
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంతగానో సేవ చేసిన తనను పార్టీ ప్రస్తుతం గుర్తించకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి మణి శంకర్ మళ్లీ పెదవి విప్పారు. పార్టీకి ఇంకా సేవ చేద్దామని ఉన్నా తనను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తానొక వృద్ధుడిని అని పక్కన పెట్టేశారని, తాను మరీ అంత వృద్ధుడినేమీ కాదన్నారు 83 ఏళ్ల మణిశంకర్ అయ్యర్. జాతీయ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మణి శంకర్ అయ్యర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.‘
ఇప్పుడు నేనేమీ మాట్లాడినా బీజేపీ వక్రీకరిస్తుంది. వారు కచ్చితంగా ఆ పని చేస్తారు. మీతో మాట్లాడిన దానిని వక్రీకరిస్తారు. కానివ్వండి.. వారు అలా చేస్తే మనం చేసేదేమీ ఉండదు.. మా పార్టీలోని పవన్ ఖారే నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. నా సేవలు పార్టీకి అవసరం లేదని తేల్చి చెప్పేశారు. ఏ రకంగానే నా సేవలు అవసరం లేదన్నారు.
ఇక ‘గాంధీ’ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ షిప్ పై మణి శంకర్ అయ్యర్ స్పందించారు. ‘ మా ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. వారు నన్నేమీ శత్రవుగా చూడటం లేదు. కానీ రాహుల్ గాంధీ.. నన్ను బాగా వృద్ధుడిగా చూస్తున్నారు. నేను వృద్ధుడ్నే కానీ.. మీరు అనుకునేంత వృద్ధుడ్ని కాదు. ఇదే వారు నన్ను సంప్రదించకపోవడానికి ప్రధాన కారణం’ అని చెప్పుకొచ్చారు.
ఇక రాహుల్ గాంధీకి మెంటార్ గా వ్యవహరిస్తారా అని అడిగిన ప్రశ్నకు.. మణిశంకర్ అయ్యర్ తనదైన శైలిలో జవాబిచ్చారు. ‘ రాహుల్ కు మెంటార్ గా ఉండాలని గత 20 ఏళ్లగా సిద్ధంగా ఉన్నా. కానీ వారు నన్ను కోరుకోవడం లేదు. నా అభిప్రాయాన్ని వారు మీద నేను బలవంతంగా రుద్దలేను కదా. నేను ఉండాలని కోరుకుంటున్నా. కానీ రాహుల్ అనుకోవడం లేదు’ అని అన్నారు. కాంగ్రెస్ లో కొంతమంది తనపై లేనిపోనివి చెప్పి తనను వారి నుంచి దూరం చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు అయ్యర్.
మరి ఈ విషయాల్ని రాహుల్ గాంధీ సమక్షంలోనే నివృత్తి చేసుకోవచ్చు కదా అని అడిగిన మరో ప్రశ్నకు అయ్యర్ బదులిస్తూ.. ‘ నేను ఎలా కలుస్తాను.. వారు కలిసే అవకాశం ఇవ్వకపోతే నేను కలవగలను. 2004లొ రాహుల్ నా మాట గౌరవం ఇచ్చేవారు. ఆ సందర్భంలో మీరు నా తండ్రికి స్నేహితుడు.. అందుకు మీ మాట వింటాను.. మా తండ్రి మీ మాట విన్నారు.. నేను కూడా మీ మాట వింటాను’ అని ఒకానొక సందర్భంలో సంగతిని అయ్యర్ గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు వారిని కలిసే పరిస్థితి లేదన్నారు. వారే తనను దూరం పెడుతున్నారన‍్నారు. అటు రాహుల్, ఇటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎవర్నీ నేను కలవలేకపోతున్నా. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగా లేకపోయినా కలవడానికి లేకుండా ఉంది. నేను వారు గురించి ఎందుకు డిస్టర్బ్ కావాలి. నాకేమైనా ఇప్పుడు ఎంపీ పోస్ట్ కోసం వారిని కలవాలా? ఏంటీ, అని అయ్యర్ తిరిగి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment