ పెద్దలు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం ద్వారా వారి సుప్రీం లీడర్‌ను నవ్వులపాలు చేస్తున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్‌సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో రెండో రోజు శనివారం రాహుల్ పాల్గొన్నారు. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. పేదలను కాపాడుతున్న రాజ్యాంగంపై బీజేపీ నిత్యం దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. బ్రిటిషర్లతో రాజీపడ్డ సావర్కర్ బీజేపీ సుప్రీం లీడర్ సావర్కర్ మాటలతోనే ప్రసంగం ప్రారంభిస్తానని రాహుల్ అన్నారు. ‘‘వేదాల తర్వాత అత్యంత ఆరాధనీయ గ్రంథం మనుస్మృతి అని సావర్కర్ చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు, ఆలోచనలకు మనుస్మృతే ఆధారమన్నారు. మన ఆధ్యాతి్మక, దైవిక మార్గాన్ని అది నిర్దేశించిందని చెప్పారు. మను స్మృతి ఆధారంగానే దేశం నడుచుకోవాలంటూ రచనలు, పోరాటం చేశారు. ఇప్పుడు మీరేమో (బీజేపీ) రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడు తున్నారు. అంటే మీ నాయకుని బోధలకు మద్దతిస్తున్నట్టా, లేదా? మీరు రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడటమంటే సావర్కర్‌ను మీరు అవమానిస్తున్నట్లే. హేళన చేస్తున్నట్టే. కించపరుస్తున్నట్టే. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కూడా సావర్కర్‌ను ప్రశంసించారంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి సావర్కర్ బ్రిటిషర్లతో రాజీపడ్డారని ఇందిర ఆరోపించారు. గాం«దీజీ, నెహ్రూ స్వాతంత్య్ర పోరాటంలో జైలుకెళ్తే సావర్కర్ మాత్రం బ్రిటిషర్లకు క్షమాపణ లేఖ రాసి మరీ జైలు నుంచి బయటపడ్డారని అప్పట్లో ఇందిర విమర్శించారు’’ అని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం కురుక్షేత్ర యుద్ధంలో మాదిరిగా నేడు దేశంలో రెండు పక్షాలు ఇరువైపులా మోహరించాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒకటి రాజ్యాంగాన్ని కాపాడే పక్షం. మరొకటి దాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న పక్షం. మేం ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం. మాకు తమిళనాడులో పెరియార్, కర్ణాటకలో బసవన్న, మహారాష్ట్రలో పూలే, అంబేడ్కర్, గుజరాత్లో గాంధీ ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్‌ను సందర్శించా. సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించా. బాధిత కుటుంబం అవమానంతో ఇంటికి పరిమితమైతే నిందితులేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు. బాధిత కుటుంబం ఇంటికే పరిమితం కావాలని రాజ్యాంగంలో రాసుందా? అది కేవలం మీ (బీజేపీ) పుస్తకంలోనే రాసుంది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం సురక్షితమైన చోటికి మార్చకపోతే మేమే ఆ పని చేస్తాం. సంభాల్ హింసాకాండలో ఐదుగురు అమాయకులు బలయ్యారు. సమాజంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. కులం, మతం, వర్గం పేరిట ప్రజలను విడగొట్టాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.బలహీన వర్గాల బొటనవేళ్లు నరికేస్తున్నారు ‘‘ఏకలవ్యుడు గురుదక్షిణ కింద బొటనవేలు నరికి ద్రోణాచార్యుడికి సమరి్పంచాడు. నేడు మోదీ ప్రభుత్వం యువత, కార్మికులు, వెనుకబడిన తరగతులు, పేదల బొటన వేళ్లను నిస్సిగ్గుగా నరికేస్తోంది. వారి నైపుణ్యాలను, జీవనోపాధిని దెబ్బతీస్తోంది’’ అంటూ రాహుల్ దుయ్యబట్టారు. ‘‘అగి్నపథ్ తెచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. పదవుల భర్తీకి లేటరల్ ఎంట్రీ విధానం తెచ్చారు. పేపర్ లీకేజీలు కొనసాగిస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటున్నారు’’ అని ఆరోపించారు. మోదీ దన్నుతో అదానీ సామ్రాజ్యం దేశంలో కీలక రంగాల్లోకి విస్తరించిందన్నారు. ‘‘మేం అధికారంలోకి వస్తే దేశమంతటా కులగణన నిర్వహిస్తాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తాం’’ అని పునరుద్ఘాటించారు. -
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై దుమారం
-
గాంధీ కుటుంబం రాజ్యాంగాన్ని అవమానించింది: లోక్‌సభలో ప్రధాని మోదీ
Live Updates..రాజ్యాంగంపై చర్చ.. ప్రధాని మోదీ సమాధానంఇవాళ మనం ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నాంరాజ్యాంగ నిర్మాతలతో పాటు దేశ ప్రజలకు ధన్యవాదాలుప్రజాస్వామ్య భావనను 75 ఏళ్లుగా నిలబెట్టుకున్నాంఅందుకు ప్రజలకే మొదట ఘనత దక్కుతుందిభారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందిమనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు.. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు కూడామనది మదర్ ఆఫ్ డెమోక్రసీదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందిత్వరలోనే మూడో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించబోతుందిరాజ్యాంగంలో మహిళలు కీలక ప్రాంత పోషించారువివిధ రంగాలకు చెందిన ఆ మహిళలు రాజ్యాంగ నిర్మాణంలో చాలా ప్రభావశీలంగా పనిచేశారు.భిన్నత్వంలో ఏకత్వం భారత్ ప్రత్యేకతభారతీయుల ఏకతనే రాజ్యాంగం కూడా ప్రస్తావించిందిఆర్టికల్ 370 దేశం ఏకత్వానికి అడ్డుగా నిలిచింది.ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం తల్లి లాంటిందిభారత ప్రజాస్వామ్యం, గణతంత్రం ఎంతో గొప్పదిమన రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది.ఎందరో మహానుభావులు మన రాజ్యాంగాన్ని రచించారు.ప్రజా స్వామ్య దేశాలు భారత్‌ను విశ్వసిస్తున్నాయి.గాంధీ కుటుంబం రాజ్యాంగాన్ని అవమానించింది.కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ నిర్మాతలను అవమానించారుకాంగ్రెస్ ప్రజాస్వామ్యం గొంతు నొక్కిందిప్రజల మద్దతు లేకుండానే గాంధీ కుటుంబం దేశాన్ని పాలించింది. లోక్‌సభలో రాజ్యాంగంపై వాడీవేడీ చర్చ..కాసేపట్లో ప్రతిపక్ష నేతల ప్రశ్నలపై సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోదీపార్లమెంటులో రాజ్యాంగంపై రెండో రోజు కొనసాగుతున్న చర్చరాజ్యాంగ చర్చలో.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 26.. మతపరమైన విద్యాసంస్థల ఏర్పాటు, నిర్వాహణకు వెసులుబాటు కల్పించింది కానీ, ప్రధాని మాత్రం వక్ఫ్ బోర్డుకు రాజ్యాంగంతో ఏమాత్రం సంబంధం లేదని అంటున్నారు. అసలు ఈ ప్రధానికి పాఠాలు నేర్పింది ఎవరు?. ఆయన్ని(ప్రధాని మోదీని ఉద్దేశించి..) ఆర్టికల్ 26 చదవమనండి. వక్ఫ్ ఆస్తులను లాక్కునే కుట్రను కేంద్రం చేస్తోంది #WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, AIMIM MP Asaduddin Owaisi says, "Read Article 26, it gives religious denomination, the right to establish and maintain institution for religious and charitable purposes. The Prime Minister… pic.twitter.com/5KOoRAe6Vm— ANI (@ANI) December 14, 2024 అందుకే కులగణన.. రాజ్యాంగ చర్చలో రాహుల్ గాంధీ50 శాతం రిజర్వేషన్ అనే గోడను మేం బద్ధలు కొడతాంఅందుకే కులగణనని తెరపైకి తెచ్చాంమీరేం చెప్తారో.. చెప్పుకోండిదేశం కోసం రాజ్యాంగం.. ఇండియా కూటమి సిద్ధాంతంరాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ కూటమి ఉందిఆర్థిక-సామాజిక సమానత్వాలు లేకుండా రాజకీయ ఐక్యత మనుగడ కష్టమని అంబేద్కర్ చెప్పారుఇవాళ అదే ప్రతీ ఒక్కరి ముందు కనిపిస్తోందిరాజకీయ సమానత్వం లేకుండా పోయిందిదేశంలోని వ్యవస్థలన్నింటిని గుప్పిట పట్టేశారుసామాజిక, ఆర్థిక సమానత్వాలు లేకుండా పోయాయిదళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, రైతులు, శ్రామికులు.. దేశంలో వీళ్లు(బీజేపీ) ఎవరి బొటనవేళ్లు కత్తిరిస్తున్నారో దేశానికి చూపించాలనుకున్నాంఈ క్రమంలోనే కులగణన మా తదుపరి అడుగు అయ్యిందికులగణనతో భారత్‌లో సరికొత్త అభివృద్ధికి బాటలు వేస్తాంఅలా రాజ్యాంగంలో ఉందా? చూపించండి: రాహుల్ గాంధీకుల, వర్ణ, వర్గ, లింగ.. వివక్ష రహిత సమాజం కొనసాగాలని రాజ్యాంగంలో ఉంది.కొన్నిరోజుల కిందట.. సంభల్ నుంచి కొందరు యువకులు నన్ను చూడడానికి వచ్చారుఅమాయకులైన ఐదుగురు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపబడ్డారుఅలా చంపేయమని రాజ్యాంగంలో రాసి ఉందా?మీరు ఎక్కడికి వెళ్లినా.. ఒక మతంతో మరొక మతానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని వెదజల్లుతారు.హాథ్రస్ సామూహిక అత్యాచార బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించాబాధితులు మాత్రం ఇంటినుంచి బయటకు రాలేని పరిస్థితి.ఒక మతానికి వ్యతిరేకంగా మరో మతాన్ని ఉసిగొల్పాలని, ఒక దళిత కుటుంబాన్ని బంధించాలని నేరాలు చేసిన వాళ్లను స్వేచ్ఛగా తిరిగేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా?రాజ్యాంగంలో అలా ఎక్కడ రాశారు? నాకు చూపించండి.. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తోంది. బీజేపీ మాత్రం దానిపై దాడి చేస్తూనే ఉంది లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంఅగ్నివీర్తో దేశ యువత బొటనవేలు తెంపేశారుదేశవ్యాప్తంగా 70 పేపర్ల లీకేజీ ఘటనలు వెలుగు చూశాయిపేపర్ లీక్‌లతో యువత బొటనవేలు తెంపేశారుఢిల్లీ సరిహద్దులో రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు.. రైతులపై లాఠీ ఛార్జీలు చేస్తున్నారువాళ్లు మిమ్మల్ని కోరేది మద్దతు ధర.. ఆ డిమాండ్ సబబైందేకానీ, అదానీ, అంబానీలను అందలం ఎక్కిస్తూ.. అన్నదాతల బొటనవేలు కూడా తెంపేశారుఅభయ ముద్రతో మేం(కాంగ్రెస్) ‘‘భయపడొద్దు’’ అని ప్రజలకు చెప్తుంటే.. మీరేమో వాళ్ల బొటనవేలు తెంచేస్తున్నారుఇదే మీకు మాకు ఉన్న తేడా! లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంఅనేకమంది మేధావుల లోచనలకు ప్రతిరూపం మన రాజ్యాంగందేశంలో ప్రజలు వివిధ రకాల సిద్ధాంతాలను పాటిస్తారుసావర్కర్ సిద్దాంతాలను తప్పుబట్టిన రాహుల్ గాంధీ మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరించి రాజ్యాంగం ఉండాలని సావర్కర్ విశ్వసించారురాజ్యాంగం, మనుస్మృతి వేర్వేరురాజ్యాంగం ఆధునిక భారత దస్త్రం.. కానీ, ప్రాచీన భారతం, దాని ఆలోచనలు అందులో ఉన్నాయిరాజ్యాంగాన్ని తెరిస్తే.. అంబేద్కర్, గాంధీ, నెహ్రూల ఆకాంక్షలు, ఆలోచనలు మనకు కనిపిస్తాయిసావర్కర్ గురించి ప్రశ్నిస్తే నన్ను దోషిగా చూస్తున్నారుమహాభారతంలోని కులవివక్షను ప్రస్తావించిన రాహుల్ గాంధీఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరకు విలువిద్య నేర్పమని వెళ్లాడునువ్వు మా జాతివాడివి కాదని ఏకలవ్యుడ్ని వెనక్కి పంపాడుద్రోణుడి ప్రతిరూపంతో ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకున్నాడుద్రోణుడు కోరితే తన బొటనవేలును గురుదక్షిణగా ఇచ్చాడుద్రోణుడి మాదిరిగానే మీరు(కేంద్రాన్ని ఉద్దేశించి..) కూడా దేశ యువత బొటనవేలును కత్తిరిస్తున్నారు. #WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, Lok Sabha LoP Rahul Gandhi says, "This is Abhayamudra. Confidence, strength and fearlessness come through skill, through thumb. These people are against this. The manner in which Dronacharya… pic.twitter.com/nIropoeCfq— ANI (@ANI) December 14, 2024#WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, Lok Sabha LoP Rahul Gandhi says, "I want to start my speech by quoting what the Supreme Leader, not of the BJP but of the modern interpretation of the ideas of the RSS has to say about the… pic.twitter.com/eS7HGR8Ivp— ANI (@ANI) December 14, 2024 జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ వ్యతిరేకం: కార్తీ చిదంబరం👉వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. డీఎంకేతో సహా అనేక ప్రాంతీయ పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. సమాఖ్య నిర్మాణాన్ని తీసివేయడానికి ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం ఇది. రాష్ట్ర ఎన్నికలు ప్రజాస్వామ్యానికి చాలా మంచివి. రాష్ట్ర ఎన్నికలు రాజకీయ పార్టీలను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ప్రజలకు అవకాశం ఇస్తాయి అని కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: On One Nation One Election, Congress MP Karti Chidambaram says, "The Congress party will oppose this proposal and many regional parties including the DMK oppose the proposal. It is yet another attempt by the government to take away the federal structure. Having… pic.twitter.com/kK2CfP1KFm— ANI (@ANI) December 14, 2024అలా చేయడం నియంతృత్వమే.. 👉జమిలి ఎన్నికలపై టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ మాట్లాడుతూ..‘1966-68 వరకు ప్రతీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగింది. అందుకే అన్ని ఎన్నికలు కలిసి జరిగేవి. కానీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం ప్రారంభమైన తర్వాత వ్యవస్థ మారిపోయింది. సంకీర్ణాల వల్ల కొన్నిసార్లు ప్రభుత్వం పడిపోతుంది. ఇలాంటి నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవద్దు. ప్రతిపక్షంతో మాట్లాడకుండా దీనిని తీసుకురావడం నియంతృత్వం అవుతుంది.#WATCH | Delhi | On One Nation One Election, TMC MP Kirti Azad says, “Till 1966-68, all the elections used to happen together because the government used to run for 5 years. But then the system changed because coalition governments started forming and sometimes the government… pic.twitter.com/Cjiz5jzSNA— ANI (@ANI) December 14, 2024 👉దేశంలో మైనారిటీలపై జరుగుతున్న అంశం లోక్‌సభలో చర్చకు వచ్చింది.. ఈ సందర్బంగా ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటరిచ్చారు. 👉లోక్‌సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. మన దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని ప్రతిపక్ష నేతలు ఎందుకు అంటున్నారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏ ఒక్క పార్టీ కోసమో చెప్పడం లేదు. నేను దేశం కోసం చెబుతున్నాను.👉యూరోపియన్ యూనియన్‌లోని సెంటర్ ఫర్ పాలసీ అనాలిసిస్ సర్వే ప్రకారం.. యూరోపియన్ యూనియన్‌లో 48% మంది ప్రజలు వివక్షకు గురయ్యారు. అందులో ముస్లింలు, హిందువులు, మైనారిటీలు కూడా ఉన్నారు. స్పెయిన్‌లో ముస్లింలపై వివక్ష ఎక్కువగా ఉంది. ముస్లింలపై అంతర్గత ద్వేషపూరిత నేరాల నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో కూడా పాకిస్తాన్ పరిస్థితి, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న విషయాలను వెల్లడించారు. ఆప్ఘనిస్తాన్ సహా టిబెట్‌లో జరుగుతున్న పరిణామాలను సైతం చెప్పారు. అలాంటప్పుడు ఈ దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని ఎందుకంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. #WATCH | In Lok Sabha, Union Parliamentary Affairs Minister Kiren Rijiju says, "...A narrative is being created. According to the survey of the Center for Policy Analysis in European Union, 48% people in European Union have been victims of discrimination. Most of them are… pic.twitter.com/oqZVtpGLDn— ANI (@ANI) December 14, 2024👉రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఇరుపక్షాల మధ్య మధ్య ఇవాళ లోక్‌సభలో వాడీవేడి చర్చ జరగనుంది. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక చర్చలో ప్రధాని మోదీ- ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ మాట్లాడనున్నారు. 👉లోక్‌సభ చేపట్టిన రెండు రోజుల చర్చలో.. ఇవాళ కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. రాజ్యాంగంపై చర్చలో.. రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నేతలూ మాట్లాడతారు. సాయంత్రం.. ఆఖర్లో ప్రధాని ప్రసంగంతో ఈ చర్చ ముగియనుంది. ఈ క్రమంలో నిన్న ప్రియాంక గాంధీ.. ఇవాళ రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలకు, విమర్శలకు మోదీ స్పందించనున్నారు.👉పార్లమెంట్ వద్ద ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. విపత్తుకు గురైన వయనాడ్‌కు స్పెషల్ ప్యాకేటీ ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. హిమాచల్‌లో కూడా ఇలాంటి విపత్తే సంభవించింది. ఈ మేరకు సాయం కేంద్రాన్ని కోరాం. ఈ మేరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశాం. కానీ, విన్నపాన్ని వారు పట్టించుకోలేదు. విపత్తును కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అక్కడ నివస్తున్న వాళ్లు కూడా భారతీయలే అని కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, "The government is refusing to give a special package to Wayanad. We have requested the Home Minister, we have written to the Prime Minister...Himachal Pradesh has also seen similar large-scale devastation and there is a… https://t.co/mIyBAQipwu pic.twitter.com/7xdie56kHH— ANI (@ANI) December 14, 2024👉తొలిరోజు.. శుక్రవారం బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. 👉ఆయన విమర్శలకు కాంగ్రెస్ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. పార్లమెంట్లో తొలి ప్రసంగం చేసిన ఆమె.. బీజేపీపై ఎదురుదాడి చేశారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు.ఎల్లుండి జమిలి బిల్లు👉సోమవారం లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు వన్ నేషనల్ వన్ ఎలక్షన్ బిల్ వెళ్లనుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా సోమవారం లోక్‌సభ బిజినెస్‌లో లిస్ట్ జమిలి ఎన్నికల బిల్లును చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 82, 83, 172, 327కు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లు రూపకల్పన చేశారు. 👉లోక్‌సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా బిల్లును ప్రతిపాదించారు. మధ్యలో అసెంబ్లీలు రద్దయినప్పటికీ మిగిలిన కాలానికే ఎన్నికల నిర్వహణ జరిగేలా బిల్లులో సవరణలు చేశారు. అసెంబ్లీలు ఉన్న ఢిల్లీ, జమ్మకశ్మీర్, పాండిచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతాల కోసం మరొక సవరణ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. అపాయింటెడ్ డే తర్వాత ఒకే సారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేశారు. 👉ఇదిలా ఉండగా.. అపాయింటెడ్ డే 2029 కంటే ముందే ఉంటుందా? లేదా అనేదానిపై భిన్నమైన చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సహకరిస్తేనే జమిలి ఎన్నికల బిల్లు చట్ట రూపం దాల్చే అవకాశం ఉంది. -
రాజ్యాంగం కన్నా... అధికారమే మీకు మిన్న
న్యూఢిల్లీ: రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య మధ్య వాడీవేడి చర్చకు శుక్రవారం లోక్‌సభ వేదికైంది. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్‌సభ చేపట్టిన రెండు రోజుల చర్చను ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. ఆయన విమర్శలకు కాంగ్రెస్ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. జడ్జి బి.హెచ్.లోయా మృతిపై తృణమూల్ సభ్యురాలు మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. సభలో ఆద్యంతం ఇరుపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. నినాదాలు, అరుపులు, కేకల నడుమ రెండుసార్లు సభ వాయిదా పడింది. జేబులో పెట్టుకోవడమే నైజం రాజ్యాంగాన్ని దేశానికి తానిచి్చన కానుకగా కాంగ్రెస్ భ్రమ పడుతోందని రాజ్‌నాథ్ అన్నారు. రాజ్యాంగ కూర్పులో, అది ప్రవచించిన విలువల పరిరక్షణలో విపక్షాలు, కాంగ్రెసేతర నేతల పాత్రను నిరంతరం తక్కువ చేసి చూపేందుకే ప్రయతి్నంచిందని ఆరోపించారు. 1944లోనే పలువురు దేశభక్త నేతలు స్వతంత్ర హిందూస్తాన్ రాజ్యాంగాన్ని రూపొందించారని నాటి హిందూ మహాసభ ప్రయత్నాలను ఉద్దేశించి రక్షణ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘పండిట్ మదన్మోహన్ మాలవీయ, లాలా లజపతిరాయ్, భగత్‌సింగ్, వీర సావర్కార్ వంటి నాయకులు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాకపోయినా వారి భావజాలాలు రాజ్యాంగంలో అడుగడుగునా ప్రతిఫలిస్తున్నాయి. వారంతా నిత్య స్మరణీయులు. అలాంటి మహా నాయకులపైనా మతవాద ముద్ర వేసిన చరిత్ర కాంగ్రెస్‌ది! రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు, దాని రూపురేఖలనే మార్చేసేందుకు దుస్సాహసం చేసి పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెసే. ఆ లక్ష్యంతోనే తన దశాబ్దాల పాలనలో రాజ్యాంగాన్ని చీటికీమాటికీ సవరిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీ విధింపు మొదలుకుని విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం, ఇందిర సర్కారు నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే పక్కకు తప్పించడం దాకా ఇందుకు ఉదాహరణలన్నో! భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్‌కు చెందిన తొలి ప్రధాని నెహ్రూ కూడా ఏకంగా రాజ్యాంగాన్నే సవరించారు! అలాంటి పారీ్టకి చెందిన వాళ్లు నేడు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘పైగా విపక్ష నేతలు కొందరు కొద్ది రోజులుగా రాజ్యాంగ ప్రతిని జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. చిన్నతనం నుంచీ వారు నేర్చుకున్నది అదే. ఎందుకంటే వారి కుటుంబ పెద్దలు కొన్ని తరాలుగా రాజ్యాంగాన్ని తమ జేబుల్లో పెట్టుకున్న వైనాన్ని చూస్తూ పెరిగారు మరి!’’ అంటూ రాహుల్‌గాంధీ తదితరులను ఉద్దేశించి రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎన్డీఏ సభ్యులు చప్పట్లతో అభినందించగా విపక్ష సభ్యులు ‘సిగ్గు, సిగ్గు’ అంటూ నిరసించారు. -
ఇటు ఎమర్జెన్సీ.. అటు రాజ్యాంగ పరిరక్షణ!
న్యూఢిల్లీ, సాక్షి: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్‌కు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా.. ప్రత్యేక సమావేశాలతో అధికార-ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను వేడెక్కించబోతున్నాయి. ఎన్డీయే సర్కార్ నుంచి రాజ్యాంగాన్ని రక్షించాలంటూ విపక్ష కూటమి.. అలాగే ఎమర్జెన్సీ అంశంతో బీజేపీ.. ఒకరినొకరు కార్నర్ చేసే అవకాశం కనిపిస్తోంది.రాజ్యాంగంపై చర్చ కోసం శుక్రవారం మధ్యాహ్నాం లోక్‌సభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇవాళ, రేపు రాజ్యాంగంపై ప్రజాప్రతినిధుల సభ చర్చించనుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఎన్డీయే కూటమి తరఫున 12 నుంచి 15 మంది ఈ చర్చలో భాగమవుతారని తెలుస్తోంది. ఇందులో జేడీఎస్ అధినేత, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి, బీహార్ మాజీ సీఎం జతిన్ మాంజీ, శివసేన తరఫున శ్రీకాంత్ షిండే (ఏక్నాథ్ షిండే) పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. చివరిరోజు.. అంటే రేపు సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగంతో(సమాధానంతో) ఈ చర్చ ముగియనుంది.స్వతంత్ర భారతావనిలో నూతనంగా రూపొందించిన రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించగా.. 1950 నవంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగానే ఈ చర్చ జరగనుంది. రాజ్యాంగ పరిణామం, ప్రాముఖ్యతతో మొదలయ్యే చర్చ.. రాజకీయ మలుపులు తిరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరనివ్వకుండా ప్రతిపక్షాలు అవాంతరం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ఎన్డీయే.. అలాగే వివిధ అంశాలతో కేంద్రంపై ఇండియా కూటమి పరస్పరం విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.కాంగ్రెస్సే లక్ష్యంగా..లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఆశించిన ఫలితం రాలేదు. ఇండియా కూటమి.. ప్రత్యేకించి కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు దక్కాయి. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మిశ్రమ ఫలితాలే దక్కుతున్నాయి. ఈ పరిణామాలను బీజేపీ సహించలేకపోతోంది. వీటన్నింటికి తోడు.. ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్నే మార్చేస్తుందంటూ సార్వత్రిక ఎన్నికల టైంలో కాంగ్రెస్ విపరీతమైన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంపై చర్చ ద్వారానే కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తాలని మోదీ నేతృత్వంలోని కేంద్రం భావిస్తోంది.ఆర్నెల్ల కిందట.. ఎమర్జెన్సీకి 49 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని ప్రస్తావించి మరీ ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది వారేనని(కాంగ్రెస్‌ను ఉద్దేశించి.. ).. నాడు ఎమర్జెన్సీ విధించి .. నేడు రాజ్యాంగంపై ప్రేమా? అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ ఎలా అణగదొక్కిందో.. ప్రతీ భారతీయుడు గౌరవించే దేశ రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటిరోజులే మనకు గుర్తు చేస్తాయి అంటూ విసుర్లు విసిరిరాయన. దీంతో మరోసారి ఎమర్జెన్సీ అంశం రాజ్యాంగ చర్చలో ప్రస్తావన వచ్చే అవకాశమూ లేకపోలేదు.కౌంటర్‌కి ఇండియా కూటమి రెడీ..రాజ్యాంగంపై చర్చలో భాగంగా.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. విపక్షాల తరఫున.. డీఎంకే నుంచి టీఆర్ బాలు, టీఎంసీ నుంచి మహువా మెయిత్రా-కల్యాణి బెనర్జీ పేర్లు ఖరారు కాగా.. మిగతావాళ్ల పేర్లు వెలువడాల్సి ఉంది. అలాగే రాహుల్ ఇవాళ మాట్లాడతారా? రేపా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఎన్డీయే కూటమి కౌంటర్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. అదానీ అంశం ప్రధానంగా పార్లమెంట్‌ను దద్దరిల్లిపోయేలా చేసింది ఇండియా కూటమి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ చర్చను కేవలం ఆ అంశానికి మాత్రమే పరిమితం చేయొద్దని ఇతర ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. సంభల్ హింసతో పాటు రైతుల నిరనల, మణిపూర్ హింస తదితర అంశాలను కూడా ప్రస్తావించి రాజ్యంగాన్ని రక్షించాలంటూ పార్లమెంట్లో గట్టిగా నినదించాలని భావిస్తున్నయి.అటు పెద్దల సభలోనూ.. ఇవాళ, రేపు దిగువ సభలో మాత్రమే రాజ్యంగంపై చర్చ జరుగుతుంది. ఆదివారం పార్లమెంట్‌కు సెలవు. రాజ్యసభలో సోమ, మంగళవారం ఇదే తరహాలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. ఇప్పటికే మూడు లైన్ల విప్‌ను ఆయా ఎంపీలకు సదరు పార్టీలు జారీ చేశాయి. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ఈ చర్చను ప్రారంభించనున్నారు. -
బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు.. రాహుల్‌పై నిర్మల ఫైర్
ఢిల్లీ: యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తాము చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకు సిబ్బందికి ఫోన్లు చేసి వేధించే వారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం తమ మోసపూరిత మిత్రులకు అపరిమిత వనరుగా ఉపయోగిస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటరిచ్చారు.ఈ క్రమంలో కేంద్ర మంత్రి నిర్మల మాట్లాడుతూ..‘రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడాలి. బ్యాంకుల్లో కష్టపడి పనిచేసే ఉద్యోగులపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలి. ముందుగా ఆయన బ్యాంకింగ్ సెక్టార్‌పై అవగాహన పెంచుకోవాలి. యూపీఏ హయాంలోనే బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను యూపీఏ హయాంలో తమ బంధుమిత్రులు, చీకటి వ్యాపారుల కోసం ఏటీఎంలా ఉపయోగించుకున్నారు. అలాగే, కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకుల సిబ్బందికి ఫోన్లు చేసి మరీ వేధించేవారు. రుణాల ఇవ్వని పక్షంలో వారిని టార్గెట్ చేసేవారు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో బ్యాంకులు, ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయమైన పురోగతి సాధించాయన్నారు. పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. రూ.3.26 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌తో ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసినట్టు చెప్పుకొచ్చారు. అలాగే, కేంద్రంలో బీజేపీ హాయంలోనే 54 కోట్ల జన్‌ధన్ యోజన ఖాతాలు, పీఎం ముద్ర రుణాలు, స్టాండ్-అప్ ఇండియా, పీఎంస్వానిధి వంటి స్కీమ్స్ తీసుకువచ్చినట్టు తెలిపారు. -
‘చేతి’కి ఓటేస్తే.. చేతగాని సీఎంను రుద్దారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు తెలంగాణ ముఖ్యమంత్రి పంపుతున్న మూటలపై ఉన్న శ్రద్ధ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాటలపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. రాష్ట్రంలో చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను ప్రజల నెత్తిన రుద్దారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణను ఆగమాగం చేసిందని, అస్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తోందని ఆరోపించారు. సీఎం మతిలేని నిర్ణయాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రగతిపథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం.. ఇప్పుడు అధోగతి పాలవుతుంటే కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని ఉద్దేశించి కేటీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. లేఖలో కేటీఆర్ పేర్కొన్న అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘విషమే తప్ప విషయం లేని సీఎం చేతిలో ఏడాది పాలనలో తెలంగాణ బతుకు ఛిద్రమవుతున్నా కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర వహిస్తోంది. కాంగ్రెస్‌ను నమ్మితే రైతుకు గోస తప్ప భరోసా లేదని తొలి ఏడాది పాలనలోనే తేలిపోయింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యో గాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులతో ఫొటోలకు పోజులు కొట్టి అడ్రస్ లేకుండా పోయిన మీరు కూడా కాంగ్రెస్ చేసిన మోసంలో భాగస్వాములేనని యువత బలంగా నమ్ముతోంది. ఎన్నికల ప్రచారంలో ఆడబిడ్డలకు అరచేతిలో వైకుంఠం చూపించి నిలువునా మోసం చేశారు. హైడ్రా, మూసీ పేరిట నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేసిన పాపం మీ కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తలుపుతట్టే ఏకైక గడపగా తెలంగాణ భవన్ నిలిచింది. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు అన్నట్టుగా సాగుతున్న మీ పాలన తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాధనాన్ని లూటీ చేసిన సర్కారుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి చరిత్రను లిఖించింది. తెలంగాణ తల్లి దివ్య స్వరూపాన్ని అవమానించి, ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సచివాలయం, అమరవీరుల స్తూపం మధ్య తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో మీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా ప్రతిష్టించారు. రేవంత్ చేసిన కుటిల చర్యలకు ప్రతిస్పందనగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గుర్తులు తెలంగాణలో చెరగడం ఖాయం. అసలైన తెలంగాణ చరిత్ర, సంస్కృతిని, ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన, తెలంగాణ సమాజంపైన ఉంది. ఆ విగ్రహాలను గాంధీ భవన్‌కు సాగనంపుతాం ప్రజల ఆశీస్సులతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిర, రాజీవ్ గాందీ, ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మార్చుతాం. సచివాలయం ముందు ఏర్పాటుచేసిన కాంగ్రెస్ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాలను మీ పార్టీ కార్యాలయం గాందీభవన్‌కు సకల మర్యాదలతో సాగనంపుతాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ తరహా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్‌ను సీఎం ఇకనైనా మానుకోవాలి. మేం పదేళ్లలో పెంచిన రాష్ట్ర సంపదను దోచుకుని, ఘనమైన తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను చెరిపేస్తామంటే సహించేది లేదు’’ అని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. -
జరగబోయేది అదే.. రాహుల్‌కు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటపై శ్రద్ధ లేదా?. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా?’’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.‘‘నమ్మి అధికారమిస్తే ఆగం చేయడమే కాక.. అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా?. గ్యారెంటీలకు దిక్కులేదు, 420 హామీలకు పత్తాలేదు, డిక్లరేషన్లకు అడ్రస్ లేదు!. అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకూ అందరూ బాధితులే. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం వరకూ వంచితులే. ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా నిర్బంధం.. సకల రంగాల్లో సంక్షోభం. మేము పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు మార్చలేదు’’ అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.‘‘మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా?. ఈ నీచ సంస్కృతికి సీఎం ఫుల్ స్టాప్ పెట్టకపోతే జరగబోయేది అదే! అంటూ లేఖలో కేటీఆర్ హెచ్చరించారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS లేఖ♦️చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారు.♦️ఢిల్లీకి అందే మూటలపై తప్ప.. మీరిచ్చిన మాటపై శ్రద్ధ లేదా?♦️తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా? ♦️నమ్మి అధికారమిస్తే… pic.twitter.com/D4Nt9d8yDf— BRS Party (@BRSparty) December 11, 2024ఇదీ చదవండి: ఏం చేశాం.. ఏం చేద్దాం? -
పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం.. రాజ్‌నాథ్‌తో రాహుల్ గాంధీ
ఢిల్లీ: పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సభ వెలుపల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ గులాబీ పూలు, జాతీయ పతకాన్ని అందించారు. ఆ ఘటన సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అదానీ అంశం ఉభయ సభల్ని కుదిపేస్తుంది. అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై సభలో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఉభయ సభల్లో ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం సమావేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్‌కు వస్తున్న రాజ్‌నాథ్ సింగ్‌కు కూటమి నేతలు గులాబీ పూలు, జాతీయ జెండాలు చేతికి ఇచ్చి తమ నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో రాహుల్ రాహుల్ స్వయంగా వెళ్లి ఇవ్వడంతో వాటిని రాజ్‌నాథ్ స్వీకరించారు.#WATCH | Delhi | In a unique protest in Parliament premises, Congress MP and LoP Lok Sabha, Rahul Gandhi gives a Rose flower and Tiranga to Defence Minister Rajnath Singh pic.twitter.com/9GlGIvh3Yz— ANI (@ANI) December 11, 2024 నవంబర్ 20న నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్యపై నిరంతరం వాయిదా పడుతూనే ఉన్నాయి. అదానీ సమస్యపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి,. జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఫండింగ్ చేసే ఒక సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. దీనిపై చర్చ జరపాలని పట్టుబట్టింది. దీంతో ఉభయ సభల్లో వాయిదా పర్వం కొనసాగుతుంది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిన్న వాయిదా పడిన ఉభయ సభలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. -
అదానీ, మోదీ పాత్రధారులతో... రాహుల్ మాక్ ఇంటర్వ్యూ
న్యూఢిల్లీ: అదానీ అంశంపై విపక్షాలు సోమవారం పార్లమెంటు మకరద్వారం వద్ద వినూత్నంగా నిరసన తెలిపాయి. అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీలు పారిశ్రామికవేత్త గౌతం అదానీలా మాణిక్కం ఠాగూర్, ప్రధాన నరేంద్ర మోదీలా సప్తగిరి శంకర్ మాస్కులు ధరించారు. వారితో విపక్ష నేత రాహుల్‌గాంధీ మాక్ ఇంటర్వ్యూ నిర్వహించారు. పార్లమెంటును ఎందుకు నడవనీకయకుండా చేస్తున్నారని అదానీ (ఠాగూర్)ను ప్రశ్నించారు. ‘‘ఇది అమిత్ భాయ్ (హోం మంత్రి అమిత్ షా)ను అడగాలి. కానీ ఆయన కని్పంచడం లేదుగా’’ అంటూ ఆయన బదులిచ్చారు. మీ మధ్య సంబంధమేమిటని రాహుల్ మరో ప్రశ్నించగా, ‘‘మేమిద్దరం ఒకటే. ఎయిర్పోర్టయినా, మరొకటయినా నేనేది అడిగినా చేస్తారాయన’’ అంటూ ఠాగూర్ మళ్లీ బదులిచ్చారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాహుల్ రెట్టించగా, ‘‘ఆయన ఈ మధ్య చాలా టెన్షన్‌గా ఉంటున్నారెందుకో’’ అని సమాధానమిచ్చారు. -
ఇది వరకు కేవలం ప్రధాని అభ్యర్ధి ఎవరనే విషయంలోనే లుక లుకలు బయటపడేవి!
-
రాహుల్ ఉన్నతస్థాయి ద్రోహి: బీజేపీ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రతిపక్షం ముసుగులో రాహుల్.. ఉన్నతస్థాయి దేశ ద్రోహిలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. అమెరికాకు చెందిన ఏజెన్సీలు, బిలియనీర్ జార్జ్ సోరోస్లతో రాహుల్‌ను పోల్చుతూ బీజేపీ ఎంపీ సాంబిత్ పాత్ర తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నవేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్ అజెండాను రాహుల్ ముందుకు తీసుకెళ్తున్నారని, దేశాన్ని అస్థిరపర్చేందుకు వారు కుట్రలు పన్నుతున్నారని సాంబిత్ పాత్రా మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీ, జార్జ్ సోరోస్, ఆయన మద్దతున్న ఓసీసీఆర్పీ మధ్య ఓ ముక్కోణపు బంధం ఉందని విమర్శించారు. రాహుల్ దేశానికి ద్రోహం చేస్తున్నాడని, సోరోస్ స్క్రిప్ట్ ఇక్కడ అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు.బీజేపీ ఎంపీ సాంబిత్ పాత్ర‘త్రిభుజానికి ఒకవైపు అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్, అమెరికాకు చెందిన కొన్ని ఏజెన్సీలు, మరోవైపు సొరేస్ మద్దతున్న OCCRP పేరుతో పెద్ద న్యూస్ పోర్టల్ ఉన్నాయి. త్రిభుజం చివరి మూలలో రాహుల్ గాంధీ, ‘ఉన్నత స్థాయి ద్రోహి’ అని అనడానికి నేను భయపడను. లోక్‌సభలో ప్రతిపక్ష నేతను దేశద్రోహి అనడానికి తనకు ఎలాంటి సందేహం లేదు. సోరోస్ అజెండాను రాహుల్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఓసీసీఆర్పీ ఆదేశాలను పాటిస్తున్నారు. రాహుల్, సోరోస్ ఇద్దరూ ఒకటే. ఒకరు బాధ పడితే మరొకరు కలత చెందుతారు. తన అజెండాలను నెరవేర్చుకోవాలని ఆ బిలియనీర్ కోరుకుంటున్నారు. ఆయనకు రాహుల్ సాయం చేస్తున్నారు. దేశ ప్రయోజనాలకు ముప్పుతేవడమే వారిద్దరికీ కావాలి. దేశాన్ని విభజించాలని చూసేవారు ప్రగతిని చూడలేరు.’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో హైటెన్షన్
-
సంభల్ ఉద్రిక్తతలు.. తిరిగి ఢిల్లీ ప్రయాణమైన రాహుల్, ప్రియాంక
పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం ‘మేం సంభల్ వెళ్లేందుకు పోలీసులు మమ్మల్ని అనుమతించట్లేదు. అడ్డుకుంటున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్లే హక్కు నాకు ఉంది. ఇతర నేతలతో కాకుండా ఒంటరిగా వెళ్లేందుకూ నేను సిద్ధమే. పోలీసులతో కలిసి వెళ్లేందుకైనా సిద్ధమే. కానీ, వారు అందుకు అంగీకరించడం లేదు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మండిపడ్డారు.అటు వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ‘‘బాధితులను కలిసే హక్కు రాహుల్‌కు ఉంది. ఆయనను అనుమతించాలి’’ అని డిమాండ్ చేశారు. అయినా, పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో చేసేదేం లేక.. కాంగ్రెస్ నేతలు అక్కడినుంచి వెనుదిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన రాహుల్ ప్రియాంకదాదాపు 2 గంటల తర్వాత ఢిల్లీకి పయనమైన నేతలుసంభల్ సందర్శనకు అనుమతి లేదని అడ్డకున్న పోలీసులు ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్న ప్రియాంక, రాహుల్ఘాజీపూర్లో వీరి కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు.ఢిల్లీ టు సంభల్ మార్గంలో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులుఘాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు #WATCH | Lok Sabha LoP & Congress MPs Rahul Gandhi, Priyanka Gandhi Vadra and other Congress leaders have been stopped by Police at the Ghazipur border on the way to violence-hit Sambhal. pic.twitter.com/EcPEOFahIV— ANI (@ANI) December 4, 2024న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ అల్లర్ల ప్రాంతాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా బయలుదేరారు. సంభాల్‌లోని మసీదులో సర్వే కారణంగా చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించనున్నారు. రాహుల్, ప్రియాంక వెంట ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు ప్రతినిధి బృందం కూడా ఉన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని 10 జనపథ్ నివాసం వెలుపల భారీగా గుమిగూడారు. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.#WATCH | Visuals from Ghazipur border where Lok Sabha LoP & Congress MPs Rahul Gandhi, Priyanka Gandhi Vadra and other Congress leaders have been stopped by Police on the way to violence-hit Sambhal. pic.twitter.com/eqad86lxr0— ANI (@ANI) December 4, 2024 ఢిల్లీ నలుమూలలా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఢిల్లీ–సంభల్ మార్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. దీంతో ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘాజీపూర్ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే సంభల్‌లో శాంతిభద్రతల దెబ్బతిన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆ ప్రాంతానికి చేరుకోకుండా ఆడ్డుకునే అవకాశం ఉంది. శాంతిభద్రతల పరిస్థితి కారణంగా బయటి వ్యక్తులను ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుమతించబోమని పోలీసులు, జిల్లా యంత్రాంగం పేర్కొంది. ఈ క్రమంలోనే ఇటీవల సమాజ్ వాదీ పార్టీ ఎంపీల ప్రతినిధి బృందం జిల్లాలోకి ప్రవేశించకుండా నిలిపివేశారు. ఇక నిషేధాజ్ఞలను డిసెంబర్ 31 వరకు పొడిగించారు.జిల్లా కలెక్టర్ రాజేంద్ర పెన్సియా గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్ పోలీసు కమీషనర్లకు.. అమ్రోహా, బులంద్‌షహర్ పోలీసు సూపరింటెండెంట్లకు లేఖ రాశారు. రాహుల్ సోనియా గాంధీలను ఆపాలని లేఖలో కోరారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ మాట్లాడుతూ.. కనీసం నలుగురు సభ్యుల ప్రతినిధి బృందాన్ని సంభాల్‌కు వెళ్లడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.కాగా సంభల్‌లోని షాహీ జామా మసీదు ఉన్న స్థలంలో దేవాలయం కొందని కొందరు హిందూ పిటిషనర్లు గతంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. ఆ సర్వే జరుగుతోన్న సమయంలోనే అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, పోలీసులపై కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పంటించారు. ఆ ఘర్షణల్లో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సంభల్‌లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు స్థానిక సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్, మరో 700 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.. -
లోక్‌సభలో ప్రియాంక సీటింగ్ ఖరారు.. మోదీ, రాహుల్ స్థానాలు కూడా!
