న్యూఢిల్లీ:లోక్‌సభలో ప్రతిపక్షనేత,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది. గురువారం(డిసెంబర్19) పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ తోయడం వల్లే తమ ఇద్దరు ఎంపీలు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్‌గాంధీపై కేసు పెట్టింది.
‘మా పార్టీ రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.దాడి చేయడంతో పాటు దాడికి ప్రేరేపించారని ఫిర్యాదు చేశాం. నిరసన సమయంలో ఏం జరిగిందో ఎంపీలు ఇప్పటికే చెప్పారు’ అని బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
BJP files police complaint against Rahul Gandhi for assault, incitement
Read @ANI Story | https://t.co/ls6lEzdYdB#BJP #AnuragThakur #RahulGandhi #policecomplaint pic.twitter.com/sMqjgPbEvL— ANI Digital (@ani_digital) December 19, 2024
‘రాహుల్ వైఖరి ఆమోదయోగ్యమైందికాదు.అలాగే నేరపూరితమైంది కూడా. అందుకే ఈ రోజు మేమంతా ఆయనపై ఫిర్యాదు చేశాం.పార్లమెంట్‌లోకి శాంతియుతంగా వెళ్లేందుకు భద్రతా సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించారు. ఆ దారిలో వెళ్లాలని పదేపదే అభ్యర్థించారు. కానీ రాహుల్ మాత్రం ఆ అభ్యర్థనను తిరస్కరించారు’ అని మరో ఎంపీ బన్సూరీ స్వరాజ్ చెప్పారు.
అమిత్ షా వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే: రాహుల్‌గాంధీ
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ రాహుల్‌గాంధీపై ఈ ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. అలాగే అదానీ అంశంపై చర్చ వారికి ఇష్టం లేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఖర్గే,రాహుల్‌గాంధీ గురువారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment