praliament
-
రాహుల్‌గాంధీపై హత్యాయత్నం కేసు
న్యూఢిల్లీ:లోక్‌సభలో ప్రతిపక్షనేత,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది. గురువారం(డిసెంబర్19) పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ తోయడం వల్లే తమ ఇద్దరు ఎంపీలు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్‌గాంధీపై కేసు పెట్టింది.‘మా పార్టీ రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.దాడి చేయడంతో పాటు దాడికి ప్రేరేపించారని ఫిర్యాదు చేశాం. నిరసన సమయంలో ఏం జరిగిందో ఎంపీలు ఇప్పటికే చెప్పారు’ అని బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.BJP files police complaint against Rahul Gandhi for assault, incitementRead @ANI Story | https://t.co/ls6lEzdYdB#BJP #AnuragThakur #RahulGandhi #policecomplaint pic.twitter.com/sMqjgPbEvL— ANI Digital (@ani_digital) December 19, 2024 ‘రాహుల్ వైఖరి ఆమోదయోగ్యమైందికాదు.అలాగే నేరపూరితమైంది కూడా. అందుకే ఈ రోజు మేమంతా ఆయనపై ఫిర్యాదు చేశాం.పార్లమెంట్‌లోకి శాంతియుతంగా వెళ్లేందుకు భద్రతా సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించారు. ఆ దారిలో వెళ్లాలని పదేపదే అభ్యర్థించారు. కానీ రాహుల్ మాత్రం ఆ అభ్యర్థనను తిరస్కరించారు’ అని మరో ఎంపీ బన్సూరీ స్వరాజ్ చెప్పారు.అమిత్ షా వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే: రాహుల్‌గాంధీ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ రాహుల్‌గాంధీపై ఈ ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. అలాగే అదానీ అంశంపై చర్చ వారికి ఇష్టం లేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఖర్గే,రాహుల్‌గాంధీ గురువారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. -
‘హిందీయేతర ప్రసంగాలపై వివక్ష’.. ఖండించిన సంసద్ టీవీ
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను ప్రసారం చేసే ‘సంసద్ టీవీ’ హిందీలో మాట్లాడని ఎంపీలపై వివక్ష చూపుతోందని ఎన్సీపీ( శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే సోమవారం ఆరోపణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలపై తాజాగా సంసద్ టీవీ స్పందించింది.‘ఎంపీ సుప్రియా సూలే చేసిన ఆరోపణలు సత్యం లేదు. పార్లమెంట్ కార్యకలాపాలను ఎంపీలు మాట్లాడిన భాషలోనే ప్రసారం చేస్తున్నాం. అయితే వినేవారి సౌలభ్యం కోసం హిందీ, ఇంగ్లీష్, ఇతర ప్రాంతీయ భాషల్లో వినే ఆప్షన్ కల్పించాం. ఎంపీలు కూడా సభలో కూర్చొని.. పార్లమెంట్ కార్యకలాపాలను వినవచ్చు’అని ‘ఎక్స్’లో పేర్కొంది.సోమవారం పార్లమెంట్ సమావేశాల ప్రరంభం అయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాల ప్రచారంలో సంసద్ టీవీ హిందీ మాట్లాడని ఎంపీలపై వివక్ష చూపుతోందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపణలు చేశారు.‘పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభ తొలి సెషన్లోనే సంసంద్ టీవీ ఇంగ్లీష్, ప్రాంతీయ భాషల్లో మాట్లాడే ఎంపీల ప్రసంగాలను హిందీ వాయిస్ ఓవర్ ఇస్తోంది. ఇలాంటి భయంకరమైన చర్యలకు సంసద్ టీవీ పాల్పడుతోంది. సంసద్ టీవీ హిందీలో ప్రసంగించని ఎంపీలపై వివక్ష చూపుతోంది. ఇతర భాషలతో పోల్చితే.. ఒక భాషకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఇలా చేయటం భారత సమాఖ్యవాదాన్ని సవాల్ చేయటమే...ప్రాంతీయ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడే ఎంపీల ప్రసంగాలకు హిందీ వాయిస్ ఓవర్ ఇవ్వటం, సెన్సార్షిప్ విధించటం వల్ల హిందీ మాట్లాడనివారి హక్కులను కాలరాయటమే. ప్రభుత్వం వెంటనే ఇలా ప్రసారం చేయటాన్ని నిలిపివేయాలి. ఇది పూర్తి వివక్ష, సమాఖ్యవాద వ్యతిరేక విధానం’అని ఆరోపణలు చేశారు.2023లో కూడా సంసద్ టీవీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ మాట్లాడే క్రమంలో అధిక శాతం స్పీకర్‌ను చూపించారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ఉద్దేశపూర్వంగా విపక్షాల స్క్రీన్ టైంను సంసద్ టీవీ తగ్గించి ప్రసారం చేసినట్లు ఆరోపణులు చేశారు. -
సారీ.. టైంలేదు!
ప్రతిపాదనలు రాలేదు ఈ ఏడాది ఎంపీ నిధులకు సంబంధించి మొదటి విడతగా ఒక్కొక్కరికి కేంద్రం రూ.2.5కోట్లు విడుదల చేసింది. జిల్లాలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు కలిపి రూ.5 కోట్లు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి ఎంపీల నుంచి ప్రతిపాదనలు అందాల్సి ఉంది. వారి నుంచి ప్రతిపాదనలు రాగానే ఆ నిధులను ఖర్చు చేస్తాం. - సీహెచ్ రమణమూర్తి, సీపీఓ సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా ప్రజాప్రతినిధులకు తీరిక లేనట్లుంది..! ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు వారి దగ్గర ఉన్న నిధులు ఖర్చుచేసేందుకు సమయం దొరకడం లేనట్లుంది. ఎంపీలుగా ఎన్నికై ఆర్నెల్లకాలం గడుస్తున్నా తమ నిధులు ఖర్చుచేసేందుకు ఇప్పటివరకు ఏ ఒక్క ప్రతిపాదనా అందజేయలేదు. దీంతో వారికి కేటాయించిన ఎంపీ నిధులు ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రతి పార్లమెంట్ సభ్యుడికి తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద ఏటా రూ.ఐదుకోట్లు కేటాయిస్తుంది. అయితే వీటిని ఏడాదిలో రెండుదఫాలుగా రూ.2.5 కోట్ల చొప్పున మంజూరు చేస్తుంది. ఈ నిధులు ఎంపీలు పదవిలో ఉన్న ఐదేళ్లపాటు విడుదలవుతాయి. వీటన్నింటినీ సంబంధిత పార్లమెంట్ సభ్యుడు సూచించిన పనులకు మాత్రమే ఖర్చుచేసే అవకాశం ఉంటుంది. వీరు ఈ నిధులను తమ పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఖర్చు చేసుకోవచ్చు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, క్రీడలు, లైబ్రరీ, విద్య, ప్రజల ఆరోగ్యం, మరుగుదొడ్లు, విద్యుత్‌దీపాలు తదితర పనులన్నింటికీ ప్రతిపాదనలు చేసి మంజూరుచేసే అవకాశం ఉంది. కాగా, ప్రభుత్వ భవనాల నిర్మాణం, గ్రాంట్లు, రుణాలు, నిరాశ్రయుల పరిహారం తదితర వాటికి ఎంపీ నిధులు ఖర్చుచేసే అవకాశం ఉండదు. అందని ప్రతిపాదనలు! జిల్లాలో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి ఏపీ జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి నంది ఎల్లయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లాలో రాజ్యసభ సభ్యులు ఒక్కరూ లేరు. దీంతో ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి పద్దుల కింద నిధులు మంజూరయ్యారు. మొదటి విడతగా ఒక్కొక్కరికీ రూ.2.5కోట్లు మంజూరయ్యాయి. అయితే ఈ డబ్బులు వచ్చి దాదాపు రెండు, మూడు నెలలు గడుస్తున్నా.. సంబంధిత పార్లమెంట్ సభ్యుల నుంచి ఏ ఒక్క ప్రతిపాదన కూడా అందలేదు. ఆరునెలలు గడుస్తున్నా ఇద్దరు ఎంపీలు కూడా ఏ ఒక్క ప్రతిపాదన ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జిల్లాలో ఏ ప్రాంతాన్ని, ఏమూలను తట్టినా సమస్యలు కొకొల్లలు. కనీసం తాగడానికి గుక్కెడు మంచి నీళ్లు లేక అలమటిస్తున్న ప్రాంతాలు అనేకం ఉన్నా యి. రోడ్డు సౌకర్యం లేక అనేక గ్రామాలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో నెలకొన్న సమస్యల చిట్టాపద్దు చాలదు. జిల్లాలో ఇన్ని సమస్యలు ఉంటే ఎంపీలు మాత్రం వారి దగ్గరున్న పైసలు ఖర్చు చేయడంలేదు. వారి నుంచి ఇప్పటివరకు ప్రణాళికా కార్యాలయానికి ఒక్క ప్రతిపాదన కూడా అందలేదు. దత్తత గ్రామాల పరిస్థితి దుర్భరం ప్రతి పార్లమెంట్ సభ్యుడు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు జిల్లాలో ఉన్న ఇద్దరు ఎంపీలు కూడా రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని దామరగిద్ద మండలంలోని మొగిలి మడక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అలాగే నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య కూడా తన నియోజకవర్గ పరిధిలోని మల్దకల్ మండలంలోని అమరవాయి గ్రామాన్ని ఎంచుకున్నారు. అయితే గ్రామాల దత్తత తీసుకున్నారే కానీ ఇప్పటివరకు వాటిపై దృష్టిసారించలేకపోయారు. ఇంకా విచిత్రమేమిటంటే ఇరువురు కూడా దత్తతగ్రామాల వైపు కన్నెత్తి చూడలే కపోయారు.