18వ లోక్‌సభలో ఎంపీల సీటింగ్ ఏర్పాట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీటులో ఎలాంటి మార్పు లేదు. గతంలో మాదిరి ఆయన ముందు వరుసలోని తొలి సీట్లో కూర్చోనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండో స్థానంలో, హోంమంత్రి అమిత్ షా మూడో సీట్ నెంబర్లో కూర్చోనున్నారు. గతంలో సీటు నెంబర్ 58లో కూర్చొనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇకపై 4వ స్థానానికి మారారు. ఇక వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో స్థానం కేటాయించారు. ఈ మేరకు సోమవారం సవరించిన సీటింగ్ జాబితాను విడుదల చేశారు.గతంలో సీట్ నెంబర్ 4, 5 ఖాళీగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని వేరే వారికి కేటాయించారు. అదే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా వంటి కీలక మంత్రులకు స్థిరమైన సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి.రాహుల్ గాంధీ 498వ స్థానంలో..వీరితోపాటు సీనియర్ ప్రతిపక్ష నేతల సీట్లు మొదటి వరుసలో ఉంటాయి. కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 498వ స్థానంలో కూర్చుంటారు., సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ 355వ స్థానంలో కూర్చోనున్నారు. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయకు 354వ సీటు కేటాయించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు రాహుల్ గాంధీ పక్కనే సీటు నంబర్ 497 కేటాయించారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ కు లోక్ సభ రెండో వరుసలో స్థానం కల్పించారు. ఫైజాబాద్ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు సీటు నంబర్ 357లో కూర్చుంటారు. డింపుల్ యాదవ్ 358 సీటులో అతని పక్కన కూర్చుంటారు. ఇకప ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో 517వ సీట్లో కూర్చోనున్నారు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు కేరళకు చెందిన అదూర్ ప్రకాష్, అస్సాంకు చెందిన ప్రద్యుత్ బోర్డోలోయ్ పక్కన ఆమె కూర్చుంటారు. -
అటు ప్రేమ, ఇటు వివక్ష
కోజికోడ్(కేరళ): పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్న ప్రధాని మోదీ కేరళలోని వయనాడ్ బాధితుల పట్ల విపక్ష కనబరుస్తున్నారని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తొలిసారిగా సొంత నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా కోజికోడ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమెతో కలిసి రాహుల్‌గాంధీ పాల్గొని ప్రసంగించారు. ‘‘అందర్నీ సమాన దృష్టిలో చూడాలని మన రాజ్యాంగం ప్ర¿ోధిస్తోంది. కానీ మన ప్రధానికి మాత్రం అవేం పట్టవు. అమెరికాలో అదానీపై కేసులు నమోదయ్యాక ఆయనను భారతీయులంతా ఒక నిందితుడిగా చూస్తుంటే ప్రధాని మోదీ మాత్రం ఆయనను ప్రత్యేకంగా చూస్తున్నారు. అమెరికాలో అదానీపై నేరాభియోగాలు నమోదైనా ప్రధాని మోదీ అస్సలు పట్టించుకోరు. ఆయనను నేరస్తుడు అని అమెరికా సంబోధించినా భారత ప్రభుత్వం ఆయనపై ఎలాంటి నేరాభియోగాలు మోపదు. అదానీపై ఇంతటి ప్రేమ ఒలకబోసే ప్రధాని కేరళలో ప్రకృతి విలయంతో సర్వం కోల్పోయిన వయనాడ్ బాధితుల బాధలను చెవికెక్కించుకోరు. అవసరమైన సహాయక సహకారాలు మద్దతు ఇవ్వాలనే ఆలోచన ఆయనకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ సమర్థవంతంగా ప్రజల కోసం పోరాడుతోంది. మన మీద నమ్మకంతో, కాపాడుతామన్న విశ్వాసంతో ప్రజలు మన వద్దకు వస్తున్నారు. వయనాడ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు పోరాడతా’’అని అన్నారు. అంతకుముందు రాహుల్ వయనాడ్ మృతులకు నివాళులరి్పంచారు. బీజేపీ, ప్రకృతి విపత్తు ఒక్కటే: ప్రియాంక రాహుల్ తర్వాత ప్రియాంకాగాంధీ ప్రసంగించారు. ‘‘ప్రకృతి విపత్తు, బీజేపీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. రెండింటి శైలి ఒక్కటే. ప్రకృతి విపత్తు ఎలాగైతే తనకు నచి్చనట్లు చేస్తుందో బీజేపీ కూడా ఎలాంటి నియమనిబంధనలు, వివరణలు, ప్రజాస్వామ్యయుతవిధానాలను అవలంభించదు. బీజేపీ నుంచి ఎదుర్కొంటున్న రాజకీయసవాళ్లు అచ్చు కొండచరియలు విరిగిపడటం లాంటిదే. రాజకీయసమరంలో పాటించాల్సిన కనీస ధర్మాలనూ బీజేపీ పాటించదు. రాజ్యాంగబద్ద సంస్థలనూ నాశనంచేస్తోంది. విధ్వంసకర అజెండాకు మాత్రమే బీజేపీ కట్టుబడి ఉంటుంది. వయనాడ్ ప్రజల మనిషిగా పార్లమెంట్లో మాట్లాడతా. ఇక్కడి వారి సమస్యలను ప్రస్తావిస్తా. సోదరుడు రాహుల్‌గాం«దీపై చూపించిన ప్రేమను నాపైనా చూపించినందుకు మీకు రెండింతల ధన్యవాదాలు. గెలిచి ఇక్కడికొచ్చా. వయనాడ్ ప్రజల ఉజ్వల భవిత కోసం నా శాయశక్తుల కృషిచేస్తా’’అని ప్రియాంక గాంధీ అన్నారు. -
నేడు వయనాడ్‌కు రాహుల్, ప్రియాంక
వయనాడ్: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా శనివారం కేరళలోని వయనాడ్‌లో పర్యటించనున్నారు. వయనాడ్ నియోజకవర్గంలో బహిరంగ సభలో వారు ప్రసంగిస్తారని కాంగ్రెస్ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కోజికోడ్ జిల్లాలోని ముక్కమ్‌లో మధ్యాహ్నం బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నాయి. కరూలై, వాందూర్, ఎడవాన్నా పట్టణాల్లోనూ ప్రజలను ప్రియాంక, రాహుల్ కలుసుకుంటారని తెలిపాయి. వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ హోదాలో తొలిసారిగా వయనాడ్‌లో పర్యటించబోతున్నారు. తనను గెలిపించినందుకు గాను నియోజకవర్గ ప్రజలకు ప్రియాంక కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. -
Parliament Session: ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు రేపటికి(శుక్రవారం) వాయిదా పడ్డాయి. అటు లోక్‌సభ, రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనలతో సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. అదాని గ్రూప్ అవినీతి ఆరోపణలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభలను వాయిదావేశారు. పార్లమెంట్ ఉభయ సభలు 12గంటల వరకూ వాయిదా పడ్డాయి.లోక్‌సభ స్పీకర్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో కేరళలోని వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో సభకు వచ్చిన ఆమె.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగోరోజైన గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. #WATCH | Delhi: Congress MP Shashi Tharoor says, " I am delighted as we had campaigned for her. I am happy that she won...as you can see, she is appropriately dressed in a Kerala saree" pic.twitter.com/MFoJPaf4dj— ANI (@ANI) November 28, 2024 కాగా తాజాగా వెలువడిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ నాలుగు లక్షలకుపైగా రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టనుండగా, పార్లమెంటులో ముగ్గురు గాంధీలు ఎంపీలుగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సోనియా రాజ్యసభలో ఎంపీగా ఉండగా, రాహుల్, ప్రియాంక లోక్‌సభలో కూర్చోనున్నారు. వక్ఫ్ బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను సమర్పించేందుకు నవంబర్ 29న గడువును పొడిగిస్తూ ప్రతిపాదనను సమర్పించనుంది.ఇక నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజు నుంచి స్తంభిస్తూనే ఉన్నాయి. ఉభయ సభలు రోజంతా వాయిదా పడుతున్నాయి. మణిపూర్ హింస, సంభాల్ హింస సహా పలు సమస్యలపై ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండో రోజు సభ జరగలేదు. మూడో రోజు ఉభయ సభలు గంట వ్యవధిలో వాయిదా పడ్డాయి. -
నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ తన సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీలతో పాటు నేడు (గురువారం) పార్లమెంటుకు చేరుకోనున్నారు. ఈరోజు ఆమె లోక్‌సభ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. రాహుల్ గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ రెండు స్థానాలలో విజయం సాధించారు. తరువాత ఆయన వయనాడ్‌ను వదులుకున్నారు. తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాకా గాంధీ పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయకూడదని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా సంతానం రాహుల్, ప్రియాంక ఇప్పుడు లోక్‌సభకు చేరుకున్నారు. అంటే పార్లమెంటు ఎగువ సభలో తల్లి, దిగువ సభలో కుమారుడు, కుమార్తె కూర్చోనున్నారు.ఇదేవిధంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ కూడా లోక్ సభ సభ్యులు. అఖిలేష్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి గెలుపొందగా, ఆయన భార్య ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి స్థానం నుంచి ఎన్నికయ్యారు. అఖిలేష్ యాదవ్ బంధువు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానం నుంచి గెలుపొందగా, మరో బంధువు ధర్మేంద్ర యాదవ్ బదౌన్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ కుటుంబానికి చెందిన నలుగులు ఎంపీలుగా ఉన్నారు.బీహర్ నేత పప్పు యాదవ్ పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన భార్య రంజిత్ రంజన్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు. 2014 నుంచి ఆయన సభకు ఎన్నికవుతూవస్తున్నారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీగా ఉన్నారు.ఇది కూడా చదవండి: Pakistan: షియా-సున్నీల ఘర్షణ.. 10 మంది మృతి -
కాంగ్రెస్‌కు మరో షాక్.. బాంబు పేల్చిన మమత!
ఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఘోర పరాజయాల నేపథ్యంలో ఇండియా కూటమిలో లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. ఇండియా కూటమిలో చీలికలను సంకేతాలిస్తూ తృణమూల్ కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోయే ప్రసక్తే లేదంటూ కుండబద్దలు కొట్టింది. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. హర్యానాలో కాంగ్రెస్ విజయం పక్కా అనుకున్నప్పటికీ హర్యానాలో ఓటమి.. మహారాష్ట్రలో కూడా దారుణ ఫలితాలు రావడంతో ఇండియా కూటమిలో లుకలుకలు చోటుచేసుకున్నాయి. మొదటి నుంచి ఇండియా కూటమిలో వ్యతిరేక స్వరం వినిపిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బిగ్ బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ కు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తృణమూల్ కాంగ్రెస్.పార్లమెంట్ సమావేశాల వేళ కూటమిలో చీలికకు సంకేతాలిస్తూ కాంగ్రెస్ తీరుపై టీఎంసీ నేతలు సంచలన విమర్శలు చేశారు. అలాగే, మిత్రపక్షం కాంగ్రెస్ నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోదని టీఎంసీ పేర్కొంది. పార్లమెంట్ లో బెంగాల్ ప్రజల సమస్యలను లేవనెత్తే విధంగా సభను నిర్వహించాలని కోరింది. అవినీతిపై పార్లమెంట్లో చర్చ కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రజల కోసం తాము చర్చ కొనసాగించాలనుకుంటున్నట్టు టీఎంసీ వెల్లడించింది. బెంగాల్ కు నిధుల కొరత ఉంది. కేంద్రం నుంచి నిధుల రావాల్సి ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పార్లమెంట్ లో చర్చించాలనుకుంటున్నాం అని టీఎంసీ సభ్యులు తెలిపారు.ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల్లోనూ, పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఎంసీ వేర్వేరుగా పోటీ చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఉపఎన్నికలలో మొత్తం ఆరు స్థానాలను, లోక్‌సభ ఎన్నికలలో 40 నియోజకవర్గాలలో 29 స్థానాలను గెలుచుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఓటమి చెందడంపై కూడా టీఎంసీ ఘాటు విమర్శలు చేసింది. -
తెలంగాణలో కులగణన చరిత్రాత్మకం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచి్చనా ఇదే తరహాలో కులగణన చేపడతామని ప్రకటించారు. తెలంగాణలో కులగణన ఫలితాల ఆధారంగా పాలసీలను రూపొందిస్తామని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని తోల్‌కటోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఏం చేసినా, ఎంత అడ్డుకున్నా కులగణన, రిజర్వేషన్లకు అడ్డుగోడలు తొలగించి చూపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో కులగణనను ప్రజా భాగస్వామ్య ప్రక్రియగా మార్చాం. కులగణన ఏదో మూసి ఉన్న గదిలో పది పదిహేను మంది రూపొందించినది కాదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు అంతా కలసి తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. ఇది చరిత్రాత్మకం. కర్ణాటక, తెలంగాణలాగే.. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇదే తరహాలో కులగణన చేపడతాం. తెలంగాణలో కులగణన ఫలితాలు వస్తే.. దాని ఆధారంగా మేం పాలసీలు రూపొందిస్తాం. బీజేపీ భయపడుతోంది కులగణన అంటే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నాయి. నాలుగైదు శాతం మంది కోటీశ్వరుల కంట్రోల్లో ఈ దేశాన్ని పెట్టాలని బీజేపీ భావిస్తుంది. కులగణన చేయడం, రిజర్వేషన్లను 50 శాతం పెంచడం ద్వారానే దానిని ఛేదించగలుగుతాం. అదే పనిలో మేమున్నాం. దీనిని తెలంగాణ, కర్ణాటకలలో చేశాం. ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచి్చనా దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, నిరుపేదల డేటా తీస్తాం. అభివృద్ధి, దేశ భవిష్యత్తులో వారి భాగస్వామ్యం ఎంత? భవిష్యత్తు ఏమిటి? అనేదే మా లక్ష్యం. ఈ వేదికపై రోహిత్ వేముల ఫొటో ఉంది. ఆయన ఎంతో మాట్లాడాలనుకున్నారు. కానీ వీళ్లు (కేంద్ర ప్రభుత్వం) రోహిత్ వేముల గొంతు నొక్కేశారు. యువత కలలకు వ్యతిరేకంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది.అదానీ, అంబానీ, టాటా, బిర్లాలు.. ఆదివాసీలా? దళితులా? దేశంలో దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు దక్కాల్సిన వాటా దక్కడం లేదు. ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ వీరి మధ్య అడ్డుగోడ కడుతున్నారు. అదానీ, అంబానీ, టాటా, బిర్లాలు ఆదివాసీలా? దళితులా? దేశంలో 90 శాతం ప్రజలకు అన్యాయం జరుగుతోంది. దానికి కులగణన, రిజర్వేషన్ల పెంపు ఒక్కటే మార్గం. ఆ దిశగా ఉన్న అడ్డుగోడలను తొలగించి చూపిస్తాం. కులగణన విషయాన్ని ఊరూవాడాలో ప్రచారం చేయాలి..’’అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. -
రాహుల్ తిట్టినందుకే అదానీ విరాళం వెనక్కి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘అదానీ నుంచి రూ.100 కోట్ల విరాళం తీసుకోవడంపై రాహుల్‌గాంధీ ఫోన్ చేసి తిడితే నష్ట నివారణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి వెనక్కి తగ్గాడు. అదానీ విరాళంగా రూ.100 కోట్ల చెక్‌ను ఇచ్చి 38 రోజులు పూర్తయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నగదుగా ఎందుకు మార్చుకోలేదు? చెక్ చూపించి వెనుక నుంచి డబ్బులు దోచుకునే కుట్ర జరుగుతోందా?..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. ‘అదానీ ఫ్రాడ్ అని రేవంత్‌కు ఇప్పుడే తెలిసిందా? అదానీని రాహుల్‌గాంధీ ఫ్రాడ్ అంటుంటే రేవంత్ మాత్రం ఫ్రెండ్ అంటూ రూ.12,400 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను బీఆర్ఎస్కు అంటగడుతూ అసత్య ప్రచారం చేస్తున్న సీఎం తన పేరును అబద్ధాల రేవంత్‌రెడ్డిగా మార్చుకోవాలి..’ అని కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు తలసాని, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ అసలైన శాడిస్ట్..: ‘అదానీ విషయంలో రాహుల్‌గాందీకి, రేవంత్‌కు నడుమ ఏకాభిప్రాయం కనిపించడం లేదు. రాహుల్‌తో తిట్లు తిన్న అసహనంతో నన్ను రేవంత్ ఇష్టమొచ్చినట్లు తిడుతున్నాడు. చిట్టి నాయుడికి చిప్ దొబ్బినట్లు కనిపిస్తోంది. అదానీ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్రంలో అదానీకి రెడ్ సిగ్నల్ ఇవ్వడమే కేసీఆర్ చేసిన తప్పా? తెలంగాణ వనరులను దొంగకు దోచిపెట్టడాన్ని ప్రశ్నించిన నేను సైకోనా? తాను తప్పులు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న రేవంత్ అసలైన శాడిస్ట్. రేవంత్ మాదిరిగా కాళ్లు పట్టుకోవడం, లుచ్చా పనులు చేయడం, మస్కా కొట్టడం, గౌతమ్ భాయ్ అంటూ తిరిగే రకం కాదు మేము. నేను దావోస్‌లో అదానీతో కలిసి దిగిన ఫోటోను బహిరంగంగా ట్విట్టర్లో పెట్టా. కానీ రేవంత్ తరహాలో ఆయనను ఇంటికి పిలుచుకుని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదు. కోహెనూర్ హోటల్లో కాళ్లు పట్టుకోలేదు. అదానీ కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు నాకు లేదు..’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి అనుమతులపై అబద్ధాలు ‘సీఎం ప్రతి అంశంపైనా అవగాహన లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతూ రాష్ట్ర గౌరవం మంటగలుపుతున్నాడు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ను అదానీతో ముడి పెడుతూ సీఎం ప్రెస్మీట్లు పెడుతున్నాడు. రక్షణ శాఖ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇచ్చిన అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటగడుతున్నాడు. డ్రై పోర్టు, విద్యుత్ ట్రాన్స్మిషన్ అనుమతులతో మాకు సంబంధం లేదు..’ అని మాజీమంత్రి స్పష్టం చేశారు. గురుకుల మరణాలన్నీ సర్కారు హత్యలే ‘గురుకుల పాఠశాలల్లో చదివే 48 మంది పిల్లలు చనిపోయినా సీఎం సమీక్ష నిర్వహించడం లేదు. గురుకుల విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు రేవంత్‌రెడ్డే కారణం..’ అని కేటీఆర్ ఆరోపించారు. జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్ బంజారాహిల్స్ (హైదరాబాద్): కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలపై పగ పెంచుకుని వేధిస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ, హైడ్రా బాధితులు, ఆటోడ్రైవర్లు తదితర నగర ప్రజలు.. ప్రభుత్వం పెడుతున్న బాధలు చెప్పుకునేందుకు తెలంగాణ భవన్‌కు వస్తున్నారని, తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారిందని చెప్పారు. ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ జిల్లా సన్నాహక సమావేశాన్ని మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సంతోషంగా లేదని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. రేవంత్‌రెడ్డి ఎత్తైన కుర్చీలో కూర్చొని గొప్ప మనిíÙని కావాలని భావిస్తున్నాడని, కానీ కేసీఆర్‌లా ప్రజలకు మంచి చేసినప్పుడు మాత్రమే వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకోగలమని గుర్తించడం లేదని అన్నారు. హైదరాబాద్‌ను నాలుగు ముక్కలు చేసే కుట్ర ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్‌ను మూడు లేదా నాలుగు ముక్కలు చేయాలని సీఎం కుట్ర చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే కుట్రలో బీజేపీకి కూడా భాగం ఉందని అన్నారు. కాంగ్రెస్ తప్పుడు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అఖండ మెజార్టీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
రాష్ట్రపతి ముర్మును అవమానించిన రాహుల్.. బీజేపీ ఆరోపణలు
న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అగౌరవపరిచారని బీజేపీ ఆరోపించింది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా ఆమెను అవమానపరిచారని ఆరోపించింది. జాతీయ గీతం సమయంలో కూడా రాహుల్ పరధ్యానంలో ఉన్నారని మండిపడింది. ఈమేరకు సోషల్ మీడియాలో వరుస వీడియోలను షేర్ చేసింది.పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా స్మారక నాణెం, స్టాంపులను రాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం స్టేజీపై ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. राहुल गांधी को इतना घमंड है कि राष्ट्रपति जी का अभिवादन तक नहीं किया। सिर्फ इसलिए क्योंकि वो जनजातीय समाज से आती हैं, महिला हैं और राहुल गांधी कांग्रेस के राजकुमार? कैसी घटिया मानसिकता है ये? pic.twitter.com/shtP5s2dxs— Amit Malviya (@amitmalviya) November 26, 2024అయితే అక్కడే ఉన్న రాహుల్ గాంధీ మాత్రం రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా వేదికపై నుంచి వెళ్లిపోయాడని ఎక్స్ వేదికగా బీజేపీ నేత అమిత్ మాల్వీయ విమర్శించారు. జాతీయ గీతం ప్లే అవుతున్న సమయంలో అందరూ ముందుకు చూస్తే.. రాహుల్ మాత్రం పక్కకు, కిందకు చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రపతి, ఇతర నాయకులు నిలబడి ఉండగానే గాంధీ కూర్చోవడానికి ప్రయత్నించారని విమర్శించారుCongress always disrespects President Smt Droupadi Murmu ji, because she is the first Tribal woman to occupy the highest office of the land. Rahul Gandhi and family despise SC, ST and OBCs. It shows. pic.twitter.com/CR3v8pAioL— Amit Malviya (@amitmalviya) November 26, 2024‘రాహుల్ గాంధీ తన దృష్టిని 50 సెకన్లు కూడా కేంద్రీకరించలేరు. కానీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిపై పూర్తిగా అసహ్యకరమైన వ్యాఖ్య చేసే ధైర్యం అతనికి ఉంది. జాతీయ గీతం ముగియగానే, వేదికపై ఉన్న రాహుల్ గాంధీ దిగిపోవడానికి ప్రయత్నిచారు. రాహుల్ ద్రౌపది ముర్మును ఎప్పుడూ అగౌరపరుస్తుంటారు. ఎందుకంటే ఆమె దేశ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ కాబట్టి. రాహుల్, గాంధీ కుటుంబం.. ఎస్సీ, ఎస్టీ,ఓబీలపై ప్రేమలేదు’ అని విమర్శలు గుప్పించారు.Rahul Gandhi can’t hold his attention for even 50 seconds and he had the audacity to make an absolutely distasteful comment on the President of United States. pic.twitter.com/TAesrKmrmS— Amit Malviya (@amitmalviya) November 26, 2024 అయితే ఈ వీడియోలపై పలువురు స్పందిస్తూ.. రాష్ట్రపతి పట్ల రాహుల్ అహంకారం ప్రదర్శించారని, మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తరువాత రాహుల్ నిరాశలో కూరుకుపోయారని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. అయితే బీజేపీ ఆరోపణలపై రాహుల్ గాంధీ కానీ, ఇతర కాంగ్రెస్ నేతలు కానీ స్పందించలేదు. -
రాజ్యాంగంలో సావర్కర్ స్వరం ఉందా?: రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అది వేల సంవత్సరాల భారతదేశ ఆలోచనల సమాహారమని చెప్పుకొచ్చారు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇదే సమయంలో తెలంగాణలో కులగణన చరిత్రాత్మక అడుగు అని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ సంవిదాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అది వేల సంవత్సరాల భారతదేశ ఆలోచనల సమాహారం. సత్యం, అహింసలతో ముడిపడి ఉంది. రాజ్యాంగంలో సావర్కర్ జీ స్వరం ఉందా? అని ప్రశ్నించారు. హింసకు గురిచేయాలి, మనుషులను చంపాలి, అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలి అని ఎక్కడైనా రాసిందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.#WATCH | Delhi: At the Constitution Day program at Talkatora Stadium, Lok Sabha LoP & Congress MP Rahul Gandhi says, "Does it (Constitution) have Savarkar ji's voice? Is it written somewhere in it that violence should be used, people should be killed or that the govt should be… https://t.co/tYELczHI6E pic.twitter.com/vIaY4TRBXY— ANI (@ANI) November 26, 2024ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మాట్లాడుతూ..‘తెలంగాణలో కులగణన చరిత్రాత్మక అడుగు. అక్కడ కుల గణన మొదలు పెట్టాం. కుల గణనలో అడిగే ప్రశ్నలు ఒక గదిలో కూర్చొని 15 మంది రూపొందించలేదు. కులగణనలో అడిగే ప్రశ్నలు తెలంగాణ ప్రజలే డిజైన్ చేశారు. ఇది ప్రజా ప్రక్రియ. భవిష్యత్‌లో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తాం.బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేసినా సరే కుల గణన ద్వారా రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి ఎత్తివేస్తాం. కుల గణన అనేది నేను పార్లమెంట్లో రాజ్యాంగంపై చేసిన హామీ. కుల గణనను పాస్ చేసి చూపిస్తా. అందరికీ సమాన హక్కు కోసం పోరాడుతున్నాం. కుల గణన ద్వారా ప్రజా సమాచారం తెలుస్తుంది. దీని ద్వారా పాలసీలు నిర్ణయించబడతాయి. ఐదు ఆరు శాతం ఉన్న వారు దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కులగణన జరుగుతోంది. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం. అందుకే కులగణన సర్వే చేపట్టాం. దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే సామాజిక న్యాయం. ఇది మూడో ఉద్యమం. దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయం వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధిస్తే... రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు.. మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం 2.0 పూర్తయింది. ఇప్పుడు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల ఆధ్వర్యంలో కుల గణనకు సామాజిక న్యాయం 3.0 ప్రారంభమైంది. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ మహా యుద్ధం ప్రకటించారు. ఆయన బాటలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సామాజిక, ఆర్థిక, కుల సర్వే మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో సర్వే 92 శాతం పూర్తయింది.పదేళ్లుగా దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగ రక్షణకు రాహుల్ గాంధీ దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టారు. రాహుల్ చేపపట్టిన ఉద్యమంలో ప్రజలు భాగస్వాములైనందునే మోదీ 400 వందల సీట్లు అడిగితే ప్రజలు కేవలం 240 సీట్లకు పరిమితం చేశారు. దేశవ్యాప్తంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తున్నారు.. ఇందుకు వయనాడ్, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిస్తే, జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. రాజ్యాంగ రక్షణ ఉద్యమం కేవలం రాహుల్ గాంధీకి పరిమితమైన అంశంగా అనుకోవద్దు. మనమంతా అందులో భాగస్వాములు కావాలి. ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే ఉందని గుర్తుంచుకోవాలి. మహాత్మా గాంధీ పరివార్ రాజ్యంగ రక్షణకు పూనుకుంటే.. మోదీజీ పరివార్ అంటే సంఘ్ పరివార్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని విమర్శించారు.ఇక, అంతకుముందు వయనాడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని కలిసి సీఎం రేవంత్, భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. -
న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పాత్రేం పోషించదు: డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పార్లమెంట్లో, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల పాత్రను పోషించాలని ప్రజలు భావించకూడదని అన్నారు. చట్టాలను సమీక్షించడానికి, పరిరక్షించడానికే న్యాయవ్యవస్థ ఉందని అన్నారాయన. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థల పాత్ర కూడా తామే పోషించాల్సి వస్తోందని ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉందని నొక్కి చెప్పారు.ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పిన జస్టిస్ చంద్రచూడ్.. తాను ఇక్కడికి వచ్చింది ఆ విషయంపై మాట్లాడడానికి కాదన్నారు. ‘ఈ వివాదంలో ప్రతిపక్ష నేతలతో నేను స్వరం కలపాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ విషయం మాట్లాడేందుకు నేను ఇక్కడికి రాలేదు. కానీ ఒక్క విషయం చెప్పదల్చుకొన్నాను. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షాల పాత్రను న్యాయవ్యవస్థ పోషించాలని ప్రజలు అనుకోకూడదు. న్యాయవ్యవస్థ చట్టసభలలో ప్రతిపక్షంలా ఉండాలనేదే తప్పుడు భావన. అది నిజం కాదు. .. మేమున్నది చట్టాలను పరిశీలించడానికి. కార్యనిర్వాహక వర్గం చర్యలు చట్టాలకు లోబడి ఉన్నాయో, లేదో సమీక్షించే బాధ్యత మాపై ఉంది. రాజకీయ ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ ప్రజలు న్యాయ వ్యవస్థలను వాడుకొంటున్నారు. దాని భుజాల మీద నుంచి తుపాకీ కాలుస్తున్నారు. కోర్టులను రాజకీయ ప్రతిపక్షాల కేంద్రంగా మారుస్తున్నారు’ అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.ఇటీవల ఓ సందర్భంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పనిచేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనని విమర్శించారు. -
అన్న రాహుల్ గాంధీ మెజార్టీని దాటేసిన ప్రియాంక
-
Wayanad: ప్రియాంక గాంధీ ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే!
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రికార్డు స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికలోనే.. తన సత్తా చాటుతున్నారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె 4,08. 036 ఓట్ల మెజార్టీతో తన సమీప సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరిపై గెలుపొందారు.రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్వయనాడ్ ఉప ఎన్నికల్లో ఏకంగా సోదరుడు రాహుల్ గాంధీ మెజార్టీ ప్రియాంక బ్రేక్ చేశారు. గత వయనాడ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3 లక్షల 64 వేల ఓట్ల మెజార్టీ రాగా.. ప్రియాంకకు 4 లక్షల 8 వేల ఓట్ల మెజార్టీ లభించింది. సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరి రెండో స్థానంలో, బీజేపీ నుంచి నవ్య హరిదాస్ డో స్థానంలో ఉన్నారు.కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రాహుల్ గాంధీ.. 3, 64, 653 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థిపై గెలుపొందారు. రాహుల్‌కు మొత్తం 6,47,445 ఓట్లు రాగా.. సీపీఐ నేత అన్నీ రాజాకు 2,83023 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్థి కే సురేంద్రన్ను 1, 41,045 ఓట్లు మాత్రమే వచ్చాయి. -
ఖర్గే, రాహుల్‌కు రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు
ఢిల్లీ: తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకుగాను కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాట్‌లకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే శుక్రవారం లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలంటూ ఆయన హెచ్చరించారు.ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్‌లోని ఓ హోటల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేత రూ.5 కోట్లు పంపిణీ చేశారని బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) నాయకుడు హితేంద్ర ఠాకూర్ మంగళవారం ఆరోపించిన క్రమంలో తావ్డే లీగల్ నోటీసు ఇచ్చారు.ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను సుదీర్ఘ రాజకీయ జీవితంలో అలాంటి చర్యలకు ఎన్నడూ పాల్పడలేదు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నేతలు తన పరువుకు భంగం కలిగించి పార్టీని దెబ్బతీయాలని చూశారన్నారు. కాంగ్రెస్ నేతలు తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. అందుకోసమే ఈ నోటీసులు పంపాను’’ అంటూ తావ్డే మీడియాకు వెల్లడించారు. -
ఢిల్లీ కాలుష్యం.. జాతీయ అత్యవసర పరిస్థితే: రాహుల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంపై కాంగ్రెస్ ఎంపీ. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం పెరగడంపై అటు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న వేళ.. ఈ సంక్షోభాన్నిపరిష్కరించడానికి అందరూ ఐక్యంగా స్పందించాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాలుష్య పరిస్థితులను జాతీయ అత్యవసర స్థితిగా అభివర్ణించారు.ఈ మేరకు ఇండియా గేట్ వద్ద పర్యావరణవేత్త ఝాతో కలిసి మాట్లాడారు. ఉత్తర భారతదేశంలో నమోదవుతున్న గాలి కాలుష్యంపై రాజకీయ విమర్శలు, నిందలు వేసుకోవడానికి ఇది సమయం కాదని అన్నారు. కాలుష్య నివారణకు తక్షణ, సామూహిక చర్యలు అవసరమని పేర్కొన్నారు. కాలుష్యం కారణంగా తన కళ్ళు కూడా మండుతున్నాయంటూ వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. వాయు కాలుష్యానికి సామాన్య ప్రజలే ఎక్కువగా ప్రభావితులవుతున్నారని తెలిపారు.‘సమాజంలోని అత్యంత బలహీన వర్గాలు, పేదలు వాయు కాలుష్యం వినాశకరమైన ప్రభావాన్ని చూపుతోంది. ఈ విషపూరితమైన గాలిని తప్పించుకోలేక అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. వృద్ధులు బాధలు పడుతున్నారు. చాలా మంది చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఉత్తరభారతంలో నెలకొన్న తాజా పరిస్థితుల వల్ల పర్యాటకం బాగా పడిపోయింది. ప్రపంచంలో దేశ ఖ్యాతి పడిపోతుంది. కాలుష్య మేఘాలు వందలాది కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. వాటిని తొలగించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వాలు, కంపెనీలు, నిపుణులు, పౌరుల నుంచి జాతీయ స్థాయిలో సమిష్టి ప్రతిస్పందన అవసరం. రాజకీయ నిందలు కాదు. విషపూరితంగా మారుతున్న వాతావరణాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని తెలిపారు.మరికొద్ది రోజుల్లో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై కూలంకషంగా చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనాలని సహచర ఎంపీలకు పిలుపునిచ్చారు. వాయు కాలుష్య రూపంలో ముంచుకొస్తన్ను ముప్పును అరికట్టడానికి కలిసి కట్టుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు.Air pollution in North India is a national emergency—a public health crisis that is stealing our children’s future and suffocating the elderly, and an environmental and economic disaster that is ruining countless lives. The poorest among us suffer the most, unable to escape the… pic.twitter.com/s5qx79E2xc— Rahul Gandhi (@RahulGandhi) November 22, 2024 -
అదానీని ఇవాళే అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఏకంగా ముఖ్యమంత్రులను అరెస్ట్‌లను చేస్తున్నారు.. కానీ, గౌతమ్ అదానీని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అదానీ.. భారత చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లఘించారనని నిరూపించబడిందని చెప్పుకొచ్చారు. అదానీని వంద శాతం ప్రధాని మోదీనే కాపాడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ లంచం ఆరోపణ కేసులో గౌతమ్ అదానీ, ఇతరులపై అభియోగాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు గౌతమ్ అదానీ, మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్‌బీఐ చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. అమెరికాలో ఇది స్పష్టంగా నిరూపించబడింది. అయినప్పటికీ అదానీ బాహ్య ప్రపంచంలో స్వేచ్చగా తిరుగుతున్నారు. చట్టాలు ఆయనకు వర్తించవా?. అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాం. #WATCH | Delhi: When asked if he would raise the issue of US prosecutors charging Gautam Adani and others in alleged Solar Energy contract bribery case, in Parliament, Lok Sabha LoP Rahul Gandhi says, "We are raising this issue. It is my responsibility as LoP, to raise this… pic.twitter.com/UenrnN2dej— ANI (@ANI) November 21, 2024ఇదే సమయంలో అదానీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మేము పార్లమెంట్ సాక్షిగా ఎన్నో సార్లు చెప్పాము. కానీ, అదానీపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం మాత్రం ముందుకు రాదు. ఎందుకంటే ప్రధాని మోదీనే అదానీని వంద శాతం కాపాడుతున్నారు. మోదీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారు. అదానీ అక్రమాలపై విచారణ జరిపేందుకు జేపీసీ ఏర్పాటు చేయాలన్నది ముందు నుంచి మా డిమాండ్. ఇప్పుడు కూడా ఇదే కోరుతున్నాం. అదానీ రూ.2000 కోట్ల స్కాం చేసినా స్వేచ్చగా బయటే తిరుగుతున్నారు. ఇక, రాహుల్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ కార్యాలయంలో పవర్ కట్ కావడంతో అదానీ పవర్, మోదీ పవర్ ఏది పనిచేస్తుందో అర్థం కాలేదు అంటూ సెటైర్లు వేశారు. కచ్చితంగా పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తుతాం. ప్రజలకు అన్ని వివరాలను వెల్లడిస్తాం. ఏ రాష్ట్రంలో అదానీ అవినీతికి పాల్పడినా కచ్చితంగా విచారణ జరపాలి. ఈ వ్యవహారంలో అదానీకి తోడుగా ఉన్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కానీ, అదానీని అరెస్ట్ చేయరు.. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయి.. కాబట్టి ఆయనపై విచారణ కూడా ఉండదు. అదానీ దేశాన్ని హైజాక్ చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, ఈ కేసుకు సంబంధించి సెబీ చీఫ్ మదహబి పురి బుచ్‌ను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. #WATCH | Delhi: On US prosecutors charging Gautam Adani and others in alleged Solar Energy contract bribery case, Lok Sabha LoP Rahul Gandhi says, "JPC is important, it should be done but now the question is why is Adani not in jail?...American agency has said that he has… pic.twitter.com/rAzVUoquqN— ANI (@ANI) November 21, 2024 -
హిమాచల్ భవన్ జప్తు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను కాకుండా.. బదులుగా సర్కస్లను నడుపుతోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. హిమాచల్‌లో రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తన చేతకాని ప్రభుత్వం వల్ల రాష్ట్రం తీసుసుకున్న అప్పును తీర్చలేక ఢిల్లీలో హిమాచల్ భవన్‌ను కోల్పోవాల్సి వస్తుందని విమర్శలు గుప్పించారు. గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గారంటీలు ఇవ్వడం, చేతికందినన్ని అప్పులు చెయ్యడం, ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చెయ్యించుకునే పరిస్థితికి రావడం కాంగ్రెస్ అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. మొన్న గారంటీలు అమలు చెయ్యలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థితి హస్తానికి తలెత్తిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. నేడు కాంగ్రెస్ చెల్లించాల్సిన అప్పు తేల్చకపోతే, డిల్లీలో హిమాచల్ భవన్‌ను జప్తు చేస్తాం అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. తమ హామీలకు నిధులు సమకూర్చడం కోసం చట్టబద్ధంగా గంజాయిని విక్రయించడానికి కాంగ్రెస్ అనుమతి కోరిందని ప్రస్తావించారు. మరి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చడానికి ఏం విక్రయిస్తారంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.కాగా ఓ విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హిమాచల్ భవన్ జప్తుకు రాష్ట్ర హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనాన్ని వేలం వేసి బకాయిలు తీర్చేసుకోవాలని సదరు కంపెనీకి సూచించింది. దీంతో పది గ్యారెంటీల పేరుతో రెండేళ్ల క్రితం హిమాచల్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గారంటీలు ఇవ్వడం! చేతికందినన్ని అప్పులు చెయ్యడం! ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చెయ్యించుకునే పరిస్థితికి రావడం! ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు! సాక్షాత్తు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు! గారంటీలు అమలు చెయ్యలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థి… pic.twitter.com/1lfvoR1Bu7— KTR (@KTRBRS) November 20, 2024 -
ఏక్ హై తో మోదీ, అదానీ సేఫ్ హై: రాహుల్ గాంధీ
ముంబై/రాంచీ: ‘ఏక్ హై తో సేఫ్ హై’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సేఫ్ అంటే సురక్షితంతోపాటు బీరువా అనే అర్థం కూడా ఉంది. మోదీ పిలుపునకు, ముంబైలో అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టిన ధారావి అభివృద్ధి పథకాన్ని ముడిపెడుతూ విమర్శలు గుప్పించారు. రాహుల్ సోమవారం ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వెంట ఒక సేఫ్(చిన్నపాటి బీరువా) కూడా తీసుకొచ్చారు. అందులోంచి రెండు పోస్టర్లు బయటకు లాగారు.ఒక పోస్టర్‌పై నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ ఫోటో, మరో పోస్టర్‌పై ధారావి మ్యాప్ ఉంది. మోదీ, అదానీ ఫోటోపై ‘ఏక్ హై తో సేఫ్ హై’ అనే పిలుపును ముద్రించారు. కలిసి ఉంటే సురక్షితంగా ఉంటామని మోదీ చెబుతున్నారని, వాస్తవానికి సురక్షితంగా ఉన్నది ఎవరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీ, అదానీ కలిసికట్టుగా ముందుకుసాగుతూ, ఒకరికొకరు చక్కగా సహకరించుకుంటూ సురక్షితంగా ఉంటున్నారని మండిపడ్డారు. ధారావి అభివృద్ధి ప్రాజెక్టు పేరిట రూ.లక్ష కోట్ల విలువైన భూమిని అదానీకి అప్పగించారని మండిపడ్డారు. కేవలం అదానీ ప్రయోజనాల కాపాడేలా ధారావి ప్రాజెక్టు టెండర్లు రూపొందించారని విమర్శించారు.ధారావి ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి బడా పారిశ్రామికవేత్తల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోందని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఇతర పారిశ్రామికవేత్తలకు దక్కిన ప్రాజెక్టులను నరేంద్ర మోదీకి సన్నిహితులైన బిలియనీర్లకు అప్పగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. దేశంలో ఓడరేవులు, విమానాశ్రయాలతోపాటు దేశ సంపదను కేవలం ఒకే ఒక్క వ్యక్తికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్ షా, అదానీ కలిసుంటారు ‘‘ప్రధాని మోదీ ప్రవచిస్తున్న ‘ఏక్ హై తో సేఫ్ హై’కి అసలు అర్థం నేను చెబుతా. నరేంద్ర మోదీ, అమిత్ షా, గౌతమ్ అదానీ కలిసి ఉంటే సురక్షితంగా ఉంటారు. ఆ ముగ్గురూ కలిసే ఉంటున్నారు. దేశ సంపద మొత్తం అదానీ, అంబానీ లాంటి బడా బాబుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. టెండర్లలో పారదర్శకతకు పాతరవేసి, ప్రాజెక్టులను వారికి కట్టబెడుతున్నారు’’ అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఆయన సోమవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో మీడియాతో మాట్లాడారు. మణిపూర్ గత ఏడాదిన్నర కాలంగా మండిపోతున్నా ప్రధాని మోదీ మొద్దునిద్ర వీడడం లేదని అన్నారు. హింసాకాండలో అమాయక ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా కాదని రాహుల్ తేల్చిచెప్పారు. రిజర్వేషన్లను మరింత పెంచాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. -
బిలియనీర్లు, పేదలకు మధ్య పోరే ఈ ఎన్నికలు: రాహుల్
ముంబై: మహారాష్ట్ర ఎన్నికలు ఇద్దరు బిలియనీర్లు, పేదల మధ్య పోరుగా పేర్కొన్నారు కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ముంబైలోని భూమి అంతా తమ చేతుల్లోకి వెళ్లాలని ఆ బిలియనీర్లు కోరుకుంటున్నారని అంబానీ, అదానీలను పరోక్షంగా ఉద్ధేశిస్తూ విమర్శించారు. ఈ మేరకు ముంబైలో సోమవారం రాహుల్ మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్ సహా రూ.7 లక్షల కోట్ల ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలించారని మండిపడ్డారు. దీని వల్ల మహారాష్ట్రలో యువత ఉద్యోగాలు కోల్పోయారని ఆయన అన్నారు.‘మహారాష్ట్ర రైతులు, పేదలు, నిరుద్యోగులు, యువతకు సహాయం అవసరం. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో ఉచితంగా రూ.3000 జమ చేస్తాం, మహిళలకు, రైతులకు బస్సు ప్రయాణం, రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. సోయాబీన్‌కు క్వింటాల్‌కు రూ.7వేలు మద్దతు ధర ఇస్తాం. తెలంగాణ, కర్ణాటకలో మాదిరి మహారాష్ట్రలో కూడా కులగణన పూర్తి చేస్తాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించి, దేశంలో కుల గణన నిర్వహిస్తాం’ అని తెలిపారు.ఇక ఇటీవల ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ‘ఏక్ హై తో సేఫ్ హై’ (ఐక్యంగా ఉంటేనే మనమంతా సురక్షితంగా ఉంటాం) అని ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే మోదీ సర్కార్ పని చేస్తోంది. పేదల గురించి వారికి ఎలాంటి ఆలోచన లేదు. ధారావిలోని నివాసితుల ప్రయోజనాలను విస్మరించారు. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అక్కడి ప్రజలకు భూములను తిరిగి అప్పగిస్తుంది’’ అని రాహుల్ భరోసానిచ్చారు. -
బైడెన్ లాగే మతిమరుపు
అమరావతి/ చిముర్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని నరేంద్ర మోదీ మతిమరుపుతో బాధపడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని దేశ డీఎన్ఏగా భావిస్తుందని, అధికార బీజేపీ, రాష్ట్రయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లకు మాత్రం అదో ఖాళీ పుస్తకమని రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ అమరావతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చవచ్చని రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదని, కానీ మహారాష్ట్రలో అదే జరిగిందని పేర్కొన్నారు.బడా వ్యాపారవేత్తలకు సంబంధించి 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని బీజేపీపై ధ్వజమెత్తారు. ‘రాజ్యాంగమే మన దేశ డీఎన్ఏగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు అదో ఖాళీ పుస్తకం’అని రాహుల్ అన్నారు. ఎన్నికల ప్రచారసభల్లో రాహుల్ ప్రదర్శిస్తున్న రాజ్యాంగ ప్రతిలో లోపలి పేజీలు ఖాళీగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ విమర్శించిన నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా స్పందించారు. నేను లెవనెత్తుతున్న అంశాలపైనే మోదీ మాట్లాడుతున్నారని సోదరి ప్రియాంకగాంధీ నా దృష్టికి తెచ్చారు. ‘కులగణన జరగాలని, రిజర్వేషన్లపై 50 శాతం గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని నేను మోదీకి లోక్‌సభలో చెప్పాను.కానీ ఆయన మాత్రం నేను రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఎన్నికల సభల్లో చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ లాగే మతిమరుపుతో బాధపడుతున్నారు’అని రాహుల్ ధ్వజమెత్తారు. బైడెన్ ఒక సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌గా పరిచయం చేయడాన్ని ఉదహరించారు. అలాంటి లక్షణాలే మోదీలోనూ కనపడుతున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ కులగణనకు వ్యతిరేకమని కూడా మోదీ చెబుతారని ఎద్దేవా చేశారు. రాహుల్ బ్యాగ్ తనిఖీ సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం తనిఖీ చేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ మహారాష్ట్రలోని అమరావతికి వెళ్లా రు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ ధమన్‌గావ్ రైల్వే హెలిప్యాడ్‌లో దిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హెలికాప్టర్లో ఎన్నికల సంఘం అధికారులు సోదాలు చేశారు. ఎన్నికల సంఘం తనిఖీలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. -
జో బైడెన్‌లాగే ప్రధాని మోదీకి మతిపోయినట్లుంది: రాహుల్
ముంబై: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని మోదీక జ్ఞాపకశక్తి కోల్పోతున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాట్లాడే విషయాలపై మాత్రమే మోదీ తరుచూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్‌మాట్లాడుతూ.. బిడెన్ (81) పొరపాటున ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌గా పరిచయం చేసిన సంఘటనను ప్రస్తావించారు.‘ప్రధానిమోదీ ప్రసంగం విన్నట్లు మా సోదరి ప్రియాంక నాతో చెప్పింది. ఆయన ఆ స్పీచ్‌లో కాంగ్రెస్ ఏం మాట్లాడుతుతోందే దానిపైనే మోదీ మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఆయనకు జ్ఞాపకశక్తి తగ్గిపోయిందేమో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వస్తే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చారని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తప్పుగా అన్నారు. అతను తన జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. అలాగే మన ప్రధాని కూడా జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. గత ఏడాది కాలంగా నా ప్రసంగాల్లో రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని చెబుతున్నా.. కానీ కాంగ్రెస్ రాజ్యాంగంపై దాడి చేస్తోందని ప్రధాని మోదీ చెబుతున్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహిస్తున్నారని తెలిసి ఇప్పుడు ఆయన నేను రాజ్యాంగంపై దాడి చేస్తున్నాను అని అబద్దాలు చెబుతున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 50 శాతం రిజర్వేషన్ పరిమితిని రద్దు చేస్తామని లోక్‌సభలో కూడా చెప్పాను. కానీ మోదీ ఇప్పటికీ రాహుల్ గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెబుతున్నారు. అందుకే ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారని అనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రాహుల్‌గాంధీ బ్యాగులు తనిఖీ చేసిన ‘ఈసీ’
ముంబయి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్ర వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యాగులను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. శనివారం(నవంబర్ 16) మధ్యాహ్నం అమరావతిలో రాహుల్ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే అధికారులు ఆయన బ్యాగులు చెక్ చేశారు. బ్యాగులతో పాటు రాహుల్‌గాంధీ వచ్చిన హెలికాప్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో రాహుల్ తన పార్టీ నేతలతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పలువురు ప్రముఖ నేతల బ్యాగుల తనిఖీలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. ఈ తనిఖీలు’ తాజాగా రాజకీయ దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారులు పలుమార్లు తనిఖీ చేయడం వివాదానికి దారి తీసింది. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఎన్నికల అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.అయితే,ఎన్నికల వేళ ఇది సాధారణ ప్రక్రియే అంటూ ఈసీ క్లారిటీ ఇచ్చింది. కాగా,మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.నవంబరు 23న ఫలితాలను వెల్లడించనున్నారు.ఇదీ చదవండి: కసబ్‌కు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: జేపీ నడ్డా -
కేసీఆర్ ను ఫినిష్ చేస్తానన్న వారే ఫినిష్ అయ్యారు: కేటీఆర్
-
రాహుల్ హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి నిరాకరణ.. గంటపాటు ఆలస్యం
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి శుక్రవారం అనుకోని అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు ఏటీసీ నుంచి ఆనుమతి రాకపోవడంతో టేకాఫ్‌కు గంటకు పైగా ఆలస్యం అయ్యింది. దీంతో రాహుల్ చాలాసేపు హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గొడ్డాలో ప్రచారానికి వెళ్లారు కాంగ్రెస్ నేత. అక్కడ బహిరంగ ర్యాలీలో ప్రసంగించడం ముగిసిన తర్వాత ఆయన ప్రచారం కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదు. భద్రతా కారణాల పేరుతో క్లియరెన్స్ ఆలస్యంగా లభించింది. ఈ సమస్యతో 75 నిమిషాలపాటు రాహుల్ హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది. హెలికాప్టర్ టేకాఫ్‌కు ఆలస్యం అవడంతో రాహుల్ ప్రయాణ షెడ్యూల్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది.HUGE BREAKING 🚨⚡LoP Rahul Gandhi’s helicopter denied permission from flying in JharkhandIt’s been more than 2 hours but no permission granted yet 🚨Why is Modi & BJP so scared? pic.twitter.com/WJltLvaB5p— Ankit Mayank (@mr_mayank) November 15, 2024హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి ఆలస్యంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. రాజకీయంగా ప్రేరేపితమైనదని మండిపడింది. ఇది బీజేపీ పన్నిన కుట్రేనని ఆరోపించింది. తమ ప్రచారాలను అణగదొక్కే ప్రయత్నమని పేర్కొంది. ‘రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలను ఆలస్యం చేయడానికి చేసిన ప్రయత్నమే.. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నాయకులు తోసిపుచ్చారు.మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), స్థానిక అధికారులు కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, అదనపు భద్రతా తనిఖీలు, ఎయిర్‌స్పేస్ మేనేజ్మెంట్ ఆందోళనలు హోల్డ్అప్కు కారణమై ఉండవచ్చని సమాచారం. -
యూపీ ప్రచారానికి అగ్రనేతలు అనుమానమే?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారంపై సందిగ్ధత నెలకొంది. వయనాడ్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ నెల 13న ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకగాందీలు యూపీలో ఈ నెల 20న 9 స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావించినా ఇంతవరకు పార్టీ తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా రాహుల్, ప్రియాంకలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వారు ప్రచారం చేయడం కష్టమేనని తెలుస్తోంది. నిజానికి యూపీలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావించింది. 9 స్థానాలకు గానూ కనీసంగా 4 స్థానాలకు తమకు వదిలేయాలని భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీని కోరినప్పటికీ ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నుంచి సానుకూల స్పందన రాలేదు. చివరి 2 స్థానాలు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించినా, గెలుపు అవకాశాలు లేకపోవడంతో వాటిల్లో పోటీకి కాంగ్రెస్ నిరాకరించింది. తొమ్మిది స్థానాల్లోనూ ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థులే పోటీ చేస్తారని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో అఖిలేశ్ యాదవ్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. అధికార బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం ఇంతవరకు ప్రచారంలో పాల్గొనలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్‌రాయ్ సహా మాజీ ఎంపీ పీఎల్ పునియాలు ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రచారం కోసం కాంగ్రెస్, ఎస్పీలు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర సీఎల్పీ నేత ఆరాధన మిశ్రా, కాంగ్రెస్ ఎంపీ తనూజ్ పునియాలు ఎస్పీతో కలిసి సంయుక్త ర్యాలీలు నిర్వహిస్తున్నా, అంతంతమాత్రం స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలతో ఉమ్మడి ప్రచార ప్రణాళికను రూపొందించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఉమ్మడి ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభల కోసం సత్వరమే షెడ్యూల్ ఖరారు చేసి, అధికార బీజేపీ విభజన రాజకీయాలను బట్టబయలు చేసే కార్యాచరణ తీసుకోవాలని ఇరు పారీ్టల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా.. అగ్రనేతల ప్రచారంపై ఇంతవరకు ఏఐసీసీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. -
Rahul Gandhi: ఏమీ ఉండదనే చదవలేదనుకుంటా
నందూర్బార్(మహారాష్ట్ర): తాను తరచూ ప్రదర్శించిన ఎరుపురంగు రాజ్యాంగప్రతి అంతా ఖాళీ అంటూ ప్రధాని మోదీసహా అధికార బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు లోక్‌సభలో విపక్ష నేత గట్టి సమాధానమిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నందూర్బాగ్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘‘ రాజ్యాంగ ప్రతి కవర్ ఎరుపు రంగులో ఉందా నీలం రంగులో ఉందా అనేది మనం ఎప్పుడూ చూడలేదు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధపడ్డాం. ఇంతటి ఘనత గల రాజ్యాంగంలో ఏమీ లేదని, ఏమీ ఉండదని ప్రధాని మోదీజీకి గట్టి నమ్మకం కల్గిందేమో. ఎందుకంటే జీవితంలో ఆయన ఎప్పుడూ ఈ రాజ్యాంగాన్ని చదివిఉండరు. ఏమీ ఉండదనే చదవలేదనుకుంటా. అందుకే నేను ర్యాలీల్లో చూపించే ఎరుపురంగు రాజ్యాంగప్రతి లోపల అన్నీ తెల్లపేజీలే అని చెబుతున్నారు. మోదీజీ ఇది ఖాళీ పుస్తకం కాదు. భారతీయ ఆత్మ, జ్ఞానానికి ఆలవాలం ఈ పుస్తకం. బిర్సా ముండా, బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా పూలే, మహాత్మాగాంధీల ఆత్మతో భారత రాజ్యాంగం నిండి ఉంది. అయినాసరే మీరు ఈ పుస్తకం ఖాళీ అని అంటున్నారంటే మీరు వీళ్లందరినీ అవమాని స్తున్నట్లే’’ అని రాహుల్ అన్నారు. ‘‘ ఆదివా సీలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు నిర్ణయాధికారం దక్కాలి కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లు గిరిజనులను ఆదివాసీలు అని సంభోదించకుండా వనవాసులు అని పిలుస్తు న్నారు. నీరు, భూమి, అడవిపై తొలి హక్కు దారులు ఆదివాసీలే. ఎలాంటి హక్కులు కల్పించకుండా బీజేపీ ఆదివాసీలను అడవికి పరిమితం చేసింది. బిర్సా ముండా ఇవే హక్కుల కోసం పోరాడి వీరమరణం పొందారు’’ అని రాహుల్ అన్నారు. మేనిఫెస్టోను ప్రస్తావించిన రాహుల్‘‘మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంబీఏ) జనప్రయోజన వాగ్దానాలతో మేనిఫెస్టోను మీ ముందుకు తెచ్చింది. అధికారంలోకి వస్తే మా కూటమి సర్కార్ రైతులు, యువతకు నెలకు రూ.3,000 ఆర్థిక తోడ్పాటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.3,00,000 దాకా రుణమాఫీ, నిరుద్యోగయువతకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి అందించనుంది. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీల అసలైన జనసంఖ్య తెలిస్తే వారికి ఆ మేరకు వనరుల్లో న్యాయమైన వాట దక్కుతుంది. అందుకు జనగణన ఎంతగానో దోహదపడనుంది. ప్రస్తుతం 80 శాతం గిరిజనుల జనాభాలో నిర్ణాయాత్మక స్థాయి లో కేవలం ఒక శాతం మంది మాత్రమే ఉన్నారు’’ అని అన్నారు. ఒక్కరే ఆదివాసీ ఆఫీసర్‘‘కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత ఉన్న తాధికారులు 90 మంది ఉంటే వారిలో ఆదివాసీ వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఉదాహరణకు ఈ 90 మంది అధికారులు రూ.100 విలువైన ప్రజాపనులపై నిర్ణయాలు తీసుకుంటే ఆదివాసీ అధికారి నిర్ణయంపై ఆధారపడే పనుల విలువ కేవలం 10 పైసలు. మొత్తంగా చూస్తే పనిచేసే ఆ కొద్ది మంది ఆదివాసీ అధికారులను కీలకమైన శాఖల్లో ఉండనివ్వ రు. అప్రాధాన్యమైన విభాగాల్లో, పోస్టుల్లో నియమిస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. మనం ఈ పద్ధతిని మారుద్దాం’’ అని రాహుల్ అన్నారు. -
కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎం!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం రాహుల్ గాందీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి తెలంగాణ నుంచే డబ్బు మూటలు వెళ్తున్నాయని ఆరోపించారు. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దుల్లో భద్రతను పెంచాలని, ఆన్లైన్ లావాదేవీలపై మరింత నిఘా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామన్నారు. పలు సందర్భాల్లో తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాలంటూ వ్యాఖ్యానించిన ప్రధానమంత్రి మోదీ.. సీఎం రేవంత్‌రెడ్డి అవినీతిపై చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించారు.అమృత్ స్కీంలో జరిగిన స్కాంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్‌తో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు ఈ స్కాంపై చర్యలు తీసుకోకపోతే తాము రాజ్యసభలో ఈ అంశాన్ని లెవనెత్తి దేశమంతా ఆలోచించేలా చేస్తామని కేంద్రమంత్రిని హెచ్చరించినట్లు చెప్పారు. మంగళవారం వసంత్‌విహార్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, మాజీ ఎంపీ బాల్క సుమన్, దాసోజు శ్రవణ్‌లతో కలిసి కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కొడంగల్ వాసులకు విషం సొంత బావమరిది సృజన్‌రెడ్డికి అమృతం ఇచి్చన సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ వాసులకు మాత్రం విషం ఇచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. బావమరిది కంపెనీని అందలమెక్కించేందుకు రేవంత్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రుణమాఫీ, రైతుబంధు, పింఛన్లు, తులం బంగారం, మహిళలకు రూ.2,500 ఇచ్చేందుకు డబ్బు లేదు కానీ.. మహారాష్ట్రలో మాత్రం రూ.300 కోట్లతో పేపర్ యాడ్స్ ఇచ్చారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతిపై వివరాలిచి్చనా కేంద్రం ఇప్పటివరకూ విచారణ జరపలేదని మండిపడ్డారు. బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు ఎవరైనా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించారా అని నిలదీశారు. సీఎం హైదరాబాద్‌ను నాలుగు ముక్కలుగా చేసే కుట్రలో బీజేపీ ఎంపీలు మద్దతు పలుకుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి పెట్టుబడులు బీజేపీపాలిత రాష్ట్రాలకు తరలించాలన్నదే రేవంత్ ఎజెండా అని వ్యాఖ్యానించారు. రేవంత్ 26 సార్లు ఢిల్లీ వచ్చారు... 11 నెలల్లో 26 సార్లు ఢిల్లీకి వచి్చన సీఎం రేవంత్ తెలంగాణకు రూ.26 పైసలు కూడా తీసుకురాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నేను ఢిల్లీకి వస్తే మీకేం పని అని మంత్రి పొంగులేటి అంటున్నాడు. మీ కుంభకోణాలు, మీ చేతగాని పాలనను దేశ ప్రజల ముందుకు తెచ్చేందుకే ఢిల్లీకి వచ్చాను. పౌరసరఫరాల శాఖలో అవినీతి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీల లీలలు కూడా బయటపెట్టేందుకు మళ్లీ మళ్లీ ఢిల్లీకి వస్తాను. నేను ఈ సమావేశం అనంతరం హైదరాబాద్‌కు వస్తా.. మీకు (కాంగ్రెస్ ప్రభుత్వానికి) దమ్ముంటే ఏదైనా చేయండి. ఎన్ని ఏజెన్సీలనైనా రప్పించుకోండి’అని కేటీఆర్ అన్నారు. 2–3 వారాల క్రితం కోహినూర్ హోటల్లో పొంగులేటి అదానీని రహస్యంగా కలిసి కాళ్లు పట్టుకున్నారా లేదా అని వ్యాఖ్యానించారు. కులగణన పేరుతో 75 ప్రశ్నలు కేసీఆర్ పేరు తలవనిదే ఒక్కరోజు కూడా సీఎం రేవంత్‌కు నిద్రపట్టదని కేటీఆర్ విమర్శించారు. ప్ర జలు కేసీఆర్ పేరు మర్చిపోతే సీఎంకు వచి్చన బా ధ ఏంటని ప్రశ్నించారు. కులగణనకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో 75 ప్రశ్నలు వేయడమేంటని నిలదీశారు. ఎవరైనా కులం, మతం వివరాలు అడుగుతారని, కానీ.. మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా, టీవీ ఉందా, ఏసీ ఉందా అనే ప్రశ్నలు అడుగుతున్నారని దుయ్యబట్టారు. అవి లేకపోతే నువ్వేమైనా కొనిస్తావా అంటూ సీఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేలను మేకలను కొన్నట్లు కొంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలను కూడా ఇలాగే కొన్నారనే విషయం మర్చిపోవద్దన్నారు.పనికిరాని పాలనలో ఆగంపసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణ తల్లడిల్లుతూ తిరగబడుతోంది. కుటుంబ దాహం కోసం జరుగుతున్న కుట్రలపై లగచర్ల పోరాడుతోంది. మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతోంది. కుట్రలు, కుతంత్రపు పాలనలో జనం కోపం కట్టలు తెంచుకుంటోంది. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, హైడ్రా దౌర్జన్యాలు, మూసీలో ఇళ్ల కూల్చివేతలు ఇలా పలు అంశాలపై అనేక మంది ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల మహా ధర్నా, పెండింగ్ బకాయిల కోసం మాజీ సర్పంచ్ల నిరసన, పరీక్షల నిర్వహణపై విద్యార్థుల ఆగ్రహం, ఫార్మా పరిశ్రమలకు భూములు ఇవ్వమంటూ అన్నదాత కన్నెర్ర వంటి ఘటనలు రాష్ట్రంలో ప్రతీరోజు కనిపిస్తున్నాయి’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
రాజ్యాంగం అంతానికి కుట్రలు
గోండియా/న్యూఢిల్లీ: మన దేశ రాజ్యాంగాన్ని అంతం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిరోజూ 24 గంటలూ పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని చదవలేదని తాను గ్యారంటీగా చెప్పగలనని అన్నారు. ఒకవేళ నిజంగా ఆయన చదివి ఉంటే రాజ్యాంగంలో రాసి ఉన్న అంశాలను తప్పనిసరిగా గౌరవించేవారని పేర్కొన్నారు.ఐక్యత, సమానత్వం, అన్ని మతాల పట్ల గౌరవాన్ని రాజ్యాంగం బోధిస్తోందని గుర్తుచేశారు. విద్వేషం, అణచివేత, అసమానత్వాన్ని వ్యతిరేకిస్తోందని తెలిపారు. మంగళవారం మహారాష్ట్రలోని గోండియాలో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. పదేళ్లలో ఎంతమంది రైతుల రుణాలను మాఫీ చేశారో ప్రధానిని ప్రశ్నించాలని ప్రజలను కోరారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలి్చవేయడం రాజ్యాంగబద్ధమేనా? అని నిలదీశారు. రాజ్యాంగాన్ని బలహీనపర్చడం బీజేపీకి అలవాటేనని మండిపడ్డారు. అత్యున్నత పర్యాటక కేంద్రంగా వయనాడ్ కేరళలోని వయనాడ్‌ను అత్యున్నత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని తాను, తన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా సంకలి్పంచామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక వీడియోను తన యూట్యూబ్ ఖాతాలో విడుదల చేశారు. సోమవారం ప్రియాంకతో కలిసి వయనాడ్ అడ్వెంచర్ పార్కును సందర్శించిన దృశ్యాలను పంచుకున్నారు. ఇటీవల ప్రకృతి విపత్తుల కారణంగా తీవ్రంగా నష్టపోయినప్పటికీ వయనాడ్ ప్రజల్లో ఆత్మస్థైర్యం తగ్గిపోలేదని, వారిని చూసి స్ఫూర్తిని పొందామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యరి్థగా ప్రియాంక పోటీ చేస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక బుధవారం జరుగనున్న సంగతి తెలిసిందే. -
ముంబయి: రాహుల్‌గాంధీపై అమిత్ షా ఫైర్
ముంబయి: రాహుల్‌గాంధీ నాలుగు తరాలొచ్చినా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(నవంబర్ 11) ముంబయిలో నిర్వహించిన ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు.‘ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం నిర్మూలించారు.మీ నాలుగు తరాలొచ్చినా కశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ సాధ్యం కాదని రాహుల్‌కు చెబుతున్నా.బీజేపీకి రాజకీయ అధికారం కన్నా కశ్మీర్ సమస్యే హృదయానికి దగ్గరగా ఉంటుంది’అని అమిత్ షా అన్నారు. కాగా, ఇటీవలే మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేశారు.వృద్ధులకు పెన్షన్ పెంపు, మహిళలకు నగదు బదిలీ వంటి హామీలను బీజేపీ ఇచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. 23న ఫలితాలు వెలువడనున్నాయి. మహాయుతి(ఎన్డీఏ), మహావికాస్ అఘూడీ(ఎంవీఏ) కూటములు ఎన్నికల్లో పోటీపడుతున్నాయి.ఇదీ చదవండి: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం.. కన్నెత్తి చూడని సెలబ్రిటీలు -
మహారాష్ట్రలో లబ్ధి కోసమే ఇక్కడ కులగణన డ్రామా
హనుమకొండ/యాదగిరిగుట్ట రూరల్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధ్వజమెత్తారు. కులగణనలో ఆస్తులు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఆదాయం వంటి వివరాలు ఎందుకంటూ ప్రజలు అధికారులను నిలదీస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి ఏడాది అవుతున్నా దానిపై ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా దానిని అమలు చేయలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామని అబద్ధాలు ఆడుతున్నారని, ఏ ఒక్కరికైనా బోనస్ ఇచ్చినట్లు చూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్న సందర్భంగా వారోత్సవాలు నిర్వహించాలా..? విజయోత్సవాలు నిర్వహించాలా అనే ఆలోచన చేస్తున్నారని, వారు విజయోత్సవాలు నిర్వహిస్తే.. తాము కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యాలపై వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.రేవంత్‌రెడ్డి రాగానే బీసీబంధు, రైతుబంధు, దళితబంధు.. ఇలా అన్నీ బందయ్యాయని కేటీఆర్ అన్నారు. కులగణన పూర్తయిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ బాంబులు.., ఆ బాంబులు పేలుతాయంటున్న ఆ మంత్రి ఏ ఒక్క బాంబు పేల్చేది లేదని, ఆయన ఏ మంత్రి ఏమోకాని బాంబుల మంత్రి అని పేరు పెట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అధైర్యపడొద్దు.. మళ్లీ వచ్చేది కేసీఆర్ సారే రైతులు అధైర్యపడవద్దని, మళ్లీ కేసీఆర్ సారే వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు వెళ్తుండగా, భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామం వద్ద ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలసి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా చొల్లేరు గ్రామానికి చెందిన తోటకూరి వెంకటమ్మ అనే వృద్ధురాలు కేటీఆర్ వద్దకు వెళ్లి.. ‘కేసీఆర్ సారు పాలననే బాగుండేది, మాకు రైతుబంధు క్రమం తప్పకుండా వేసేవాడు, ఆ డబ్బులతో వ్యవసాయం చేసుకుని సంతోషంగా ఉండేవాళ్లం, ఇప్పుడు రైతుబంధు రావడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం’అని అన్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. బాధపడవద్దని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, కేసీఆర్ సారే మళ్లీ సీఎం అవుతారని భరోసా ఇచ్చారు.పగ నామీదే అయితే పదవిని వదిలేస్తా: కేటీఆర్సిరిసిల్లటౌన్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నామీద పగ ఉంటే.. సిరిసిల్ల ఎమ్మెల్యే పదవిని రేపే వదిలేస్తా’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 నెలల్లో 34 మంది చేనేత కార్మికులు చనిపోయారని, ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు తెరవాలని, చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో శనివారం ఆత్మహత్యకు పాల్పడిన నేత దంపతులు బైరి అమర్నాథ్, స్రవంతి పిల్లలు లహరి, శ్రీవల్లి, దీక్షిత్నాథ్లను ఆదివారం ఆయన పరామర్శించారు. పిల్లలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 34 మంది నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడినా ప్రభుత్వానికి సోయి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సర్కారు సిగ్గు తెచ్చుకోవాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ, కేసీఆర్ కిట్ల ఆర్డర్లు రాక సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చేదాకా బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు -
Rahul Gandhi: బీజేపీ విధానాలతో ప్రజలకు చావులే
జంషెడ్పూర్/ధన్‌బాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అనేవి రైతులు, కార్మికులు, పేదలను చంపేస్తున్న ఆయుధాలు అని ధ్వజమెత్తారు. విద్వేషాన్ని విశ్వసించే బీజేపీ–ఆర్ఎస్ఎస్, ప్రేమను నమ్మే ‘ఇండియా’కూటమి మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. హింసకు, ఐక్యమత్యాన్ని మధ్య యుద్ధం కొనసాగుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలతో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోందని ఆరోపించారు. శనివారం జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాలు చేస్తున్నాయని, కులం, మతం, భాష ఆధారంగా సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ–ఆర్ఎస్ఎస్ ప్రయతి్నస్తుండగా, తాము పరిరక్షించేందుకు పోరాడుతున్నామని తెలిపారు. కొందరు బడా పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ నిధులు అందజేస్తున్నారని, వారు ఆ సొమ్మును విదేశాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారని ఆరోపించారు. జంషెడ్‌పూర్‌లో ప్రసంగిస్తుండగా మధ్యలో ‘అజాన్’వినిపించడంతో రాహుల్ గాంధీ రెండు నిమిషాలపాటు విరామం ఇవ్వడం గమనార్హం.మహారాష్ట్రలోనూ కుల గణన సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన ప్రక్రియ ప్రారంభిస్తామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రస్తావిస్తూ ఈమేరకు ఆయన శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై రాహుల్ గాంధీకి అమిత్ షా వార్నింగ్
రాంచీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపించి అవమానించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుక కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ ఎప్పటికీ అనుమతించదని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా.. పాలమూలో నిర్వహించిన సభలో మాట్లాడారు.‘‘రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చూపించారు. ఆయన చూపించిన రాజ్యాంగం కాపీ కవర్‌పై భారత రాజ్యాంగం అని వ్రాసి ఉంది. అందులో ఏ కంటెంట్ లేదు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. నకిలీ రాజ్యాంగ కాపీతో బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారు. నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఓబీసీలు, గిరిజనులు, దళితుల నుంచి రిజర్వేషన్లను లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఆ రిజర్వెషన్లనుమైనారిటీలకు ఇవ్వాలని యోచిస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో.. మత ఆధారిత రిజర్వేషన్లను బీజేపీ ఎన్నటికీ అనుమతించదు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కాంగ్రెస్ నాలుగో తరం కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాదని నేను రాహుల్ గాంధీని హెచ్చరిస్తున్నా. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది. ఇక.. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తాం’ అని అన్నారు.ఇక.. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి.చదవండి: దారుణం: రైలు ఇంజిన్-బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి -
రాహుల్ భావితరాలు కూడా.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేవు
సాంగ్లి (మహారాష్ట్ర): కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, ఆయన వారసులు కూడా జమ్మూశ్మీమర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 పునరుద్ధరించలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అది వారి వల్లకాదన్నారు. సాంగ్లిలో మహాయుతి తరఫున శుక్రవారం అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం బుధవారం జమ్మూశ్మీమర్ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్ మద్దతునివ్వడంతో అమిత్ షా హస్తం పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దును విపక్ష నేతలు రాహుల్ గాందీ, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్లు వ్యతిరేకించారని షా గుర్తుచేశారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ గడ్డపై నుంచి చెబుతున్నా.. రాహుల్ బాబా. మీరు లేదా మీ నాలుగోతరం వారసులు కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరు. శ్మీమర్ కోసం దేశంలోని ప్రతి వ్యక్తి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు’అని అమిత్ షా అన్నారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నపుడు పార్లమెంటులో నేనా బిల్లును ప్రవేశపెట్టాను. రాహుల్ గాం«దీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్లు దీన్ని వ్యతిరేకించారు. దీనివల్ల శ్మీమర్ లోయలో రక్తపాతం జరుగుతుందన్నారు. రక్తం ప్రవహించడం మాట అటుంచితే కనీ సం రాయి విసిరే సాహసం కూడా ఎవరూ చేయలేదు’అని అమిత్ షా పేర్కొన్నారు. యూపీఏ హయాంలో తరచూ ఉగ్రదాడులు జరిగేవి. ఉరి, పుల్వామా ఘటనల తర్వాత చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌తో పాకిస్తాన్‌లోని తీవ్రవాదులు తుడిచిపెట్టుకుపోయారని ఆయన అన్నారు. 70 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. మోదీ ప్రయత్నాల వల్ల అది సాకారమైందని అమిత్ షా అన్నారు. -
మణిపూర్‌ను మంటల్లోకి నెట్టేసింది
లోహార్‌దాగా/సిండెగా(జార్ఖండ్): కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలను తీవ్రతరం చేశారు. కాషాయ పార్టీ మణిపూర్‌కు మంటపెట్టిందని, దేశ ప్రజలను మతం ప్రాతిపదికగా విభజించేందుకు ప్ర యత్నిస్తోందని మండిపడ్డారు. దేశంలోని 90 శాతం మంది ప్రజల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. రాహు ల్ శుక్రవారం జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొని, ప్రసంగించారు. ‘బీజేపీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులను ఒకరిపై మరొకరిని ఉసిగొల్పుతోంది. ఇటీవల హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జాట్లు, జాట్‌యేతరుల మధ్య చిచ్చుపెట్టింది. ఇదే బీజేపీ నైజం’అని అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలకు బదులు ప్రేమను పెంచేందుకే కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ‘దళితులు, గిరిజనుల కోసం గళం వినిపించినప్పుడల్లా దేశాన్ని విభజిస్తున్నానంటూ నాపై బీజేపీ విమర్శలు చేస్తోంది. కానీ, నేను దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు, బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా. దేశం జనాభాలో 90 శాతం ఉన్న గిరిజనులు, దళితులు, ఓబీసీలకు పాలనలో భాగస్వామ్యం కోసం మాట్లాడటమే తప్పయినట్లయితే, ఇకపైనా ఇదే పనిని కొనసాగిస్తా’అని రాహల్ అన్నారు. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తాం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని హామీ ఇచ్చా రు. జార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే ఎస్టీల రిజర్వేషన్లను 26 శాతం నుంచి 28 శాతానికి, ఎస్సీల కోటాను 10 నుంచి 12 శాతానికి, ఓబీసీలకు 14 నుంచి 27 శాతానికి రిజర్వేషన్లను పెంచుతామన్నారు. కులగణనతో గిరిజనులు, దళితులు, ఓబీసీల ప్రాతినిధ్యం తగు రీతిలో పెరుగుతుందని చెప్పారు. బీజేపీ రైతు రుణాలు మాఫీ చేసిందా? యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు తీసుకున్న రూ.72 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందంటూ విమర్శలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం..దేశంలోని 25 మంది పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిందని రాహుల్ చెప్పారు. ‘జార్ఖండ్‌లోని రైతుల రుణాలను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందా? లేదు..ఎందుకంటే మీరంతా గిరిజనులు, దళితులు, ఓబీసీలు కాబట్టి. పెట్టుబడిదారుల రుణాలను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం మీరు తీసుకున్న అప్పులను మాత్రం మాఫీ చేయదు’అని ఎద్దేవా చేశారు. గిరిజన ప్రజల నుంచి నీరు, భూమి, అడవి(జల్, జంగల్, జమీన్)ని లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’అని ఆయన ఆరోపించారు. ఇది సైద్ధాంతిక పోరాటం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ఇండియా కూటమి, బీజేపీ–ఆర్ఎస్ఎస్ల మధ్య జరుగుతున్న సైద్థాంతిక పోరుగా రాహుల్ అభివరి్ణంచారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ల లక్ష్యం దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే, ఇండియా కూటమి లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణే అన్నారు. జలం, అడవి, భూమి తమవేనని కాషాయ పార్టీ, ఆర్ఎస్ఎస్, పెట్టుబడిదారులు భావిస్తున్నారు..అందుకే, ప్రధాని మోదీ గిరిజనులను వనవాసీలంటూ సంబోధిస్తున్నారని ఆరోపించారు. -
నేను వ్యాపార వ్యతిరేకిని కాదు: రాహుల్ గాంధీ క్లారిటీ
న్యూఢిల్లీ: తాను వ్యాపారానికి వ్యతిరేకం కాదని, కేవలం గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాను న్యాయమైన వ్యాపార పద్దతులకు మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. భారత్‌లో కార్పొరేట్ శక్తులపై రాహుల్చేసిన వ్యాఖ్యలను బీజేపీ విమర్శించడంతో.. ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ మేరకు గురువారం రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను ఓ విషయాన్ని ఖచ్చితంగా స్పష్టం చేయాలనుకుంటున్నాను. బీజేపీలోని కొందరు వ్యక్తులు నన్ను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు. నేను వ్యాపార వ్యతిరేకిని అస్సలే కాదు. ఉద్యోగాల కల్పన, వ్యాపారానికి, ఆవిష్కరణలకు, పోటీతత్వానికి మద్దతు ఇస్తా.నేను గుత్తాధిపత్యానికి వ్యతిరేకిని. మార్కెట్ నియంత్రణ శక్తులకు వ్యతిరేకిని. కేవలం కొంతమంది వ్యక్తులే ఆధిపత్యం చేలాయించడానికి విరుద్దం’ అని రాహుల్ పేర్కొన్నారు. మేనేజిమెంట్ కన్సల్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించానన్న రాహుల్.. వ్యాపారం విజయానికి అవసరమైన అంశాలను అర్థం చేసుకోగలనని తెలిపారు. తన వ్యాఖ్యలు కేంద్రీకృత శక్తికి వ్యతిరేకంగా ఉన్నాయని, సంస్థకు వ్యతిరేకంగా కాదని పునరుద్ఘాటించారు. -
రాహుల్ గాంధీది ఏ కులం..?
-
సామాజిక న్యాయం జరగాలంటే కులగణన అవసరం